Aadudam Andhra State Sports Fest will be held in January | ఆడుదాం ఆంధ్రా రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు జనవరిలో జరగనున్నాయి
రాష్ట్ర ప్రభుత్వం “ఆడుదాం ఆంధ్ర” పేరుతో రాష్ట్రంలో విధ్యార్ధులలో క్రీడలపై మక్కువ పెంచడానికి సరికొత్తగా రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించనుంది. దానికోసం ఈ నెల 27 నుంచి రాష్ట్రం లో ఉన్న గ్రామ/వార్డు సచివాలయాలలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించనున్నారు. క్రీడలపై ఆసక్తి ఉన్న విద్యార్ధుల వివరాలను తీసుకొనున్నారు, వీటి కోసం ప్రత్యేక యాప్ ను రూపొందించారు. డిసెంబర్ 15 నుంచి జనవరి 26 వరకు ఐదు క్రీడా విభాగాలలో 2.99 లక్షల మ్యాచ్ లను నిర్వహించనున్నారు. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, యోగా వంటి వివిధ పోటీలు పెట్టనున్నారు. 15 సంవత్సరాలు పైబడిన బాల బాలికలను యాప్ లేదా వెబ్సైట్ లో రిజిస్టర్ చేయనున్నారు దీనికోసం 1.50 లక్షల వాలంటీర్లకు శిక్షణ కూడా ఇవ్వనున్నారు. దాదాపు 35 లక్షల మంది క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొంటారు అని అంచనా. పిల్లల్లో, క్రీడాకారులలో క్రీడలవైపు ప్రోత్సహించడానికి ఈ పోటీలు ఎంతో ఉపయోగపడతాయి.
పోటీల నిర్వహణ:
- గ్రామ/ వార్డు స్థాయి లో డిసెంబర్ 15- 20 వరకు
- మండల స్థాయి లో డిసెంబర్ 21- జనవరి 4 వరకు
- నియోజిక వర్గం స్థాయి లో జనవరి 5 – 10 వరకు
- జిల్లా స్థాయి లో జనవరి 11- 21 వరకు
- రాష్ట్ర స్థాయి లో జనవరి 22 -26 వరకు
Read More: | |
తెలుగులో వారపు కరెంట్ అఫైర్స్ 2023 | నెలవారీ కరెంట్ అఫైర్స్ 2023 తెలుగులో |
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2023 | స్టడీ మెటీరియల్ |
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |