Vijayanagara Empire Details | విజయనగర సామజ్యం వివరాలు
విజయనాగర సామ్రాజ్యం కర్నాట రాజ్యం అని కూడా పిలుస్తారు. విజయనాగర సామ్రాజ్యం దక్షిణ భారతదేశంలోని చాలా ప్రాంతాలను కవర్ చేసింది, ఆధునిక రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, గోవా మరియు తెలంగాణ మరియు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల భూములను నియంత్రించింది. దీనిని 1336 లో సోదరులు హరిహారా I మరియు సంగమ రాజవంశానికి చెందిన బుక్కా రాయ I స్థాపించారు.
Adda247 APP
Vijayanagara Samrajyam | విజయనగర సామ్రాజ్యం
- విజయనగర సామ్రాజ్యాన్ని 1336లో హరిహరరాయలు, బుక్కరాయలు స్టాపించారు. ఈ సామ్రాజ్యాన్నిసంగమ, సాళువ, తుళువ, అరవీడు అనే నాలుగు రాజ వంశాలు పాలించాయి.
- విద్యారణ్యస్వామి సహాయంతో తుంగభద్రా నదీ తీరంలోని అనెగొంది రాజధానిగా సంగమ సోదరులు సామ్రాజ్యాన్ని స్థాపించారు. విద్యారణ్యస్వామి పేరు మీదుగా విద్యానగరం/ విజయనగరం అనే నూతన నగరాన్ని నిర్మించారు. 1344లో రాజధానిని అనెగొంది నుంచి విజయనగరానికి మార్చారు.
ఆధారాలు శాసనాలు
- బాగపెల్సి తామ్రశాసనం మొదటి హరిహరరాయల విజయాలను వివరిస్తోంది. రెండో సంగముడు వేయించిన బిట్రగుంట దాన శాసనం సంగమ సోదరుల గురించి తెలుపుతుంది.
- రెండో హరిహరుడు వేయించిన చెన్నరాయపట్టణ శాసనం, రెండో దేవరాయలు వేయించిన శ్రీరంగం తామ్ర ఫలకాలు, ఇమ్మడి నరసింహుడు వేయించిన దేవులపల్లి తామ్ర శాసనాలు (సాళువ వంశావళి) ప్రధాన ఆధారాలు.
నాణేలు
- విజయనగర కాలంలో ప్రధాన బంగారు నాణెం గద్యాణం. దీన్నే వరహా అనేవారు. ప్రతాప, ఫణం, చిన్నంకూడా బంగారు నాణాలే. తార్ వెండినాణెం. జిటాలు, కాసు రాగి నాణేలు. దీనారం ఈజిష్టియన్ నాణెం, నాణేలపై హిందూ దైవాల ప్రతిమలు, ఏనుగులు, నంది, గండబేరుండ పక్షి ఒక పక్క, రాజుల పేర్లు, బిరుదులు మరో పక్క ఉండేవి.
- రెందో దేవరాయలు వేయించిన పావలా వరహాలపై అతడి బిరుదైనగజబేటకార ముద్రితమై ఉండేది.
Literary sources – Domestic and Foreign works | సాహిత్య ఆధారాలు – దేశీయ, విదేశీ రచనలు
- మొదటి హరిహరుని కాలంలో ఇబన్ బటూట (మొరాకో) రాజ్యాన్ని సందర్శించారు
- మొదటి దేవరాయల కాలంలో నికోలోడీ కాంటే (ఇటలీ), రెంటో దేవరాయల కాలంలో అబ్దుల్ రజాక్ (పర్షియా), శ్రీకృష్ణదేవరాయల కాలంలో డొమింగోపేస్, న్యూనిజ్‌లు వచ్చారు.
- సతీసమేతంగా విజయనగర రాజ్యాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు నికోలోడీ కాంటే. ఇతడు విజయనగర చుట్టుకొలత వసంతోత్సవాలు, సతీ సహగమనం గురించి రాశారు
- డొమింగోపేస్ శ్రీకృష్ణదేవరాయలు రూపం, వ్యక్తిత్వం, బలులు, బ్రాహ్మణులు, అధ్యాపక, పూజారి, సైనిక వృత్తులు, దేవాదాసీల ఉన్నత స్దానం గురించి వివరించారు
- బార్బోజా (పోర్చుగల్) విజయనగరరాజుల పరమత సహనం, న్యాయ విధానం గురించి వివరించాడు .
- అథనేషియన్ నికెటిన్ (రష్యా) విజయనగర సామ్రాజ్యంలో ని ఆర్థిక అసమానతలు, ఆర్థిక డొల్లతనం గురించి వివరించారు
- పెరిస్టా అనే పర్షియన్ చరిత్రకారుడు బీజాపూర్ సుల్తాన్ ఇబ్రహీం ఆదిల్ షా ఆస్థానంలో నివసించారు ఇతడు హిస్టరీ ఆఫ్ ది రైజ్ ఆఫ మహ్మడన్ పవర్ గ్రంథాన్ని రచించారు
దేశీయ సాహిత్యం
గంగాదేవి – మధురా విజయం, తిరుమలాంబ – వరదాంబికా పరిణయం, రెండో దేవరాయలు -మహానాటక సుధానిధి, 2వ రాజనాథ డిండిముడు – సాళువాభ్యుదయం, 3వ’రాజనాథ డిండిముడు -రామాభ్యుదయం, శ్రీకృష్ణ దేవరాయలు – ఆముక్తమాల్యద, నాచనసోముడు – ఆంధ్రభాషా చరిత్ర స్టానాపతి -రాయవాచకం, మహాలింగదేవుడు – ఏకోత్తర నటస్థల, లక్ష్మణ దండనాయకుడు – శివతత్త్వ చింతామణి, చామరసు – ప్రభులింగలీల, హరిదాసు – ఇరుశమయ విళక్కమ్, దూబగుంట నారాయణకవి – పంచతంత్రమ్(తెలుగు), అల్లసాని పెద్దన – మనుచరిత్రం, గంగాధరుడు – గంగాదాస ప్రలాప విలాసం రచనలు విజయనగర సామ్రాజ్యం గురించి వివరిస్తున్నాయి.
Vijayanagara Political History |విజయనగర రాజకీయ చరిత్ర
ఈ సామ్రాజ్యాన్నిసంగమ, సాళువ, తుళువ, అరవీడు అనే నాలుగు రాజ వంశాలు పాలించాయి
Sangama Clan | సంగమ వంశం
- కర్ణాటకలోని మంగళ నిలయ నివాసి సంగముని కుమారులు హరిహరరాయులు, బుక్కరాయలు1336లో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. వీరు కాకతీయ రెండో ప్రతాపరుద్రుడి ఆస్థానంలో పనిచేశారు.
- మహ్మద్ బీన్ తుగ్గక్ దాడిచేసినప్పుడు కంపిలి రాజ్యంలో ఆశ్రయం పొందారు. తుగ్గక్ కంపిలిని కూడా ఆక్రమించి, సంగమ సోదరులను దిల్లీకి తీసుకొనిపోయి ఇస్లాం మతంలోకి మార్చాడు.
- ముసునూరి పాలకుల చేతిలో ఓడిపోయిన సంగమ సోదరులు విద్యారణ్యస్వామి సహాయంతో హిందూమతంలోకి మారి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. విరూపాక్షస్వామి పేరున స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించారు.
మొదటి హరిహరరాయలు (1336-56)
- ఇతని కాలంలోనే బహుమనీ రాజ్య స్థాపన జరిగింది.
- తుంగభద్ర నదీ తీరాన విద్యానగరం/ కోవెలపురం నిర్మించాడు. పంపావతి ఆలయం కట్టించాడు. ఇబన్ బటుత అనే మొరో దేశస్థుడు 1347 లో ఇతని రాజ్యాన్ని సందర్శించాడు.
- బాగాపెల్సి, అటకల గూడు శాసనాలు వేయించాడు.
- బాదామి శాసనంలో ఇతన్ని పూర్వపశ్చిమ సముద్రాదీశ్వర అనిపేర్కొన్నారు.
మొదటి బుక్కరాయలు (1356-77) (1353-79):
- ఇతను విజయనగర పట్టణ నిర్మాణం పూర్తి చేసాడు.
- విజయనగర బహుమనీల ఘర్షణలు ఇతని కాలంలోనే ప్రారంభమయ్యాయి. ఇతని కుమారుడు కంపన మదురై పై దండెత్తి విజయం సాధించాడు.
- నాచన సోముడు ఇతని ఆస్థాన కవి. సోముడు ఉత్తర హరివంశం అను ప్రసిద్ధ తెలుగు కావ్యాన్ని రచించాడు.
- బుక్కరాయలు పిచ్చుకలదిన్నె గ్రామాన్ని సోమనకి దానం చేసి పిచ్చుకలదిన్నె శాసనాన్ని వేయించాడు. ఇతను చైనాకు వర్తకబృందాన్ని పంపించాడు.
రెండో హరిహరరాయలు (1377 – 1404):
- రాజాధిరాజ, రాజపరమేశ్వర, రాజ వ్యాస, రాజవాల్మీకి లాంటి బిరుదులతో పాలించాడు.
- మొదటి బుక్కరాయలు విజయాలను తెలుపుతూ చెన్నరాయ పట్టణ శాసనం వేయించాడు.
- కాటయ వేమారెడ్డి చేతిలో ఓడిపోయి తన కుమార్తె హరిహరాంబికను ఇచ్చి పెళ్లి చేశాడు.
మొదటి దేవరాయలు (1406 – 22):
- ఇతడు వెలమలతో మైత్రి కుదర్చుకున్నాడు. ముద్ద్గల్ కంసాలి కుమార్తె నెహాల్ విషయంలో బహమనీ సుల్తాన్ ఫిరోజ్‌షాతో యుద్ధం చేస్తి ఓడిపోయాడు.
- విజయనగరం చుట్టూ బురుజులు నిర్మించాడు. తుంగభద్రా నదికి ఆనకట్టలు కట్టించి నగరానికి నీటి సౌకర్యం కల్పించాడు.
- చామన దండనాయకుడు ఇతడి మంత్రి. విక్రమార్క చరిత్ర గ్రంథాన్ని రాసిన జక్కన, దాన్ని సిద్దనకు కృతి ఇచ్చాడు. సిద్దనను చామన ఆదరించాడు.
రెండో దేవరాయలు (1426 – 46):
- ఇతడు సంగమ వంశంలో గొప్పవాడు. ఇతడిని ప్రౌఢ దేవరాయలు అని కూడా అంటారు.
- గజబేటకార బిరుదాంకితుడు (ఏనుగుల వేటలో సిద్ధహస్తుడు). కొండవీడును ఆక్రమించి, సింహాచలం వరకు ఉన్న రెడ్డి రాజ్యాన్ని సామంతరాజ్యంగా చేసుకున్నాడు.
- కపిలేశ్వర గజపతి దండయాత్రలను అరికట్టడానికి మల్లప్పవడయ సేనానిని పంపాడు.
- దక్షిణ సముద్రాధీశ్వర బిరుదు ధరించాడు.
- రాయల ఆస్థాన కవి అరుణగిరినాథు డిండిముడు. శ్రీనాథుడు రెండో దేవరాయల ఆస్థానానికి వచ్చి డిండిముడిని ఓడించి కవిసార్వభౌమ బిరుదు పొంది గండపెండేరం తొడిగించుకున్నాడు. అబ్దుల్ రజాక్
- నికోలోడీ కాంటే ఇతడి కాలంలో రాజ్యాన్ని సందర్శించారు. రెండో దేవరాయలు తన సింహాసనం ముందు మురాన్‌ను ఉంచేవాడు.
- రెండో దేవరాయల తర్వాత అతడి కుమారుడు మల్లికార్డునరాయలు 1446-1465 వరకు పాలించాడు.
Saluva Clan | సాళువ వంశం (14835 – 1505)
- సాళువ వంశస్థుల జన్మస్థలం కళ్యాణి (కర్ణాటక). ఈ వంశం వారు కళ్యాణపురవరాధీశ్వర బిరుదు ధరించారు. మంగిరాజుకు ప్రతిపక్షసాళువ బిరుదు ఉంది.
- సాళువ నరసింహుడి ఆస్థాన కవి రెండో రాజనాథడిండిమ భట్టు- సాళువాభ్యుదయం అనే గ్రంథాన్ని రాశాడు.
- నరసింహరాయలు రాజధానిని కళ్యాణి నుంచి చంద్రగిరికి మార్చాడు.
- తెలంగాణపై దండెత్తి బాలకొండ దగ్గర ముస్లిం సైన్యాలను ఓడించి రాయ మహారసుబిరుదు పొందాడు.
- రాజనాథ డిండిముడే రాఘవాభ్యుదయం అనే సంస్కృత గ్రంథాన్ని రచించాడు. పిల్లలమర్రి పినవీరభద్రుడు జైమినీ భారతం, శృంగార తాళ్ళపాక అన్నమాచార్యులు శాకుంతలం గ్రంథాలను ఇతడి కాలంలోనే రచించాడు.
- సాళువ నరసింహుడి పెద్దకుమారుడు తమ్మరాజును సింహాసనం ఎక్కించి, సర్వాధికారాలు తుళువ నరసనాయకుడు చెలాయించాడు.
- 1505లో తుళువ వీరనరసింహుడు పెనుగొండలో బందీగా ఉన్న ఇమ్మడి నరసింహరాయలను హత్య చేయించి, తుళవ వంశపాలన ప్రారంభించాడు. (వాస్తవానికి తుళువ నరసనాయకుడే ఇమ్మడి నరసింహుడిని పెనుగొండలో బంధించి, అధికారాలను హస్తగతం చేసుకుని రెందో దురాక్రమణదారుడుగా పేరొందాడు)
Thuluva Clan | తుళువ వంశం (1505 – 1575)
- మైసూర్‌లోని తుళు ప్రాంతం జన్మస్థలం. మూలపురుషుడు తిమ్మరాజు.
- ఇతడి కుమారుడు ఈశ్వర నాయకుడు సాళువ నరసింహుడి సేనానిగా అనేక విజయాలు సాధించి దేవకీపురాధిపుడు అనే బిరుదు పొందినట్లు వరాహపురాణం గ్రంథం తెలుపుతోంది. ఈ గ్రంథాన్ని నంది మల్లయ్య, ఘంట సింగనలు రచించి తుళువ నరసనాయకుడికి అంకితం చేశారు.
- వీరనరసింహుడు 1505-09 వరకు రాజ్యపాలన చేశాడు. దేవులపల్లి శాసనం వేయించింది ఇతడే.
- నంది మల్లయ్య, ఘంట సింగన (తొలి తెలుగు జంట కవులు)లు ప్రభోధ చంద్రోదయం గ్రంథాన్ని రచించారు.
- వైవాహిక సుంకాన్ని రద్దుచేసిన తొలి విజయనగర చక్రవర్తి వీర నరసింహుడు.
శ్రీకృష్ణ దేవరాయలు (1509 – 1529):
- తుళువ నరసనాయకుడు, నాగలాంబిక కుమారుడు శ్రీకృష్ణ దేవరాయలు. 1509, ఆగస్టు 8 (శ్రీ జయంతి) రోజున పట్టాభిషేకం జరుపుకున్నాడు.
- మహామంత్రి తిమ్మరుసు (మనోహరా గ్రంథం) సహాయంతో రాజయ్యాడు.
- రాయల పట్టాభిషేకానికి లూయిఫ్రెజర్/ ప్రేయర్ లూయిస్ అనే పోర్చుగీసు రాయబారిని ఆల్బూకర్క్ పంపాడు.
- కోవిలకొండు దీవాన్ యుద్ధాల్లో బహమనీ సైన్యాలను ఓడించి కోవిలకొండను ఆక్రమించాడు.
- యవన రాజ్యస్థాపనాచార్య అనే బిరుదు రాయలు పొందాడు.
- దక్షిణ భారత దేశంలో యూరోపియన్లతో తన సైన్యానికి శిక్షణ ఇప్పించిన తొలిరాజుగా శ్రీకృష్ణదేవరాయలు పేరొందారు.
- బాలకృష్ణ విగ్రహాన్ని తెచ్చి హంపిలో కృష్ణాలయం నిర్మించాడు. వీరరుద్ర గజపతిని ఓడించి, కొండవీడును ఆక్రమించి తిమ్మరాజు పినకొండ్రాజును నియమించాడు.
- మహామంత్రి తిమ్మరుసు (మనోహరా గ్రంథం) సహాయంతో రాజయ్యాడు.
- తూర్పు దిగ్విజయ యాత్రలో ఉండగానే కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువు దేవాలయంలో స్వప్నం రావడం ఫలితంగా ఆముక్త మాల్యద/ విష్ణుచిత్తీయం అనే గ్రంథ రచనకు శ్రీకారం చుట్టాడు.
- సింహాచల దేవాలయానికి ముఖ మండపం, మంగళగిరి దేవాలయానికి మండపాలు, సోపానాలు నిర్మించాడు. ప్రకాశం జిల్లాలోని కంభం చెరువును అన్నపూర్ణాదేవి నిర్మించింది.
- తల్లి నాగులాంబ పేరుతో నాగులాపురం పట్టణం, తటాకాన్ని నిర్మించాడు. పెనుగొండలో గగన్ మహల్‌ను నిర్మించాడు.
- 1513లో సాధించిన కళింగ విజయానికి గుర్తుగా భువనవిజయం అనే ఆస్థాన భవనాన్ని నిర్మించాడు.
- ఇతడి ఆస్థానంలో అష్టదిగ్గజాలు అనే కవులు ఉండేవారు. దేశ భాషలందు తెలుగులెస్స అని రాయలు పేర్కొన్నారు.
- బండారు లక్ష్మీ నారాయణ కవి సంస్కృత భాషలో సంగీత సూర్యోదయం గ్రంథాన్నిరచించాడు. దీన్ని రాయలకు అంకితమిచ్చారు.
- శ్రీకృష్ణదేవరాయలు జాంబవతి పరిణయం, మదాలస చరిత్ర, సత్యవధు ప్రియతము, సకల కథాసారసంగ్రహం, జ్ఞాన చింతామణి వంటి సంస్కృత భాషా గ్రంథాలు రచించాడు.
- అల్లసాని పెద్దన – మనుచరిత్ర ధూర్జటి – శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం (శతకం), నంది తిమ్మన – పారిజాతాపహరణం, అయ్యలరాజు రామభద్రుడు- రామాభ్యుదయం, మాదయగారి మల్లన – రాజశేఖర చరిత్ర, పింగళి సూరన – రాఘవపాండవీయం, కళా పూర్ణోదయం, ప్రభావతీ ప్రద్యుమ్నం, తెనాలి రామలింగడు – పాండురంగ మహాత్మ్యం, రామరాజభూషణుడు/ భట్టుమూర్తి – వసుచరిత్ర, హరిశ్చంద్రనలోపాఖ్యానం, నరసభూపాళీయం గ్రంథాలు రచించారు.
అచ్యుతరాయలు (1530-1542):
- అచ్యుతరాయలు తిరుపతిలో పట్టాభిషేకం జరుపుకుని సింహాసనాన్ని ఆక్రమించాడు.
- ఇతడి ఆస్థానాన్ని కర్ణాటక సంగీత పితామహుడు పురంధరదాసు సందర్శించాడు.
సదాశివరాయలు (1542 – 1576):
- అళియరామరాయలు సహాయంతో సదాశివరాయలు ‘గుత్తి’ దుర్గంలో రాజుగా ‘ప్రకటించబడ్డాడు.
- సదాశివుడు అచ్యుతరాయల అన్న రంగరాయ కుమారుడు. కానీ సలకం తిరుమలుడు రామరాయల్ని, సదాశివరాయల్ని వ్యతిరేకించి తిరుగుబాటు చేశాడు.
- ఇతడి కాలంలో పోర్చుగీసు గవర్నర్ మార్టిన్ అపాన్ట్ డిసౌజా శ్రీరంగం, కాంచీపురం ఆలయాలపై దాడిచేశాడు.
- యుద్ధంలో అళియ రామరాయలు మరణించగా, సోదరుడు తిరుమలరాయలు సదాశివరాయల్ని తీసుకుని పెనుగొండకు పోయి అరవీటి వంశాన్ని స్థాపించాడు.
Araveeti Clan | అరవీటి వంశం
- అరవీటి తిమ్మరాజు సాళువ నరసింహుని కొలువులో పనిచేశాడు. అతడి కుమారులే రామ రాయలు,వెంకటాద్రి తిరుమలరాయలు. తళ్లికోట యుద్దంలో రామరాయలు, వెంకటాద్రి చనిపో గా తిరుమలరాయలుపెనుగొండకు పోయి అరవీటి వంశ పాలన ప్రారంభించాడు.
- పెనుగొండ కేంద్రంగా తెలుగు ప్రాంతాలను శ్రీరంగరాయలు, శ్రీరంగపట్నం కేంద్రంగా కన్నడ ప్రాంతాలను రామరాయలు, చంద్రగిరి కేంద్రంగా తమిళ ప్రాంతాలనువెంకటపతి రాయలు పాలించారు.
- రామరాజ భూషణుడు తన వసుచరిత్ర గ్రంథాన్ని తిరుమలరాయలకు అంకితం ఇచ్చాడు.
- క్రీ.శ.1572 నుంచి 1585 వరకు శ్రీరంగరాయలు అరవీటి వంశం పాలన చేశాడు. ఇతడి కాలంలోనే కోడూరు యుద్ధం (1579) జరిగింది. తర్వాత రెందో వెంకటపతి రాయలు (1586 -1614) పాలనకు వచ్చాడు. రాజధానిని పెనుగొండ నుంచి వెల్లూరుకు మార్చాడు.
మూడో వెంకటపతి రాయలు (1630-1642):
- రామదేవరాయల అనంతరం అళియ రామరాయల పెద మనవడైన మూడో వెంకటపతిరాయలు పాలనకు వచ్చాడు.
- బీజాపూర్ గోల్కొండ సుల్తానులతో యుద్దాలు చేశాడు. చివరికి పరాజయం పొంది చిత్తూరు జిల్లా అడవుల్లోకి పోయి మరణించాడు.
మూడో శ్రీరంగరాయలు:
- చివరి విజయనగర పాలకుడు మూడో శ్రీరంగరాయలే.
- వెంగల్లు యుద్ధంలో గోల్కొండ సైన్యాలను ఓడించాడు. మీర్ జుమూ నాయకత్వంలో గోల్కొండ సైన్యాలు, ముస్తఫాఖాన్ నాయకత్వంలో బీజాపూర్ సైన్యాలు రాయల రాజ్యంపై దండెత్తాయి. 1642లో వెల్లూరు వద్ద జరిగిన యుద్ధంలో రాయలు పరాజయం పొందాడు.
- రాయల ప్రోత్సాహంతో మధుర వెల్లూరు నాయకులు మీర్‌జువ్లూతో పోరాడినా వందవాసి యుద్ధంలో పరాజయం పొందారు. 1665లో రాయలు మళ్లీ పెనుగొండను ఆక్రమించి 1680 వరకు పాలించాడు.
Features of Vijayanagara Era | విజయనగర యుగ విశేషాలు
- పాలన: సంప్రదాయ రాచరికం. వంశానుగత పాలన, రాజు దైవాంశ సంభూతుడునే భావన ఉంది
- ఆముక్తమాల్యద,పరాశరమాధవీయం, సకలనీతిసమ్మతం లాంటి గ్రంథాల్లో నాటి పాలనా విధానాలను వర్ణించారు.
- రాజ్యాన్ని రాష్ట్రం – మండలం -నాడు – స్టలం – సీమ -గ్రామం అనే రకాలుగా వర్గీకరించారు. మంత్రిమండలికి అధ్యక్షుడు ప్రధానమంత్రి (సర్వశిర్ర. ఇతడినేసభానాయక, తంత్రనాయక అని పిలిచేవారు.
- ప్రభుత్వ నిర్వహణలో అట్టావన (రెవిన్యూ), కందాచార (సైనిక), భాండార , ధర్మాసన లాంటిశాఖలు ఉండేవి.
Financial Conditions | ఆర్థిక పరిస్థితులు
- ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. భూమి శిస్తు రాజ్యానికి ప్రధాన ఆదాయం.
- తెలుగు ప్రాంతాల్లో తిమ్మరుసు మంత్రి సర్వే నిర్వహించాడు. సర్వే కోసం తీరాంధ్రలో కేసరిపాటిగడ, రేనాడులో దోరగడ అనే కొలమానాలను వినియోగించారు.
- బ్రాహ్మణ ఈనాములపై 1/6వ వంతు, దేవాలయ భూములపై 1/30వ వంతు పన్ను వసూలు చేసేవారు. భూమి శిస్తు మాత్రం 1/3వ వంతు ఉందేది. మాగాణి (నీరాంబర), మెట్ట (కాడాంబర) పన్నుల్లో తేడాలుండేవి. పన్నులు ధన ధాన్యరూపంలో చెల్లించవచ్చు.
- సువర్ణాదాయాన్ని సిద్దాయం అనేవారు.
- పశువులను మేపినందుకు పుల్లరి చెల్లించాలి. బిచ్చగాళ్లపై గణాచారి పన్ను విధించేవారు.
- కొందోజు అనే మంగలి అభ్యర్థన మేరకు అళియరామరాయలు కొన్ని ప్రాంతాల్లో మంగలి పన్నును తొలగించాడు.
- సాలెవారు మగ్గ్గర్కి పింజ సిద్దాయం పన్నులను; కుమ్మరి చక్రకానిక పన్నును; ఉప్పుకొటార్లపై ఉప్పరి పన్ను; ఇండ్లపై ఇల్లరి పన్ను; నిధి నిక్షేపాలు, తోటలు, పశువులు, నీటిబుగ్గలపై సంపత్తి పన్ను విధించేవారు. వివాహాల సమయంలో కల్యాణానిక్కే గుడి కళ్యాణం అనే పన్నులు విధించేవారు.
- శ్రీకృష్ణదేవరాయలు కందనవోలు, చంద్రగిరి ప్రాంతాల్లో కళ్యాణ పన్నులను తొలగించాడు.
- విజయనగర రాజ్యంలో బంగారం, వెండి, రాగి నాణేలు అమల్లో ఉండేవి. గద్వాణం బంగారు నాణెం. దాన్నేవరాహ అనేవారు. గద్వాణంలో సగం ప్రతాప. ఫణం, చిన్నం అనే ఇతర బంగారు నాణేలు కూడా వాడుకలో ఉందేవి.
- ఎక్కువ వాడుకలో ఉన్న నాణెం మాత్రం ఫణం. తార్ అనేది వెండి నాణెం. ఇది ఫణంలో ఆరో వంతు. జిటలు, కాసు అనేవి రాగి నాణేలు. దీనారం అనే ఈజిష్టియన్ నాణెం కూడా వాడుకలో ఉండేది.
- వ్యవసాయ అభివృద్ధికి చెరువులు, కాలువలు, తటాకాలను తవ్వించారు.
- బుక్కరాయల కాలంలో పెనుగొండ వద్ద శిరువేరు తటాకం, సాళువ నరసింహుడి కాలంలో అనంతపురం దగ్గర నరసాంభుది తటాకం, శ్రీకృష్ణదేవరాయల కాలంలో నాగలాపురం తటాకాలను నిర్మించారు.
- కొండవీటి రాజ్యంలో కొండమరసు తిమ్మసముద్రం, కొండ సముద్రాలను నిర్మించాడు.
- చెరువు కింద సాగు చేసుకునే రైతులు చెరువు నిర్మించిన వారికి దశబంధ మాన్యం (1/10) చెల్లించేవారు.
- శ్రీకృష్ణదేవరాయలు పోర్చుగీసు ఇంజినీర్ల సహాయంతో తుంగభద్ర నదిపై తూరుట్టు ఆనకట్టను నిర్మించాడు.
- వ్యవసాయేతర, వృత్తి పన్నులను శుల్కాదాయం అనేవారు.
- కావేరి నదిపై కృష్ణరాయలు కృష్ణరాయ సాగర్‌ద్యామ్, కోరుగల్లు వద్ద ఆనకట్టను నిర్మించాడు.
- వ్యవసాయ సంబంధ పరిశ్రమలు ఎక్కువగా ఉండేవి. తాడిపత్రి, ఆదోని, గుత్తి, వినుకొండ నూలు పరిశ్రమకు కేంద్రాలుగా ఉండేవి. కలంకారీ వస్త్ర పరిశ్రమ కూడా వృద్ది చెందింది.
- కర్నూలు, గుత్తి, అనంతపురం ప్రాంతాల్లో వజ్రాలు అధికంగా దొరికేవి.
- మొదటి దేవరాయలు మోటుపల్లిని ఆక్రమించి ధర్మశాసనం (1416) వేయించాడు. పులికాట్ రేవులో హిందు, ముస్లింల వర్తక వాణిజ్యాలు; ఎగుమతి, దిగుమతుల గురించి బార్బోసా రాశాడు. టోకు వర్తకులు హెర్నుకం అనే పన్ను చెల్లించేవారు.
- నాడు కాలికట్ ప్రముఖ నౌకా నిర్మాణ కేంద్రంగా ఉండేది.
- వ్యాపార, వాణిజ్య కేంద్రాలను నకరములు అనేవారు.
Social conditions | సాంఘిక పరిస్థితులు
- సమాజంలో బ్రాహ్మణులకు ఉన్నత స్థానం ఉండేది.
- క్షత్రియ స్త్రీలు సతీసహగమనం పాటించేవారని, నరబలి ఆచారం ఉందని పేర్కొన్నాడు.
- మొదటి దేవరాయల కాలంలో వచ్చిన నికోలోడీ కాంటే విజయనగరం చుట్టుకొలత, అందచందాలను; దీపావళి, నవరాత్రి ఉత్సవాలను ప్రజలు జరుపుకునే విధానం గురించి రాశాడు.
- రెందో దేవరాయల కాలంలో వచ్చిన అబ్దుల్ రజాక్ విజయనగరం లాంటి పట్టణం ప్రపంచంలో మరెక్కడా లేదని కితాబిచ్చాడు. ఇక్కడ వజ్రాలను రాశులుగా పోసి అమ్మేవారని పేర్కొన్నాడు.
- వేట, కుస్తీ, మల్లయుద్ధం, తోలుబొమ్మలాట, సంగీతం, నాట్యం, వీధి నాటకం, యక్షగానం, చదరంగం నాటి ప్రజల ముఖ్య వినోదాలని రజాక్ పేర్కొన్నాడు.
- పశుకాపరులను కురుబలు, ఇదయనులు అని పిలిచేవారు. వైశ్యులను నకరములు అనేవారు.
- బహుభార్యత్వం, కన్యాశుల్కం, వరశుల్కం, సతీసహగమనం లాంటి ఆచారాలు ఎక్కువగా ఉండేవి.
Religious conditions | మత పరిస్థితులు
- విజయనగర పాలకులు వేదమార్గ్ల ప్రతిష్టాపనాచార్య అనే బిరుదు ధరించారు.
- రాజులు హిందూ మతాభిమానులు అయినప్పటికీ పరమత సహనాన్ని ప్రదర్శించారు.
- సంగమ వంశీయులు కాలాముఖ శైవులు. వారి కుల దైవం విరూపాక్షుడు. కుల గురువు క్రియాశక్తి ఆచార్యులు. స్మార్త గురుపీఠమైన శృంగేరి ప్రాబల్యం పొందింది.
- రెండో వెంకటపతి రాయల ఆస్టానంలో ప్రముఖ అద్వైత ప్రవక్త అయిన అప్పయ్యదీక్షితులు నివసించాడు.
- తుళువ వంశ పాలనా కాలం నుంచి వైష్ణవం రాజాదరణ పొందింది.
- విజయనగర కాలంలో ప్రసిద్ధ ద్వైతాచార్యులు మాత్రం వ్యాసతీర్జులే.
- రెందో వెంకటపతి కాలం నుంచి శాసనాల్లో విరూపాక్షుని బదులు వేంకటేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. అతడి నాణేలపై కూడా శ్రీవేంకటేశాయనమ: అనే లేఖనం కనిపిస్తుంది. తిరుపతి, శ్రీశైలం, అహోబిలం, శ్రీకాళహస్తి నాటి ప్రసిద్ధ దేవాయాలు.
- రాయల నాణేలపై రాజు పేరు లేదా బిరుదు (కన్నడంలో మాత్రమే) ఒకవైపు ఎద్దు, ఏనుగు, గద్ద గుర్తులు మరో వైపు ముద్రించారు.
విద్యాసారస్వతాలు – కళలు
- అధికార భాష సంస్కృతం అయినప్పటికీ తెలుగు తమిళ, కన్నడ భాషలకు ప్రాధాన్యం ఇచ్చారు.
- తాళ్లపాక అన్నమాచార్యులు తన కీర్తనలను రాగి రేకులపై రాసి సరస్వతీ గ్రంథాలయంలో భద్రపరిచాడు.
సంస్కృత భాషా రచనలు
- విద్యారణ్యస్వామి – ఐతరేయదీపిక, తైతరేయదీపిక, పంచదశి, జీవన్ముక్తి వివేక. మాధవాచార్యులు – పరాశర మాధవీయం, జైమినీయ న్యాయమాలా విస్తర, సర్వదర్శన సంగ్రహం.
- శాయణుడు – వేదార్థ ప్రకాశిక (ధాతువృత్తి) (సత్యార్థ ప్రకాశిక – స్వామి దయానంద సరస్వతి) వెంకటముఖి – శుల్చ్బమీమాంస (లింగాధ్వరి – వేదార్ధ తత్వ నిర్ణయం)
- వేదాంతదేశికుడు – తతంటీక, తాత్మర్వ చంద్రిక, నాయ సిద్దాంజనం, యాదవాభ్నుదయం,రామాభ్యుదయం.
- వ్యాసతీర్జులు – తర్కతాండవ, తాత్పర్య చంద్రిక న్యాయామృతం.
- రెందో దేవరాయలు – మహానాటక సుధానిధి
- గంగాదేవి – మధురావిజయం
- తిరుమలా దేవి – వరదాంబికా పరిణయం
- శ్రీకృష్ణ దేవరాయలు – జాంబవతి పరిణయం, మదాలసా చరిత్ర, ఉషా పరిణయం, సకల కథా సారసంగ్రహం
- ధూర్జటి – కాళహాస్తీశ్వర మహత్మ్యం, కాళహస్తీశ్వర శతకం
- పింగళి సూరన – కళాపూర్ణోదయం, రాఘవ పాండవీయం, ప్రభావాతీ ప్రద్యుమ్నం
- తెనాలి రామకృష్ణుడు – పాండురంగ మహాత్మ్యం
- రామరాజభూషణుడు – వసుచరిత్ర (అసలుపేరు భట్టుమూర్తి)
- చేమకూరి వేంకటకవి – విజయవిలాసం, సారంగధర చరిత్ర
- రఘునాధ నాయకుడు – నలచరిత్ర, సావిత్రీ చరిత్ర
- ముద్దు పళని – రాధిక సాంత్వనము
- ఎకామ్ర నాథుడు – ప్రతాప చరిత్ర
- కాసే సర్వప్ప – సిద్దేశ్వర చరిత్ర
- విజయరంగ చొక్కానాథుడు – మాఘ మహాత్మ్యం , శ్రీరంగ మహాత్మ్యం
- రఘనాథ తొండమాన్ (పుదుక్కోట) – పార్వతీ పరిణయం అనే తెలుగు ప్రబంధాన్నిరచించాడు. ఇతడి ఆస్థానంలో ఉన్న నుదురుపాటి వెంకన్న – ఆంధ్రభాషార్ణవం (తెలుగులోప్రథమకోశం లేదా నిఘంటువు)ను రూపొందించాడు. కళువె వీరరాజు (మైసూర్) మహా భారతాన్ని తెలుగు వచనంలో రాశాడు.
Vaastu Structures – Arts | వాస్తు నిర్మాణాలు – కళలు
- ఆలయాల నిర్మాణం ఎక్కువగా జరిగింది.
- పంపావతి ఆలయాన్ని మొదటిహరిహరరాయలు నిర్మించి విరూపాక్షుడికి అంకితమివ్వగా, శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయం ముందు రంగమండపం నిర్మించాడు. హంపిలో హజరరామాలయం విఠలప్వామి ఆలయం నిర్మించాడు
- విఠలస్వామి ఆలయం విజయనగర వాస్తు నిర్మాణాల్లో మకుటాయమైంది. దీన్నే సప్తస్వర మండపంఅంటారు. దీన్ని రాయలు తూర్పు దిగ్విజయయాత్రలకు చిహ్నంగా నిర్మించాడు.
Andhra Pradesh History – Vijayanagara Empire Download PDF
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |