Andhra Pradesh Industrial Infrastructure Corporation (APIIC) Launches New Portal
సింగిల్ విండో విధానంలో పారిశ్రామికవేత్తలకు అవసరమైన అన్ని సేవలను ఒకే చోట అందించేలా ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ) ఆన్‌లైన్ వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఏపీఐఐసీని పరిశ్రమల శాఖతో అనుసంధానం చేయడం ద్వారా భూమి కోసం దరఖాస్తు దగ్గర నుంచి కంపెనీ వాటాల విక్రయం వరకు అన్ని సేవలను ఒకే క్లిక్‌తో పొందే అవకాశం కల్పించింది. ‘పౌర సేవలు’ పేరుతో ఏపీఐఐసీ అభివృద్ధి చేసిన నూతన పోర్టల్‌ను రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల వలవన్ ఏప్రిల్ 4న గుంటూరు జిల్లా, మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో ప్రారంభించారు. www. apindustries. gov. inకు ఏపీఐఐసీ సేవలు అనుసంధానించినట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. తొలిదశలో 14 సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
స్కిల్డు ఫోర్సు కార్యక్రమం ఉద్దేశం?
దేశంలోని లక్ష మందికి పైగా విద్యార్థులకు వివిధ నైపుణ్యాల్లో శిక్షణ కోసం ఇంటర్న్‌షిప్‌ను అందించనున్నట్టు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) ప్రకటించింది. స్కిల్డు ఫోర్సు పేరిట ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్టు తెలిపింది. అమెరికాకు చెందిన మల్టీ నేషనల్ టెక్నాలజీ సంస్థ అయిన సిస్కో, మహాత్మా గాంధీ నేషనల్ కౌన్సిల్ ఫర్ రూరల్ ఎడ్యుకేషన్(ఎంజీఎన్‌సీఆర్‌ఈ), ఆరెస్‌బీ ట్రాన్స్‌మిషన్ ఇండియా లిమిటెడ్ కంపెనీ వంటి సంస్థల ద్వారా ఈ శిక్షణ ఇప్పించనుంది
ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తెలుగు కరెంట్ అఫైర్స్ గురించి మరింత చదవండి:
ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చోటు దక్కించుకున్న లేపాక్షి వీరభద్రస్వామి దేవాలయం | కొత్త జిల్లాల జనాభాలో నెల్లూరు, విస్తీర్ణంలో ప్రకాశంలదే అగ్రస్థానం |
*******************************************************************************