తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) పరీక్షలన్నీ రీషెడ్యూల్ చేయనున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన రేవంత రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే విడుదలైన మరియు విడుదల కావాల్సిన ఉద్యోగ నోటిఫికేషన్లపై కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.
తెలంగాణలో అన్ని TSPSC పరీక్షలు రీషెడ్యూల్ అయ్యే అవకాశం ఉందా ?
తెలంగాణలో TSPSC నిర్వహించిన పరీక్షల్లో పేపర్ల లీక్, పరీక్షల వాయిదాలు నిరుద్యోగుల్లో గందరగోళం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే తాజా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇక నుంచి కొత్త నియామకాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో TSPSC త్వరలో కొత్త పరీక్ష తేదీలను విడుదల చేయనుంది.
TSPSC గ్రూప్స్ కి మళ్లీ నోటిఫికేషన్ ఇస్తారా?
గత ప్రభుత్వంలో TSPSC గ్రూప్స్ 1, 2, 3, 4 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి, గ్రూప్ 1, 2 ,4 మరియు ఇతర పోస్టులకు పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే, పేపర్ల లీక్ లు వలన జరిగిన అన్నీ పరీక్షలు వాయిదా వేస్తు, ఇప్పటి వరకు ఒక ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. అయితే గత ప్రభుత్వం ఇచ్చిన TSPSC గ్రూప్స్ 1, 2, 3, 4 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతుందా, లేదా..? కొత్తగా మళ్లీ నోటిఫికేషన్ లు ఇస్తారా అనే అయోమయంలో అభ్యర్థులు ఉన్నారు.
APPSC/TSPSC Sure shot Selection Group
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ ఇలా..
తెలంగాణలో 01 ఫిబ్రవరి 2024 వ తేదీన గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్లు.. అలాగే 01 ఏప్రిల్ 2024 తేదీన గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు.. జూన్ 1వ తేదీన గ్రూప్ 3 మరియు గ్రూప్ 4 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని, ఇంకా పోలీసు, మెడికల్, ఇంజనీరింగ్, ఉపాధ్యాయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో తెలిపింది. అలాగే కాంగ్రెస్ ప్రభత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలకుTSPSC ద్వారా నియామకాలు ఉంటాయని మేనిఫెస్టోలో వెల్లడిచింది.
TS DSC ఎప్పుడు జరిగే అవకాశం ఉంది?
గత ప్రభుత్వం తెలంగాణ DSC ద్వారా 5,089 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది, అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కూడా స్వీకరించింది. నవంబర్ 2023 లో జరగాల్సిన TS DSC పరీక్షలు ఎన్నికల వలన వాయిదా పడ్డాయి. ఇప్పుడు DSC అభ్యర్ధులందరు ఆగిపోయిన DSC పరీక్ష ని తిరిగి నిర్వహిస్తారా ? లేదా అనే అంశంపై అయోమయంలో ఉన్నారు.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తారా?
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలు ఎన్ని ఖాళీలగా ఉన్నాయి.. ఎన్ని భర్తీ అయ్యాయి అనే అంశంపై సిఎం ఱెవంత రెడ్డి ఆరా తీసినట్లు సమాచారం. విద్యాశాఖ కార్యదర్శి, పాఠశాల విద్య డైరెక్టర్ సమగ్ర వివరాలతో రూపొందించిన నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమర్పించారు. విద్యాశాఖలో 20,740 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు విద్యాశాఖ అధికారులు లెక్కగట్టారు. 2022లో ప్రభుత్వం 13 వేల ఖాళీలు భర్తీ చేస్తామని తెలిపింది. ఈ మేరకు 2023లో 5,089 పోస్టుల భర్తీకి డీఎస్సీ నిర్వహణకు సిద్ధమైంది. ఈ క్రమంలో ప్రస్తుతం విద్యాశాఖ ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలున్నాయనే అంశాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందించిన నివేదికలో పేర్కొంది. దీంతో పాటే ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులను వివరించారు. కోర్టు వివాదంలో ఉన్న అంశాలు, ఎన్నికల కోడ్ వల్ల నిలిచిపోయిన DSC పరీక్షను నివేదికలో పేర్కొన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు Youtube Official Channel | ఇక్కడ క్లిక్ చేయండి |