Samskruthika Punarujjivanam | సాంస్కృతిక పునరుజ్జీవనం
- ఆంగ్ల సంస్కృతీ ప్రభావంతో 19వ శతాబ్దంలో ఆంధ్రదేశంలో కూడా సాంస్కృతిక
పునరుజ్జీవన ఉద్యమం/సాంఘిక మతసంస్కరణ ఉద్యమం ప్రారంభమైంది. దీనికి ఆంగ్ల విద్యా విధానం, క్రైస్తవ మిషనరీలు, పత్రికలు, సంఘ సంస్కర్తల కృషి లాంటి అనేక కారణాలు దోహదం చేశాయి. - 1835లో విలియం బెంటింగ్ భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాడు. 1857
నాటికి మద్రాస్, కలకత్తా, బొంబాయి విశ్వవిద్యాలయాలను ఆంగ్లేయులు స్థాపించారు. - పాశ్చాత్య భావనలైన హేతువాదం, మానవతావాదం, శాస్త్రీయ దృక్పథం లాంటివి అవలోకనం చేసుకున్న భారతీయులు, ఆంధ్రులు సాంఘిక దురాచారాలు, మూఢ నమ్మకాలపై పోరు ప్రారంభించారు.
- 1805లో లండన్ మిషనరీ సొసైటీ జమ్మలమడుగు (కడప) కేంద్రంగా 1835లో అమెరికా బాప్టిస్ట్ సంఘం రాయలసీమ కేంద్రంగా, 1841లో చర్చి మిషన్ సొసైటీ, కృష్ణా, గోదావరి ప్రాంతాలు కేంద్రంగా విద్యావ్యాప్తికి మత ప్రచారానికి కృషిచేయడం ప్రారంభించాయి.
- రాజా రామమోహన్‌రాయ్, స్వామి దయానంద సరస్వతి లాంటి భారతీయులు ప్రారంభించిన సాంఘిక, మత సంస్కరణ ఉద్యమం ఆంధ్రులను అమితంగా ప్రభావితం చేసింది.
- బ్రహ్మ సమాజ కార్యకలాపాలకు రాజమండ్రి; సిద్దాంతాలకు-బాపట్ల, ఆలోచనలకు-మచిలిపట్నం కేంద్రాలయ్యాయి.
- సత్య సంవర్దిని (కందుకూరి), హిందూ రిఫార్మర్(మన్న బుచ్చయ్య పంతులు) జనానా (రాయసం వెంకట శివుడు) లాంటి పత్రికలు సంస్కరణోద్యమానికి ఎంతో ప్రచారం గావించాయి.
- తొలి తెలుగు పత్రిక సత్యదూతను మద్రాస్ నుంచి బళ్లారి క్రైస్తవ సంఘం 1835లో వెలువరించింది. వృత్తాంతిని (1540), వర్ధమాన తరంగిణి (1842), హితవాది(1862), తత్త్వబోధిని (1864) లాంటి పత్రికలు కూడా మత ప్రచార దృక్పథంతోనే స్థాపించారు.
- 1872లో ఉమా రంగనాయకులు నాయుడు సంపాదకత్వంలో మచిలీపట్నం నుంచి పురుషార్ధ ప్రదాయని అనే పత్రిక వెలువడింది.
- 1874లో కందుకూరి వీరేశలింగం పంతులు వివేకవర్ధిని పత్రికను స్థాపించారు.
- కొక్కొండ వెంకటరత్నం తన ఆంధ్రభాషా సంజీవని పత్రిక ద్వారా కందుకూరి భావాలను విమర్శించేవారు. దానికి అనుబంధంగా హస్యవర్ధిని పత్రికను ప్రారంభించారు.
- కందుకూరి వీరేశలింగం కూడా హాస్య సంజీవని పత్రిక (1876)ను ప్రారంభించారు.
- మహిళా విద్యాభివృద్ది కోసం వీరేశలింగం సతిహిత బోధిని పత్రికను స్టాపించగా, మల్లాది వెంకటరత్నం (1893), రాయసం వెంకట శివుడు (15894) కలిసి తెలుగు జనానాపత్రికను ప్రారంభించారు.
