Telugu govt jobs   »   Telugu Current Affairs   »   95% of the jobs in public...

తెలంగాణ లోని ప్రభుత్వరంగ సంస్థల్లోనూ 95% ఉద్యోగాలు స్థానికులకే

తెలంగాణ లోని ప్రభుత్వరంగ సంస్థల్లోనూ 95% ఉద్యోగాలు స్థానికులకే:

 

తెలంగాణలో అమలుచేస్తున్న కొత్త జోనల్‌ విధానాన్ని ప్రభుత్వ రంగ సంస్థలకూ వర్తింపజేయాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల కార్యదర్శులకు ఉత్తర్వులు జారీచేసింది. సేవా నిబంధనలనూ అమలు చేయాలని నిర్దేశించింది. దీనిపై వెంటనే చర్యలు చేపట్టి ఈ నెల 23 నాటికి సాధారణ పరిపాలనా శాఖకు నివేదిక పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు.

ఆ ప్రకారం ఇకపై ప్రభుత్వ రంగ సంస్థలైన వివిధ కార్పొరేషన్లు, కంపెనీలు (సింగరేణి కాలరీస్, ట్రైబల్‌ మైనింగ్‌ వంటివి), బోర్డులు (హౌసింగ్, పారామెడికల్, వక్ఫ్, ఖాదీ గ్రామీణ పరిశ్రమల మండలి తదితరాలు), అథారిటీలు, సమాఖ్యలు, సొసైటీలు (సెర్ప్, గురుకుల విద్యాలయాలు, టెస్కో తదితరాలు), అకాడమీలలో జరిగే కొత్త ఉద్యోగ నియామకాల్లో జూనియర్‌ అసిస్టెంట్‌ నుంచి సబ్‌ కలెక్టర్‌ స్థాయి వరకు 95 శాతం స్థానిక రిజర్వేషన్లు లభిస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా రెండు వందలకు పైగా ప్రభుత్వ రంగ సంస్థలు, కంపెనీలు, సొసైటీలు, బోర్డులు, కమిషన్లలో దాదాపు 41 వేల మంది ఉద్యోగులున్నారు.

 

mallanna-sagar-project-water-art

 

 

********************************************************************************************

mallanna-sagar-project-water-art

Sharing is caring!