42వ రాజ్యాంగ సవరణ చట్టం : 42వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని మినీ రాజ్యాంగం అని కూడా అంటారు. 42వ సవరణ చట్టం 1976 భారత రాజ్యాంగంలోని పార్ట్ 4 Aకి 10 ప్రాథమిక విధులను జోడించింది, ఇవి రష్యన్ రాజ్యాంగం నుండి తీసుకోబడ్డాయి. ఆర్టికల్ 19(1), ఆర్టికల్ 31(సి) మరియు ఇతర ఆర్టికల్స్ వంటి వాటికి సవరణలు ఉన్నాయి. ఇక్కడ మేము ఈ కథనంలో 42వ రాజ్యాంగ సవరణ చట్టం యొక్క పూర్తి వివరాలను అందిస్తున్నాము. మరిన్ని వివరాల కోసం కథనాన్ని పూర్తిగా చదవండి.
42వ రాజ్యాంగ సవరణ చట్టం
ఆర్టికల్ 51A రూపంలో 1976, 42వ సవరణ చట్టం ద్వారా భారతీయుల కొరకు పది ప్రాథమిక విధులతో కూడిన జాబితాను రూపొందించడం జరిగింది. దీని కోసం ఒక కొత్త భాగం సృష్టించబడింది. దానిని రాజ్యాంగంలో 4వ భాగం-A పొందుపరచడం జరిగింది. ఒక ప్రత్యేక అధ్యాయాన్ని చేర్చాలనే ఆలోచనతో స్వరణ్ సింగ్ కమిటీ ప్రాధమిక విధులను సిఫారసు చేసింది. విధులు మరియు హక్కులు విడదీయరానివి అనే వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకొమని దీని అభిప్రాయం. 11వ విధిని (86వ రాజ్యంగ సవరణ చట్టం, 2002 ద్వారా 51 A (K) గా చేర్చారు.
Adda247 Telugu Sure Shot Selection Group
42వ రాజ్యాంగ సవరణ చట్టం
- స్వరణ్‌సింగ్ కమిటీ సిఫార్సులను అనుసరించి, చేసిన 42వ రాజ్యాంగ సవరణను మినీ రాజ్యాంగంగా పేర్కొంటారు.
- దీని ద్వారా 19(1), 31(C), 39, 55, 74, 77, 81, 82, 83, 100, 102, 103, 105, 118, 145, 150, 166, 170, 172, 189, 191, 192, 194, 208, 217, 225, 226, 227, 228, 311, 312, 330, 352, 353, 356, 357, 358, 359, 366, 368, 371(F) ఆర్టికల్స్‌ను సవరించారు.
- దీని ద్వారా కొత్తగా చేర్చిన ఆర్టికల్స్ – 31(D), 32(A), 39(A), 43(A), 48(A), 51(A), 131(A), 139(A), 144(A), 226(A), 228(A), 257(A), 323(A), 323(B).
- రాజ్యాంగానికి IV(A), XIV అనే కొత్త భాగాలను చేర్చారు.
42వ రాజ్యాంగ సవరణ చట్టం ముఖ్యాంశాలు
- ప్రవేశికను సవరించి, సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే పదాలను చేర్చారు.
- రష్యా నుంచి గ్రహించిన 10 ప్రాథమిక విధులను IV(A) భాగంలో చేర్చారు.
- పరిపాలనా ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేశారు.
- ఆర్టికల్ – 74(1) ప్రకారం కేబినెట్ సలహాను రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు.
- 2001 వరకు లోక్‌సభ, అసెంబ్లీ సీట్లలో మార్పులేకుండా నిర్దేశించారు.
- రాజ్యాంగ సవరణలను ఏ న్యాయ స్థానంలోనూ సవాల్ చేయరాదు.
- సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయ సమీక్షాధికారాన్ని పరిమితం చేశారు.
- లోక్‌సభ, రాష్ట్రశాసన సభల పదవీ కాలాన్ని 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలకు పొడిగించారు.
- ఆదేశిక సూత్రాల అమలుకు చేసిన చట్టాలు, ప్రాథమిక హక్కులను ఉల్లఘింస్తున్నాయనే కారణంతో, కోర్టులు ఆ చట్టాలను రద్దు చేసే వీల్లేదు.
- ఏ రాష్ట్రంలోనైనా రాష్ట్రపతి పాలనను ఒకేసారి పొడిగించే కాలపరిమితిని 6 నెలల నుంచి సంవత్సరానికి పెంచారు.
- పార్లమెంటులో, రాష్ట్ర శాసనసభల్లో కోరం అవసరాన్ని తొలగించారు.
- అఖిల భారత న్యాయసర్వీస్ ఏర్పాటుకు వీలు కల్పించారు.
- కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర సాయుధ దళాలను ఏ రాష్ట్రానికైనా పంపించే అధికారంతోపాటుగా, రాష్ట్రాల శాంతి భద్రతలు పర్యవేక్షించడం, దళాల పర్యవేక్షణ అధికారం ఉంటుంది.
- రాష్ట్ర జాబితాలోని అడవుల పరిరక్షణ, విద్య, తూనికలు, కొలతలు, జనాభా నియంత్రణ, న్యాయపరిపాలన అనే అంశాలను ఉమ్మడి జాబితాలోకి మార్చారు.
- ఆర్టికల్ – 352 ద్వారా విధించే అత్యవసర పరిస్థితిని ఏ ప్రాంతానికైనా విధించేలా మార్పులు చేశారు.
- ఆర్టికల్ – 39(A) ఉచిత న్యాయసహాయం, ఆర్టికల్ – 48(A) పర్యావరణ వన్యప్రాణుల సంరక్షణ, ఆర్టికల్ – 43లో కుటీర పరిశ్రమల యాజమాన్యంలో శ్రామికులకు భాగస్వామ్యం కల్పించడం అనే ఆదేశిక సూత్రాలను చేర్చారు.
- 1977 జనవరి 3వ తేది నుండి ప్రాథమిక విధులు అమల్లోకి వచ్చాయి.
- 2002 డిసెంబర్ 12వ తేది నుండి 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ ప్రాథమిక విధిని రాజ్యాంగంలో చేర్చారు.
- ప్రాథమిక విధులకు న్యాయ సంరక్షణ లేదు.
- ప్రాథమిక విధుల దినోత్సవాన్ని జనవరి 3వ తేదిన జరుకుంటారు.
ప్రాథమిక విధులు
- రాజ్యాంగం పట్ల విధేయత కలిగి ఉండాలి.రాజ్యాంగ సంస్థలను,జాతీయ పతాకం,జాతీయ గీతాన్ని గౌరవించాలి.
- స్వాతంత్ర ఉద్యమాన్ని ఉత్తేజపరచిన ఉన్నత ఆదర్శాలను గౌరవించాలి,అనుసరించాలి.
- దేశ సార్వబౌమత్వాన్ని సమైక్యత సమగ్రతలను గౌరవించాలి,కాపాడాలి.
- దేశ రక్షణకు,జాతీయ సేవకు ఎల్లప్పుడు సిద్ధంగా ఉండాలి.
- భారత ప్రజల మధ్య సోదరభావాన్ని సామరస్యాన్ని పెంపొందించాలి. మతం,భాష,ప్రాంతీయ,వర్గ విభేదాలకు అతితగా ఉండాలి.
- మన వారసత్వ సంస్కృతి గొప్పతనాన్ని గౌరవించాలి.
- అడవులు,నదులు,వన్యప్రాణులను కాపాడాలి.
- శాస్త్రీయ,మానవతా,పరిశీలన,సంస్కరణ దృక్పదల పట్ల సానుకూలతను పెంపొందించుకోవాలి
- ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి.
- అన్ని రంగాలలో దేశ ప్రతిష్టను పెంచడానికి కృషి చేయాలి
42వ రాజ్యాంగ సవరణ చట్టం, డౌన్లోడ్ PDF
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |