నిరుద్యోగులకు శుభవార్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాన్ యూనిఫామ్ ఉద్యోగాలకు 34 నుంచి 42 ఏళ్లు వయోపరిమితి పొడిగించింది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఒక శుభవార్త తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగాలకోసం చేసే నియామక ప్రక్రియలో వయోపరిమితి పెంచి మరింత మందికి ప్రభుత్వ ఉద్యోగం సాధించేలా వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వం చేపట్టే కొన్ని ఉద్యోగ స్థానాలకు వయోపరిమితిని పెంపు వర్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఇతర రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు నేరుగా భర్తీ చేసే నాన్-యూనిఫాం పోస్టుల వయోపరిమితిని ఇప్పటివరకు ఉన్న 34 నుండి 42 సంవత్సరాలకు పెంచారు. ఈ 8 సంవత్సరాలు వయస్సు సడలింపుతో రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత రాబోయే ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రక్రియాలకు అర్హులు అవుతారు.
వయోపరిమితి పొడిగింపు
నాన్-యూనిఫాం అన్ని పోస్టులకు గరిష్ట వయోపరిమితిని 34 సంవత్సరాల నుండి 42 సంవత్సరాలకు పొడిగించారు. యూనిఫాం పోస్టులకు ప్రస్తుతం ఉన్న మరో 2 సంవత్సరాలు పొడిగించారు.ఈ ఏడాది సెప్టెంబరులో జరిగే నియామకాలకు వయోపరిమితి పెంపు వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఈ నిర్ణయాన్ని అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో విడుదల కానున్న ఉద్యోగాల భర్తీకి లో కూడా ఈ సడలింపుతో నోటిఫికేషన్ విడుదలవుతాయి అని భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో జారీ చేసే నోటిఫికేషన్లు ఆలస్యం అవుతున్న సందర్భంలో వయోపరిమితి పెంచింది అని తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగానికి గరిష్ట వయసు దాటిపోయిన నిరుద్యోగులకు నష్టం వాటిల్లకుండా ఈ వయోపరిమితిని పెంపు జీవో ఉపశమనం కలిగిస్తుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో పాటు వివిధ బోర్డుల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. యూనిఫామ్, నాన్ యూనిఫామ్ ఉద్యోగాలకు కేటగిరీలుగా గరిష్ట వయోపరిమితిని పెంచింది.