1911 లో బెంగాల్, బీహార్ రాష్ట్ర అవతరణ తర్వాత మద్రాసు ప్రెసిడెన్సీలో ఆంధ్రులు కూడా ఆలోచనలో పడ్డారు. 1912లో ఇప్పటి నిడదవోలు లో జొన్నవిత్తుల గురునాధం ఆద్వర్యంలో ఒక సదస్సు జరిగింది ఆ సదస్సులో ప్రత్యేక రాష్ట్రం కోసం తీర్మానం చేశారు. గుంటూరు లో గురునాధం అధ్యక్షతన వింజమూరి భావాణాచార్యులు, కొండా వెంకటప్పయ్య గార్లతో కలిపి ఒక కమిటీ కూడా ఏర్పడింది. తెలుగు మాట్లాడే వారిని ఒకే చోటకు చేర్చడానికి ఆంధ్ర మహా సభలు ఎంతో ఉపయోగపడ్డాయి.
1918లో ఇండియా సెక్రటరీ ఆఫ్ స్టేట్ అయిన మాంటేగు ఆధ్వర్యంలో బ్రిటిష్ పార్లమెంటు బృందం భారత్ను సందర్శించింది. భాష ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడాలని, దీనిలో భాగంగా ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుతూ న్యాపతి సుబ్బారావు నాయకత్వంలో మోచర్ల రామచంద్రరావు, పట్టాభి సీతారామయ్య, భూపతిరాజు వెంకటపతిరాజు, నెమలి పట్టాభిరాషూరావు, సీవీఎస్ నరసింహరాజు, కొండా వెంకటప్పయ్య, వీరూరు పిచ్చయ్య లాంటి నాయకులు మాంటేగుకు వినతిపత్రం అందించారు.
అయితే గతంలో ఆంధ్రమహాసభల తీర్మానాల ప్రకారం విశాఖపట్నంలో మెడికల్ కళాశాల, ఆంధ్రవిశ్వవిద్యాలయం స్థాపించారు. రాజమండ్రి, అనంతఃపురంలలో కళాశాలలు ఏర్పాటుచేశారు. ఆంధ్రుడైన వేపా రామేశం మద్రాసు హైకోర్టులో మొట్టమొదటి జడ్జీగా నియమించబడ్డారు.
APPSC/TSPSC Sure shot Selection Group
మొదటి ఆంధ్రమహాసభ
1913లో మొదటి ఆంధ్రమహా సభ గుంటూరు జిల్లా బాపట్ల లో బీఎన్ శర్మ అధ్యక్షతన జరిగింది. ఈ సభ లో కొన్ని ముఖ్యమైన తీర్మానాలు తీసుకున్నారు అవి:
- ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం ఉండాలి అని వేమవరపు రామదాసు తీర్మానం చేశారు
- పట్టాభి సీతారామయ్య అద్యక్షతన ఆంధ్రా కాన్ఫరెన్స్ స్టాండింగ్ కమిటీ ఏర్పాటైంది
- సీతారామయ్య రాయలసీమ, నెల్లూరు ప్రాంతాలను సందర్శించారు, చిత్తూరు మరియు బళ్ళారి లో కొంత వ్యతిరేకత వచ్చింది.
- ఆంధ్రరాష్ట్రం కావాలన్న తీర్మానం 1913 జూన్ లో చిత్తూరు, విశాఖపట్నం సమావేశాల్లో ప్రవేశపెట్టారు
- ఆంధ్రా అడ్వకేట్ అనే వార పత్రికను ఈ సభా సమయం లోనే ప్రారంభించారు.
- జిల్లాల వారీగా ప్రజాభిప్రాయాన్ని సేకరించి ఒక నివేదిక ఇవ్వడానికి ఒక కమిటీని వేశారు
రెండోవ ఆంధ్రమహాసభ
- రెండవ ఆంధ్రమహాసభ 1914 ఏప్రిల్ 11 న విజయవాడ లో న్యాయపతి సుబ్బారావు అధ్యక్షతన జరిగింది
- విశాఖపట్నం లో ఓడ రేవు, వ్యవసాయ, ఆరోగ్య, కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలు నిర్మించాలనుకున్నారు.
- ప్రజాభిప్రాయం ద్వారా ఆంధ్రరాష్ట్రం ద్వారా ఏర్పాటు కావాలి అని తీర్మానించారు.
మూడవ ఆంధ్రమహాసభ 1915 మే
- మూడవ ఆంధ్రమహా సభ 1915 మే విశాఖపట్నం లో రాజ రామనియం అద్యక్షత న జరిగింది
- ఈ సమావేశం లో మద్రాసు ప్రెసిడెన్సీ లో ఉన్న 11 తెలుగు జిల్లాలతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలి అని తీర్మానించారు
- సమావేశాలలో విద్య మాతృ భాషలో జరగాలి మరియు ఉపన్యాసాలు కూడా తెలుగులో ఇవ్వాలి అని తీర్మానించాలి
నాలుగో ఆంద్రమహాసభ 1916 మే
- నాలుగో ఆంధ్రమహా సభ 1916 లో కాకినాడ మోచర్ల రామచంద్రరావు అద్యక్షత వహించారు.
- మే 8 న కాకినాడ లో జరిగిన సదస్సులో అచంత రుక్మిణీ లక్ష్మీపతి మహిళా అధ్యక్షురాలిగా వ్యవహరించారు.
ఐదో ఆంద్రమహాసభ 1917 జూన్
- ఐదో ఆంద్రమహాసభ 1917 జూన్ 01న కొండా వెంకటప్పయ్య అద్యక్షతన నెల్లూరులో జరిగింది
ఆంధ్ర ఉద్యమాన్ని బలపరిచిన తెలుగు పత్రికలు
- ఆంధ్ర పత్రిక
- కృష్ణ పత్రిక
1931లో కడప కోటిరెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రత్యేక ఆంధ్ర మహాసభలో భాష ఆధారంగా ప్రత్యేక తెలుగు మాట్లాడే జిల్లాలతో ఆంధ్రరాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానించారు. లండన్ లో జరిగిన రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ తీర్మానాన్ని మహాత్మాగాంధీకి సమర్పించారు. జోగయ్య పంతులు, వి.నాగభూషణం, పి.వి.సుబ్బారావు, కె.నరసింహారావులు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం వాదించడానికి లండన్ వెళ్లారు.
ఎన్ని తీర్మానాలు, సదస్సులు చేసినా భాష ప్రాతిపదికన ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటులో ఎలాంటి పురోగతి లేదు. చివరకు 1935లో ఈ సమస్యను పరిష్కరించడానికి భారత ప్రభుత్వ చట్టం ఆమోదించబడింది.
1937లో కడప కోటిరెడ్డి అధ్యక్షతన విజయవాడలో ఆంధ్రమహాసభ సిల్వర్ జూబ్లీ మహాసభ జరిగింది. అదే సంవత్సరం మద్రాసు ప్రావిన్సులో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రత్యేక ఆంధ్ర తీర్మానాన్ని బ్రిటిష్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ కు సమర్పించింది.
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు Youtube Official Channel | ఇక్కడ క్లిక్ చేయండి |