ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కరెంట్ అఫైర్స్ డిసెంబర్ 2023 తెలుగులో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కరెంట్ అఫైర్స్ APPSC గ్రూప్స్, పంచాయితీ సెక్రటరీ, సబ్-ఇన్‌స్పెక్టర్ మరియు కానిస్టేబుల్, జూనియర్ లెక్చరర్స్ మొదలైన పరీక్షలలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. త్వరలోAPPSC గ్రూప్ 1 మరియు గ్రూప్ 2, గ్రామ సచివాలయం, ఉపాద్యాయులు మరియు ఇతర ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయబడుతుంది. ప్రతి పోటి పరీక్షలలో కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. రాష్ట్ర స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలకు ఎక్కువగా ఆ రాష్ట్రము లో జరిగే అంశాలనుండి ప్రశ్నలు వస్తాయి. కాబట్టి, ప్రభుత్వ పరీక్షలకు ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు అభ్యర్థులు దానిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ ప్రిపరేషన్‌ను పూర్తి చేయడానికి, మేము మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కరెంట్ అఫైర్స్‌ను డిసెంబర్ 2023 తెలుగులో అందిస్తున్నాము.
APPSC/TSPSC Sure shot Selection Group
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కరెంట్ అఫైర్స్ తెలుగులో
1. విజయనగరం జిల్లాలో 25 PHCలు NAQS గుర్తింపు పొందాయి
విజయనగరం జిల్లా నుండి 25 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHCలు) కేంద్ర ప్రభుత్వంచే గుర్తించబడ్డాయి మరియు మంచి ఆరోగ్య సౌకర్యాలను సృష్టించడం మరియు వాటి పరిధిలో సేవలను అందించడం కోసం నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ (NQAS) ధృవీకరణను పొందాయి. NQAS గుర్తింపు అనేది ఆరోగ్య సంరక్షణ డెలివరీ, రోగి భద్రతలో వారి శ్రేష్ఠతకు గుర్తింపు. కేంద్ర ప్రభుత్వం ఒక్కో PHCకి ఏడాదికి రూ.లక్ష చొప్పున మూడేళ్లపాటు అందజేస్తుంది. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌వో) డాక్టర్ ఎన్.భాస్కరరావు మాట్లాడుతూ. ఇతర రాష్ర్టాలకు చెందిన ఇద్దరు అధికారులు, మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరికొందరు అధికారులు ఒక్కో పీహెచ్‌సీలో సేవలు, సౌకర్యాలను అంచనా వేస్తారని తెలిపారు. వారి నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ధ్రువీకరణ కోసం PHCలను ఎంపిక చేస్తుంది.
2. విశాఖపట్నంలో తూర్పు నౌకాదల కమాండ్లో రూ.2192 కోట్లకు పైగా వ్యయంతో 37 ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి
విశాఖపట్నంలో 37 ప్రాజెక్టులు మొత్తం రూ. 2192 కోట్ల వ్యయంతో తూర్పు నౌకాదళ కమాండ్ (ENC) దాని సాంకేతిక మౌలిక సదుపాయాలను మెరుగుపరచుకుంటోంది. ఈ ప్రాజెక్టులు నౌకాదళ స్థావరం యొక్క సామర్థ్యాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ENC యొక్క ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్, నేవీ డే వేడుకల్లో భాగంగా భారత నావికాదళం యొక్క పోరాట సామర్థ్యాలను ప్రదర్శించే కార్యాచరణ డెమో కోసం ప్రణాళికలను ప్రకటించారు. ప్రతికూల వాతావరణం కారణంగా, ఈవెంట్ డిసెంబర్ 10కి వాయిదా వేశారు.
3. సెర్ప్ మరియు ఏపీ ప్రభుత్వం ఉన్నతి పథకం కింద 660 ఆటోలను పంపిణీ చేయనున్నారు
ఆంధ్రప్రదేశ్‌లో, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ద్వారా నిర్వహించబడుతున్న ప్రభుత్వ ‘ఉన్నతి’ కార్యక్రమం అట్టడుగు వర్గాలకు, ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాల (SC) మరియు షెడ్యూల్డ్ తెగల (ST) మహిళలకు సాధికారత కల్పిస్తోంది. ఈ చొరవ ద్వారా, 660 ఆటో-రిక్షాలు SC మరియు ST మహిళలకు స్థిరమైన జీవనోపాధి అవకాశాలను అందించే సాధనంగా నిలవనుంది. ప్రారంభ దశలో, 231 ఆటో-రిక్షాలు ఇప్పటికే పంపిణీ చేశారు, మిగిలిన 429 ఏప్రిల్ 14, 2024 నాటికి అందించనున్నారు.
4. స్వావలంబన్ కార్యక్రమం కోసం IIM విశాఖపట్నం SIDBIతో MOU కుదుర్చుకుంది
SIDBI యొక్క “మిషన్ స్వభలంబన్” కార్యక్రమంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ విశాఖపట్నం (IIMV) మరియు స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI) అవగాహన ఒప్పందాన్ని (MOU) చేసుకున్నాయి. ఈ ఒప్పందం ద్వారా STEM అనే కార్యక్రమం అమలుకి ఈ MOU ఉపయోగపడుతుంది. STEM లేదా స్కిల్ టు ఎంటర్‌ప్రైజ్ మోడల్ ద్వారా యువతకు వారి వ్యవస్థాపక ప్రయత్నాల సాధనలో అవగాహన కల్పించడం మరియు మద్దతు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఈ అవగాహన ఒప్పందంలో భాగంగా, IIM విశాఖపట్నం, వ్యవస్థాపకులు కావాలనుకునే వ్యక్తులకు కస్టమైజ్డ్ మరియు స్పెషలైజ్డ్ PG సర్టిఫికేట్ కోర్సు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో స్కిల్ టు ఎంటర్‌ప్రైజ్ మోడల్ (STEM) ప్రోగ్రామ్‌ను అందిస్తుంది.
5. ఏపీలో 4 స్మార్ట్ సిటీల కోసం కేంద్రం రూ.6,865 కోట్లు కేటాయించింది
పార్లమెంటులోఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపికైన తిరుపతి, కాకినాడ, విశాఖపట్నం, అమరావతి నగరాలను స్మార్ట్ సిటీల అభివృద్ధిలో భాగం కోసం ఇప్పటికే రూ.6865 కోట్లు కేటాయించినట్టు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ వెల్లడించారు. ఈ మొత్తం లో ఇప్పటివారు రూ.4742.43 కోట్ల పనులు పూర్తయ్యాయి మరియు రూ.2,122.98 కోట్లపనులు వివిధ దశలలో ఉన్నాయి అని తెలిపారు.
6. CGWB నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భూగర్బ జలాల పరిరక్షణ లో ముందు నిలిచింది
ఈ సంవత్సరం రాష్ట్రం లో వర్షాభావ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా రాష్ట్రం లో భూగర్భజలాలు మెరుగైన స్థితిలో ఉన్నాయి అని కేంద్ర భూగర్భ జలవనరుల మండలి నివేదిక తెలిపింది. భూగర్భ జలాల పరిరక్షణ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరుసగా రెండవ సంవత్సరం కూడా మొదటి స్థానం లో నిలిచింది. CGWB నివేదికలో ముఖ్యాంశాలు:
- CGWB నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 6553 మండలాలలో 667 మండలాలలో అధ్యయనం చేసింది. దేశంలో 2 నుంచి 5 మీటర్లలో నీరు లభించే ప్రాంతాలలో ఆంధ్రప్రదేశ్, అసోం, UP (ఉత్తర ప్రాంతం), బీహార్ (ఉత్తర ప్రాంతం) నిలిచాయి. 20-40 మీటర్లకి పడిపోయిన రాష్ట్రాలలో రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, పంజాబ్ ఉన్నాయి.
- భారతదేశంలో భూగర్భ జలాలు సురక్షితంగా ఉన్న మండలాలు 4,793 (73.1%) అలాగే ఆందోళనకరంగా ఉన్న ప్రాంతాలు 736(11.2%)గా ఉన్నాయి.
- భారతదేశంలో కొంతమేర సమస్యాత్మకంగా ఉన్న మండలాలు 698 (10.7%). సమస్యాత్మకంగా ఉన్న మండలాలు 199 (3%)గా ఉన్నాయి.
- భారతదేశంలో ఉప్పునీళ్లుగా మారిన మండలాలు 127(1.9%), అదే రాష్ట్రంలో 39 (5.85%)మండలాలు ఉన్నాయి.
- రాష్ట్రంలో సురక్షితంగా ఉన్న మండలాలు 597(89.5%), ఆందోళనకరంగా ఉన్న మండలాలు 10(1.5%), సమస్యాత్మకంగా ఉన్నవి 3(0.45), ఉప్పునీళ్లుగా మారినవి 39(5.85%).
- రాష్ట్రంలో భూగర్భజలాలు ఆందోళనకరంగా ఉన్న మండలాలు వెల్దుర్తి (పల్నాడు), రణస్థలం(శ్రీకాకుళం), పులివెందుల(వైఎస్ఆర్), రాచర్ల, పెద్దారవీడు, కంభం (ప్రకాశం), తనకళ్ళు, హిందూపురం, రోళ్ళ, గాండ్లపెంట (సత్యసాయి).
- రాష్ట్రంలో ఈ ఏడాది 835.03కి గాను 714.88 మీటర్లు వర్షపాతం నమోదైంది అని తెలిపింది.
APPSC Group 2 Prelims Free Live Batch
7. ఒక హెక్టారుకు ధాన్యం దిగుబడిలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది: నాబార్డ్ నివేదిక
తాజాగా నాబార్డు 2022-2023కి దేశంలోని వివిధ రాష్ట్రాలలో హెక్టారుకు ధాన్యం దిగుబడి పై ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక లో పంజాబ్ మొదటి స్థానంలో నిలవగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండవ స్థానంలో నిలిచింది. పంజాబ్ లో హెక్టారు కు 4,193కిలోలు పంట రాగా ఆంధ్రప్రదేశ్ లో 3,730.40 కిలోలు పంట వచ్చింది. తమిళనాడు 3,500.40కిలోలతో మూడవ స్థానం, తెలంగాణ 3405.60తో నాలుగోవ స్థానం లో నిలిచాయి. దేశం మొత్తం మీద చూసుకుంటే ఒక హెక్టారు కి 2838.17 కిలోల ధాన్యం దిగుబడి లభించింది అని నివేదికలో తెలిపింది.
8. ఏపీ సీఎం పలాస లో వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టు మరియు వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ను ప్రారంభించారు
శ్రీకాకుళం జిల్లా మకారాంపురంలో కిడ్నీ బాధితుల సమస్యలని తీర్చడానికి 700 కోట్లతో వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టుని సీఎం జగన్ ప్రారంభించారు దానితో పాటు పలాసలో వైఎస్ఆర్ కిడ్నీ రిసెర్చ్ సెంటర్, 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ప్రారంభించారు. ఈ చర్యతో శ్రీకాకుళం జిల్లా లో కిడ్నీవ్యాధుల బారిన పడ్డవారికి మెరుగైన వైద్యంతో పాటు కిడ్నీ సమస్యలు తలెత్తకుండా తాగునీరు కూడా అందుతుంది.
దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు ప్రబలుతున్న ఉద్దానం ప్రాంతంలోని ఏడు మండలాల పరిధిలోని 807 గ్రామాలకు శుద్ధి చేసిన తాగునీటిని శ్రీకాకుళం ప్రజల చిరకాల వాంఛను వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టు నెరవేరుస్తోంది అని తెలిపారు మరియు ఫేజ్ 2 కింద ఈ పద్ధకాన్ని 265కోట్లతో పాతపట్నం నియోజికవర్గంలో 448 గ్రామాలకు కూడా అందించే ఏర్పాట్లు చేయనున్నారు.
9. AP కేబినెట్ జనవరి నుండి ఆరోగ్యశ్రీ మరియు పెన్షన్ మొత్తాన్ని పెంచనుంది
వైఎస్‌ఆర్ ఆసరా, చేయూత పథకాల అమలుకు మరియు జనవరి నుంచి వృద్ధాప్య సామాజిక భద్రత పింఛన్‌లను రూ.2,750 నుంచి రూ.3,000కు పెంచేందుకు రాష్ట్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య చికిత్స పరిమితిని రూ. 25 లక్షలకు పెంచనుంది అదికూడా వార్షిక ఆదాయం రూ.5 లక్షలు ఉన్న వారందరికీ ఇది వర్తిస్తుంది. ఈ చర్యతో దాదాపు 90శాతం కుటుంబాలకు ఖరీదైన వైద్యం అందనుంది. ఈ పధకంలో భాగంగా కొత్త ఆరోగ్యశ్రీ కార్డులను 18వ తేదీన జగన్ మోహన్ రెడ్డి లబ్ది దారులకు అందజేయనున్నారు. ఆరోగ్యశ్రీ పథకానికి ఏడాదికి రూ.4,400 కోట్లు కేటాయించారు 3,257 జబ్బులకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యం అందించనున్నారు.
10. ICAR బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు 2023 ని దక్కించుకున్న SVVU
భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ICAR) శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న గుంటూరు లోని లాం పరిశోధనా కేంద్రానికి బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు 2023 అందజేసింది. ఈ ఏడాది ఒంగోలు జాతిని పశువులను కాపాడుతున్న లాం పరిశోధన కేంద్రానికి దక్కింది. కిసాన్ దివస్ రోజున హరియానా లో కర్నల్ ళక్ష కార్యక్రమం లో ఈ అవార్డుని అందజేస్తారు. గత సంవత్సరం పుంగనూరు పశువులను పరిరక్షించేందుకు పలమనేరులోని పుంగనూరు పరిశోధన కేంద్రానికి ఈ అవార్డు దక్కింది.
2019 లో IVF- ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ (IVF&ET) పధకం ద్వారా 2.39 కోట్లతో ఒంగోలు జాతి పశువుల అభివృద్ధి కోసం కేటాయించారు. 1926 లో లాం పరిశోధన కేంద్రం ఏర్పాటైంది, మరియు 1972 నుంచి ఒంగోలు జాతి పరిరక్షణ కోసం కృషి చేస్తోంది. గత నాలుగున్నర సంవత్సరాలుగా IVF, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ ద్వారా మేలు జాతి ఒంగోలు ఆవులను అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటివరకు 450 ఒంగోలు పశుసంపద కలిగి ఉంది.
11. ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో పలువురు కలెక్టర్లు బదిలీ
- శుభం బన్సాల్ (రంపచోడవరం) జాయింట్ కలెక్టర్ తిరుపతి జిల్లా కి బదిలీ అయ్యారు
- శోభిక (కందుకూరు) ప్రత్యేక అధికారి మధ్యాహ్న భోజనం
- గీతాంజలి శర్మ (తెనాలి) సచివాలయాల అదనపు డైరెక్టర్
- అభిషేక్ కుమార్ (అదోని) జాయింట్ కలెక్టర్ సత్యసాయి జిల్లా
- కొల్లాబత్తుల కార్తీక్ (పెనుగొండ) జాయింట్ కలెక్టర్ అల్లూరిసీతారామరాజు జిల్లా
- సేదు మాధవన్ (మార్కాపురం) CEO ఎంఎస్ఎంఈ కార్పొరేషన్
12. ప్రఖ్యాత రచయిత మరియు పర్యావరణవేత్త డా. తల్లావఝుల పతంజలి శాస్త్రి సాహిత్య అకాడమీ-2023 అందుకున్నారు
రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ రచయిత, పర్యావరణవేత్త డాక్టర్ తాళ్లవజ్జుల పతంజలి శాస్త్రి కేంద్ర సాహిత్య అకాడమీ-2023 జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. చిన్న కధల విభాగంలో ఆయనకు ఈ అవార్డు లభించింది. ఈయన రచించిన రామేశ్వరం కాకులు కి ఈ సాహిత్య అవార్డు లభించింది. 2024 మార్చి 12న న్యూఢిల్లీలోని కోపర్నికస్ మార్గ్లోని కమానీ ఆడిటోరియంలో ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డు కింద తామ్ర పతకం, లక్ష నగదు పురస్కారాన్ని అందజేస్తారు.
పతంజలి శాస్త్రికి 9 కవితా సంకలనాలు, 6 నవలలు, 5 చిన్న కథలు, మూడు వ్యాసాలు, ఒక సాహిత్య అధ్యయనం అవార్డు లభించాయి. ఆంధ్రప్రదేశ్ మడ అడవుల పరిరక్షణ కోసం ఈయన ఎంతో శ్రమించారు జనవరి 2017 నుంచి డిసెంబర్ 2021 మధ్య ప్రచురితమైన పుస్తకాలను ఈ అవార్డుకు ఎంపిక చేయడానికి పరిగణనలోకి తీసుకున్నారు, ఈ ఏడాది సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన 24 మందిలో పతంజలి శాస్త్రి ఒక్కరే తెలుగువారు.
13. భోగాపురం విమానాశ్రయం లో NIIF 675 కోట్లు పెట్టుబడి పెట్టనుంది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో భోగాపురంలో ఏర్పాటవ్వనున్న విమానాశ్రయ నిర్మాణానికి నేషనల్ ఇన్వెస్ట్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (NIIF) రూ.675కోట్లను పెట్టుబడి పెట్టనుంది. (GVAIL) జిఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఈ పెట్టుబడి ని పెట్టేందుకు GVAL మరియు NIIF మధ్య ఈ పెట్టుబడి మొత్తాని కంపల్సరీ కన్వర్టిబల్ డెబెంచర్స్ రూపంలో పెట్టింది. జిఎంఆర్ విశాఖపట్నం విమానాశ్రయం ప్రాజెక్టుని డిజైన్, నిర్మాణం, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ ప్రాతిపాదికన 40 సంవత్సరాలకు లీజు ని 2020 లో GVAL దక్కించుకుంది. ఈ నిర్మాణం పూర్తి అయితే ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద విమానాశ్రయంగా నిలుస్తుంది.
14. ఏపీ సీఎం జగన్ ఎన్‌ఆర్‌టీఎస్‌కు బీమా పథకాన్ని ప్రకటించారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విదేశాలలో ఉండే ప్రవాసాంద్రులకి రాయిటీతో బీమా సదుపాయం కల్పించింది. ఏపిఎన్‌ఆర్‌టీఎస్, ఆంధ్రప్రదేశ్ నుంచి విదేశాలకి వెళ్ళే ఉద్యోగులు, వలస కార్మికులకు 50% సబ్సిడీతో బీమా కల్పించనుంది. మరియు విధ్యార్ధులకు పూర్తి ఉచితంగా మొదటి 3 సంవత్సరాలకు బీమా అందించనుంది. ఉద్యోగులు, వలస కార్మికులు 3సంవత్సరాలకి 550 రూపాయలు మరియు విధ్యార్ధులు సంవత్సరానికి 180 రూపాయలు చెల్లించాలి కానీ ప్రభుత్వం విధ్యార్ధులకి పూర్తి రాయితీ మరియు ఇతరులకి 50% సబ్సిడీ అందించనుంది. న్యూ ఇండియా అష్యూరెన్స్ తో ఈ పధకాన్ని అందించనున్నారు. అర్హులందరు 26 డిసెంబర్ నుంచి 15 జనవరి 2024 లోగా నమోదుచేసుకోవాలి.
15. అచ్యుతాపురం సెజ్ లో 5 ఎంఎల్ డీ సీఈటీపీకి APIIC నిర్మించనుంది
విశాఖపట్నం- చెన్నై కారిడార్ లో ఉన్న అచ్యుతాపురం SEZ లో (APIIC) ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ పారిశ్రామిక వ్యర్ధాల శుద్ధికి 5 ఎంఎల్ డి కామన్ ఇఫ్లూయంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ (CETP)ను ఏర్పాటు చేయనుంది. 540 కోట్లతో 34 ఎకరాల విస్తీర్ణం లో ఈ యూనిట్ ను ఏర్పాటు చేయనున్నారు. DBFTO డిజైన్, బిల్ట్, ఫైనాన్స్, ట్రాన్స్ఫర్, ఆపరేట్ విధానంలో దీని అభివృద్ది చేస్తున్నారు. ఈ ప్లాంట్ ప్రధానంగా అనకాపల్లి జిల్లా SEZ లో ఉన్న ఫార్మా, రసాయనాల యూనిట్ల నంచి విడుదలఎఎ వ్యర్ధ జలాలను శుద్ధి చేయనుంది. ఇప్పటికే 1.5MLD సమర్ధ్యాన్ని 2 MLD కి పెంచానున్నారు మరియు 3 MLD ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నారు. ADB రుణంతో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేస్తారు
16. వైఎస్సార్ జిల్లా రైతు కె.విజయ్ కుమార్ కు సృష్టి సమ్మాన్ అవార్డు-2023
అహ్మదాబాద్ లో జరుగుతున్న సాత్విక్ సంప్రదాయ ఆహారోత్సవం-2023 కార్యక్రమం లో భాగంగా అందించే సృష్టి సమ్మాన్ పురస్కారం ఐఐఎం అహ్మదాబాద్ మాజీ ప్రొఫెసర్ అనిల్ గుప్తా చేతులు మీద వైఎస్ఆర్ జిల్లా కి చెందిన సేంద్రీయ రైతు శాస్త్రవేత్త కొమ్మూరి విజయకుమార్ కు సృష్టి సమ్మాన్ – 2023 పురస్కారం లభించింది. విజయ్ కుమార్ సేంద్రీయ పద్దతిలో చిరు ధాన్యాల సాగు పై విశేష కృషి చేశారు. ఈ పురస్కారం మార్ జీవవైవిధ్యం విభాగంలో లభించింది. ప్రొ. అనిల్ కె గుప్తా నెలకొల్పిన సొసైటి ఫర్ రిసెర్చ్ అండ్ ఇనిషియేటివ్స్ ఫర్ సస్టైనబుల్ టెక్నాలజీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ (సృష్టి), 1995 నుంచి ప్రతి సంవత్సరం గ్రామీణ రైతు శాస్త్రవేత్తలు, జీవవైవిధ్యం, పర్యావరణ పరిరక్షణకు విశేష కృషి చేస్తున్న సంస్థలు, వ్యక్తులకు ఈ సృష్టి సమ్మాన్ అవార్డులు అందిస్తున్నారు.
17. జేసీఐ ‘ఔట్ స్టాండింగ్ బిజినెస్ ఎంటర్ ప్రెన్యూర్’ అవార్డు అందుకున్న సిద్ధా సుధీర్
జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ప్రతి సంవత్సరం సభ్యుల నుండి నామినేట్ చేయబడిన వ్యక్తులకు మూడు ఉత్తమ వ్యాపారవేత్తలు / పారిశ్రామికవేత్త / ప్రొఫెషనల్ అవార్డులను అందిస్తుంది. ఈ సంవత్సరం బెంగళూరులో బుధవారం జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్ణాటక రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ ఎస్ లాడ్ హాజరయ్యారు మరియు ప్రముఖ పారిశ్రామికవేత్త, వైఎస్సార్సీపీ నేత, టీటీడీ బోర్డు సభ్యుడు సిద్ధా సుధీర్ జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ నేషనల్ లెవల్ ఔట్ స్టాండింగ్ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డు తన బాధ్యతను పెంచిందని, జేసీఐ నెట్ వర్క్ కు తన సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు.
18. ఆంధ్రప్రదేశ్ లో 8.13 శాతం తగ్గిన నేరాల రేటు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి 2022, 2021 సంవత్సరాలతో పోలిస్తే 2023లో రాష్ట్రంలో నేరాలు తగ్గాయని, రాష్ట్రంలో నేరాలను అరికట్టడానికి పోలీసు శాఖ చేపట్టిన విజిబుల్ పోలీసింగ్, అవగాహన కార్యక్రమాలు సత్ఫలితాలనిచ్చింది అని తెలిపారు. గురువారం రాష్ట్ర పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ రాష్ట్రంలో 2022లో 1,75,612 కేసులు నమోదు కాగా, 2023లో 1,61,334 నేరాలు నమోదయ్యాయి మరియు ఏడాదిలో 8.13 శాతం నేరాల రేటు తగ్గింది.
విభాగాల వారీగా ఉన్న వివరాలలో హత్యలు, హత్యాయత్నం కేసులు 10 శాతం, దోపిడీలు 28.57 శాతం, దొంగతనాలు 37.24 శాతం, పగటి దొంగతనాలు 13.41 శాతం, రాత్రి దొంగత నాలు 13.54 శాతం, రోడ్డు ప్రమాదాలు 7.83 శాతం, ఎస్సీ, ఎస్టీలపై నేరాలు 15.20 శాతం, సైబర్ నేరాలు 25.52 శాతం తగ్గాయని తెలిపారు.
19. SPMVV EUSAIతో ఒప్పందంపై సంతకం చేసింది
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |