The Eastern Chalukyas, Also known as the Chalukyas of Vengi, were a South Indian dynasty that ruled during the 7th and 12th centuries. They started out as governors of the Chalukyas of Badami in the Deccan region. Subsequently, they became a sovereign power, and ruled the Vengi region of present-day Andhra Pradesh. They Ruled until 1130 CE. They continued ruling the region as feudatories of the Cholas until 1189 CE. in this article we are providing complete details of eastern Chalukyas. to know more details about eastern Chalukyas read the article completely.
APPSC/TSPSC Sure shot Selection Group
Andhra Pradesh History – East Chalukyas | తూర్పు చాళుక్యులు
తూర్పు చాళుక్యులు 7వ శతాబ్దం నుండి 12వ శతాబ్దాల వరకు ప్రస్తుత భారత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ యొక్క తూర్పు ప్రాంతాన్ని పాలించిన ప్రముఖ రాజవంశం. తూర్పు చాళుక్యులు లేదా వేంగి చాళుక్యులు అని కూడా పిలుస్తారు, వారు దక్షిణ భారతదేశ చరిత్ర యొక్క చరిత్రలో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్నారు. తూర్పు చాళుక్యులను ఇతర రాజవంశాల నుండి వేరుగా ఉంచింది ఏమిటంటే, విస్తృత సాంస్కృతిక మరియు రాజకీయ పరిణామాలతో ప్రాంతీయ ప్రభావాలను సామరస్యపూర్వకంగా మిళితం చేయగల వారి సామర్థ్యం.
తూర్పు చాళుక్యులు (క్రీశ. 624 – 1076)
- క్రీశ.624లో కుబ్దవిష్ణువర్థనుడు వేంగి రాజధానిగా తూర్పు చాళుక్య రాజ్యాన్ని స్థాపించాడు. ఈ వంశం క్రీ.శ.1076 వరకు ఆంధ్రదేశాన్ని పరిపాలించింది.
- చాళుక్యులు క్షత్రియులు. వీరు మధ్య ఆసియాకు చెందినవారని లూయీరైస్ అనే చరిత్రకారుడు పేర్కొన్నాడు.
- ఈ వంశానికి చెందిన చిలికి రమ్మణక అనే పాలకుడు ఇక్వాకులకు సామంతుడిగా హిరణ్య ప్రాంతాన్ని (కడప, కర్నూలు) పాలించినట్లు నాగార్జున కొండశాసనం తెలుపుతోంది.
- తూర్పు చాళుక్యులు హారితీ పుత్ర అనే మాతృసంజ్ఞను ఉపయోగించారు. చాళుక్యులు బ్రహ్మచుళకం నుంచి పుట్టారని బిల్వణుడి విక్రమాంక దేవ చరిత్ర గ్రంథం పేర్కొంది. తూర్పు చాళుక్యుల్లో గొప్పవాడు గుణగ విజయాదిత్యుడు కాగా చివరి చక్రవర్తి ఏడో విజయాదిత్యుడు.
Political history | రాజకీయ చరిత్ర
- కుబ్బ విష్ణువర్ధనుడు (క్రీ.శ. 624 – 642): బాదామి చాళుక్య రాజు రెండో పులకేశి సోదరుడు కుబ్ద విష్ణువర్ధనుడు. రెండో పులకేశి కునాల, పిష్టపురం యుద్ధాల్లో తూర్పు ప్రాంతాలను జయించి కుబ్ద విష్ణువర్థనుడిని పాలకుడిగా నియమించాడు.
- రెందో పులకేశి మరణానంతరం కుబ్ద విష్ణువర్ధనుడు స్వతంత్ర పాలన ప్రారంభించాడు.
- విషమసెద్ధి మకరధ్వజుడు, మహారాజు, కాయదేవ లాంటి బిరుదులు ధరించాడు.
- చీపురుపల్లి, తిమ్మాపురం శాసనాలు వేయించాడు. తిమ్మాపురం శాసనంలో పరమ భాగవతుడు అనే బిరుదు ధరించినట్లు ఉంది. అటవీ దుర్ణయుడు ఇతడి సామంతుల్లో ప్రధానమైనవాడు.
- కుబ్ద విష్ణువర్ధనుడు పిఠాపురంలో కుంతీమాధవ స్వామి ఆలయాన్ని నిర్మించాడు.
మొదటి జయసింహ వల్లభుడు: (క్రీ.శ 642 – 673)
- ఇతడు సర్వలోకాశ్రయ, సర్వసిద్ది అను బిరుదులూ ధరించాడు.
- తూర్పు చాళుక్య పల్లవ ఘర్షణలు ఇతని కాలంలోనే ప్రారంభమయ్యాయి.
- పొలమూరు, పెద్దమద్దాల శాసనాలు ఇతని విజయాలను వర్ణిస్తాయి.
- ప్రాచీన తెలుగు శాసనాల్లో ఒకటైన విప్పర్ల శాసనం వేయించింది ఇతడే.
- ఇతని తర్వాత ఇంద్ర భట్టారకుడు, రెండో విష్ణువర్ధనుడు, మంగి యువరాజు, రెండో జహాసింహుడు వరుసగా పాలించారు. ఇంద్రభట్టారకుడు కేవలం 7 రోజులు మాత్రమే పాలించాడు.
మూడో విష్ణువర్ధనుడు: (క్రీశ 718 – 752)
- ఇతను త్రిభువనాంకుశ, కవిపండిత కామధేను అనే బిరుదులూ ధరించాడు.
- పల్లవ రాజు రెందో నంది వర్మను ఓడించి, బోయకొట్టాలు (నెల్లూరు) ప్రాంతాన్ని ఆక్రమించాడు. ఇతని సేనాని ఉదయ చంద్రుడు.
మొదటి విజయాదిత్యుడు: (క్రి.శ 753 – 770)
- ఇతను మహా రాజాధిరాజా, భట్టారక అను బిరుదులను ధరించాడు.
- ఇతని కాలంలోనే తూర్పు చాళుక్య రాష్ట్రకూట ఘర్షణలు మొదలయ్యాయి.
- రాష్ట్రకూట యువరాజు గోవిందుని చేతిలో ఇతను ఓడిపోయాడు.
నాలుగో విష్ణువర్ధనుడు: (క్రీశ 771 – 806)
- ఇతను రాష్ట్రకుట రాజైన ధ్రువుని చేతిలో ఓడిపోవడమే కాక, తన కుమార్తె ఐన శీల మహాదేవినిచ్చి వివాహం జరిపించాడు.
- ఇతను రాష్ట్రకూటులకు సామంతునిగా వ్యవహరించాడు. ఇతని గురించి పంప రచించిన విక్రమార్దున విజయం గ్రంథంలో వుంది.
రెండో విజయాదిత్యుడు
- ప్రతీహార వంశరాజు నాగభట్టు విజయాదిత్యుడి చేతిలో ఓడినట్లు తెలుస్తోంది.
- రెండో విజయాదిత్యుడు 108 యుద్ధాలు చేసి, 108 శివాలయాలు నిర్మించాడు.
- నరేంద్ర మృగరాజు మహావీరుడు, చాళుక్యరామ, విక్రమధావళి అనే బిరుదులు పొందాడు.
- విజయాదిత్యుడి వల్లే బెజవాడ విజయవాడ అయిందని చరిత్రకారుల అభిప్రాయం.
అయిదో విష్ణువర్ధనుడు (క్రీశ. 847 – 848)
- రెందో విజయాదిత్యుడి తర్వాత అతడి కుమారుడు కలి విష్ణువర్ధనుడు/అయిదో విష్ణువర్ధనుడు ఒక్క సంవత్సరమే పరిపాలించాడు.
గుణగ విజయాదిత్యుడు/మూడో విజయాదిత్యుడు (క్రీశ. 848 – 891)
- తూర్పు చాళుక్య రాజుల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన గొప్ప పాలకుడు గుణగ విజయాదిత్యుడు.
- అతడు వేయించిన తొమ్మిది శాసనాలు లభించాయి.
- వాటిలో మచిలిపట్నం శాసనం, గుంటూరు శాసనం, సాతలూరు శాసనం, సీసలి శాసనం (ఇవన్నీ తామ్ర శాసనాలు), అద్దంకి శిలా శాసనం ముఖ్యమైనవి.
- చాళుక్య భిముడి అత్తిలి శాసనం, అమ్మరాజు ఈడేర్సు కలుచుంబర్రు శాసనాలు కూడా గుణగ విజయాదిత్యుడి విజయాలను వివరిస్తున్నాయి.
- ఇతడి సేనాని పాండురంగడు వేయించిన అద్దంకి శాసనంలో (తొలి పద్య శాసనం) తరువోజ వృత్తం ఉంది.
- గంగాయమునా తోరణాన్ని తన ధ్వజంపై ముద్రించాడు.
- ఈ విషయాన్నిసాతలూరు శాసనం వివరిస్తుంది. కాబట్టి వేంగి చాళుక్యులను చండచాళుక్యులు అంటారు.
- గుణగ విజయాదిత్యుడు త్రిపురమర్త్య మహేశ్వర, దక్షిణాపతి, పరచక్రరామ, భువన కందర్ప, వీరమకర ధ్వజ, రణరంగ శూద్రక, మనుజప్రకార బిరుదులు పొందాడు.
ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర ఆర్టికల్స్
చాళుక్య భీముడు/ ఆరో విష్ణువర్ధనుడు (క్రీశ. 892 – 922)
- రణమర్థ వంశస్తుల మంచికొండ నాడును రాష్ట్రకూట సైన్యం వేములవాడ బద్దెగ నాయకత్వంలో ఆక్రమించింది.
- “మొసలిని జలాయశయంలో బంధించినట్లుగా భీముడిని బద్దెగ బంధించాడు” అని పంప రచించిన విక్రమార్దున విజయం గ్రంథం తెలియజేస్తుంది.
- కానీ రణమర్థ వంశస్తుడైన కుసుమాయుధుడు రాష్ట్రకూట (రట్టడి) సైన్యాలను ఓడించి, చాళుక్య భీముడిని విడిపించాడు. కొరవి శాసనం ఈ విషయాన్ని తెలుపుతోంది.
- చాళుక్య భీముడు క్రీ.శ.892లో ఆరో విష్ణువర్ధనుడు అనే నామాంతరంతో పట్టాభిషేకం జరుపుకున్నాడు.
- చాళుక్య భీముడు ౩6౦ యుద్దాలు చేశాడని మల్లపదేవుడి పిఠాపురం శాసనం చెబుతుంది.
- చాళుక్య భీముని ఆస్థానంలో చల్లవ్వ అనే గాన విద్యాప్రవీణురాలు వుండేది.
- ఇతడి బిరుదు కవి వృషభ.
- ద్రాకారామం , చేబ్రోలు, చాళుక్య భీమవరం, భీమేశ్వరాలయాలను నిర్మించింది ఇతడే. ఇతని కాలంలోనే హల్లీశకం అనే కోలాట నృత్యం ప్రసిద్ధి చెందింది.
మొదటి అమ్మరాజు (921-928)
- ఇతనికి రాజమహేంద్ర అనే బిరుదు వుండేది.
- తన బిరుదు పేరు మీదుగానే రాజమహేంద్రవరాన్ని ఇతను నిర్మించినట్లు, విన్నకోట పెద్దన కావ్యాలంకార చూడామణి గ్రంథం ద్వారా తెలుస్తుంది.
- మొదటి అమ్మరాజు తర్వాత అతడి కుమారుడు కంటిక విజయాదిత్యుడు పాలనను వచ్చాడు.
- కానీ రెందో విక్రమాదిత్యుడు అతడిని 15 రోజుల్లోనే తొలగించి తనే పాలకుడయ్యాడు.
- అమ్మరాజు మరొక కుమారుడైన రెందో చాళుక్య భీముడు రెండో విక్రమాదిత్యుడిని సంహరించి ఎనిమిది నెలలు వేంగిని పాలించినట్లు తెలుస్తోంది.
- విక్రమాదిత్యుడి తర్వాత మొదటి యుద్ధమల్లు రాజయ్యాడు. తర్వాత రెండో చాళుక్య భీముడు తిరిగి రాజయ్యాడు.
- మొదటి యుద్ధమల్లుడు క్రీశ.930_934 మధ్య పాలించాడు.
- తర్వాత రెండో చాళుక్య భీముడు_క్రీ.శ.935లో రాజయ్యాడు. నాలుగో విజయాదిత్యుడు, వేలాంబల కుమారుడే రెండో చాళుక్య భీముడు.
- ఇతడు కోలవెన్ను శాసనం వేయించాడు. రెండో చాళుక్య భీముడి భార్యలు అంకిదేవి, లోకాంబిక. అంకిదేవికుమారుడు దానార్ణవుడు కాగా లోకాంబిక కుమారుడు రెండో అమ్మరాజు.
రెండో యుద్ధమల్లుడు
- క్రీ.శ.940లో రెందో చాళుక్య భీముడు మరణించడంతో రెందో యుద్ధమల్లుడు రాష్ట్రకూటరాజు నాలుగో గోవిందుడి సహాయంతో రాజయ్యాడు.
- ఇతడు వేయించిన బెజవాడ శాసనంలో తెలుగు చంధస్సుకు చెందినమధ్యాక్కరలు ఉన్నాయి.
- ఇతడి కాలంలోనే నన్నెచోడుడు తెలుగులో కుమార సంభవంగ్రంథాన్నిరచించాడు.
- మొదటి యుద్ధమల్లు విజయవాడలో కార్తికేయ ఆలయం నిర్మించగా, రెందో యుద్ధమల్లు నాగమల్లీశ్వరి ఆలయాన్ని నిర్మించాడు.
రెండో అమ్మరాజు (ఆరో విజయాదిత్యుడు) (క్రీ.శ. 945 – 970):
- రెండో చాళుక్య భీముడు,లోకాంబికల పుత్రుడు రెండో అమ్మరాజు. ఇతడు క్రీ.శ.945లో రెండో యుద్ధమల్లుడిని వధించి పాలనకు వచ్చాడు.
- రెండో అమ్మరాజు పాలనలో రాష్ట్రకూట రాజు మూదో కృష్ణుడి దండయాత్ర జరిగింది.
- రెండో అమ్మరాజు జైనమతాన్ని అవలంబించాడు.
- ఇతడు ప్రకాశం జిల్లాలో కఠకాభరణ జినాలయాన్ని నిర్మించాడు.
- రెందో అమ్మరాజు ఆస్టానంలో కవి చక్రవర్తి బిరుదాంకితుడైన పోతనభట్టు, మాధవభట్టు, భట్టుదేవుడు అనే కవులు ఉండేవారు.
- రెండో అమ్మరాజు కవిగాయక కల్పతరువు, పరమ బ్రాహ్మణ్య, పరమ మహేశ్వర, పరమ భట్టారక బిరుదులు పొందాడు.
దానార్జ్హవుడు (క్రీశ. 970 – 973)
- మాగల్లు శాసనం ప్రకారం కీశ.970లో దానార్జవుడు రెండో అమ్మరాజును వధించి రాజ్యానికి వచ్చాడు.
- చోళుల సహాయంతో కల్యాణిచాళుక్యుల దాడులను ఎదుర్కోవాలని ప్రయత్నించాడు కాని వారి సహాయం లభించలేదు.
- క్రీశ.973లో జటాఛోడబీముడు దానార్జవుడిని ఓడించి చంపాడు.
జటాఛోడ భీముడు (క్రీశ. 973 – 1000)
- కర్నూలు మండలంలోని పెద్దకల్లును పాలించిన తెలుగుభోడ వంశస్థుడు జటాఛోడ భీముడు.
- కైలాసనాథ దేవాలయ శాసన ఖండం ఇతడి విజయాలను తెలుపుతుంది.
రాజరాజ నరేంద్రుడు (క్రీ.శ. 1019 – 1060)
- రాజరాజ నరేంద్రుడు క్రీ.శ.1019లో సింహాసనం అధిష్టించినప్పటికీ క్రీశ.1021లోనే పట్టాభిషేకం జరిగింది.
- చోళుల సహాయంతో రాజరాజ నరేంద్రుడు కలిదిండి యుద్ధంలో వారిని ఓడించాడు. ఈ యుద్ధంలో చనిపోయిన చోళసేనానుల స్మృత్యర్థం రాజరాజనరేంద్రుడు మూడు శివాలయాలు నిర్మించాడు.
- పశ్చిమ/కల్యాణి చాళుక్యులు సమస్త భువనాశ్రయుసత్యాశ్రయ కులశేఖర లాంటి బిరుదులు పొందారు.
- నన్నయ కూడా తన ఆంధ్ర మహాభారత గ్రంథంలో ఈ బిరుదులు ప్రస్తావించాడు.
- రాజరాజ నరేంద్రుడు తన ఆస్థానంలో నన్నయ, నారాయణభట్టు, పావులూరి మల్లన కవులను పోషించాడు.
- నారాయణభట్టు సహాయంతో నన్నయ మహాభారతాన్ని తెలుగులో రాసి ఆదికవిగా పేరొందాడు.
- పావులూరి మల్లన గణితసార సంగ్రహం అనే గ్రంథాన్ని రచించాడు.
- తొలి తెలుగు వ్యాకరణ గ్రంథం ఆంధ్రశబ్దచింతామణి లేదా ఆంధ్ర భాషానుశాసనం ను నన్నయ రాశాడు.
- నన్నయ నందంపూడి శాసనాన్ని వేయించాడు. రాజరాజ నరేంద్రుడు తన రాజధానిని వేంగి నుంచి రాజమహేంద్రవరానికి మార్చుకున్నాడు. ఇతడికి కావ్యగీతిప్రియుడు అనే బిరుదుంది.
ఏడో విజయాదిత్యుడు
- చివరి వేంగి చాళుక్యరాజు ఏడో విజయాదిత్యుడు.
- కల్యాణి చాళుక్యరాజు విక్రమాదిత్యుడితో పోరాటంలో తన కుమారుడు రెండో శక్తివర్మను కోల్పోయాడు.
- క్రీ.శ1075లో ఇతడి మరణంతో వేంగి చాళుక్య రాజ్యం అంతరించి చోళరాజ్యంలో విలినమైంది.
తూర్పు చాళుక్య కాలంనాటి సామంత రాజ్యాలు
- చాళుక్య యుగంలో బాణులు, నొలంబులు, వైదుంబులు, వేములవాడ చాళుక్యులు ముదిగొండ చాళుక్యులు. వీరంతా సామంతరాజులుగా ప్రధాన పాత్ర పోషించారు.
- బాణులు: కదంబ వంశానికి చెందిన కుకుత్సవర్మ వేయించిన తొల్గొండ శాసనంలో బాణుల ప్రస్తావన తొలిసారిగా ఉంది.
- వంశ మూలపురుషుడు విజయ నందివర్మ. వీరి రాజధాని నేటి అనంతపురం జిల్లాలోని పరివిపురి (పరిగి).
- నొలంబ వంశ రాజు మహేంద్రుడు విక్రమాదిత్య బాణుడిని వధించి మహాబలికులవిధ్వంసక బిరుదు పొందాడు.
ముదిగొండ చాళుక్యులు
కొరవి సీమలోని ముదిగొండ (ఖమ్మం) వీరి రాజధాని. వంశస్థాపకుడు రణమర్థ అతడి సోదరుడు కొక్కిలి. రణమర్థ కుమారుడైన కుసుమాయుధుడు చాళుక్య భీముడి వేంగి సింహాసన ఆక్రమణలో తోడ్పడ్డాడు.
వేములవాడ చాళుక్యులు
విక్రమాదిత్య యుద్ధమల్లుడు ఈ వంశ స్థాపకుడు. నేటి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ వీరి రాజధాని. మొదటి అరికేసరి కొల్లిపర శాసనం, రెండో అరికేసరి వేములవాడ శాసనం, మూడో అరికేసరి పర్భనిశాసనాలు, పంప కవి రచించిన విక్రమార్జున విజయం వీరి చరిత్రకు ప్రధాన ఆధారాలు.
Features of the Era | యుగ విశేషాలు
- పాలనాంశాలు: వేంగి చాళుక్యులు తమ రాజ్యాన్ని విషయాలు, నాడులు, కొట్టాలు, గ్రామాలుగా విభజించారు.
- రాజు సర్వాధికారి, సప్తాంగ సిద్ధాంతాన్ని అనుసరించారు. రాజు, రాజ్యం, మంత్రి దుర్గం, కోశం, సైన్యం, మిత్రుడు అనేవి సప్తాంగాలు.
- నాటి మంత్రి మండలిని అష్టాదశ తీర్థులు అనేవారు. యువరాజు లేదా ఉపరాజు, సేనాపతి, కోశాధికారులు సలహాలు ఇచ్చేవారు.
Financial Conditions | ఆర్థిక పరిస్థితులు
- తూర్పు చాళుక్యుల కాలంలో వ్యవసాయ, వాణిజ్య, పరిశ్రమల రంగాలు బాగా అభివృద్ధి చెందాయి.
- బ్రాహ్మణులు ఆలయాలు, భూములు అగ్రహారాలు పొంది భూస్వాములుగా రూపొందారు.
- రాజ్యానికి ప్రధాన ఆదాయం భూమి శిస్తు.
- వైదుంబరాజు భువన త్రినేత్రుడు సింహాసనం ఎక్కిన సందర్భంలో రేనాడు రైతులపై దేగరచ పన్ను, పడెవాలు పన్ను, పడియేరి పన్ను, సంధి విగ్రహం పన్ను మినహాయించాడు.
- నాడు వర్తక సంఘాలను నకరములు అని, వర్తక సంఘాల నియమ నిబంధనలను సమయకార్యం అని పేర్కొనేవారు.
- మాడలు, ద్రమ్మములు,గద్యాణాలు అనేవి నాటి ముఖ్య నాణేలు. మొదటి శక్తివర్మ బంగారు నాణేలు సయాం (బర్మా)లో లభించాయి.
- మార్కెట్లు కూడళ్లకు, సరకుల రవాణా చేసేవారిని ‘పెరికలు’గా పిలిచేవారు.
- చినగంజాం, కళింగపట్నం, కోరంగి, మచిలీపట్నం, మోటుపల్లి, కృష్ణపట్నం నాటి ప్రధాన ఓడరేవులు.
వీరి కాలంలో పన్నులు:
- కల్లానక్కనం – కల్లు పై విధించే పన్ను
- కళ్యానక్కనం – వివాహంపై పన్ను
- దొగరాజు భృతి – యువరాజు భృతి కోసం పన్నుమత పరిస్థితులు : భౌద్ధ మతం క్షీణించి జైన మతానికి రాజాదరణ లభించింది.
- తూర్పు చాళుక్యులు పరమ భాగవత పరమ మహేశ్వర బిరుదులు ధరించి స్మార్త సంప్రదాయాన్ని పాటించారు.
- పూజా విధానంలో శివుడు, విష్ణువు, దేవి, గణపతి, ఆదిత్యుడు అనే అయిదు దైవాలను ఆరాధించే పంచాయతన పద్దతిని ప్రవేశపెట్టారు.
- శ్రీశైలం, ద్రాకారామం, కాళేశ్వరం శైమతంలోపాశుపత, కాలాముఖ, కాపాలిక అనే శాఖలు ఏర్పడ్డాయి.
- చోళులు ఆంధ్ర దేశంలోని జైన క్షేత్రాలను ధ్వంసం చేశారు. శైవంలో ప్రాచీనమైన పాశుపతాన్ని లకులీశుడు స్టాపించగా, కాలాముఖ శాఖను కాలాననుడు స్థాపించాడు.
- కాలాముఖులు అమరావతి, బెజవాడ లాంటి చోట్ల సింహ పరిషత్తులు సాపించి జైన, బౌద్ధ ఆలయాలను ధ్వంసం చేశారు.
Social Conditions | సాంఘిక పరిస్థితులు
- వేంగి చాళుక్యుల కాలంలో చాతుర్వర్ణ వ్యవస్థ ప్రధానమైంది. అయినప్పటికీ కులవ్యవస్థ అత్యంత జరఠిలమైంది.
- బ్రాహ్మణుల్లో వైదికులు, నియోగులు ఏర్పడ్డారు.
- వైశ్యులు జైనమతాన్ని అవలంభించారు. వారి కులదేవత వాసవీ కన్యకా పరమేశ్వరి.
- విశ్వకర్మలు పంచాననం లేదా పంచాణం వారిగా అవతరించారు.
- పంచాణం అంటే కంసాలి,కమ్మరి, కంచరి, కాసె, వడ్రంగి అనే అయిదు తరగతులుగా విశ్వకర్మలు అవతరించారు.
- శాసన, పత్రికాకారులుగా, లేఖకులుగా విశ్వకర్మలు పనిచేస్తూ, తమ పేరు చివరన ఆచార్య అనే పదాన్ని ధరించారు.
Cultural Conditions | సాంస్కృతిక పరిస్థితులు
- తూర్పుచాళుక్యుల కాలంలో విద్యా సారస్వతాలు, వాస్తుకళా రంగాలు ఎంతో అభివృద్ధి చెందాయి. తెలుగు, సంస్కృత భాషలను పోషించారు.
- రెండో అమ్మరాజు ఆస్థానంలో భట్టిదేవుడు (కవి చక్రవర్తి), మాధవ భట్టు, పోతన భట్టు లాంటి కవులను పోషించారు.
- అందుకే రెండో అమ్మరాజు కవిగాయక కల్పతరువుగా పేరొందాడు.
- మూడో విష్ణువర్ధనుడు కవి పండితకామధేనువు అనే బిరుదు పొందాడు.
- అతిప్రాచీన తెలుగు మరో ప్రాచీన తెలుగు శాసనమైన విప్పర్ల శాసనాన్ని మొదటి జయసింహ వల్లభుడు వేయించాడు.
- ద్రాక్షరామ, చేబ్రోలు భీమేశ్వర ఆలయాలను మొదటి చాళుక్యభీముడు నిర్మించాడు.
- బిక్కవోలు(బిరుదాంకని ప్రోలు) దేవాలయాలను గుణగ విజయాదిత్యుడు నిర్మించాడు.
- నాటి శిల్పాల్లో వీణ, పిల్లనగ్రోవిమృదంగం, తాళాలు లాంటి వాద్య పరికరాలు కనిపిస్తున్నాయి.
Andhra Pradesh History – East Chalukyas Study Material PDF
Andhra Pradesh History Articles |
Andhra Pradesh History – Satavahans |
Andhra Pradesh History – Ikshvakulu |
Andhra Pradesh History – Reddy and Nayaka Rajulu |
Andhra Pradesh History – Kakathiyas |
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |