Telugu govt jobs   »   Current Affairs   »   Andhra Pradesh State Current affairs In...
Top Performing

Andhra Pradesh State Current affairs In Telugu July 2022 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కరెంట్ అఫైర్స్ జూలై 2022 తెలుగులో

Andhra Pradesh State Current affairs In Telugu July 2022: Andhra Pradesh state current affairs plays crucial role in GROUP-1, GROUP-2, Panchayat Secretary, GROUP-4 , Assistant Engineer(AE), Sub-Inspector and Constable, Junior Lecturers etc., exams.. Andhra Pradesh Government releases notification for Various posts through Andhra Pradesh like GROUP-1, GROUP-2, Panchayat Secretary, GROUP-4 , Assistant Engineer(AE), Sub-Inspector and Constable, Junior Lecturers, Degree Lecturers and various executive and non-executive posts under various departments of Telangana. Current affairs play a very important role in the competitive examinations and hence, aspirants have to give undivided attention to it while doing preparation for the government examinations. To complement your preparation, we are providing you the Andhra Pradesh State Current affairs In Telugu July 2022.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కరెంట్ అఫైర్స్ జూలై 2022 తెలుగులో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కరెంట్ అఫైర్స్ GROUP-1, GROUP-2, పంచాయితీ సెక్రటరీ, GROUP-4, అసిస్టెంట్ ఇంజనీర్(AE), సబ్-ఇన్‌స్పెక్టర్ మరియు కానిస్టేబుల్, జూనియర్ లెక్చరర్స్ మొదలైన పరీక్షలలో కీలక పాత్ర పోషిస్తుంది.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. APPSC  ద్వారా GROUP-1, GROUP-2, పంచాయితీ సెక్రటరీ, GROUP-4, అసిస్టెంట్ ఇంజనీర్ (AE), సబ్-ఇన్‌స్పెక్టర్ మరియు కానిస్టేబుల్, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లు మరియు వివిధ ఎగ్జిక్యూటివ్ మరియు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు తెలంగాణలోని వివిధ విభాగాల క్రింద. కరెంట్ అఫైర్స్ పోటీ పరీక్షల్లో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. కాబట్టి, ప్రభుత్వ పరీక్షలకు ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు అభ్యర్థులు దానిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ ప్రిపరేషన్‌ను పూర్తి చేయడానికి, మేము మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కరెంట్ అఫైర్స్‌ను జూలై 2022 తెలుగులో అందిస్తున్నాము.

Andhra Pradesh State Current affairs In Telugu July 2022_3.1

APPSC/TSPSC Sure shot Selection Group

Andhra Pradesh State Current affairs In Telugu | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కరెంట్ అఫైర్స్ తెలుగులో

1. భీమవరంలో 30 అడుగుల అల్లూరి విగ్రహం ఆవిష్కరణ

 

30-FEET-Alluri sitaramaraju
30-FEET-Alluri sitaramaraju

బ్రిటిష్‌ పాలకుల్ని గడగడలాడించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు దేశంలోని కోట్లాది ఆదివాసీల ధైర్యానికి, స్థైర్యానికి, సంస్కృతికి ప్రతీక అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ‘దమ్ముంటే నన్ను ఆపండి’ అని గర్జించి బ్రిటిష్‌ సైనికుల తుపాకులకు ఎదురొడ్డిన ఆ మహావీరుడి ధైర్యసాహసాలే స్ఫూర్తిగా, ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లపై 130 కోట్ల మంది ప్రజలు ఐకమత్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా, అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన ఉత్సవాల్లో ప్రధాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

2. టెలీమెడిసిన్‌ సేవల్లో ఏపీ రికార్డు

TELEMEDICINE
TELEMEDICINE

 

టెలీమెడిసిన్‌ సేవల్లో ఏపీ ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించింది. దేశంలోనే ఒక్కరోజులో లక్ష కన్సల్టేషన్ల మైలురాయిని దాటిన తొలి రాష్ట్రంగా ఘనత సాధించింది. దేశవ్యాప్తంగా  2,04,858 కన్సల్టేషన్లు నమోదవగా ఇందులో 48.89 శాతం అంటే 1,00,159 కన్సల్టేషన్లు ఏపీలోనే నమోదయ్యాయి. తమిళనాడు నుంచి 34వేలు, కర్ణాటకలో 15వేలు, తెలంగాణలో 5,574, కేరళలో 543 చొప్పున నమోదయ్యాయి.

వైద్య సేవలను ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ–సంజీవని టెలీమెడిసిన్‌ సేవలను 2019 నవంబర్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించాయి. ప్రజారోగ్యంపట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన సీఎం వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ఈ కార్యక్రమం అమలులో తొలినుంచీ దూకుడుగా ముందుకెళ్తోంది. చిత్తశుద్ధితో కార్యక్రమాన్ని అమలుచేస్తూ ప్రజలకు వైద్య సేవలను మరింత అందుబాటులోకి తీసుకెళ్తోంది.

 3. రూ.931.02 కోట్లతో జగనన్న విద్యాకానుక

Vidya-Kanuka
Vidya-Kanuka

 

వేసవి సెలవుల అనంతరం 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి స్కూళ్లు ప్రారంభమైన తొలిరోజు జూలై 5న సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా వరుసగా మూడో ఏడాది కూడా జగనన్న విద్యాకానుక (జేవీకే) స్టూడెంట్‌ కిట్లను పంపిణీ చేసింది. కర్నూలు జిల్లా ఆదోనిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వీటి పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఒకటి నుంచి పదవ తరగతి వరకు చదువుతున్న 47,40,421 మంది విద్యార్థులకు ఇవి అందనున్నాయి. ఇందుకోసం రూ.931.02 కోట్లను ప్రభుత్వం వ్యయం చేస్తోంది.

విద్యపై పెట్టే వ్యయం విద్యార్థుల భవిష్యత్తుకు పెట్టుబడి అనే మహోన్నత ఆశయంతో సీఎం జగన్‌ ఏటా విద్యారంగానికి బడ్జెట్‌లో రూ.వేల కోట్లు కేటాయిస్తున్నారు. విద్యార్థుల అభ్యసనానికి అవసరమైన అన్ని వనరులను ప్రభుత్వం సమకూరుస్తోంది. ఇందులో భాగంగా జగనన్న విద్యాకానుక కింద బడులు తెరిచిన తొలిరోజే ప్రతి విద్యార్థికీ ఉచితంగా 3 జతల యూనిఫాం క్లాత్‌ (కుట్టుకూలితో సహా), ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగు, బై లింగ్యువల్‌ (తెలుగు, ఇంగ్లీష్‌ భాషల్లో ఉండే) పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, వర్క్‌బుక్స్‌తో పాటు అదనంగా ఆక్స్‌ఫర్డ్‌ ఇంగ్లీషు–తెలుగు డిక్షనరీని ప్రభుత్వం అందిస్తుంది. గతంలో అందుకోని వారు, ప్రస్తుతం కొత్తగా చేరిన వారికి మాత్రమే ఈ డిక్షనరీలను ఇస్తారు. బోధనా కార్యక్రమాలకు ఇబ్బంది కలగకుండా ఈ నెల 5 నుంచి నెలాఖరు వరకు కిట్లను అందజేస్తారు.

4. మిస్‌ ఉత్తరాంధ్ర 2022  నిధి చౌదరి

Miss-Uttarandhra-2022
Miss-Uttarandhra-2022

 

మిస్‌ అండ్‌ మిసెస్‌ ఉత్తరాంధ్ర–2022 గ్రాండ్‌ ఫైనల్స్‌ ఆదివారం ఘనంగా జరిగాయి. న్యూ హోప్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు నాగమల్లేశ్వరి ఆధ్వర్యంలో నగరంలోని ఒక హోటల్‌లో నిర్వహించిన ఈ వేడుకల్లో యువతలు, మహిళలు తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు.

సంప్రదాయ వస్త్రాలు ధరించి, క్యాట్‌ వాక్‌ చేస్తూ అదరహో అనిపించారు. ఫైనల్స్‌లో 20 మంది పాల్గొనగా మిస్‌ ఉత్తరాంధ్రగా నిధి చౌదరి, మిసెస్‌ ఉత్తరాంధ్రగా భాగ్యలక్ష్మి నిలిచారు. విజేతలకు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ తోట నగేష్‌ బహుమతులు అందజేశారు.

5. ఏయూలో అల్లూరి అధ్యయన కేంద్రం

Alluri_AU_Campus
Alluri_AU_Campus

 

అల్లూరి సీతారామరాజుకు ఉమ్మడి విశాఖ జిల్లాకు విడదీయలేని అనుబంధం ఉంది. ఆయన ఆలోచనలు, ఆకాంక్షలు, ఆశయాలను ముందుకు నడిపించే విధంగా ఆంధ్రవిశ్వవిద్యాలయంలో అల్లూరి సీతారామరాజు చరిత్ర– ఆదివాసీ అధ్యయన కేంద్రం పనిచేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా సేవలందిస్తోంది.

6. రీసెర్చ్‌ కారిడార్‌గా తిరుపతి

 

DRDO- TIrupati
DRDO- TIrupati

కేంద్ర పరిశోధన సంస్థలతో పాటు దేశంలో ఏ నగరంలోనూ లేని విధంగా తొమ్మిది యూనివర్సిటీలున్న తిరుపతిని రీసెర్చ్‌ కారిడార్‌గా తీర్చిదిద్దుతామని భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) చైర్మన్, కేంద్ర ప్రభుత్వ రక్షణ పరిశోధన కార్యదర్శి డాక్టర్‌ సతీష్‌రెడ్డి తెలిపారు. యువ శాస్త్రవేత్తలు, రీసెర్చ్‌ స్కాలర్లు, విద్యా సంస్థలు నూతన శాస్త్ర, సాంకేతిక ఆవిష్కరణలతో ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

తిరుపతిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఫౌండేషన్‌(ఐఎస్‌టీఎఫ్‌)ను శనివారం ఆయన ప్రారంభించి, లోగోను ఆవిష్కరించారు. పలు కాలేజీలు, యూనివర్సిటీలను నాలెడ్జ్‌ పాట్నర్స్‌గా చేసుకుని వారికి సర్టిఫికెట్లు అందించారు.

 

7. ఏపీ: భారతి సిమెంట్‌ సంస్థకు 5 స్టార్‌ రేటింగ్‌

Bharati_Cement
Bharati_Cement

 

ఆంధ్రప్రదేశ్‌ నుంచి భారతి సిమెంట్‌ సంస్థకు మరో గౌరవం దక్కింది. తాజాగా ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ జాతీయ అవార్డు ప్రకటించింది కేంద్రం. గనుల నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలు పాటించినందుకు గానూ భారతి సిమెంట్‌కు ఈ అవార్డును అందజేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. 2021-22 గనుల నిర్వహణలో 5 స్టార్‌ రేటింగ్‌ను ఇచ్చింది కేంద్రం. ఈ ఏడాది వెయ్యికి పైగా గనులు పోటీ పడగా అందులో ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ దక్కించుకున్నవి కేవలం 40 మాత్రమే కావడం విశేషం.

8. నెల్లూరులో గ్యాస్‌ పరిశ్రమ ఏర్పాటు పనులు ప్రారంభం

Gas Industry in Nellore
Gas Industry in Nellore

 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇంటింటికీ పైప్‌లైన్‌ గ్యాస్‌ అందించేందుకు అనుమతులు పొందిన ఏజీ అండ్‌ పీ గ్యాస్‌ పరిశ్రమ పనులు షురూ చేసింది. రాష్ట్రంలోని నెల్లూరు, చిత్తూరు, తిరుపతి పట్టణాల్లో ఇంటింటికీ గ్యాస్‌ కనెక్షన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

9. ఏపీకి ఉత్తమ ప్రింట్‌ ప్రమోషనల్‌ మెటీరియల్‌ అవార్డు

పర్యాటక రంగంలో రాష్ట్రానికి ఉత్తమ ప్రింట్‌ ప్రమోషనల్‌ మెటీరియల్‌ అవార్డు లభించిందని రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) తెలిపింది. జులై 5, 6 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించిన ‘ట్రావెల్‌ టూరిజం ఫెయిర్‌’లో ప్రింట్‌ ప్రమోషనల్‌ మెటీరియల్‌ విభాగంలో రాష్ట్రానికి అవార్డు లభించినట్లు ఏపీటీడీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కన్నబాబు వెల్లడించారు.

Also Read: TS State Current Affairs in Telugu

10. ఆంధ్ర రాష్ట్ర హైకోర్టుకు ఏడుగురు కొత్త న్యాయమూర్తులు

AP High Court Judges
AP High Court Judges

 

 

సుప్రీంకోర్టు కొలీజియం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు ఏడుగురు కొత్త న్యాయమూర్తుల పేర్లను ప్రతిపాదించింది. ప్రస్తుతం వివిధ కోర్టుల్లో న్యాయాధికారులుగా పని చేస్తున్న వీరికి హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలో సమావేశమైన కొలీజియం నిర్ణయించి కేంద్రానికి సిఫార్సు చేసింది. వీరిలో అడుసుమల్లి వెంకట రవీంద్రబాబు, వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్, బండారు శ్యాంసుందర్, ఊటుకూరు శ్రీనివాస్, బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి, తల్లాప్రగడ మల్లికార్జునరావు, దుప్పల వెంకటరమణ ఉన్నారు. 37 మంది న్యాయమూర్తులు ఉండాల్సిన ఏపీ హైకోర్టులో ప్రస్తుతం 24 మంది పని చేస్తున్నారు. ఇప్పటికే మహబూబ్‌ సుబానీ షేక్‌ పేరును కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. ఆయనతో పాటు, ఈ ఏడుగురి పేర్లకూ కేంద్రం ఆమోదముద్ర వేస్తే మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 32కు చేరుతుంది. గత రెండు రోజుల్లో సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని కొలీజియం అలహాబాద్‌ హైకోర్టుకు 9 మంది, కర్ణాటక హైకోర్టుకు అయిదుగురు న్యాయాధికారుల పేర్లను సిఫార్సు చేసింది.

11. ఎంఎస్‌ఎంఈలకు యూనియన్‌ బ్యాంకుతో ఏపీఐఐసీ ఒప్పందం 

APIIC
APIIC

 

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ (ఎంఎస్‌ఎంఈ)లు రుణం కోసం దరఖాస్తు చేసుకున్న 10 రోజుల్లో యూనియన్‌ బ్యాంకు ద్వారా మంజూరు చేసేలా ఆ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆంధ్ర రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (ఏపీఐఐసీ) వైస్‌ ఛైర్మన్, ఎండీ సుబ్రమణ్యం తెలిపారు. ఏపీఐఐసీ గుర్తించిన 39 పారిశ్రామిక పార్కుల్లోని ఎంఎస్‌ఎంఈలకు రుణాలు అందించడంలో బ్యాంకు భాగస్వామ్యం కానుందన్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం, యూనియన్‌ బ్యాంకు చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ బ్రహ్మానందరెడ్డి అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు.

12. ‘అమృత్‌ సరోవర్‌’లో ఏపీకి మూడో స్థానం

 

amrut sarovar
amrut sarovar

దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘అమృత్‌ సరోవర్‌’ కార్యక్రమం అమలులో ఆంధ్రప్రదేశ్‌  మూడో స్థానానికి ఎగబాకింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశంలోని ప్రతి జిల్లాలో కనీసం 75 చెరువులను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది ఏప్రిల్‌ 24న ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. కనీసం ఒక ఎకరం విస్తీర్ణంలో పది వేల క్యూబిక్‌ మీటర్ల మేర నీరు నిల్వ చేసేలా ఈ చెరువులు నిర్మించాలని నిర్ణయించింది.

నిర్దేశిత లక్ష్యం కన్నా ఎక్కువగా ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో అన్ని శాఖల ఆధ్వర్యంలో 2,890 చెరువుల నిర్మాణం, అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే 1,809 చెరువుల పనులు కూడా మొదలయ్యాయి. వచ్చే ఏడాది ఆగస్టుకు చెరువుల నిర్మాణం పూర్తిచేయాల్సి ఉంది.

13. నెలాఖరులో నింగిలోకి SSLV

SSLV
SSLV

 

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) చిన్న తరహా ఉపగ్రహాలను రోదసిలోకి పంపేందుకు రూపొందించిన స్మాల్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌(ఎస్‌ఎస్‌ఎల్‌వీ)ను ఈ నెలాఖరులో ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ1 రాకెట్‌ ద్వారా 142 కేజీల బరువు కలిగిన మైక్రోశాట్‌–2ఏ అనే ఉపగ్రహాన్ని రోదసి లోకి పంపేందుకు చర్యలు చేపట్టింది. తిరుపతి జిల్లా సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌)లోని మొదటి ప్రయోగ వేదికపై రాకెట్‌ అనుసంధానం చేసే పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

ప్రస్తుతం అంతరిక్ష ప్రయోగాలు వాణిజ్యపరంగా మారిపోవడంతో పలు దేశాలు చిన్న తరహా ఉపగ్రహాలను తక్కువ ఖర్చుతో ఇస్రో ద్వారా ప్రయోగించేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. బుల్లి ఉపగ్రహాలను తక్కువ వ్యయంతో ప్రయోగించే విషయంలో భారత్‌ ప్రపంచంలోనే నంబర్‌వన్‌ స్థానంలో ఉంది. ఇప్పటికే పీఎస్‌ఎల్‌వీ రాకెట్ల ద్వారా 34 దేశాలకు చెందిన 342 ఉపగ్రహాలను ప్రయోగించి ప్రపంచంలోనే ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. ఆ స్థానాన్ని నిలుపుకునేందుకు ఎస్‌ఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను రూపొందించింది.

ఇప్పటివరకు ఇస్రో ఎస్‌ఎల్‌వీ, ఏఎస్‌ఎల్‌వీ, పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3 అనే ఐదు రకాల రాకెట్లతో ఉపగ్రహాలను రోదసి లోకి పంపించింది. ప్రస్తుతం ఆరో రకం రాకెట్‌గా ఎస్‌ఎస్‌ఎల్‌వీని తయారు చేసింది. ఇప్పటి వరకు పీఎస్‌ఎల్‌వీని మాత్రమే వాణిజ్యపరమైన ప్రయోగాలకు ఉపయోగించారు. ఇప్పుడు ఎస్‌ఎస్‌ఎల్‌వీని కూడా అందుబాటులోకి తెస్తున్నారు.

14. సూక్ష్మ సేద్యంలో ఏపీ అగ్రగామి 

AP_Micro_Irrigation
AP_Micro_Irrigation

 

సూక్ష్మ సేద్యంలో ఆంధ్రప్రదేశ్‌ ఇతర రాష్ట్రాల కంటే ముందంజలో ఉంది. ఆ తర్వాత స్థానంలో కర్ణాటక నిలిచింది. దేశంలో వ్యవసాయ సాంకేతికతపై నాబార్డు పరిశోధన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. సూక్ష్మ సేద్యంలో తొలి ఐదు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌ రాష్ట్రాలున్నట్లు ఆ నివేదిక పేర్కొంది. అలాగే, ఏపీలోని మొత్తం సాగు విస్తీర్ణంలో 51 శాతం ఈ తరహా సేద్యమే చేస్తున్నట్లు ఆ నివేదిక తెలిపింది.

అదే కర్ణాటకలో 49 శాతం, మహారాష్ట్ర 34 శాతం, తమిళనాడులో 29 శాతం, గుజరాత్‌లో 22 శాతం సూక్ష్మ సేద్యం చేస్తున్నట్లు వెల్లడించింది. ఇక భూగర్భ జలాలు బాగా అడుగంటిన పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో సూక్ష్మ సేద్యం సాగు విస్తీర్ణం బాగా తక్కువగా ఉండటంపట్ల నివేదిక ఆశ్చర్యాన్ని వ్యక్తంచేసింది. పంజాబ్‌లో మొత్తం సాగు విస్తీర్ణంలో సూక్ష్మ సేద్యం కేవలం ఒక శాతమే ఉండగా.. దాని పొరుగు రాష్ట్రం హర్యానాలో పది శాతమే ఉంది.

15. పెట్టుబడుల వాస్తవరూపంలో ఏపీ నంబర్‌ 1

INVESTMENT_AP- NO-1
INVESTMENT_AP- NO-1

 

రాష్ట్రంలో  పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపనను ప్రోత్సహిస్తున్నారు, కొత్త పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా పరిశ్రమలు త్వరితగతిన ఉత్పత్తి ప్రారంభించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఉత్పత్తి ప్రారంభించడం ద్వారా పెట్టుబడులను వాస్తవరూపంలోకి తేవడంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దేశంలో మొదటి స్థానంలో ఉంది.

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ డిపార్టమెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ (డీపీఐఐటీ) తాజా గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు మూడు నెలల కాలంలో రాష్ట్రంలో రూ.19,409 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. ఈ పెట్టుబడులు పెట్టిన 15 పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించాయి. వీటిలో నోవా ఎయిర్, తారక్‌ టెక్స్‌టైల్స్, టీహెచ్‌కే ఇండియా, కిసాన్‌ క్రాఫ్ట్, తారకేశ్వర స్పిన్నింగ్‌ మిల్‌ వంటివి ఉన్నాయి.

 

16. ఏపీ SDPCL సీఎండీగా సంతోషరావు నియమితులయ్యారు 

 

APSDCL CMD
APSDCL CMD

ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్‌) ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా కె.సంతోషరావు బాధ్యతలు స్వీకరించారు. ఏపీ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్, విశాఖపట్నం) సీఎండీగా విధులు నిర్వహిస్తున్న ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ఇంధన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

17. ఫ్యాప్సి అధ్యక్షుడిగా కరుణేంద్ర జాస్తి ఎన్నికయ్యారు

 

PAPSI
FAPCCI

ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఫ్యాప్సి) అధ్యక్షుడిగా 2022 – 23 ఏడాదికిగాను కరుణేంద్ర ఎస్‌. జాస్తి ఎన్నికయ్యారు. 3వ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎమ్‌) ఇందుకు వేదికైంది. స్టైప్యాక్‌ వ్యవస్థాపకులైన కరుణేంద్ర విశాఖపట్నంలోని గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌లో బీఈ (మెకానికల్‌) చదివారు. కే లాజిస్టిక్స్‌లో భాగస్వామిగానూ ఉన్నారు. మాక్రో మీడియా డిజిటల్‌ ఇమేజింగ్‌తోనూ ఈయనకు అనుబంధం ఉంది. 2019 – 20లో ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీకి అధ్యక్షుడిగా సేవలందించారు.

18. కొవ్వాడ అణువిద్యుత్‌ కేంద్రానికి ఆమోదం

KOVVADA NUCLER-center
KOVVADA NUCLER-center

 

ఆంధ్రప్రదేశ్‌లోని కొవ్వాడ వద్ద అణువిద్యుత్‌ కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు ప్రధానమంత్రి కార్యాలయం సహాయమంత్రి జితేంద్ర సింగ్‌ చెప్పారు. కొవ్వాడతోపాటు మహారాష్ట్రలోని జైత్‌పూర్, గుజరాత్‌లోని ఛాయ, మిథి విర్ది, పశ్చిమ బెంగాల్‌లోని హరిపూర్, మధ్యప్రదేశ్‌లోని భీమ్‌పూర్‌లలో అణువిద్యుత్‌ కేంద్రాల ఏర్పాటుకు కూడా ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు వివరించారు.

రాజ్యసభలో  వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. కొవ్వాడలో 1,208 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఆరు అణు రియాక్టర్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దేశంలో ఏడువేల మెగావాట్ల అణువిద్యుత్‌ ఉత్పాదన కోసం కర్ణాటక, హరియాణా, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో 10 అణు రియాక్టర్లలను నెలకొల్పేందుకు ప్రభుత్వం ఆర్థిక, పాలనాపరమైన ఆమోదం ఇచ్చినట్లు తెలిపారు.  సమూహం పద్ధతిలో నెలకొల్పే ఈ పది రియాక్టర్ల నిర్మాణం 2031 నాటికి పూర్తవుతుందని చెప్పారు. వీటి నిర్మాణం పూర్తయితే అదనంగా మరో ఏడువేల మెగావాట్ల అణువిద్యుత్‌ అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

19. ఆగస్టు 15 నుంచి ‘ఫ్యామిలీ డాక్టర్‌’ ప్రారంభం 

Family Doctor Policy
Family Doctor Policy

 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఫ్యామిలీ డాక్టర్‌ విధానం అమలుకు వైద్య, ఆరోగ్య శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. ఆగస్టు 15 నుంచి ఈ విధానం అమలు చేయాలని సీఎం ఆ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో ఆగస్టు 1నుంచి రాష్ట్రవ్యాప్తంగా ట్రయల్‌ రన్‌ ప్రారంభించేందుకు కార్యాచరణ రూపొందించారు. ఈ విధానంపై ఆశా వర్కర్, ఏఎన్‌ఎం, ఎంఎల్‌హెచ్‌పీ నుంచి రాష్ట్రస్థాయి అధికారుల వరకూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 26 జిల్లాల వారీగా మాస్టర్‌ ట్రైనర్‌లను గుర్తించి, వారికి బుధవారం విజయవాడలో శిక్షణ ఇచ్చారు. వీరు జిల్లాల్లోని వైద్యులు, వైద్య సిబ్బందికి శిక్షణ ఇస్తారు.  

  •  గ్రామ సచివాలయాలు కేంద్రంగా 104 మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌ (ఎంఎంయూ)ల ద్వారా ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని ప్రజలకు చేరువ చేయనున్నారు. ప్రస్తుతం ప్రతి గ్రామ సచివాలయానికి నెలలో ఒక రోజు 104 వాహనాలు వెళుతున్నాయి. ఆ రోజు మధ్యాహ్నం వరకు 104 వైద్యుడు, సిబ్బంది ఓపీలు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత గృహాలను సందర్శించి, మంచానికి పరిమితమైన వృద్ధులు, వికలాంగులు, బాలింతలు, పిల్లలకు వైద్యం చేస్తున్నారు.
  •  ఇలా 656 ఎంఎంయూలు రాష్ట్ర వ్యాప్తంగా సేవలు అందిస్తున్నాయి. ఫ్యామిలీ డాక్టర్‌ విధానంలో అదనంగా అవసరమయ్యే 432 కొత్త 104 వాహనాలు కొనుగోలుకు వైద్య శాఖ చర్యలు తీసుకుంటోంది. 

ఫ్యామిలీ డాక్టర్‌ విధానం అంటే?

  •  సాధారణంగా ఆర్థిక స్థితి మెరుగ్గా ఉన్న కుటుంబాల వారు ఒక వైద్యుడిని ఫ్యామిలీ డాక్టర్‌గా ఎంచుకుంటారు. కుటుంబంలో ఎవరికి ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా, వెంటనే ఆ వైద్యుడిని సంప్రదిస్తారు. అతను జబ్బును గుర్తించడం, చిన్న చిన్న జబ్బులు అయితే ప్రాథమిక వైద్యం చేయడం, స్పెషలిస్ట్‌ వైద్యం అవసరం ఉంటే రెఫర్‌ చేయడం ఇలా వారి ఆరోగ్యం పట్ల వైద్యుడు నిరంతరం ఫాలోఅప్‌లో ఉంటాడు. 
  • తద్వారా ఆ కుటుంబంలోని వ్యక్తుల ఆరోగ్యంపై వైద్యుడికి సమగ్ర అవగాహన ఉంటుంది. ఆ కుటుంబానికి మెరుగైన వైద్య సంరక్షణ సమకూరుతుంది. ఇదే తరహాలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం.

20. అవినీతిపై ఫిర్యాదులకు ఏసీబీ నంబర్ 14400

ACB Number
ACB Number

 

ప్రభుత్వ సేవల్లో అవినీతికి ఏమాత్రం తావు లేకుండా కఠిన చర్యలు చేపట్టి పారదర్శకంగా వ్యవహరించాలని అధికార యంత్రాంగాన్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. సబ్‌ రిజిస్ట్రార్, ఎమ్మార్వో, ఎండీవో, ఆర్డీవో, కలెక్టర్‌ కార్యాలయాలతో పాటు అవినీతి జరగడానికి అవకాశం ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై మరింత దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. అవినీతిపై ఫిర్యాదులకు సంబంధించి ఏసీబీ నంబర్‌ 14400తో పోస్టర్‌లు ఏర్పాటు చేసి ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ స్పష్టంగా కనిపించేలా ఈ పోస్టర్‌ను ప్రదర్శించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఈ నంబర్‌ అందరికీ తెలిసేలా ప్రదర్శించాలని సూచించారు.

APPSC GROUP-1
APPSC GROUP-1

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!

Andhra Pradesh State Current affairs In Telugu July 2022_24.1