- 1904లో వీరేశలింగం తెలుగు జనానా పత్రికకు సంపాదకుడిగా ఉండి విదేశీ నారీమణుల చరిత్రము అనే వ్యాసాన్ని ప్రచురించారు. అముద్రిత గ్రంథ చింతామణి అనే మాసపత్రికను నెల్లూరు నుంచి కె. రామకృష్ణయ్య వెలువరించారు.
- 1891లో న్యాపతి సుబ్బారావు ఆధ్వర్యంలో రాజమండ్రి నుంచి చింతామణి పత్రిక వెలువడింది.
- చిలకమర్తి రామచంద్ర విజయం,హేమలత, అహల్యాబాయి నవలలు చింతామణి పత్రికలో ప్రచురితమయ్యాయి.
- 1902లో మచిలీపట్నం నుంచి కొండా వెంకటప్కయ్య కృష్ణా పత్రికను స్తాపించగా, అది 1905 నుంచి ముట్నూరి కృష్ణారావు సంపాదకత్వంలో కొనసాగింది. దేశోద్దారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు 1909లో బొంబాయి కేంద్రంగా ఆంధ్రపత్రిక (వారపత్రిక )ను ప్రారంభించగా, అది 1914 నుంచి మద్రాస్ కేంద్రంగా దినపత్రికగా మారింది.
- 1925లో మాడపాటి హనుమంతరావు ప్రారంభించిన గోల్కొండ పత్రిక సురవరం ప్రతాపరెడ్డి సంపాదకత్వంలో కొనసాగింది.
APPSC/TSPSC Sure shot Selection Group
Early Reformers | తొలి సంస్కర్తలు
- ఆంధ్రదేశ సంస్కరణ ఉద్యమాన్ని వీరేశలింగం ముందు యుగం, వీరేశలింగం యుగంగా వర్గీకరిస్తారు. భారత సాంస్కృతిక పునర్వికాస పితామహుడిగా రాజారామమోహన్‌రాయ్ పేరొందగా, ఆంధ్రదేశ సాంస్కృతిక పునర్వికాస పితామహుడిగా కందుకూరి కీర్తి గడించారు.
- మద్రాస్ కోర్టులో దుబాసీగా పనిచేసిన ఏనుగుల వీరాస్వామి సాంఘిక దురాచారాలు, వాటి కారణాలు వివరించాడు.కాశీయాత్రలు అనే గ్రంథాన్ని రచించాడు.
మద్రాస్‌లోని హిందూ లిటరరీ సొసైటీలో సభ్యుడిగా ఉండేవాడు. వెన్నెలకంటి సుబ్బారావు బడి పుస్తకాల్లో మార్పులు చేయడం ద్వారా దేశీయ విద్యా లోపాలను సరిదిద్దాలని ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాలని సూచించాడు. - రాజమండ్రికి చెందిన సామినేని ముద్దు నరసింహ నాయుడు హిత సూచని (1862) గ్రంథం రాసి సాంఘిక సంస్కరణల ఆవశ్యకతను వివరించాడు. కోమలేశ్వర శ్రీనివాస పిళ్లె స్తే విద్యావ్యాప్తికి 70 వేల రూపాయలు విరాళంగా ఇచ్చాడు.
- విశాఖపట్నానికి చెందిన పరవస్తు వెంకట రంగాచార్యులు వితంతు వివేకం గ్రంథాన్ని రాసి స్త్రీ పునర్వివాహాలు శాస్త్ర సమ్మతమేనని వాదించాడు.
- గాజుల లక్ష్మీనరసుసెట్టి వెట్టిచాకిరీ నిర్మూలనకు కృషిచేశారు. ఆత్మూరి లక్ష్మీ నరసింహం స్త్రీల పునర్వివాహ సమాజంలో సభ్యుడిగా చేరి పోరాడాడు.
Kandukuri Veereshalingam (Andhra Vaitalika) |కందుకూరి వీరేశలింగం (ఆంధ్ర వైతాళికుడు)
- ఆంధ్ర పునర్వికాస పితామహుడు, దక్షిణ భారత విద్యాసాగరుడు, గద్య తిక్కనగా పేరొందిన కందుకూరి వీరేశలింగం పంతులు 1848, ఏప్రిల్ 16న రాజమహేంద్రవరంలో పున్నమ్మ, సుబ్బారాయుడు దంపతులకు జన్మించారు. దూసి సోమయాజులు వద్ద సంస్కృత భాషను అధ్యయనం చేశారు. 12వ ఏట ఏడేళ్ల రాజ్యలక్ష్మి (బాపమ్మ)తో వివాహం జరిగింది.
- 1872లో కోరంగి (తూ.గో. జిల్లా) ఆంగ్ల పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరారు.
- మూఢనమ్మకాలు, సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడారు. బ్రహ్మ సమాజంలో చేరి రాజమండ్రి కేంద్రంగా సంఘ సంస్కరణకు పూనుకున్నారు.
- 1874లో ధవళేశ్వరంలో తొలి బాలికా పాఠశాలను స్థాపించారు.
- మద్రాస్‌లో సమర్ధ రంగయ్యశెట్టి నుంచి గద్య తిక్కన బిరుదును పొందారు (1873).
- తొలి బాలికా పాఠశాలకు తొలి ప్రధానోపాధ్యాయుడిగా మల్లాది అచ్చన్న శాస్త్రిని నియమించారు. 1874లో వివేకవర్ధిని మాసపత్రికను, దాని అనుబంధంగా 1876లో హాస్య సంజీవనిపత్రికను ప్రారంభించారు.
- 1878లో రాజమండ్రిలో సంఘ సంస్కరణ సమాజం/ ప్రార్ధనా సమాజాన్ని స్టాపించారు. స్త్రీ పునర్వివాహం న్యాయసమ్మతమే అని పేర్కొంటూ 1879, ఆగస్టు ౩న రాజమండ్రిలో తొలి బహిరంగ ఉపన్యాసం చేశారు. 1880లో స్త్రీ పునర్వివాహ సమాజాన్ని ప్రారంభించారు.
- 1881, డిసెంబరు 11న రాజమండ్రిలో తొలి వితంతు వివాహాన్ని జరిపించారు.
- 1883లో సతిహితబోధిని పత్రికను ప్రారంభించారు. 1891, జులై 20న రాజమండ్రి నుంచి సత్యసంవర్ధిని పత్రికను ప్రారంభించారు. 1905లో సత్యవాదిని పత్రిక ప్రారంభించారు. చింతామణి పత్రికకు కూడా కందుకూరి సంపాదకుడిగా వ్యవహరించారు. 1897లో మద్రాసులో వితంతు శరణాలయాన్ని స్టాపించారు.
- 1893లో రావు బహదూర్ బిరుదు ప్రదానం చేశారు. 1898లో మహదేవ గోవింద్ రెనడే మద్రాసులో జరిగిన సంఘ సంస్కరణ సమావేశంలో కందుకూరిని దక్షిణ భారత విద్యాసాగరుడు అనే బిరుదుతో సత్కరించారు.
- 1905లో రాజమండ్రిలో వితంతు శరణాలయాన్ని స్థాపించారు. (నోట్: తొలి వితంతు శరణాలయాన్ని మద్రాస్ (1897)లో, రెందోది రాజమండ్రి (1905)లో స్థాపించారు). 1906, డిసెంబరు 16న హితకారిణి సమాజాన్ని రాజమండ్రిలో స్టాపించి తన మొత్తం ఆస్తిని ఆ సంస్థకు చెందేలా వీలునామా రాశారు. కందుకూరి 1919, మే 27న మద్రాసు (వేదవిలాస్)లో మరణించారు.
సాహిత్య సేవ
- తెలుగు సాహిత్యంలో కందుకూరి అనేక నూతన ప్రక్రియలను ప్రారంభించారు. తెలుగులో తొలి సాంఘిక నవల రాజశేఖర చరిత్ర(వివేక చంద్రిక) రచించారు. దీన్ని అలీవర్ గోల్డ్ స్మిత్ రచన వికార్‌ఆఫ్ వేక్‌ఫీల్డ్ ఆధారంగా రాశారు. జోనాథన్ స్విష్ట్ రచించిన గలీవర్ ట్రావెల్స్ ఆధారంగా సత్యరాజ పూర్వదేశ యాత్రలు గ్రంథాన్ని రచించారు. ఆంధ్ర కవుల చరిత్రం గ్రంథ రచన ద్వారా సాహిత్య చరిత్రకు శ్రీకారం చుట్టారు. కాళిదాసు, షేక్‌స్‌స్సియర్ నాటకాలను అనువదించారు.
- తిర్య గ్విద్వాన్ మహాసభ, మూషికాసుర విజయం, వ్యవహార ధర్మబో ధిని(ఫ్లీడర్ నాటకం), పెద్దయ్య గారి పెళ్లి లాంటి ప్రహసనాలు, నాటకాలు రచించారు.విక్టోీరియా మహారాణి చరిత్ర (1897), నారద సరస్వతి సంవాదము, సత్యవతీచరిత్రము, చమత్కార రత్నావళి బ్రహ్మవివాహం (కన్యాశుల్కం విమర్శ నాటకం) లాంటి రచనలు కూడా చేశారు. ది కమాండ్ ఆఫ్ కెరీర్స్‌కు అనువాదమే చమత్కార రత్నావళి. ఆంగ్లకవి షెరిటాన్ రచన డ్యుయన్నా ఆధారంగా రాగమంజిరి నాటకాన్ని రచించారు.
- షెరిటాన్ మరొక రచన ది రైవల్స్ అనువాదంగా కళ్యాణ కల్పవల్లి రచించారు. కందుకూరి అభినవాంధ్రకు ఆదిబ్రహ్మ అని ఆరుద్ర (భాగవతుల సదాశివ శంకరశాస్త్రి ) పేర్కొనగా చిలకమర్తి “తన దేహం గేహం, కాలం, విద్య, ధనం ప్రజలకు అర్పించిన ఘనుడు కందుకూరి” అని పేర్కొన్నారు.
Raghupathi Venkataratnam Naidu | రఘుపతి వెంకటరత్నం నాయుడు (1862 – 1939)
1862లో మచిలీపట్నంలో జన్మించారు. మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో అభ్యసించారు. మన్నవ బుచ్చయ్య పంతులు ప్రేరణతో 1885లో బ్రహ్మసమాజంలో చేరారు. ఆంధ్రలో బ్రహ్మసమాజాన్ని బాగా ప్రచారం చేశారు. 1891లో సాంఘిక శుద్ది సంఘం (సోషల్ ప్యూరిటి అసోసియేషన్ – SPA) స్టాపించారు. నోబుల్ కళాశాల (మచిలిపట్నం),మహబూబ్ కళాశాల (సికింద్రాబాద్), పిఠాపురం రాజా కళాశాలల్లో (కాకినాడ) అధ్యాపకుడిగా,
ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. కాకినాడలో ఆంధ్రబ్రహ్మోపాసనా మందిరాన్ని స్థాపించారు. దేవదాసి వ్యవస్థ రద్దు కోసం కృషి చేశారు. (మతం ఆమోదించిన పాప పంకిలం). సోషల్ రిఫార్మర్, ఫెలోవర్కర్స్‌బ్రహ్మ ప్రకాశిక, పీపుల్స్ ప్రండ్ లాంటి పత్రికలు నడిపారు. కాకినాడలో అనాథ, హరిజన బాలికల కోసం శరణాలయం, వసతి గృహం నిర్మించారు. బ్రహ్మర్షి అభినవ సోక్రటీస్ లాంటి బిరుదులు పొందారు. విద్యారంగంలోని కృషికి ఆంగ్ల ప్రభుత్వం నైట్‌హుడ్ బిరుదుతో సత్కరించింది. పేద విద్యార్థుల కోసం తన గురువుమిల్లర్ పేరిట ఆంధ్ర బ్రహ్మధర్మ ప్రచారక నిధి అనే ఒక నిధిని ఏర్పాటు చేశారు.
Gurjada Apparao | గురజాడ అప్పారావు
1861, నవంబరు 30 న విశాఖ జిల్లా రాయవరంలో జన్మించారు. విజయనగర రాజు ఆనందగజపతి, రీనా మహారాణీ వద్ద దివాన్ (కార్యదర్శి)గా పనిచేశారు. దేవుడి కంటే మనిష్కి మతం కంటే సమాజం ప్రధానం అని భావించేవారు. సంఘ సంస్కరణకు, దేశభక్తికి తన సాహిత్యం ద్వారా సేవలు అందించారు. 1896లో కన్యాశుల్కం నాటకాన్ని రచించి విజయనగర రాజుకు అంకితం చేశారు. 1910లో ముత్యాల సరాలు రచించారు. ఈ గ్రంథంలోనే అనేక దేశభక్తి గీతాలు ఉన్నాయి. దేశమంటే మట్టికాదోయ్, దేశమును ప్రేమించుమన్నృ్య మంచి అన్నది మాల అయితే నేను మాలనే అగుదున్ లాంటి గీతాలు రచించారు. పుత్తడిబొమ్మ పూర్ణమ్మ, కన్యక, దిద్దుబాటు (తొలి తెలుగు కథానిక) లాంటి రచనలు చేశారు. 1913లో మద్రాస్ విశ్వవిద్యాలయ సెనేట్ మెంబరుగా నియమితులయ్యారు. నవయుగ వైతాళికుడు బిరుదు పొందారు.
- “ఆదికాలంలో తిక్కన , మధ్యకాలంలో వేమన , ఆధునిక కాలంలో గురజాడ తెలుగులో మహాకవులు” – శ్రీశ్రీ
- “గురజాడ రచనలన్నీ నష్టమైపోయినా ఒక్క దేశభక్తి గీతం మిగిలినా చాలును అతడు ప్రపంచ కవుల్లో ఒక మహాకవిగా రుజువు కావడానికి” – శ్రీశ్రీ
- “గురజాడ 1915లోనే చనిపోయినా 1915 తర్వాతే జీవించడం ప్రారంభించారు” – దేవులపల్లి కృష్ణశాస్త్రి
- “వీరేశలింగం మహాపురుషుడు , గిడుగు మహాపండితుడు కాగా గురజాడ మహాకవి” – నార్లవెంకటేశ్వరరావు
- “కొత్త తరానికి గురువెవరంటే గురజాడ అని నేనంటాను” – దాశరథి
- “తెలుగు ప్రజల స్మృతి పథంలో అప్పారావు సదా జీవిస్తాడు” – గిడుగు సీతాపతి
Komarlaju Venkata Lakshmana Rao | కొమర్లాజు వెంకట లక్ష్మణరావు (1877 – 1923)
1877లో కృష్ణాజిల్లా, పెనుగంచిప్రోలులో జన్మించారు. నాగపూర్‌లో విద్యాభ్యాసం చేశారు. కేసరి, మరాఠా పత్రికల్లో వ్యాసాలు రాశారు. 1898లో కందుకూరి జనానా పత్రికలో కూడా వ్యాసాలు రాశారు. మునగాల ఎస్టేట్‌లో దివాన్‌గా పనిచేశారు. మునగాల రాజా నాయని వెంకట రంగారావు లక్ష్మణరావు కృషికి తోడ్పాటు అందించారు. 1901లో రావిచెట్టి రంగారావు గృహంలో శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయం (హైదరాబాద్)ను స్థాపించారు. 1904లో హనుమకొండలో రాజరాజనరేంద్ర ఆంధ్రభాషా నిలయం, సికింద్రాబాద్ (1905) లో ఆంధ్ర సంవర్థనీ గ్రంథాలయాలు నిర్మించారు. 1906లో విజ్ఞాన చంద్రికా మండలిని స్టాపించారు.
- “లక్ష్మణరావు ఒక వ్యక్తి కాదు ఒక సంస్థ”. -కురగంటి సీతారామయ్య
- “వారు మరికొన్నేళ్లు జీవించిఉంటే తెనుగు నేటి కంటే ఎంతో పరిపుష్షమై + పటిష్టమైఉ ఉండేది” – విద్వాన్ విశ్వం
Gidugu Venkata Ramamurthy | గిడుగు వెంకట రామమూర్తి (1862 – 1940)
గిడుగు 1862లో గంజాం జిల్లాలో జన్మించారు. పర్లాకిమిడిలో ఉపాధ్యాయుడిగా చేరారు. సవర భాష అభివృద్ధికి కృషి చేశారు. వ్యవహారిక భాషోద్యమ పితామహుడిగా పేరొందారు. తెలుగు అనే పత్రికను 1920లో ప్రారంభించారు. జయంతి రామయ్య లాంటివారు వారు గిడుగుపై ధ్వజమెత్తారు. గురజాడు పిట్సుదొర లాంటివారు గిడుగును సమర్ధించారు. సవర భాష అభివృద్ధి కోసం చేసిన కృషికి మద్రాస్ ప్రభుత్వం రావూసాహెబ్ బిరుదును ఇచ్చింది. పండిత బిషక్కుల భాషాభేషజం వ్యాసాన్ని తెలుగు పత్రికలో ప్రచురించారు. 1913లో మొమరాండమ్ ఆఫ్మోడరన్ తెలుగు పేరుతో ఒక విన్నపాన్ని మద్రాసు ప్రభుత్వానికి గిడుగు సమర్పించారు.
