Industries in Andhra Pradesh
Andhra Pradesh Domestic product of Industrial sector accounts for ₹507.45 billion (US$6.4 billion). Andhra Pradesh state has also started to focus on the fields of information technology and biotechnology. Several major heavy industries are in operation in Visakhapatnam. Andhra Pradesh also has good power, airport, IT, and port infrastructure. Andhra Pradesh government is striving towards creating quality infrastructure and to make AP an attractive destination for both domestic and foreign investors.
Andhra Pradesh new industrial policy is under process and will be announced by the Andhra Pradesh government soon. In this Article we are providing Complete details Present status of Andhra Pradesh Industries and also Industries Of Andhra Pradesh. we are providing Industries Of Andhra Pradesh PDF in this Article. Download Industries Of Andhra Pradesh PDF and Know more details about Industries Of Andhra Pradesh.
APPSC/TSPSC Sure shot Selection Group
ఆంధ్రప్రదేశ్ – పారిశ్రామిక రంగం
- ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటికి పారిశ్రామికంగా ఎంతో వెనుకబడి ఉంది.
- 60వ దశకంలో కేంద్ర ప్రభుత్వం పరిశ్రమలను స్టాపించడంతో రాష్ట్రానికి పారిశ్రామిక కళ వచ్చింది.
- 1980 దశాబ్ద కాలంలో పెద్ద ఎత్తున పారిశ్రామికీకరణం జరిగి మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాల సరసన మనరాష్ట్రం చేరింది.
- రాష్ట్ర విభజనానంతరం అత్యధిక పరిశ్రమలు తెలంగాణకు వెళ్లిపోయాయి. దాంతో పారిశ్రామికంగా మళ్లీ ఆంధ్రప్రదేశ్ వెనుకబడింది.
- ప్రస్తుతం, స్వదేశీ మరియు విదేశీ పెట్టుబడిదారులకు APని ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మార్చడానికి, రాష్ట్రంలో అనుకూలమైన పారిశ్రామిక వాతావరణంతో పాటు నాణ్యమైన మౌలిక సదుపాయాలను సృష్టించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది.
- 2023 లో విశాఖ లో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరిగింది. అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ నారమ్స్ కూడా సులభతరం చేసింది.
పరిశ్రమలను ప్రధానంగా 4 రకాలుగా విభజించవచ్చు. అవి :
- భారీ పరిశ్రమలు
- మధ్యతరహా పరిశ్రమలు
- లఘు పరిశ్రమలు
- కుటీర పరిశ్రమలు
భారీ పరిశ్రమలు
- ఉత్పత్తి రంగంలో రూ.100 కోట్ల కంటే ఎక్కువ; సేవారంగంలో రూ.40 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి ఉన్న పరిశ్రమలను భారీ పరిశ్రమలు అంటారు.
- భారీ పరిశ్రమలను ప్రభుత్వరంగంలో స్థాపించారు.
మధ్యతరహా పరిశ్రమలు
- ఉత్పత్తి రంగంలో రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు; సేవారంగంలో రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు పెట్టుబడి ఉన్న పరిశ్రమలను మధ్యతరహా పరిశ్రమలు అంటారు
- మధ్యతరహా పరిశ్రమలను ఎక్కువగా ప్రయివేటు రంగంలో స్థాపించారు.
లఘు పరిశ్రమలు
- ఉత్పత్తి రంగంలో రూ. కోట్లు, సేవారంగంలో రూ.2 కోట్లకు మించకుండా పెట్టుబడి ఉన్న పరిశ్రమలను లఘు పరిశ్రమలు అంటారు. వీటిని పూర్తిగా ప్రయివేటు రంగంలో స్థాపించారు.
కుటీర పరిశ్రమలు
- పూర్తిగా లేదా పాక్షికంగా కుటుంబ సభ్యులు కలిసి నామ మాత్రపు పెట్టుబడితో నిర్వహించే పరిశ్రమలను కుటీర పరిశ్రమలు అంటారు.
ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమైన పరిశ్రమలు
వ్యవసాయాధార భారీ పరిశ్రమల్లో ముఖ్యమైనవి.
