Telugu govt jobs   »   Current Affairs   »   Andhra Pradesh Handicrafts at G20 Summit

Andhra Pradesh Handicrafts at G20 Summit | G20 సదస్సులో ఆంధ్రప్రదేశ్ హస్తకళలు

Andhra Pradesh Handicrafts at G20 Summit | G20 సదస్సులో ఆంధ్రప్రదేశ్ హస్తకళలు

ఢిల్లీలో జరుగుతున్న జీ20 సమావేశాలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాల వైవిధ్యాన్ని చాటిచెబుతున్నాయి. భారత స్టాల్‌లో ఏర్పాటు చేసిన క్రాఫ్ట్స్ బజార్ ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది, ఇక్కడ విదేశీ ప్రతినిధులు భారతదేశం యొక్క శతాబ్దాల నాటి సాంస్కృతిక మరియు హస్తకళల వారసత్వం గురించి తెలుసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల స్టాల్స్‌లో ప్రముఖ హస్తకళా వస్తువులను విక్రయించారు. ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ రాష్ట్ర హస్తకళల వారసత్వం మరియు సంస్కృతిని ప్రదర్శించే లేపాక్షి స్టాల్‌ను ఏర్పాటు చేసింది. ఈ స్టాల్‌లో బొబ్బిలి వీణ, ధర్మవరం, వెంకటగిరి, మంగళగిరి చేనేత వస్ర్తాలు, కొండపల్లి, అనకాపల్లి, విజయనగరం బొమ్మలతో పాటు వివిధ రకాల హస్తకళలు, చేనేత వస్త్రాలు ఉన్నాయి. తిరుపతిలో కొయ్యతో కొలువుదీరిన వెంకటేశ్వర స్వామి విగ్రహం ప్రత్యేక ఆకర్షణ.

అధికారులు విదేశీ అతిథులకు లేపాక్షి ఉత్పత్తుల ప్రయోజనాలను వివరిస్తూ ఉత్పత్తుల వెనుక ఉన్న చరిత్ర, సంస్కృతిని తెలియజేశారు. ఏపీలోని హస్తకళలు, చేనేతలకు విదేశీ ప్రతినిధుల నుంచి మంచి స్పందన లభించింది అని తెలిపారు.

తెలంగాణ స్టాల్‌లో చేర్యాల పెయింటింగ్స్, గద్వాల, పోచంపల్లి చేతితో నేసిన వస్త్రాలు, నిర్మల్ బొమ్మలు, కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ ఉన్నాయి. కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ అనేది 400 ఏళ్ల నాటి కళారూపం, ఇది క్లిష్టమైన డిజైన్‌లు మరియు సున్నితమైన హస్తకళకు ప్రసిద్ధి. ఇది యునెస్కో అవార్డు మరియు నాలుగు జాతీయ అవార్డులను గెలుచుకుంది. నిర్మల్ పెయింటింగ్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

సదస్సులో పాల్గొనే దేశాధినేతలు, ప్రధానమంత్రులకు అశోకచక్రం ఆకారంలో వెండి తీగతో తయారు చేసిన బ్యాడ్జీలను బహూకరించారు. రెడీమేడ్‌గా తయారు చేసుకొచ్చిన హస్త కళాకృతులే కాకుండా అక్కడే సజీవంగా అందరి ముందు తయారుచేసి చూపే ఏర్పాట్లు చేశారు. కుమ్మరి చక్రం,  సాలెల మగ్గం, దారం వడికే రాట్నం, తంజావూరు, రాజస్థాన్‌ పెయింటింగ్‌లన్నీ అందరి ముందు వేసి అందించడం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇండియన్‌ క్రాఫ్ట్స్‌లో  ప్రధానంగా బొబ్బిలి వీణ, వేప చెక్కతో తయారు చేసిన శ్రీవేంకటేశ్వరస్వామి నిలువెత్తు విగ్రహం ఆకట్టుకున్నాయి. వెండితో చేసిన ఏడుకొండలవాడి ఫిలిగ్రీ విగ్రహం ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది.

AP and TS Mega Pack (Validity 12 Months)

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

***************************************************************************

Sharing is caring!

FAQs

జీ20 సదస్సులో ఏం చర్చించారు?

G20 సమ్మిట్‌లో, “ఒకే భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు” అనే థీమ్‌తో ఆహార భద్రత, వాతావరణం మరియు ఇంధనం, అభివృద్ధి, ఆరోగ్యం మరియు డిజిటలైజేషన్ వంటి ముఖ్యమైన అంశాలపై చర్చించారు. ప్రధాన మంత్రి కిషిడా సెషన్ 1 (“ఒక భూమి”) మరియు సెషన్ 3 (“ఒక భవిష్యత్తు”)లో వ్యాఖ్యలు చేశారు.