Arrival of Europeans and English Rule|యూరోపియన్ల రాక మరియు ఆంగ్ల పాలన
- ఆంధ్ర దేశానికి ప్రాచీన కాలం నుంచి అనేకమంది విదేశీయులు వచ్చేవారు. శాతవాహనుల కాలంలో రోమ్‌తో వర్తక వ్యాపారాలు జరిగేవి. మధ్యయుగంలో అరబ్బులు, ఆధునిక యుగంలో ఐరోపావారు మనదేశంతో వర్తక వాణిజ్యాలు జరిపారు.
- 1453లో తురుష్కులు కాన్‌స్టాంట్ నోపుల్ ఆక్రమించారు. దాంతో నూతన మార్గాల అన్వేషణలో భాగంగా 1498, మే 17న పోర్చుగీసు నావికుడైన వాస్కోడిగామా సౌత్ గాబ్రియెల్ అనే నౌకలో కాలికట్ తీరాన్ని చేరాడు.
- పోర్చుగీసువారు తొలి స్థావరాన్ని మచిలిపట్నం (1670)లో ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత డచ్చివారు వాన్ లిచ్‌చ్‌టన్ (Von lischotn) అనే డచ్ యాత్రికుడి రాతల వల్ల ప్రభావితమై 1605 నాటికి మహ్మద్ కులీకుతుబ్‌షా అనుమతితో మచిలిపట్నంలో పేటపోలి (కృష్ణా జిల్లా) నరసాపూర్ భీమునిపట్నంలలో వర్తక స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు.
- 1610లో పులికాట్‌లో శాశ్వత వర్తక కేంద్రాన్ని నెలకొల్పారు. మహ్మద్ కులీకుతుబ్‌షా డచ్చివారికి వజ్రాల గనులపై హక్కును కల్పించడమే కాకుండా, సొంతంగా నాణేలు ముద్రించుకోవడానికి అనుమతించాడు.
- ఆంగ్లేయులు 1611లో గ్లోబ్ నౌకలో హిప్పన్ నాయకత్వంలో వచ్చి మచిలీపట్నంలో తొలి వర్తక స్థావరాన్ని (1622) స్టాపించారు. గ్లోబ్ నౌకను నర్సాపురం వద్ద ఉన్న మాధవాయపాలెంలో తయారు చేశారు. ఆంగ్లేయులు పులికాట్ (1621), ఆర్ముగం/ఆర్మగాన్, నెల్లూరు జిల్లా(1626); నిజాంపట్నం, భిమునిపట్నం (1632); విశాఖపట్నం (1682), తూర్పు గోదావరి జిల్లా ఇంజరు/ఇంజీర (1708) లలో వర్తక స్థావరాలు స్థాపించారు.
- 1632లో అబ్దుల్లా కుతుబ్‌షా ఆంగ్లేయుల వ్యాపారానికి గోల్డెన్ ఫర్మానా జారీ చేశాడు.
- మచిలిపట్నం కౌన్సిల్ అధ్యక్షుడైన ఫ్రాన్సిస్ డే 1639లో చంద్రగిరి పాలకుడు మూడో వెంకటపతిరాయల ప్రతినిధులైన దామెర్ల సోదరులు (వెంకటప్ప, వెంకటాద్రి) సహాయంతో చెన్నపట్నంను కొని 1640లో సెయింట్ జార్జి కోటను నిర్మించాడు.
- దీన్ని 1641లో ఆంగ్లేయుల తూర్పు తీర స్థావరాలకు ముఖ్య కేంద్రంగా ప్రకటించారు. 1684లో మద్రాస్ ప్రెసిడెన్సీ ఏర్పాటుకాగా, 1688లో నగరపాలక సంస్థ ఏర్పడింది.
