Telugu govt jobs   »   Current Affairs   »   Andhra Pradesh Ranks Third In Tomato...

Andhra Pradesh Ranks Third In Tomato Production | టమోటా ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది

Andhra Pradesh Ranks Third In Tomato Production | టమోటా ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది

దేశవ్యాప్తంగా టమోటా ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో, రాష్ట్రం గణనీయమైన 23.37 లక్షల మెట్రిక్ టన్నుల టమోటా దిగుబడిని అందించింది, ఇది దేశం యొక్క మొత్తం టొమాటో ఉత్పత్తిలో 11.30 శాతానికి దోహదపడింది. దీనిని ప్రస్తావిస్తూ, ఇటీవల టమాటా ధరలు పెరగడానికి గల కారణాలు మరియు సవాళ్లను హైలైట్ చేస్తూ NABARD ఒక నివేదికను విడుదల చేసింది. ప్రధానంగా దేశంలో టమాటాలు ఎక్కువగా పండించే రాష్ట్రాల్లో 2022-23లో ఉత్పత్తి భారీగా తగ్గిందని నివేదిక తెలిపింది. అయితే ఇందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ మాత్రం అంతకు ముందు ఆర్థిక ఏడాదితో పోల్చితే 2022 – 23లో 1.50 శాతం వృద్ధి నమోదైందని వెల్లడించింది.

ప్రధానంగా టమాల ధరల పెరుగుదలకు గుజరాత్, తమిళనాడు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రల్లో ఉత్ప త్తి గణనీయంగా తగ్గడమేనని NABARD తెలిపింది. దీంతో పాటు మేలో అకాల వర్షాలు, జూన్ లో వడగండ్ల వానలకు పంట దెబ్బతిందని వివరించింది. కర్ణాటకలో పంట ప్రధాన ప్రాంతాల్లో మార్చి, ఏప్రిల్, మే నెలల్లో వడగళ్ల వానలకు, జూన్ లో భారీ వర్షాలకు వేసిన పంటలో 70 శాతం నాశనమైందని పేర్కొంది. అలాగే మహారాష్ట్రలో ఈ ఏడాది వాతావరణ అనుకూలంగా లేకపోవడం తో పెద్ద ఎత్తున పంట దెబ్బతిందని వెల్లడించింది

2021-22లో దేశంలో టమోటా ఉత్పత్తి మొత్తం 206.9 లక్షల టన్నులు, 2022-23లో 206.2 లక్షల టన్నులకు తగ్గింది. ఈ ఏడాది జూలైలో టమోటా ధరలు మూడు రెట్లు పెరిగాయని నివేదిక హైలైట్ చేసింది. జూన్‌లో కిలో ధర రూ.30 ఉండగా, రిటైల్ మార్కెట్‌లో జూలై చివరి నాటికి కిలో రూ.130కి చేరింది. ముఖ్యంగా ఆగస్టు 10న హోల్‌సేల్ మార్కెట్‌లో కిలో ధర రూ.106.91గా ఉండగా, రిటైల్ మార్కెట్‌లో కిలో ధర రూ.131.69కి చేరింది.

SSC Complete Preparation Kit | Live Classes | Test Series | eBooks | Printed Books | By Adda247

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

***************************************************************************

Sharing is caring!

FAQs

ఆంధ్రప్రదేశ్‌లో టమోటాలు ఎక్కడ పండిస్తారు?

దేశంలోనే టమాటా పండించే ప్రధాన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ ఒకటి. కర్నూలు, చిత్తూరు, రంగారెడ్డి, ప్రకాశం జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలివస్తోంది.