Desiraju pedabapayya | దేశిరాజు పెదబాపయ్య
26 ఏళ్ల వయసులో మరణించిన సంఘ సంస్కర్త. కందుకూరి వీరేశలింగం పంతులు
శిష్యుడు. ఆడంబరాలకు వ్యతిరేకంగా ఉద్యమం నిర్వహించారు. బాపట్ల నివాసి. VOICE OF TRUTH పత్రిక, యువకుల ప్రార్ధనా సభ (YMPU)ను స్థాపించారు.
Jayanti Ramaiah Pantulu | జయంతి రామయ్య పంతులు
తూర్పుగోదావరి జిల్లా ముక్తేశ్వరంలో జన్మించారు. పండితుడు, శాసన పరిశోధకుడు. పిఠాపురం రాజా కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. 1911లో ఆంధ్ర సాహిత్య పరిషత్‌లు ప్రారంభించారు. అయిదువేల తాళపత్ర గ్రంథాలు సేకరించి అధ్యయనం చేశారు. ఆంధ్ర దంత రామురు పంటువాజ్మయ వికాస వైఖరి, డిఫెన్స్ ఆఫ్ లిటరరీ తెలుగు, ద్రవిడయన్ లెక్సికోగ్రఫీ లాంటి గ్రంథాలు రచించారు. సూర్యరాయాంధ్ర భాషా నిఘంటువును రూపొందించారు. శాసన పద్యమంజరి అనే పరిశోధనా సంపుటాలు రచించారు. (రెవెన్యూ అధికారిగా కూడా పనిచేశారు).
Chilakamarthi Lakshminarasimha Pantulu|చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు:
ఆంధ్రా మిల్దన్‌గా పేరొందారు. రాత్రి పాఠశాలలు, హరిజన పాఠశాలలు ఏర్పాటు చేశారు. అంధకవిగా పేరొందారు. బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసాలను తెలుగులో అనువదించారు. రాజా రామ మోహన్ రాయ్పాఠశాలస్థాపించారు. దేశమాత పత్రికను ప్రారంభించారు.
Unnava LakshmI Narayana | ఉన్నవ లక్ష్మీనారాయణ
ఆయన నవల మాలపల్లి తెలుగు సాహితీ చరిత్రలోనూ, సామాజిక దృక్పధంలోనూ ఒక ముఖ్యమైన ఘట్టం. గుంటూరులో ఆయన స్థాపించిన శ్రీ శారదా నికేతన్ స్త్రీ విద్యను ప్రోత్సహించడంలో మంచి కృషి చేసింది. ఉన్నవ ఎన్నో రకాల సంస్థలను స్థాపించి తన అపారమైన సేవలను అందించాడు. 1900లో గుంటూరులో యంగ్‍మెన్స్ లిటరరీ అసోసియేషన్‍ను స్థాపించాడు. 1902లో అక్కడే వితంతు శరణాలయాన్ని స్థాపించాడు. వీరేశలింగం పంతులు అధ్యక్షతలో తొలి వితంతు వివాహం జరిపించాడు. వీరేశలింగం స్థాపించిన వితంతు శరణాలయాన్ని 1906 లోను, పూనాలోని కార్వే మహిళా విద్యాలయాన్ని, 1912 లోను సందర్శించాడు. 1913 లో జొన్నవిత్తుల గురునాథంతో కలసి విశాలాంధ్ర పటం తయారుచేశాడు. రాయవేలూరు జైలు నుంచి విడుదల అయినతర్వాత 1922లో గుంటూరులో శారదానికేతన్‍ను స్థాపించి బాలికలకు విద్యావకాశాలు కల్పించాడు
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |