All India Sub-Junior Badminton tournament in Vijayawada from November 1-8 | విజయవాడలో ఆలిండియా సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నవంబర్ 1 నుంచి 8 వరకు జరుగుతుంది
విజయవాడ వేదికగా నవంబర్ 1 నుంచి 8 వరకు ఆలిండియా సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ జరగనుంది. సబ్ జూనియర్ విభాగం లో U-15, U-17 బాలబాలికలు పాల్గొంటారు. దేశవ్యాప్తంగా ఉన్న బాలబాలికలు దాదాపుగా 2,500 మంది వరకు పాల్గొంటారు. విజయవాడ లో ఉన్న DRRMC) దండమూడి రాజగోపాలరావు మున్సిపల్ కార్పొరేషన్ ఇండోర్ స్టేడియం, విజయవాడ పటమట సాయి సందీప్ బ్యాడ్మింటన్ అకాడమీ, చెన్నుపాటి రామకోటయ్య మున్సిపల్ కార్పొరేషన్ ఇండోర్ స్టేడియం, పటమటలో ఈ పోటీలు జరుగుతాయి. AP బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతున్నాయి క్రీడలకు సంభందించిన పోస్టర్ ను విడుదల చేశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, వీఎంసీ మేయర్, ఎమ్మెల్యేలు తదితరుల సమక్షం లో నవంబర్ 1వ తేదీన ప్రధాన ఇండోర్ స్టేడియంలో టోర్నీని ప్రారంభిస్తారు.
పోటీలు నవంబర్ 1-4 వరకు క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లు జరుగుతాయి, ఆ తర్వాత 5 నుంచి 8 వరకు మెయిన్ డ్రా మ్యాచ్‌లు జరుగుతాయి. మొత్తం 10 విభాగాలలో 2000 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించేందుకు క్రీడాకారులకు ఆడదాం ఆంధ్రా కార్యక్రమం కింద లక్ష స్పోర్ట్స్ కిట్లను అందజేసింది.
Read More: | |
తెలుగులో వారపు కరెంట్ అఫైర్స్ 2023 | నెలవారీ కరెంట్ అఫైర్స్ 2023 తెలుగులో |
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2023 | స్టడీ మెటీరియల్ |
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |