Andhra Pradesh ranks second in grain yield per hectare: NABARD Report | ఒక హెక్టారుకు ధాన్యం దిగుబడిలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది: నాబార్డ్ నివేదిక
తాజాగా నాబార్డు 2022-2023కి దేశంలోని వివిధ రాష్ట్రాలలో హెక్టారుకు ధాన్యం దిగుబడి పై ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక లో పంజాబ్ మొదటి స్థానంలో నిలవగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండవ స్థానంలో నిలిచింది. పంజాబ్ లో హెక్టారు కు 4,193కిలోలు పంట రాగా ఆంధ్రప్రదేశ్ లో 3,730.40 కిలోలు పంట వచ్చింది. తమిళనాడు 3,500.40కిలోలతో మూడవ స్థానం, తెలంగాణ 3405.60తో నాలుగోవ స్థానం లో నిలిచాయి. దేశం మొత్తం మీద చూసుకుంటే ఒక హెక్టారు కి 2838.17 కిలోల ధాన్యం దిగుబడి లభించింది అని నివేదికలో తెలిపింది.
Sharing is caring!