- వస్త్ర పరిశ్రమ
- చక్కెర పరిశ్రమ
- జనపనార పరిశ్రమ
- పొగాకు పరిశ్రమ
- నూనె పరిశ్రమ
- ఆహార సంబంధిత పరిశ్రమ
- మన రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం అధికం కాబట్టి ఆహార వాణిజ్య పంటలను పెద్ద ఎత్తున పండిస్తున్నారు. వ్యవసాయ సంబంధిత పరిశ్రమల్లో చాలావరకు వాణిజ్య పంటలు ప్రధాన పాత్ర వహిస్తున్నాయి.
- రాష్ట్ర ఆదాయంలో సగంపైనా వ్యవసాయ సంబంధిత పరిశ్రమల ద్వారా లభిస్తోంది.
వస్త్ర పరిశ్రమ
- ఆంధ్రప్రదేశ్‌లో పత్తి పంట ప్రధానంగా కోస్తా ప్రాంతంలో తర్వాత రాయలసీమలో పండుతుంది.
- ముఖ్యంగా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పండుతుంది.
- మొదటి వస్త్ర పరిశ్రమను 1915 – 18 మధ్య కాలంలో తూర్పుగోదావరిలోని పందెల్ల పాకలో స్థాపించారు. ఇది ప్రస్తుతం పనిచేయడం లేదు.
- 1921లో అనంతపురం జిల్లా, రాయదుర్గంలో మరొక వస్త్ర పరిశ్రమను ఏర్పాటు చేశారు
వస్త్రపరిశ్రమ | స్థాపించిన సంవ త్సరం | ప్రాంతం |
ఆదోని కాటన్ మిల్స్ లిమిటెడ్ | 1949 | ఆదోని |
రాయలసీమ మిల్స్ లిమిటెడ్ | 1950 | రామ్‌నగర్ (కర్నూలు) |
ఆదోని స్పిన్నింగ్ వీవింగ్ కంపెనీ లిమిటెడ్ | 1956 | ఆదోని |
ఎమ్మిగనూర్ స్పిన్నింగ్ మిల్స్ లిమిటెడ్ | 1965 | ఎమ్మిగనూరు (కర్నూలు) |
మదనపల్లి స్పిన్నింగ్ మిల్స్ లిమిటెడ్ | 1966 | మదనపల్లి (చిత్తూరు) |
ఆంధ్ర కో ఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్స్ లిమి | 1954 | గుంతకల్ (అనంతపురం) |
కడప స్పిన్నింగ్ మిల్స్ లిమిటెడ్ | 1983 | సాంసుపల్లి (కడప) |
చిత్తూరు టెక్‌స్‌టైల్స్ లిమిటెడ్ | 1968 | బంగారుపాలెం (చిత్తూరు) |
అనంతపూర్ కాటన్ మిల్స్ లిమిటెడ్ | 1978 | ఎర్రన గుంటపల్లి (అనంతపురం) |
తిరుపతి కాటన్ మిల్స్ | – | రేణిగుంట |
శ్రీ వెంకటాచలపతి మిల్స్ | – | తిరుపతి |
గోమతి స్పిన్నర్స్ | – | బంగారుపాలెం (చిత్తూరు) |
అభిరామ్ కాటన్ మిల్స్ | 1973 | సూళ్లూరు పేట (నెల్లూరు) |
జ్యోతి ప్రకాష్ స్పిన్నింగ్ మిల్స్ | 1982 | తడ (శ్రీకాకుళం) |
- వస్త్ర పరిశ్రమ అధికంగా రాయలసీమలో కేంద్రీకృతమైంది.
- వస్త్రపరిశ్రమలు అధికంగా ఉన్న జిల్లా – చిత్తూరు
పంచదార పరిశ్రమ
- చెరకు పంట వృద్ధి, అధిక దిగుబడులు, నూతన వంగడాలు పంచదార పరిశ్రమ అభివృద్ధికి దోహదపడతాయి.
- పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో చెరకు అధికంగా పండిస్తారు.
- రాష్ట్రం మొత్తం మీద సహకార రంగంలో చక్కెర పరిశ్రమలు అధికంగా ఉన్నాయి.
- ఆంధ్రప్రదేశ్‌లో మొదటి పంచదార పరిశ్రమను 1933లో విశాఖపట్నంలో ఏటికొప్పాక వద్ద స్థాపించారు.
ఆంధ్ర చక్కెర పరిశ్రమ
- ఈ పరిశ్రమను పశ్చిమగోదావరిలోని తణుకులో 1952లో ప్రయివేటు రంగంలో స్థాపించారు.
- ఈ పరిశ్రమలో చక్కెరతోపాటు సూపర్ ఫాస్ఫేట్లు, క్లోరిన్, సల్ఫ్యూరిక్ ఆమ్లం, ఎసిటిక్ ఆమ్లం, పరిశ్రమల ఆల్కహాల్, కాస్టిక్‌సోడా, ఆలం, క్లోరో సల్ఫూరిక్ ఆమ్లం లాంటి రసాయనాలు తయారుచేస్తారు. వీటితోపాటు అంతరిక్ష వాహనాల కోసం ఉపయోగపడే ఇంధనాన్ని కూడా ఈకర్మాగారం ఉత్పత్తి చేస్తుంది.
ప్రయివేటు రంగంలో చర్కెర కర్మాగారాలు
- దక్కన్ షుగర్స్ – సామర్లకోట (తూర్పుగోదావరి)
- సర్వారాయ షుగర్స్ లిమిటెడ్ – చెల్లూరు
- కిర్ణంపూడి షుగర్ మిల్స్ – పిఠాపురం
- కేసీపీ లిమిటెడ్ – లక్ష్మీపురం, ఉయ్యూరు
- జైపూర్ మిల్స్ – చాగల్లు
సహకారం రంగంలో చక్కెర మిల్లులు ఉన్న ప్రదేశాలు
కొవ్వూరు (పశ్చిమగోదావరి), అనకాపల్లి (విశాఖపట్నం), చిత్తూరు, నంద్యాల, దౌలతాపుర్ (కడప), ఏటికొప్పాక, ఆముదాల వలస, పాయకరావు పేట (తాండవ కో ఆపరేటివ్ షుగర్స్).
జనపనార పరిశ్రమ
- రాష్ట్రంలో జనపనార ముఖ్యంగా కోస్తా జిల్లాల్లోని శ్రీకాకుళం, కృష్ణా, విజయనగరం; గుంటూరు, తూర్పుగోదావరిలో ఈ పంట వ్యాప్తి ఎక్కువగా ఉంది.
- భారతదేశంలో జనపనార పరిశ్రమలో ఆంధ్రప్రదేశ్ ద్వితీయ స్థానంలో ఉంది.
- జనపనార పరిశ్రమ ఆంధ్రప్రదేశ్‌లో 1905లో ప్రారంభమైంది.
- ఆంధ్రాలో మొదటి జనపనార మిల్లు – ఏలూరులోని శ్రీకృష్ణా జ్యూట్ మిల్లు.
- ఇవేకాకుండా చిట్టివలస, నెల్లిమర్ల, గుంటూరు ఒంగోలులో జనపనార పరిశ్రమలు ఉన్నాయి.
- ప్యాకింగ్ పనుల్లో చాలావరకు కృత్రిమ నారతో చేసిన వస్తువులను వాడటం వల్ల జనపనారకు ప్రాముఖ్యం తగ్గింది. ఈ పంట విస్తీర్ణం ఉత్పత్తి దెబ్బతింది.
పొగాకు పరిశ్రమ
- పొగాకు ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో రెండో స్థానంలో ఉండగా, మనదేశంలో ఆంధ్రప్రదేశ్‌ది రెండో స్థానం.
- భారతదేశ హవానాగా ఆంధ్రప్రదేశ్‌ను పిలుస్తారు. గుంటూరు జిల్లాలో పండించే వర్జీనియా పొగాకు ప్రపంచంలోనే అత్యంత మేలైన రకంగా గుర్తింపు పొందింది.
- గుంటూరులోని ఇండియన్ లీఫ్ టొబాకో డెవలప్‌మెంట్ కంపెనీ నవ భారత్ టొబాకో లిమిటెడ్ కంపెనీ, జమీడాల బ్రదర్స్ టొబాకో లిమిటెడ్ కంపెనీలు అత్యంత ముఖ్యమైన ఎగుమతిదారులు.
- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం ఆరు సిగరేట్ పరిశ్రమలు ఉన్నాయి.
- ఒక్క సిగరేట్ పరిశ్రమ మాత్రమే తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు లో ఉంది.
AP Geography PDF in Telugu Chapterwise
కాగితపు పరిశ్రమ
- కాగితపు పరిశ్రమను కావలసిన ముడి పదార్థాలు వెదురు, గడ్డ మెత్తని కలప.
- ఆంధ్రప్రదేశ్‌లో మొదటి కాగితపు పరిశ్రమను 1924లో రాజమండ్రిలో స్థాపించారు.దీన్నే ఆంధ్ర పేపర్ మిల్స్ లిమిటెడ్ అని పిలుస్తారు. 1929 వరకు ఈ పేపర్ మిల్లును కర్ణాటక పేపర్ మిల్‌స్‌గా పిలిచేవారు.
- 1970లో రాయలసీమ పేపర్ మిల్‌స్‌ను ఆదోనిలో టీజీఎల్ గ్రూప్ ప్రారంభించింది. ఈ పరిశ్రమకు 42,000 టన్నుల ఉత్పాదన సామర్థ్యం ఉంది.
ముఖ్య కాగిత పరిశ్రమలు
- ఆంధ్ర పేపర్ మిల్స్ – రాజమండ్రి
- రాయలసీమ పేపర్ మిల్స్ – గొందిపర్ల కర్నూలు
- పెన్నార్ పేపర్ మిల్స్ – కడప
- వంశధార పేపర్స్ – మండపం (శ్రీకాకుళం)
- డెల్టా పేపర్ మిల్స్ – వేండ్ర (పశ్చిమ గోదావరి)
- కోస్టల్ పేపర్స్ – మాధవరాముడు పాలెం (తూర్పు గోదావరి)
- సూర్యచంద్ర పేపర్ మిల్స్ – మారెడుబాక (తూర్పు గోదావరి)
- సిరికాల్ పేపర్ మిల్స్ – నెల్లూరు
- కొల్లేరు పేపర్స్ – బొమ్మలూరు (కృష్ణా)
ఆంధ్రప్రదేశ్‌లో స్టా బోక్స్ పరిశ్రమ కూడా కేంద్రీకృతమై ఉంది. ఇందులో కొన్ని కర్మాగారాలు
i. ఆంధ్రప్రదేశ్ స్టా బోర్డ్ మిల్ లిమిటెడ్ – భీమవరం (పశ్చిమ గోదావరి)
ii. వీరవెంకట సత్యనారాయణ స్టా బోర్డ్స్ లిమిటెడ్ – పశ్చిమ గోదావరి
ఖనిజాధారిత, ఇంజినీరింగ్ ఆధారిత పరిశ్రమలు
- భారతదేశంలో పారిశ్రామికీకరణం పెద్దస్థాయిలో జరగడానికి అవకాశాలు కల్పించినప్పుడు దేశంలో ఇంజినీరింగ్ పరిశ్రమల అభివృద్ధి అవసరం అని భావించారు.
- ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో అనేక భారీ, మధ్యతరహా పరిశ్రమలు నెలకొల్పారు. ఇవి ఎక్కువగా విశాఖపట్నం, చిత్తూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కేంద్రీకృతమయ్యాయి.
పరిశ్రమ | ప్రాంతం | ఉత్పత్తులు |
విశాఖ ఉక్కు కర్మాగారం | విశాఖపట్నం | ఉక్కు ఉత్పత్తులు |
హిందుస్టాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ | విశాఖపట్నం | నౌకలు |
భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెసల్స్ | విశాఖపట్నం | ప్రెజర్ వెసల్స్ రసాయన పరిశ్రమల సామాగ్రి |
హిందుస్థాన్ పెట్రోలియం లిమిటెడ్ | విశాఖపట్నం | పెట్రోల్, డీజిల్ గ్యాస్, నాప్తా |
హిందుస్టాన్ జింక్ లిమిటెడ్ | విశాఖపట్నం | జింక్ ఉత్పత్తులు |
గ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా | విశాఖపట్నం | |
ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలిమిటెడ్ | ఎర్రగుంట్ల (కడప) | ఎరువులు |
కోరమండల్ ఫెర్టిలైజర్స్ (1967) | విశాఖపట్నం | ఎరువులు |
గోదావరి ఫెర్టిలైజర్స్ | కాకినాడ (తూర్పుగోదావరి) | ఎరువులు |
ఆంధ్రా ఫెర్టిలైజర్స్ | తాడేపల్లి (గుంటూరు | ఎరువులు |
కృష్ణా ఇండస్టియల్ కార్పొరేషన్ | నిడదవోలు (పశ్చిమగోదావరి) | ఎరువులు, రసాయనాలు |
Mineral Wealth of Andhra Pradesh
సిమెంటు పరిశ్రమ
- ఆంధ్రప్రదేశ్‌లో సిమెంటు పరిశ్రమను 1939లో ప్రారంభించారు.
- మొదట్లో రెండు పరిశ్రమలు ఉండేవి. అవి ఆంధ్రా సిమెంటు పరిశ్రమ (విజయవాడ, 1940), అసోసియేటెడ్ సిమెంట్ పరిశ్రమ (తాడేపల్లి – గుంటూరు, 1939)
- 1955లో కర్నూలు జిల్లా ద్రోణాచలం తాలూకా బేతంచర్ల వద్ద పాణ్యం సిమెంట్ పరిశ్రమని సాపించారు.
- 1958లో కేసీపీ లిమిటెడ్‌ను మాచర్ల (గుంటూరు)లో స్థాపించారు.
- సిమెంటు పరిశ్రమ అభివృద్ధి చెందడానికి కావాల్సిన ముఖ్య ఖనిజం సున్నపురాయి.
- సున్నపురాయి ఎక్కువగా లభించే కడప, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో సిమెంటు పరిశ్రమలు ఎక్కువగా కేంద్రీకృతమయ్యాయి.
రాష్ట్రంలో ముఖ్యమైన సిమెంటు పరిశ్రమలు
- ఎల్ అండ్ టీ సిమెంట్స్ – తాడిపత్రి (అనంతపురం)
- పెన్నా సిమెంట్స్ – తాడిపత్రి (అనంతపురం)
- కోరమండల్ సిమెంట్స్ – చిలమకూరు (కడప)
- టెక్స్ మాకో సిమెంట్ లిమిటెడ్ – ఎర్రగుంట్ల (కడప)
- పాణ్యం సిమెంట్స్ – ద్రీణాచలం (కర్నూలు)
- అసోసియేటెడ్ సిమెంట్స్ – తాడేపల్లి
- ప్రియదర్శిని సిమెంట్స్ – రామాపురం (కృష్ణా)
- సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా – ఎర్రగుంట్ల(కడప)
విశాఖ ఉక్కు కర్మాగారం
- విశాఖ ఉక్కు కర్మాగారాన్ని 1971లో ప్రారంభించారు. ఆగస్టు 1 1992 లో దీన్ని జాతికి అంకితమిచ్చారు. భారతదేశంలో సముద్ర తీరంలో ఉన్న ఉక్కు కర్మాగారం ఇదే. దక్షిణభారత దేశంలో మొదటి సమగ్ర ఉక్కు కర్మాగారం కూడా ఇదే.
AP Geography -Soil types of Andhra Pradesh
కుటీర పరిశ్రమలు
- ఆంధ్రప్రదేశ్ ప్రాచీన కాలం నుంచి కుటీర పరిశ్రమలకు పేరొందింది. కుటీర పరిశ్రమల్లో ముఖ్యంగా చేనేత వస్తువులు, పట్టు వస్త్రాలు, తివాచీలు, చాపలు, దంతపు వస్తువులు, పీచు వస్తువులు, బొమ్మలు, అద్దకపు వస్తాలు, అల్లికలు, వెండి నగిషీ వస్తువులు, ఇత్తడి సామార్రి తయారవుతున్నాయి.
- కుటీర పరిశ్రమల్లో చేనేత పరిశ్రమ అతిపెద్ద పరిశ్రమ.
ముఖ్య కుటీర పరిశ్రమలు
- ఏటి కొప్పాక – లక్క బొమ్మలు
- కొండపల్లి (విజయవాడ) – రంగు రంగుల బొమ్మలు
- ఏలూరు – తివాచీలు
- తిరుపతి – చందనపు బొమ్మలు
- చీరాల (ప్రకాశం) – టై అండ్ డై (స్కిల్స్)
- జరీ చీరలు – గద్వాల్ (అనంతపురం),వెంకటగిరి (నెల్లూరు),ఉప్పాడ, ధర్మవరం (అనంతపురం), గుంటూరు
- గాజులు – గుత్తి, శ్రీ శ్రీకాళహస్తి , సింహాచలం
- కలంకారీ – పెడన, మచిలిపట్నం
- ఇత్తడి సామాగ్రీ – కాళహస్తి
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |