Telugu govt jobs   »   Current Affairs   »   ఆంధ్రప్రదేశ్ నైపుణ్య శిక్షణలో మూడో స్థానంలో, ఉద్యోగాల్లో...

ఆంధ్రప్రదేశ్ నైపుణ్య శిక్షణలో మూడో స్థానంలో, ఉద్యోగాల్లో రెండో స్థానంలో నిలిచింది

ఆంధ్రప్రదేశ్ నైపుణ్య శిక్షణలో మూడో స్థానంలో, ఉద్యోగాల్లో రెండో స్థానంలో నిలిచింది

కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకారం, గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ మరియు ఉపాధి అవకాశాల పరంగా మొదటి ఐదు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ స్థానం సంపాదించింది. నైపుణ్య శిక్షణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మూడో స్థానంలో, ఉద్యోగ నియామకాల్లో రెండో స్థానంలో ఉంది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కింద 27 రాష్ట్రాలు మరియు నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలలో ఇప్పటి వరకు 14.51 లక్షల మంది గ్రామీణ యువతకు విజయవంతంగా శిక్షణనిచ్చింది, ఇందులో 8.70 లక్షల మంది వ్యక్తులు ఉపాధిని పొందినట్లు తెలిపింది.

ఈ పథకం కింద గ్రామీణ యువతకు వారి అభిరుచుల ఆధారంగా వృత్తిపరమైన రంగాల్లో నైపుణ్య శిక్షణను అందజేస్తారు. అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడంలో  ముందున్న రాష్ట్రాలు ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ మరియు బీహార్. అదనంగా, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు శిక్షణ పొందిన అభ్యర్థులకు ఉద్యోగ నియామకాల పరంగా మొదటి ఐదు స్థానాలను ఆక్రమించాయి.

ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుండి 15 మరియు 35 సంవత్సరాల మధ్య వయస్సు గల గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ అందించడంపై ఈ పథకం దృష్టి పెడుతుంది. SC మరియు STలకు 50%, మైనారిటీలకు 15%, మహిళలకు 33%, అలాగే వికలాంగులు మరియు వారి కుటుంబాల నిర్వహణ బాధ్యత కలిగిన మహిళలు వంటి నిర్దిష్ట సమూహాలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. 37 రంగాలలోని 877 ప్రాజెక్ట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీల మద్దతుతో, ఈ శిక్షణ దేశవ్యాప్తంగా 2,369 కేంద్రాలలో నిర్వహించబడుతుంది.

తొలి ఐదు స్థానాలు పొందిన రాష్ట్రాల్లో శిక్షణ పొందిన అభ్యర్థులు

రాష్ట్రం శిక్షణ పొందిన అభ్యర్థుల సంఖ్య
ఒడిశా 2,10,557
ఉత్తరప్రదేశ్ 1,84,652
ఆంధ్రప్రదేశ్ 1,04,462
మధ్యప్రదేశ్ 74,929
బిహార్ 73,060

టాప్ ఐదు రాష్ట్రాల్లో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు

ఒడిశా 1,68,582
ఆంధ్రప్రదేశ్ 87,757
తమిళనాడు 58,263
ఉత్తరప్రదేశ్ 46,997
తెలంగాణ 46,983

"VISION" APPSC Group-1 Prelims Officers Batch | Telugu | Online Live Interactive Classes From Adda247

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

***************************************************************************

Sharing is caring!

FAQs

గ్రామీణ యువతకు స్వయం ఉపాధి కోసం శిక్షణా పథకం ఏమిటి?

TRYSEM అంటే ట్రైనింగ్ టు రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్. TRYSEM అనేది కేంద్ర ప్రాయోజిత కార్యక్రమం, ఇది 15 ఆగస్టు 1979న ప్రారంభించబడింది. ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం 18-35 ఏళ్ల మధ్య ఉన్న గ్రామీణ BPL ప్రజలకు సాంకేతిక మరియు వ్యాపార నైపుణ్యాన్ని అందించడం.