Andhra Pradesh has the highest number of women making deposits in banks | మహిళలు బ్యాంకుల్లో డిపాజిట్లు చేసేవారిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది
బ్యాంకుల్లో మహిళలు చేస్తున్న డిపాజిట్ల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. ఎస్బీఐ రిసెర్చి నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. 2019 నుంచి 2023 సంవత్సరాల మధ్య డిపాజిట్లు, రుణాలపై సవివర నివేదిక విడుదల చేసింది. మహిళలు చేస్తున్న డిపాజిట్లు పెరగడానికి ప్రధాన కారణం ప్రభుత్వాలు మహిళా సాధికారతకు తీసుకుంటున్న చర్యలే.
స్థిరమైన మహిళా సాధికారతకు ఇవి నిదర్శనం’ అని ఆ నివేదిక పేర్కొంది. దేశంతో పాటు రాష్ట్రంలో మహిళలు చేస్తున్న డిపాజిట్లు పెరగడంతో పాటు మహిళలకు బ్యాంకు రుణాలు కూడా పెరుగుతున్నట్లు ఎస్బీఐ తెలిపింది.
ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం బ్యాంకు డిపాజిట్లలో 35 శాతానికి పైగా మహిళలు ఉన్నారు. 2019 నుంచి 2023 మధ్య కాలంలో దేశంలో మహిళలు తలసరి డిపాజిట్ రూ.4,618కి చేరగా, ఆంధ్రప్రదేశ్‌లో రూ.6,444కి పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో, మార్చి 2023 నాటికి మొత్తం డిపాజిట్లు రూ.4.56 లక్షల కోట్లకు చేరుకున్నాయి, ఈ మొత్తంలో మహిళలు రూ.1.59 లక్షల కోట్లు అని ఎస్బీఐ రిసెర్చి నివేదిక వివరించింది.
పంజాబ్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్ మరియు బీహార్ వంటి రాష్ట్రాల్లో మహిళల డిపాజిట్లు 35 శాతానికి మించిపోయాయి. మహారాష్ట్ర, కర్నాటక, గుజరాత్ మరియు తెలంగాణలలో మహిళల డిపాజిట్లలో తక్కువ పెరుగుదల కనిపించింది. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 2022-23లో దేశవ్యాప్తంగా షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల్లో డిపాజిట్లు 10.2 శాతం పెరిగినప్పటికీ, వ్యక్తిగత వాటా మాత్రం క్షీణించిందని నివేదిక హైలైట్ చేసింది. ముగిసిన 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం డిపాజిట్లలో మహిళా కస్టమర్ల వాటా 20.5 శాతానికి పెరిగిందని విశ్లేషించింది
గ్రామీణ ప్రాంతాలు కూడా ఈ అంశంలో గణనీయమైన వృద్ధిని సాధించాయి. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో మహిళల డిపాజిట్లు పెరిగినట్లు నివేదిక పేర్కొంది. కోవిడ్‌కు ముందు 2019 సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు చేసిన డిపాజిట్ల వాటా 25 శాతం నుంచి 2023 నాటికి 30 శాతానికి పెరిగింది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో మహిళలు చేస్తున్న డిపాజిట్లు బాగా పెరుగుతున్నాయని, 2019 నుంచి 2023 మధ్య కాలంలో ఇవి 50 శాతానికి చేరాయని పేర్కొంది.
మొత్తం డిపాజిట్లలో 37 శాతం 40 నుంచి 60 సంవత్సరాల వయస్సు లోపల వారివేనని, వారి వ్యక్తిగత డిపాజిట్లు రూ.34.7 లక్షల కోట్లని తెలిపింది. 60 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్ల డిపాజిట్లు రూ. 36.2 లక్షల కోట్లు అని, ఈ వ్యక్తిగత డిపాజిట్లు 38 శాతమని తెలిపింది. 60 సంవత్సరాల పైబడిన సీనియర్ మహిళల వ్యక్తిగత డిపాజిట్లు రూ.13.2 లక్షల కోట్లుగా తెలిపింది.
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
***************************************************************************