ఆంధ్రప్రదేశ్ చరిత్ర- శాతవాహనులు
శాతవాహనులు : శాతవాహనులను పురాణాలలో ఆంధ్రులు అని కూడా పిలుస్తారు. శాతవాహనులు దక్కన్‌లో ఉన్న పురాతన దక్షిణాసియా రాజవంశం. పురాణాల ఆధారంగా కానీ పురావస్తు ఆధారాలు లేకుండానే శాతవాహనులు క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దంలో అధికారంలోకి వచ్చారు. శాతవాహనుల రాజ్యంలో ఆధునిక ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ మరియు మహారాష్ట్ర ఉన్నాయి. కొన్ని సార్లు పశ్చిమాన గుజరాత్ వరకు విస్తరించింది. శాతవాహనుల రాజవంశం రాజధాని ప్రతిష్ఠానం (పైతాన్) మరియు అమరావతి (ధరణికోట). ఈ వ్యాసంలో మేము శాతవాహన రాజవంశం గురించి పూర్తి వివరాలను అందిస్తున్నాము. శాతవాహన రాజవంశం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి వ్యాసాన్ని పూర్తిగా చదవండి.
APPSC/TSPSC Sure shot Selection Group
Sathavahanas | శాతవాహనులు
మూలపురుషుడు | శాతవాహనుడు |
స్థాపకుడు రాజధాని | సిముఖుడు |
రాజ భాష | 1) ధాన్యకటకం 2) పైఠాన్ ప్రతిష్టానపురం |
రాజలాంచనం | సూర్యుడు |
మతం | జైనం , హైందవం |
అధికార భాష | ప్రాకృతం |
Satavahanas – inscriptions | శాతవాహనులు – శాసనాలు
నానాఘాట్ శాసనం | నాగానిక (మొదటి శాతకర్ణి గురించి) |
నాసిక్ శాసనం | గౌతమీ బాలశ్రీ (గౌతమీపుత్ర శాతకర్ణి గురించి) |
మ్యాకధోనీ శాసనం | మూడవ పులోమావి (శాతవాహన వంశ పతనం గురించి) |
జునాగఢ్/గిర్నార్ | రుద్రదాముడు (మొదటి సంస్కృత శాసనం) |
హాతిగుంఫ శాసనం | ఖారవేలుడు |
ఎర్రగుడి శాసనం (కర్నూలు) | అశోకుడు |
Sathavahanas Rulers | శాతవాహన పాలకులు, వారి రాజకీయ చరిత్ర
శాతవాహనులు బ్రాహ్మణ కులానికి చెందినవారు. వైదిక మతస్తులు. ఆంధ్ర అనేది జాతి శబ్దం కాగా, శాతవాహన అనేది వంశ నామం. శాతవాహనుల పాలన శ్రీముఖుడితో ప్రారంభం కాగా, చివరి శాతవాహన రాజు మూడో పులోమావితో వంశం అంతరించింది.
1. శ్రీ ముఖుడు :
- శాతవాహన రాజ్య స్థాపకుడు
- ప్రతిష్టానపురం రాజధానిగా అధికారంలోకి వచ్చాడు
- ఇతని తండ్రి శాతవాహనుడు
- ఇతడిని బ్రహ్మాండ పురాణం సింద్రకుడు అని, విష్ణుపురాణం బలిపుచ్చక అని, మత్స్యపురాణం సిమకుడు అని, ‘భాగవత పురాణం’ బలి అని పేర్కొంటున్నాయి.
- ఇతని నాణేలు ‘శాద్వాహణ’ పేరుతో ముద్రించిన నాణేలు కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల, మెదక్ జిల్లాలోని కొండాపూర్ ప్రాంతాల్లో లభించాయి
2. కృష్ణుడు (కణ్పడు) :
- శ్రీముఖుడి అనంతరం అతడి సోదరుడు కన్హ రాజ్యానికి వచ్చాడు.
- కచేరి, నాసిక్ గుహలను తవ్వించాడు.
- నాసిక్ లో బౌద్ధ సన్యాసుల సంక్షేమం కొరకు “ధర్మ మహామాత్య” అనే అధికారులను నియమించారు.
- కస్హేరి గుహాలయాలు నిర్మించాడు.
- మాళ్వాను జయించిన తొలి శాతవాహన చక్రవర్తి ఇతడే.
- ఇతని కాలంలోనే భాగవత మతం దక్కణ్ లో ప్రవేశించింది.
3. శాతకర్ణి -1
- శాతవాహన వంశానికి నిజమైన స్థాపకుడు.
- మొదటి శాతకర్ణి పుష్యమిత్ర శుంగుడిని ఓడించినందుకు గుర్తుగా నాణాలపై ఉజ్జయిని పట్టణ గుర్తును ముద్రించాడు.
- మొదటి శాతకర్ణికి దక్షిణాపథపతి, అప్రతిహతచక్ర బిరుదులున్నాయి
- వైదిక యజ్ఞ యాగాలు నిర్వహించిన మొదటి రాజు – శాతకర్ణి-I
- ఇతను తొలిసారిగా బ్రాహ్మణులకు పన్ను మినహాయింపు భూములను దానంగా ఇచ్చాడు.
4. శాతకర్ణి-2
- ఇతను ఆంధ్రదేశాన్ని అతి ఎక్కువకాలం అంటే 56 సంవత్సరాలు
పాలించిన శాతవాహన చక్రవర్తి రెందో శాతకర్ణి. - ఇతను సాంచి స్థూపానికి దక్షిణ తోరణాన్ని నిర్మించాడు. ఇతని శాసనం సాంచి (విదిశ దగ్గర)లో లభించింది.
- భిల్సా శాసనంలో పేర్కొన్న శాతవాహనరాజు రెందో శాతకర్ణే.
- ఇతని ఆస్థాన కళాకారుడు – వశిష్టపుత్ర ఆనంద.
5. కుంతల శాతకర్ణి
- ఇతని కాలంలో సంస్కృతం శాతవాహనుల అధికార భాషగా మారింది. (అప్పటి వరకు ప్రాకృతం అధికార భాషగా ఉండేది)
- ఇతని ఆస్థానంలో శర్వవర్మ, గుణాఢ్యుడు ఉన్నారని పేర్కొంటారు.
- శర్వవర్మ-కాతంత్ర వ్యాకరణం (సంస్కృత వ్యాకరణ గ్రంధం)
- గుణాఢ్యుడి-బృహత్కథ (పైశాచిక భాష) విష్ణుశర్మ పంచతంత్రాన్ని రచించుటకు ఆధారమైనది.
- శర్వవర్మ, గుణాఢ్యుడి మధ్య ఏర్పడిన సవాలు గూర్చి వివరించిన గ్రంథం సోమదేవుడి “కథాసరిత్సాగరం •
- కుంతల శాతకర్ణి భార్య “మలయావతి” కరిర్త అనే కామక్రీడ వలన మరణించింది.
6. హాలుడు
- ఆంధ్రుల చరిత్రలో తొలి కవిరాజు.
- శాతవాహన 17వ చక్రవర్తి హాలుడు. ఇతడు ప్రాకృత భాషలో గాథాసప్తశతి (సట్టసి) అనే గ్రంథాన్ని రచించాడు.
- తన సాహిత్యం వల్ల హాలుడు కవివత్సలుడు అనే బిరుదు పొందాడు.
- ఈ ఇతను ప్రాకృతంలో గాధా సప్తశతి (మహారాష్ట్ర ప్రాకృతం) ని సంకలనం చేశాడు.
- ఇతను శ్రీలంక రాకుమార్తె లీలావతిని సప్త గోదావరిలో వివాహమాడాడు.
- ఈ వివహం పై కుతూహలుడు లీలావతి పరిణయం (ప్రాకృతం) రంగాన్ని రచించారు.
శాతవాహనులు -గౌతమీపుత్ర శాతకర్ణి
- శాతవాహనుల్లో అతి గొప్పవాడు.
- ఇతను అధికారంలోకి రావడంతో శాలివాహన శకం (క్రీ.శ.78) ప్రారంభమైంది.
- 1957 నుండి క్రీ.శ 78 వ సం||ను భారత ప్రభుత్వం అధికారికంగా శాలివాహన శకారంభ సంవత్సరంగా పాటిస్తున్నది.
- శాలివాహన శకంను పాటించిన ఏకైక రాజు “యాదవ రామచంద్ర దేవుడు” (దేవగిరి రాజు).
- ఇతని గొప్పతనం గూర్చి ఇతని తల్లి గౌతమి బాలశ్రీ వేయించిన – నాసిక్ శాసనం తెలియజేస్తుంది.
- ఇతను నహపానుడి వెండి నాణాలను తన చిహ్నాలతో తిరిగి ముద్రించాడు. ఈ నాణాలు “కడలూరు” (జోగల తంబి)లో కనుగొనబడ్డాయి.
- ఇతను వైదిక సంప్రదాయాలను పాటిస్తూ బౌద్ధ మతాన్ని కూడా ఆదరించాడు.
- బౌద్ధ భిక్షువులకు 100 నివర్తనాల భూమిని దానం చేశాడు.
- బౌద్ధ శాఖ అయిన భద్రనేయ అనే శాఖకు నాసిక్ లో గుహలను ఇచ్చాడు.
- ఇతని నాణెములు కొండాపూర్, పెదబంకూరులలో పెద్దసంఖ్యలో లభించాయి.
- శాతవాహనుల రాజులలో తన పేరు మీద మొదట శాసనాలు వేయించిన రాజు ఇతడే.
- గౌతమీపుత్ర శాతకర్ణికి బెనకటక స్వామి అనే బిరుదు కూడా ఉంది.
- తల్లి పేరును తన పేరు ముందు పెట్టుకున్న తొలి శాతవాహన రాజు ఇతడే.
పులోమావి-2 (వశిష్ట పుత్ర పులోమావి)
- ఇతడిని దక్షిణా పథేశ్వరుడుగా పేర్కొనడమైంది. నవనగర స్వామి అనే బిరుదు కూడా ఉంది.
- ఇతని కాలంలో గౌతమీ బాలశ్రీ నాసిక్ శాసనాన్ని (ప్రాకృతం) వేయించింది.
- ఇతని కాలంలోనే రాజధానిని ప్రతిష్టానపురం నుండి అమరావతికి మార్చడం జరిగింది.
- ఇతని కాలంలో అమరావతి స్థూపం నిర్మించబడింది.
- ఇతడు కార్లేలో బౌద్ధ సన్యాసులకు విరాళాలు ఇచ్చాడు.
- ఓడ గుర్తు ఉన్న నాణేలను ముద్రించిన తొలి శాతవాహన రాజు కూడా ఇతడే
యజ్ఞశ్రీ శాతకర్ణి
- శాతవాహన వంశంలో చివరి గొప్పవాడు.
- ఇతని కాలంలోనే మత్స్యపురాణం సంకలనం చేయబడింది.
- ఇతను నాగార్జునునికి శ్రీపర్వతం (నాగార్జున కొండ)పై పారావత విహారం నిర్మించాడు.
- రెండు తెరచాపల నౌక బొమ్మ గల నాణాలు ముద్రించాడు. ( ప్రారంభించింది పులోమావి-2)
- బాణుడు హర్ష చరిత్రలో ఇతనిని “త్రిసముద్రా ధీశ్వరుడు” అని పేర్కొన్నాడు.
- యజ్ఞశ్రీ శాతకర్ణి చినగంజాం (ప్రకాశం) శాసనాన్ని వేయించాడు.
- ఆచార్య నాగార్జునుడు యజ్ఞశ్రీని ఉద్దేశిస్తూ ‘సుహృల్లేఖ”ను రచించాడు.
మూడవ పులోమావి
- ఇతను చివరి శాతవాహన చక్రవర్తి
- ఇతని సేనాపతి అయిన శ్రీశాంత మూలుడు తిరుగుబాటు చేయడంతో రాజ్యాన్ని వదిలి బళ్ళారి పారిపోయి, అక్కడ నుండి కొంతకాలం పాలించాడు. ఇతను బళ్ళారిలో ‘మ్యాకదోని శాసనాన్ని‘ వేయించాడు.
- మ్యాకదోని శాసనం శాతవాహన రాజ్య పతనం గురించి వివరిస్తుంది.
శాతవాహనుల పాలనాంశాలు
- శాతవాహనుల కాలంనాటి పాలనా విశేషాలను ఉన్నాఘర్ శాసనం వివరిస్తుంది. వీరు ఎక్కువగా మౌర్యుల పాలనా విధానాలనే అనుసరించారు.
- కౌటిల్యుని అర్థశాస్త్ర, మనుధర్మ శాస్త్రాల ఆధారంగా పాలన కొనసాగించారు. సప్తాంగ సిద్ధాంతాన్ని అనుసరించారు. పితృస్వామిక, వంశ పారంపర్య రాచరిక విధానాన్ని పాటించారు.
- శాతవాహనులు తమ రాజ్యాన్ని ఆహారాలు (రాష్ట్రాలు ) విషయాలు (జిల్లాలు), గ్రామాలుగా విభజించారు.
- సామంతరాజ్యాలు కూడా వీరి ఆధీనంలో ఉండేవి. ఆహారానికి అధిపతి అమాత్యుడు.
- విషయం (జిల్లా) అధిపతిని విషయపతి అని, గ్రామ అధిపతిని గ్రామిఖ/ గ్రామణి అని పిలిచేవారు.
శాతవాహనుల కాలంలోని రచనలు – రచయితలు
- గాథాసప్తశతి (ప్రాకృత భాషలో) – హాలుడు
- బృహత్ కథ (పైశాచిక ప్రాకృత భాషలో) – గుణాఢ్యుడు
- లీలావతి (ప్రాకృత భాషలో) – కుతూహలుడు
- కాతంత్ర వ్యాకరణం (సంస్కృత భాషలో) – శర్వవర్మ
- సుహృల్లేఖ, రససిద్దాంతం/ రసమంజరి, ప్రజ్ఞా పారమితశాస్త్ర , ఆరోగ్యమంజరి, రత్నావళి రాజపరి కథ (సంస్కృత భాషలో) – ఆచార్యనాగార్జునుడు
Andhra Pradesh History – Satavahanas, Download PDF
Also check Previous Chapters:
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |