Andhra Pradesh Ranks Seventh In Exports Of Millets | చిరు ధాన్యాల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ ఏడో స్థానంలో ఉంది
దేశంలోని చిరుధాన్యాల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలో ఉంది. గుజరాత్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు ప్రధాన ఆరు స్థానాల్లో ఉన్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అదనంగా, చిరుధాన్యాలను ఎగుమతి చేసే మొదటి ఐదు దేశాల్లో భారత్ ఉందని కూడా పేర్కొం ది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో, మొత్తం 169,049.22 మెట్రిక్ టన్నుల చిరుధాన్యాలను భారతదేశం నుండి ఐదు దేశాలకు ఎగుమతి చేయబడ్డాయి. వీటిలో, పంపిణీ ఈ క్రింది విధంగా ఉంది: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు 17.8 శాతం, సౌదీ అరేబియాకు 13.7 శాతం, నేపాల్‌కు 7.4 శాతం, బంగ్లాదేశ్‌కు 4.9 శాతం మరియు జపాన్‌కు 4.4 శాతం ఎగుమతి చేసినట్లు కేంద్రం పేర్కొంది.
ఇతర దేశాల్లో వీటికి డిమాండ్ ఎక్కువగా ఉన్నందున దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చిరుధాన్యాల ఉత్పత్తి పెంచడంతో పాటు స్థానిక వినియోగం, ఎగుమతులను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలను తీసుకుంటోందని వివరించింది. ఇందులో భాగంగా అగ్రికల్చరల్-ప్రాసెస్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (APEDA) చిరుధాన్యాల ఎగుమతిని ప్రోత్సహించాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందుకు ఎగుమతుదారులకు సహాయం అందిస్తుందని తెలిపింది.
గ్లోబల్ మార్కెట్‌లో పురోగతి
ప్రపంచ మార్కెట్‌లలో భారతీయ మిల్లెట్లను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం స్టార్టప్‌లు, అకడమిక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లు, భారతీయ మిషన్లు, ప్రాసెసర్‌లు, రిటైలర్లు మరియు ఎగుమతిదారులతో భాగస్వామ్యాన్ని చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కృషిచేస్తోందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లలో భారతీయ చిరుధాన్యాలను ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ఫోరమ్ (EPF) ఏర్పాటు చేయబడిందని కూడా ప్రస్తావించబడింది. 2023ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఏడాది పొడుగునా వీటి ఉత్పత్తితో పాటు వినియోగం పెంచేందుకు వివిధ కార్యక్రమాల నిర్వహణపై దృష్టిసారించాయని పేర్కొంది.
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
***************************************************************************