32 New Traditional Food Clusters to be Opened in AP | APలో 32 కొత్త సాంప్రదాయ ఆహార క్లస్టర్‌లు ప్రారంభించారు
కాకినాడ గొట్టం కాజా…అనకాపల్లి బెల్లం.. మాడుగుల హల్వా..ఆత్రేయపురం పూతరేకులు.. తాపేశ్వరం మడత కాజా.. గువ్వలచెరువు పాలకోవా, బందరు తొక్కుడు లడ్డు.. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో ఏ మారుమూల పల్లెకు వెళ్లినా స్థానికంగా పేరొందిన ఎన్నో సంప్రదాయ ఆహార ఉత్పత్తులున్నాయి. చరిత్ర కలిగిన ఈ ఆంధ్ర వంటకాలకు భౌగోళిక గుర్తింపు తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతీ ఉత్పత్తికి ప్రత్యేక బ్రాండింగ్తో అంతర్జాతీయ మార్కెటింగ్, తద్వారా వీటి తయారీపై ఆధారపడిన వారికి మెరుగైన జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఆహార ఉత్పత్తులకు బ్రాండింగ్, భౌగోళిక గుర్తింపు తెచ్చేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు దామోదరం సంజీవయ్య లా వర్సిటీతో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ ఎంవోయూ చేసుకుంది. ఇటీవలే ఆత్రేయపురం పూతరేకులకూ జీఐ ట్యాగ్ వచ్చింది. ఇప్పుడు మాడుగుల హల్వాకు జీఐ ట్యాగ్ తీసుకొచ్చే దిశగా చర్యలు చేపట్టారు. ఆ తర్వాత దశల వారీగా మిగిలిన ఉత్పత్తులకు కూడా జీఐ ట్యాగ్ తీసుకురానున్నారు.
ఆహార ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్లో 32 ట్రెడిషన్ ఫుడ్ క్లస్టర్స్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాటి పరిధిలో గుర్తించిన ఆహార ఉత్పత్తుల తయారీదారులకు అవసరమైన ఆర్ధిక చేయూతను అందజేయనుంది
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |