Telugu govt jobs   »   Current Affairs   »   A ₹100 coin is going to...

A ₹100 coin is going to be released on the occasion of N.T Rama Rao’s centenary | N.T రామారావు శతజయంతి సందర్భంగా ₹100 నాణెం విడుదల కానుంది

A ₹100 coin is going to be released on the occasion of N.T Rama Rao’s centenary | N.T రామారావు శతజయంతి సందర్భంగా ₹100 నాణెం విడుదల కానుంది

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు స్మారకార్థం ఆగష్టు 28వ తేదీన ప్రత్యేకంగా రూ.100 నాణేన్ని ఆవిష్కరించనున్నారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ నాణేన్ని ఆగస్టు 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారికంగా విడుదల చేయనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో విడుదల వేడుక జరగనుందని, అక్కడ రాష్ట్రపతి ముర్ము ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల సమక్షంలో నాణేన్ని ఆవిష్కరిస్తారని రాష్ట్రపతి భవన్ కార్యాలయం తెలిపింది.

ఈ వంద రూపాయల కాయిన్ 44 మిల్లీమీటర్లు చుట్టుకొలతతో ఉండే ఈ నాణెంలో సుమారు 50 శాతం వెండి అలాగే 40 శాతం రాగీ ఉండనుంది.అలాగే ఐదు శాతం నికెల్ ఐదు శాతం లోహాలు ఉంటాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ నాణేనికి ఓ వైపు మూడు సింహాలతో కూడిన అశోక చక్రం మరోవైపు ఎన్టీఆర్ చిత్రం దాని కింద శ్రీ నందమూరి తారక రామారావు శతజయంతి అని హిందీ భాషలో 1923-2023 అని ముద్రించినట్లుగా  ఆర్బీఐ తెలిపింది.  నాణెం విడుదలకు  కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ లీడర్ పురంధేశ్వరి ప్రత్యేక చొరవ తీసుకున్నారు.

చారిత్రక ఘటనలు ప్రముఖుల గుర్తుగా వెండి నాణెలు విడుదల చేయడం ఆనవాయితీగా వస్తోంది. 1964 నుంచి నాణేలను విడుదల చేస్తోంది కేంద్రప్రభుత్వం. ఈ సంప్రదాయం మాజీ ప్రధాని నెహ్రూ గౌరవార్థం వెండి నాణెం విడుదల చేయడంతో ప్రారంభమైంది. ఆనవాయితీలో భాగంగా ఈ సారి ఎన్టీఆర్ పేరుతో వెండి నాణేన్ని విడుదల చేయడం పట్ల కుటుంబసభ్యులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

AP and TS Mega Pack (Validity 12 Months)

మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

RBI 2023లో ఏ నాణేన్ని విడుదల చేస్తుంది?

మే 28న కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రూ.75 నాణేన్ని విడుదల చేశారు.ఆర్థిక వ్యవహారాల శాఖ ప్రకారం. ఈ నాణెం బరువు 35.35-34.65 గ్రాములు.