ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం (నవంబర్ 11, 2024) 2024-25 ఆర్థిక సంవత్సరానికి ₹2.94 లక్షల కోట్ల బడ్జెట్‌ను సమర్పించింది. శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, 2024-2025 ఆర్థిక సంవత్సరానికి పాఠశాల విద్యకు ₹ 29,909 కోట్లు కేటాయించారు, పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధికి ₹ 16,739 కోట్లు కేటాయించారు మరియు ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమానికి ₹ 18,421 కేటాయించారు. రెవెన్యూ వ్యయం అంచనా 2,35,916.99 కోట్ల రూపాయలు. మూలధన వ్యయం అంచనా 32,712.84 కోట్ల రూపాయలు. రెవెన్యూ లోటు 34,743.38 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. ద్రవ్య లోటు 68,742.65 కోట్ల రూపాయలుగా ప్రతిపాదించారు. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి (GSDP) లో రెవెన్యూ లోటు 4.19 శాతంగానూ ద్రవ్యలోటు 2.12 శాతంగానూ ఉండవచు అంచనా కట్టారు.
Adda247 APP
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2024-25 ముఖ్యాంశాలు
- 2024-25లో పాఠశాల విద్యకు రూ.29,909 కోట్లు కేటాయించారు
- యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ- రూ. 322 కోట్ల
- పోలీసు శాఖ- రూ. 8,495 కోట్లు కేటాయించారు
- పర్యావరణ, అటవీ, శాస్త్ర, సాంకేతిక శాఖ – రూ. 687 కోట్లు కేటాయించారు
- రవాణా, రోడ్లు, భవనాల శాఖ- రూ. 9,554 కోట్లు కేటాయించారు
- ఇంధన శాఖ – రూ. 8,207 కోట్లు కేటాయించారు
- పరిశ్రమలు, వాణిజ్య శాఖ- రూ. 3,127 కోట్లు కేటాయించారు
- జలవనరుల శాఖ- రూ 16,705 కోట్లు కేటాయించారు
- గృహ నిర్మాణ శాఖ- రూ. 4,012 కోట్లు కేటాయించారు
- పురపాలక పట్టణాభివృద్ధి శాఖ- రూ. 11,490కోట్లు కేటాయించారు
- పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ- రూ. 16,739 కోట్ల
- వైద్యారోగ్య శాఖ – రూ. 18,421 కోట్లు కేటాయించారు
- ఉన్నత విద్యాశాఖ- రూ. 2,326 కోట్లు కేటాయించారు
- పాఠశాల విద్యాశాఖ- రూ. 29,909 కోట్లు కేటాయించారు
- నైపుణ్యాభివృద్ధి శాఖ- రూ.1,215కోట్లు కేటాయించారు
- మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ- రూ. 4,285కోట్లు కేటాయించారు
- షెడ్యూల్ కులాల సంక్షేమం- రూ. 18,497 కోట్లు కేటాయించారు
- షెడ్యూల్ తెగల సంక్షేమం- రూ. 7,557 కోట్లు కేటాయించారు
- బీసీల సంక్షేమం – రూ. 39,007కోట్లు కేటాయించారు
- అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమం- రూ. 4,376కోట్లు కేటాయించారు
- వ్యవసాయం, అనుబంధ రంగాలకు- రూ. 11,855 కోట్లు కేటాయించారు.
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు Youtube Official Channel | ఇక్కడ క్లిక్ చేయండి |