Adda247 APP
Anglo-French conflicts : ఆంగ్ల – ఫ్రెంచి సంఘర్షణలు (కర్ణాటక యుద్ధాలు)
కర్ణాటక ప్రాంతంలోనే ఆంగ్ల, ఫ్రెంచి వర్తక స్థావరాలు (మద్రాస్, పాండిచ్చేరి) ఉండటం వల్ల ఆ ప్రాంతంలో జరిగిన ఘర్షణలనే కర్ణాటక యుద్దాలు అన్నారు. నాటి కర్ణాటక రాజధాని ఆర్కాటు. ఈ పట్టణమే ఆంగ్ల, ఫ్రెంచి సంఘర్షణలకు కేంద్రస్ట్థానమైంది. వారి మధ్య 3 యుద్ధాలు జరిగాయి.
First Carnatic War – మొదటి కర్ణాటక యుద్ధం (1740 – 1748)
- ఐరోపాలో ప్రారంభమైన ఆస్ట్రియా వారసత్వ యుద్ధంలో ఇంగ్లండ్, ప్రాన్‌స్‌ల జోక్యం వల్ల భారతదేశంలో రెండు కంపెనీల మధ్య యుద్దం మొదలైంది. నాటి ఫ్రెంచి గవర్నర్ డూప్లే ఆంగ్ల గవర్నర్ నికోలస్ మోర్స్.
- ఆంగ్లేయులు కర్ణాటక నవాబు అన్వరుద్దీన్‌కు ఫిర్యాదు చేయగా, అతడు తన సైన్యంతో ఫ్రెంచివారిపై సైన్యాన్ని నడిపి శాంధథోమ్ యుద్దం (1746)లో ఫ్రెంచివారి చేతిలో ఓటమి నొందాడు.
- 1748లోఎక్‌స్‌లా ఛాపెల్ సంధి ద్వారా ఆస్ట్రియా వారసత్వ యుద్ధం ముగిసింది. దాంతో మద్రాస్‌ను తిరిగి ఇచ్చేశారు. కానీ ప్రాన్స్ అమెరికాలోని లూయిస్ బర్‌గ్‌ను పొందింది.
Second Carnatic War- రెండో కర్ణాటక యుద్ధం (1749 – 1753)
- ఈ యుద్ధానికి కారణం హైదరాబాద్, కర్ణాటక వారసత్వ తగాదాల్లో ఐరోపా కంపెనీల జోక్యం. ముజఫర్ జంగ్ (హైదరాబాద్), చందాసాహెబ్ (కర్ణాటక)లను ఫ్రెంచివారు బలపరచగా నాజర్ జంగ్స్ అన్వరుద్దీన్‌లను ఆంగ్లేయులు బలపరిచారు.
- కర్ణాటకలో మొదట ఫ్రెంచివారి సహాయంతో చందాసాహెబ్ కర్ణాటక నవాబుగా నియమితుడైనప్పటిక్తీ 1752లో రాబర్ట్ క్లెవ్ దండెత్తి ఆర్కాటును ముట్టడించి అన్వరుద్దీన్ కుమారుడు మహ్మదాలీిని కర్ణాటక నవాబుగా నియమించాడు.
- ఆర్కాటు వీరుడిగా క్లెవ్ కీర్తి గడించాడు. ఆవిధంగా ఈ యుద్దం కర్ణాటకలో ఫ్రెంచివారి పలుకుబడిని అంతం చేసింది.
Third Carnatic War – మూడో కర్ణాటక యుద్ధం (1756 – 1763)
- ఐరోపాలో ఇంగ్లండ్, ప్రాన్‌స్‌ల మధ్య సప్తవర్ష సంగ్రామం 1756లో మొదలైంది. ఫలితంగా భారతదేశంలో కంపెనిల మధ్య మూడో కర్ణాటక యుద్ధం ప్రారంభమైంది.
- నాటి ఫ్రెంచి గవర్నరు కౌంట్ డిలాలి హైదరాబాదులో ఉన్న బుస్సీని కర్ణాటకకు పిలిపించగా ఆంగ్లేయులు చందుర్తి యుద్ధం (17058, డిసెంబరు 7), మచిలిపట్నం యుద్ధాల్లో (1759, ఏప్రిల్ 8) ఫ్రెంచివారిని ఓడించారు. ఫలితంగా సలాబత్ జంగ్ ఆంగ్లేయుల పక్షాన చేరి ఉత్తర సర్కారులను ఆంగ్లేయులకు ఇచ్చేశాడు. హైదరాబాద్/ భారతదేశంలో ఫ్రెంచి ఆధిపత్యాన్ని ఈ యుద్ధం అంతం చేసింది.
బొబ్బిలియుద్ధం (1757 జనవరి 24)
- బుస్సీ సలహాతో విజయనగర జమీందారు విజయరామరాజు బొబ్బిలిపై యుద్ధాన్ని ప్రకటించాడు. బొబ్బిలి జమీందారు రంగారావు చనిపోగా, అతడి మిత్రుడు తాండ్ర పాపారాయుడు విజయరామరాజును హత్య చేశాడు. తర్వాత ఆనంద గజపతి విజయనగర జమీందారుగా నియమితుడయ్యాడు.
- కొండార/కోడుర (1759) యుద్ధంలో పెద్దాపురం జమీందారును ఆనంద గజపతి ఓడించాడు.
- 1760లో ఆనంద గజపతి మశూచి వ్యాధి సోకి మరణించాడు.
ఉత్తర సర్కారులు:
- నేటి కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం నుంచి ప్రకాశం వరకు ఉన్న ప్రాంతాన్ని ఉత్తర సర్కారులు అనేవారు. సలాబత్‌జంగ్ వీటిని మొదట ఫ్రెంచివారికి (1754) తర్వాత ఆంగ్లేయులకు (1759) ఇచ్చాడు.
- గోదావరి ప్రాంత జమీందారులను ఓడించి కప్పం వసూలు చేశాడు. మహారాష్ట్రలతో జరిపిన యుద్ధంలో ఆంగ్లేయుల సహాయాన్ని కోరాడు. కాన్సి వారు మూడో కర్ణాటక యుద్ధంలో పాల్గొంటున్నందు వల్ల సహాయపడలేదు.
- ఆంగ్రేయులు జోగిపంతులుకు రావు బహదూర్ బిరుదును ఇవ్వగా నిజాం అతడిని రాజమండ్రి మజుందార్/ నూర్ షెరిస్తార్‌గా నియమించాడు.
దత్త మండలాలు:
- కడప, కర్నూలు, బళ్లారి, అనంతపురం జిల్లాలను నిజాం అలీ 1800, అక్టోబరు 12న సైన్య సహకార పద్ధతిలో చేరినందుకుగాను ఆంగ్లేయులకు దత్తం చేశాడు. అందుకే వాటిని దత్త మండలాలు అంటారు.
- ఈ ప్రాంతాలు విజయనగర సామ్రాజ్యంలో తర్వాత మొగలుల ఆధీనంలో ఉండేవి. వీటిని హైదర్ అలీ, టిప్పు సుల్తానులు ఆక్రమించారు.
- “ఈ ప్రాంతాలను ఆంగ్లేయులకు దత్తం చేయడం మంచిది. దీనివల్ల నిజాం, ఆంగ్లేయుల మధ్య మైత్రి శాశ్వతం కాగలదు” అని వెల్లస్లీ వ్యాఖ్యానించాడు.
నెల్లూరు, చిత్తూరు జిల్లాలు (1802):
- రెండో కర్ణాటక యుద్ధం తర్వాత ఈ ప్రాంతాలు మహ్మద్ అలీ పాలనలోకి వచ్చాయి. నాలుగో మైసూర్ యుద్ధంలో కర్ణాటక నవాబు టిప్పుసుల్తాన్‌కు సహాయపడ్డాడనే నెపంతో ఆంగ్లేయులు ఆ ప్రాంతాలపై దండెత్తి ఆక్రమించారు.
- 1796లో మహ్మద్ అలీ, 1801లో అతడి కుమారుడు ఉమ్రా మరణించడంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాలను 1802లో ఆంగ్ల సామ్రాజ్యంలో కలిపివేశారు. ఈ విధంగా యావత్ ఆంధ్రదేశం ఆంగ్లేయ పాలనలోకి వెళ్లిపోయింది.
- 1802లో వెల్లస్లీ ఉమ్మడి మద్రాస్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశాడు.
Company Governance – Counter Revolts |కంపెనీ పాలన – వ్యతిరేక తిరుగుబాట్లు
- ఆంగ్లేయుల విధానాలకు వ్యతిరేకంగా ఆంధ్రాలోని జమీందారులు, రాయలసీమలోని పాలెగార్లు అనేక తిరుగుబాట్లు చేశారు.
- ప్రభుత్వానికి జమీందారులు చెల్లించాల్సిన శిస్తు మొత్తాలను పేష్కష్ అనేవారు. పేష్కషను అధికంగా పెంచడం, శిస్తు వసూలు పద్ధతులు కఠినంగా ఉండటం, జమీందారుల వారసత్వ తగాదాల్లో ఆంగ్లేయులు జోక్యం చేసుకోవడం లాంటి వాటివల్ల ఈ తిరుగుబాట్లు జరిగాయి.
- 1768 నాటికి గంజాం సర్కారులో సుమారు 20 మంది జమీందారులున్నారు. గుంసూరు, పర్లాకిమిడి జమీందారులు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేశారు. కంపెనీ ఈ తిరుగుబాట్లను అణిచివేసింది.
- విజయనగరం జమీందారు చిన విజయరామరాజు బాలుడైనందున సీతారామరాజు దివాన్‌గా ఉంటూ పరిపాలన చేశాడు
పద్మనాభ యుద్ధం (1794)
- చిన విజయరామరాజు ఆంగ్లేయుల ఆదేశాలను ధిక్కరించి విశాఖపట్నం, భీమునిపట్నం మధ్య ఉన్న పద్మనాభం అనే గ్రామంలో తలదాచుకున్నాడు.
- ఆంగ్ల సైన్యాలు 1794, జులై 10న జరిపిన పద్మనాభ యుద్ధంలో చిన విజయరామరాజు మరణించాడు.
- గోదావరి సర్కార్‌లోని పిఠాపురం, పెద్దాపురం, పోలవరం, మొగలితుర్రు జమీందారులు, కృష్ణా సర్కారులోని ఒంగోలు, నిజాంపట్నం జమీందారులు కూడా తిరుగుబాటు చేయగా కంపెనీ సైన్యం వాటిని అణిచివేసింది.
పాలెగార్ల తిరుగుబాట్లు
- రాయలసీమ ప్రాంతంలోని 80 మంది పాలెగార్లు 1800లో ఆంగ్లేయులపై తిరుగుబాటు చేశారు.
- కర్నూలు పాలెగార్ నరసింహారెడ్డి 1546లో కోయిలకుంట్లలోని ఖజానాను కొల్లగొట్టాడు. ముండ్లపాడు వద్ద నోల్ట్ అనే ఆంగ్ల సేనాని నరసింహారెడ్డిని ఓడించగా నిజాం సంస్థానంలోకి పారిపోయాడు.
- ఆదోని ప్రాంతంలో అనంతప్ప/అంతప్ప తిరుగుబాటు ప్రయత్నం చేశాడు. మన్రో పూర్తిగా తిరుగుబాట్లను అణిచివేసి శాంతి భద్రతలు నెలకొల్పాడు.
రంపా తిరుగుబాటు (1879)
- రంప గోదావరి జిల్లాలోని చోడవరం విభాగంలోని గ్రామం. కంపెనీ 1813లోనే శిస్తువసూలు, శాంతి భద్రతల కోసం మున్సబ్‌దార్‌ను నియమించింది.
- 1835లో మున్సటబ్‌దార్ రామభూపతిదేవ్ మరణంతో అతడి కుమార్తెను మున్సబ్‌దార్‌గా నియమించారు. కాని 1848లో మద్రాస్ ప్రభుత్వం ఈమెను తొలగించి కొత్త మున్సబ్‌దారును నియమించి చిగురు పన్ను, మొదలు పన్ను లాంటి సుంకాలను విధించింది.
- ఫలితంగా పులికంట సాంబయ్య, చంద్రయ్య, తమ్మన్నదొర, అంబుల్‌రెడ్డి లాంటి నాయకులు గిరిజన తిరుగుబాట్లకు నాయకత్వం వహించారు. చంద్రయ్య అడ్డతీగల పోలిస్‌స్టేషన్‌ను తగలబెట్టాడు. సవిలియన్ అనే ఆంగ్ల అధికారి ఈ తిరుగుబాటును అణిచివేశాడు.
రేకపల్లి తిరుగుబాటు
- రేకపల్లి భద్రాచలం తాలూకాలో ఉంది. ఇక్కడి ప్రజలు పోడు వ్యవసాయం చేసేవారు. సెంట్రల్ ప్రావిన్‌స్‌లోని ఈ ప్రాంతాన్ని 1874లో మద్రాస్ ప్రావిన్‌స్‌లో చేర్చి అటవీ ఉత్పత్తుల వినియోగంలో అనేక పన్నులు విధించింది.
- ఫలితంగా 1879 జులై 10న అంబుల్‌రెడ్డి నాయకత్వంలో వడ్డెగూడెం పోలిస్‌స్టేషన్‌పై దాడి చేశారు. ప్రభుత్వం ఈ తిరుగుబాటును కూడా అణిచివేసింది.
Company Governance | కంపెనీ పాలనా విధానం
- కంపెనీ ఉత్తర సర్కార్లను రెండు భాగాలుగా విభజించి విశాఖపట్నం, మచిలీపట్నం కేంద్రాలుగా చేసింది. 1786లో మద్రాసులో బోర్డ్ ఆఫ్ రవెన్యూ ఏర్పడి 1794లో రద్దయ్యింది. కలెక్టర్ల వ్యవస్థ మొదలైంది.
- ఉత్తర సర్కారులను గంజాం, విశాఖపట్నం, గోదావరి, కృష్ణా , నెల్లూరు అనే 5 జిల్లాలుగా విభజించారు.
- దత్త మండలాలను ఒకే జిల్లాగా చేసి అనంతపురం జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేశారు.
- 1800లో థామస్ మన్రో దత్త మండలాల ప్రధాన కలెక్టరుగా నియమితుడయ్యాడు.
- 1808లో బళ్లారి, కడప జిల్లాలుగా విభజన జరిగింది. 1858లో కర్నూలు, 1882లో అనంతపురం, 1911లో చిత్తూరు జిల్లాలు ఏర్పడ్డాయి (పటాస్కర్ అవార్డు ప్రకారం చిత్తూరు జిల్లా ఏర్పడింది).
- జిల్లా కలెక్టర్లకు ఉన్న పోలీస్ మెజిస్ట్రేట్ అధికారాలను కారన్‌వాలీస్ తొలగించాడు.
- 1818 నాటికి జిల్లా జడ్జీల నియామకం, సివిల్స్ క్రిమినల్ కోర్టులు జిల్లాస్థాయిలో ఏర్పాటయ్యాయి.
- కిందిస్థాయి కోర్టులను సదర్ అమీన్‌లు అని పిలిచేవారు.
- రెవెన్యూ విభాగంలో శాశ్వత శిస్తు పద్దతి, రైత్వారీ పద్ధతి, గ్రామవారీ/ మహల్వారీ పద్దతులను ప్రవేశపెట్టారు.
- గ్రామపద్ధతి నెల్లూరు సర్కారు ప్రాంతంలో అమలు చేశారు. శిస్తు వసూలు అధికారులను లంబార్జర్స్ అనేవారు.
- 1788లో సర్కూూట్ కమిటీ నివేదిక ప్రకారం వేలం పద్దతిని రద్దు చేశారు.
థామస్ మన్రో
- “ప్రజా సంక్షేమానికి తమ జీవితాన్ని ధారపోసిన కంపెనీ అధికారుల్లో మన్రో ముఖ్యుడు” అని రమేష్‌దత్ అనే చరిత్రకారుడు వ్యాఖ్యానించాడు.
- సైనికుడిగా భారతదేశానికి వచ్చిన మన్రో బారామహల్ (సేలం) ప్రాంతానికి సివిల్ అధికారిగా నియమితుడయ్యాడు.
- కెప్టెన్ రీడ్ వద్ద పనిచేస్తూ రెవెన్యూ విధానాలను అధ్యయనం చేశాడు. అతడు రూపొందించిన రైత్వారీ సిద్ధాంతాలను మార్పుచేసి మద్రాస్ ప్రెసిడెన్సీలో రైత్వారీ పద్దతిని రూపొందించాడు.
- 1799లో సర్కారు జిల్లాల కలెక్టరుగా, 1800లో దత్త మండలాల ప్రధాన కలెక్టర్‌గా నియమితుడైై 1807 వరకు పనిచేశాడు.
- 1820లో న్యాయసంఘ అధ్యక్షుడిగా తిరిగి భారతదేశం వచ్చాడు. మద్రాస్ గవర్నరుగా నియమితుడయ్యాడు.
- దత్త మండలాలను సందర్శిస్తూ 15827, జులై 6న పత్తికొండ (కర్నూలు జిల్లా)లో కలరా వ్యాధి సోకి మరణించాడు.
- రాయలసీమ ప్రజలు ఇతడిని మాండవ ఋషి అని పిలిచేవారు.
Religious and socio-religious conditions |ఆర్లిక, సాంఘిక మత పరిస్థితులు
- జమీందారులు, కౌలు రైతులు అనే వర్గాలు ఏర్పడ్డాయి. మధ్యతరగతి వర్గం ఆవిర్భవించింది.
- మహిళాభ్యుదయం చోటు చేసుకుంది. అనేక సాంఘిక దురాచారాలను నిర్మూలించారు. సాంఘిక, మత సంస్కరణ ఉద్యమాలు బయలుదేరాయి.
- క్రైస్తవ మత ప్రచారంతోపాటు విద్యావ్యవస్థలో మార్పులు ప్రవేశించాయి.
- వ్యవసాయరంగం వాణిజ్యీకరణ జరిగింది.
- 1833లో గుంటూరులో డొక్కల కరవు వచ్చింది. సర్ ఆర్దర్ కాటన్ కృషి వల్ల 1847లో గోదావరి నదిపై ధవళేశ్వరం ఆనకట్ట, కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీ (1853) నిర్మితమయ్యాయి. దీన్ని కాటన్ శిష్యుడైన కెప్టెన్ ఓర్ నిర్మించాడు.
- చేనేత, వస్త్ర పరిశ్రమలు 18వ శతాబ్దంలో అత్యున్న స్థాయిలో ఉండేవి. మచిలిపట్నం కలంకారీ అద్దకం వస్త్రాలకు ప్రసిద్ది చెందింది. ఏలూరు – తివాచీలకు, నెల్లూరు – రుమాళ్లకు; కర్నూలు – దుప్పట్లు, కంబళ్లకు ప్రసిద్ధి చెంచాయి.
- రాయలసీమలోని ఆదోని, బళ్లారి కూడా కుటీర పరిశ్రమలకు ప్రసిద్ధి చెందాయి.
- విశాఖపట్నం రేవు నుంచి 7లక్షల రూపాయల వరకు ఉన్న ఎగుమతులు 1830 నాటికి లక్ష రూపాయలకు పడిపోయాయి.
- మచిలీపట్నం నుంచి ఏడాదికి 10 లక్షలుగా ఉండే ఎగుమతులు 1834 నాటికి కేవలం మూడు వేల రూపాయలకు పడిపోయాయి.
- నరసాపురం, కోరంగిల వద్ద నౌకలను నిర్మించేవారు. నరసాపురం వద్ద ఉన్న మాధవాయపాలెంలో గ్లోబ్‌నౌక తయారైంది.
- క్రైస్తవ మిషనరీలు మత ప్రచారంతోపాటు విద్యావ్యాప్తికి కృషి చేశాయి.యునైటెడ్ లూథరన్ మిషన్ కృషి వల్ల 1842లో గుంటూరులో ఆంగ్లోవెర్నాక్యులర్ స్కూల్ (ఏసీ కాలేజ్ 1885)ను స్టాపించారు. మచిలీపట్నంలో నోబుల్ కళాశాలను స్టాపించారు.
- 1852లో నాటి కలెక్టర్ పెందకోస్ట్ కృషి వల్లకాకినాడలో మిడిల్ స్కూల్ (పీఆర్ కాలేజ్) స్టాపితమైంది.
- 1856లోమచిలిపట్నంలో శేషయ్య శాస్త్రి స్టాపించిన స్కూల్ హిందూ కాలేజీగా పరిణామం చెందింది.
- 1867లో విజయనగరంలో స్థాపించిన మిడిల్ స్కూల్ మహారాజ కాలేజీగా మారింది. సి.పి.బ్రౌన్, యం.డి.కాంప్‌బటెల్, కల్నల్ మెకంజీ లాంటి ఆంగ్లేయులు తెలుగు భాషాభివృద్ధికి కృషిచేశారు.
- ఐసీఎస్ ఉద్యోగియైన కాంప్‌బెల్ తెలుగుభాషకు వ్యాకరణం రాశాడు. సి.పి.బ్రౌన్ తెలుగు -ఇంగ్లిష్నిఘంటువును తయారు చేయడమే కాకుండా, వేమన పద్యాలను 1817లోసేకరించి 1829లో అనువదించి ప్రచురించాడు.
- మామిడి వెంకయ్య 1806లో ఆంధ్రదీపిక అనే నిఘంటువును రాశాడు. కాల్‌డ్‌వెల్ పండితుడు ద్రావిడ భాషలకు తులనాత్మక వ్యాకరణం రాశాడు. విశాఖపట్నం జమీందార్ గోడే జగ్గారావు వేదవిద్యలన్ని నేర్చిన పండితుడుగా పేరొందాడు.
- జర్మన్ పండితుడైన బెంజిమన్ షుల్డ్ బైబిల్‌ను తెలుగులోకి అనువదించాడు (1727).
- మంగళగిరి ఆనందరావు అనే మరో వ్యక్తి వేదాంత రసాయనం అనే క్రైస్తవ గ్రంథాన్ని రచించాడు.
ఆంధ్రదేశంపై పారిశ్రామిక విప్ణవ ప్రభావం
- 18వ శతాబ్ద రెండో భాగంలో ఇంగ్లండ్‌లో ప్రారంభమైన పారిశ్రామిక విప్లవం ప్రపంచ ఆర్థికస్టితిని తారుమారు చేసింది. పరిశ్రమల్లో యంత్రాలు ప్రవేశించడంతో చిన్నతరహా, కుటీర పరిశ్రమలు పతనమయ్యాయి.
- వ్యాపారవాదం/మర్కంటైలిజమ్ భారత ఆర్థిక వ్యాపార రంగాలను నాశనం చేసింది. ముడి సరకుల దోపిడీ, మిల్లులో తయారైన ఇంగ్లండ్ వస్తువులకు భారత్ మార్కెట్‌గా మారిపోయింది.
- కొంత ఆధునికీకరణ కూడా జరిగింది. రవాణా, పారిశ్రామిక, సమాచార రంగాలు కొంత అభివృద్ధి చెందాయి.
- నెల్లూరు నుంచి అభ్రకం, విజయనగరం నుంచి మాంగనీసు ఇంగ్లండ్‌కు ఎగుమతి చేసేవారు.
1857 సిపాయిల తిరుగుబాటు ప్రభావం
- 1857 సిపాయిల తిరుగుబాటు ప్రభావం అటు ఆంధ్ర, ఇటు హైదరాబాద్ రాజ్యాల్లో కొద్దిగా కనిపిస్తుంది. పర్లాకిమిడి ప్రాంతంలో దండసేనుడు(సవర జాతి), ఉభయ గోదావరి జిల్లాల్లో కొరటూరు మున్సబ్ అయిన కోరుకొండ సుబ్బారెడ్డి కడపలో షేక్ పీర్ సాహెబ్ (జిహాద్) తిరుగుబాట్లు చేశారు.
- బిటిష్ రెసిడెన్సీపై తుర్రేబాజ్‌ఖాన్ 1857 జులై 17న దాడి చేశాడు. కానీ ఆంగ్ల సైన్యాధికారి మేజర్ బ్రిక్స్ దాన్ని అణిచివేశాడు.
- కౌలాస్ జమీందార్ – రంగారావు, ముందర్గి జమీందార్ – భీమారావు). 1857 తిరుగుబాటును అణచడంలో తోడ్పడిన హైదరాబాద్ నిజాం అప్టలుద్దాలాకు ఆంగ్లేయులు స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదు ఇచ్చారు
- నవాబ్ తురాబ్ అలీఖాన్‌కు సాలార్‌జంగ్ బిరుదును ఇచ్చారు.
- విక్టోరియా మహారాణి ప్రకటన, 1858 చట్టం పాలనలో అనేక మార్పులు తెచ్చాయి. 1870లో మేయో ఆర్థిక వికేంద్రీకరణను ప్రవేశపెట్టగా, 1882లో రిప్పన్ స్థానిక స్వపరిపాలనా చట్టాన్ని ప్రవేశపెట్టాడు.
Features of Anglo era | ఆంగ్ల్గపాలన యుగ విశేషాలు
- 1871 – 72లో కడప – కర్నూలు కాలువ (కె.సి.కెనాల్)ను పూర్తి చేశారు.
- 1877లో బకింగ్‌హాం కాలువను నిర్మించారు.
- 1862లో పుత్తూరు – రేణిగుంట రైలుమార్గం వేశారు.
- ఆదిభట్ల నారాయణదాసు – హరికథా పితామహుడిగా షేక్ నాజర్ – బుర్రకథా పితామహుడిగా ఖ్యాతి గాంచారు.
- దక్షిణ భారతదేశంలో తొలి నాటక సమాజంగా పేరొందిన ధార్‌వాడ్ నాటక సంస్థలో బళ్లారి రాఘవ పేరొందిన నటుడు.
- 1912లో తొలి దక్షిణాది సినిమా హాలు గెయిటీ థియేటర్ (మద్రాస్)ను నిర్మించారు. గూడవల్లి రామబ్రహ్మం మాలపిల్ల, రైతుబిడ్డ సినిమాలు నిర్మించారు.
- తొలి తెలుగు మాస పత్రిక సత్యదూత (1835. దీన్ని మద్రాస్ నుంచి బళ్లారి క్రిస్టియన్ మిషనరీ నడిపేది.
- 1902లో కృష్ణా పత్రికను కొండా వెంకటప్పయ్య, దాసు వెంకటనారాయణ ప్రారంభించారు. దీని మొదటి సంపాదకుడు ఖాసా సుబ్బారావు. 1905 నుంచి ముట్నూరి కృష్ణారావు సంపాదకుడిగా ఉన్నారు.
- 1009లో దేశోద్దారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు బొంబాయి నుంచి ఆంధ్రపత్రిక (వారపత్రిక)ను నడిపారు. ఇది 1914లో దినపత్రిక (మద్రాస్)గా మారింది.
- 1924లో భారతి అనే వారపత్రికను ప్రారంభించారు.
- 1858లో కంపెనీ పాలన అంతమై బ్రిటిష్ సార్వభౌమ ప్రత్యక్ష పాలన ప్రారంభమైంది.
Andhra Pradesh History Study Notes – Arrival of Europeans and English Rule
Andhra Pradesh History – Study Material in Telugu | |
Satavahanas | Ikshvakulu |
Kakathiyas | Reddy, Nayaka Rajulu |
Vijayanagara Samrajyam | East Chalukyas |
Sanga Samskaranalu | Europeans Raaka AnglaPaalana |
Samsrkuthika Punarijjivanam | Jamindari Vyathireka Rythu Vudyamalu |