Andhra Pradesh Regions, Divisions and Districts Complete Details | ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలు, డివిజన్లు మరియు జిల్లాల పూర్తి వివరాలు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం మూడు భౌగోళిక ప్రాంతాలను కలిగి ఉంది — ఉత్తరాంధ్ర, కోస్తా ఆంధ్ర మరియు రాయలసీమ ఈ మూడు భౌగోళిక లేదా సాంస్కృతిక ప్రాంతాలు 26 జిల్లాలు, కోస్తా ఆంధ్ర ప్రాంతంలో పన్నెండు, ఉత్తరాంధ్రలో ఆరు మరియు రాయలసీమ ప్రాంతంలో ఎనిమిది జిల్లాలను కలిగి ఉన్నాయి. ఇంకా ఈ 26 జిల్లాలను 77 రెవెన్యూ డివిజన్లుగా విభజించారు. విస్తీర్ణంలో అతి చిన్న జిల్లా విశాఖపట్నం మరియు అతిపెద్ద జిల్లా ప్రకాశం. అత్యధిక జనాభా కలిగిన జిల్లా నెల్లూరు అయితే అత్యల్ప జనాభా కలిగిన జిల్లా పార్వతీపురం మన్యం.
APPSC/TSPSC Sure shot Selection Group
Andhra Pradesh Regions List | ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల జాబితా
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఉత్తరాంధ్ర, కోస్తా ఆంధ్ర మరియు రాయలసీమ వంటి మూడు భౌగోళిక ప్రాంతాలలో విస్తరించి ఉన్న 26 జిల్లాలను కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 26 జిల్లాలు ఉన్నాయి, కోస్తా ఆంధ్ర ప్రాంతంలో పన్నెండు, ఉత్తరాంధ్రలో ఆరు మరియు రాయలసీమ ప్రాంతంలో ఎనిమిది జిల్లాలు ఉన్నాయి. ఇక్కడ ప్రాంతాల వారీగా జిల్లాల జాబితా ఇవ్వబడినది. అభ్యర్ధులు దిగువ ఇచ్చిన జాబితాని తనిఖీ చేయండి
![AP New districts](https://st.adda247.com/https://www.adda247.com/jobs/wp-content/uploads/sites/9/2023/03/15121854/AP-New-districts.jpg)
ప్రాంతం | జిల్లా |
కోస్తా ఆంధ్ర |
|
ఉత్తరాంధ్ర |
|
రాయలసీమ |
|
Andhra Pradesh Divisions and Districts List | ఆంధ్రప్రదేశ్ డివిజన్లు మరియు జిల్లాల జాబితా
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 26 జిల్లాలు ఉన్నాయి, ఇంకా ఈ 26 జిల్లాలను 77 రెవెన్యూ డివిజన్లుగా విభజించారు. ఇక్కడ మేము ఏ జిల్లా ఏ రెవెన్యూ డివిజన్ లోకి వస్తుందో పూర్తి వివరాలను ఒక పట్టిక రూపం లో అందచేస్తున్నాము. డివిజన్ వాటిగా తనిఖీ చేయడానికి దిగువ పట్టికను తనిఖీ చేయండి.
No | జిల్లా | డివిజన్ల సంఖ్య | రెవెన్యూ డివిజన్లు |
---|---|---|---|
01 | శ్రీకాకుళం | 3 | శ్రీకాకుళం, పలాస, టెక్కలి |
02 | విజయనగరం | 3 | విజయనగరం, బొబ్బిలి, చీపురుపల్లి |
03 | పార్వతీపురం మన్యం | 2 | పార్వతీపురం, పాలకొండ |
04 | అల్లూరి సీతారామ రాజు | 3 | పాడేరు, రంపచూడవరం, చింతూరు |
05 | విశాఖపట్నం | 2 | విశాఖపట్నం, భీమునిపట్నం |
06 | అనకాపల్లి | 2 | అనకాపల్లి, నర్సీపట్నం |
07 | కాకినాడ | 2 | కాకినాడ, పెద్దాపురం |
08 | డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ | 3 | అమలాపురం, కొత్తపేట, రామచంద్రపురం |
09 | తూర్పు గోదావరి | 2 | రాజమండ్రి, కొవ్వూరు |
10 | పశ్చిమ గోదావరి | 3 | భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం |
11 | ఏలూరు | 3 | ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు |
12 | కృష్ణ | 3 | గుడివాడ, మచిలీపట్నం, వుయ్యూరు |
13 | NTR | 3 | విజయవాడ, నందిగామ, తిరువూరు |
14 | గుంటూరు | 2 | గుంటూరు, తెనాలి |
15 | పల్నాడు | 3 | నరసరావుపేట, సత్తెనపల్లె, గురజాల |
16 | బాపట్ల | 3 | బాపట్ల, చీరాల , రేపల్లె |
17 | ప్రకాశం | 3 | ఒంగోలు, మార్కాపూర్, కనిగిరి |
18 | శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు | 4 | నెల్లూరు, ఆత్మకూర్, కందుకూరు, కావలి |
19 | కర్నూలు | 3 | కర్నూలు, ఆదోని, పత్తికొండ |
20 | నంద్యాల | 3 | నంద్యాల, ఆత్మకూర్, ధోనే |
21 | అనంతపురం | 3 | అనంతపురం, గుంతకల్లు, కళ్యాణదుర్గం |
22 | శ్రీ సత్య సాయి | 4 | పుట్టపర్తి, పెనుకొండ, ధర్మవరం, కదిరి |
23 | YSR | 4 | కడప, జమ్మలమడుగు, బద్వేల్, పులివెందుల |
24 | అన్నమయ్య | 3 | మదనపల్లె, రాయచోటి, రాజంపేట |
25 | తిరుపతి | 4 | తిరుపతి, శ్రీకాళహస్తి, గూడూరు, సూలూరుపేట |
26 | చిత్తూరు | 4 | చిత్తూరు, పలమనేరు, నగరి, కుప్పం |
మొత్తం రెవెన్యూ డివిజన్ సంఖ్య | 77 |
Important Facts New 13 Districts of Andhra Pradesh| నూతన జిల్లాల ముఖ్య సమాచారం
రాష్ట్రంలో 13 జిల్లాల పరిధిలో 25 లోక్‌సభ స్థానాలు, 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 51 రెవెన్యూ డివిజన్లు, 670 మండలాలు ఉన్నాయి. వాటిని 26 జిల్లాలుగా రాష్ట్ర ప్రభుత్వం పునర్విభజించింది.
విస్తీర్ణం పరంగా అతి పెద్ద జిల్లా | ప్రకాశం ( 14,322 చ.కీ.మీ. ) |
విస్తీర్ణం పరంగా అతి చిన్న జిల్లా | విశాఖపట్నం (928 చ.కీ.మీ. ) |
జనాభా పరంగా అతి పెద్ద జిల్లా | కర్నూలు (23.66 లక్షలు) |
జనాభా పరంగా అతి పెద్ద జిల్లా | అల్లూరి సీతారామరాజు జిల్లా ( అరకు) (9.54 లక్షలు) |
- కొత్త జిల్లాల ఏర్పాటుపై 2020 ఆగస్టు 7న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటైంది ఆ తర్వాత జిల్లాల సరిహద్దులు, సిబ్బంది పునర్వ్యవస్థీకరణ, ఆస్తులు, మౌలిక వసతులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి అంశాలపై మొత్తం నాలుగు సబ్ కమిటీలు ఏర్పాటు చేశారు.
Andhra Pradesh Regions, Divisions and Districts PDF
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |