Andhra Pradesh State Current affairs In Telugu October 2022: Andhra Pradesh state current affairs plays crucial role in GROUP-1, GROUP-2, Panchayat Secretary, GROUP-4 , Assistant Engineer(AE), Sub-Inspector and Constable, Junior Lecturers etc., exams.. Andhra Pradesh Government releases notification for Various posts through Andhra Pradesh like GROUP-1, GROUP-2, Panchayat Secretary, GROUP-4 , Assistant Engineer(AE), Sub-Inspector and Constable, Junior Lecturers, Degree Lecturers and various executive and non-executive posts under various departments of Telangana. Current affairs play a very important role in the competitive examinations and hence, aspirants have to give undivided attention to it while doing preparation for the government examinations. To complement your preparation, we are providing you the Andhra Pradesh State Current affairs In Telugu October 2022.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కరెంట్ అఫైర్స్ అక్టోబర్ 2022 తెలుగులో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కరెంట్ అఫైర్స్ GROUP-1, GROUP-2, పంచాయితీ సెక్రటరీ, GROUP-4, అసిస్టెంట్ ఇంజనీర్(AE), సబ్-ఇన్‌స్పెక్టర్ మరియు కానిస్టేబుల్, జూనియర్ లెక్చరర్స్ మొదలైన పరీక్షలలో కీలక పాత్ర పోషిస్తుంది.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. APPSC ద్వారా GROUP-1, GROUP-2, పంచాయితీ సెక్రటరీ, GROUP-4, అసిస్టెంట్ ఇంజనీర్ (AE), సబ్-ఇన్‌స్పెక్టర్ మరియు కానిస్టేబుల్, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లు మరియు వివిధ ఎగ్జిక్యూటివ్ మరియు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు తెలంగాణలోని వివిధ విభాగాల క్రింద. కరెంట్ అఫైర్స్ పోటీ పరీక్షల్లో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. కాబట్టి, ప్రభుత్వ పరీక్షలకు ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు అభ్యర్థులు దానిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ ప్రిపరేషన్‌ను పూర్తి చేయడానికి, మేము మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కరెంట్ అఫైర్స్‌ను అక్టోబర్ 2022 తెలుగులో అందిస్తున్నాము.
APPSC/TSPSC Sure shot Selection Group
Andhra Pradesh State Current affairs In Telugu | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కరెంట్ అఫైర్స్ తెలుగులో
1. AP: ప్రపంచ వారసత్వ కట్టడంగా ‘ధవళేశ్వరం’
గోదావరి డెల్టాను 160 ఏళ్లుగా సస్యశ్యామలం చేస్తూ భారతదేశపు ధాన్యాగారంగా నిలిపిన ధవళేశ్వరం బ్యారేజ్ (సర్ ఆర్ధర్ కాటన్ ఆనకట్ట) మణిహారంలో మరో కలికితురాయి చేరింది. ప్రపంచ సాగునీటి వారసత్వ కట్టడంగా బ్యారేజ్‌ను ఐసీఐడీ(ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్) గుర్తించింది. ఇందుకు సంబంధించిన గుర్తింపు పత్రాన్ని ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో జరుగుతున్న ఐసీఐడీ 24వ కాంగ్రెస్‌లో అక్టోబర్ 6న ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డిలకు ఆ సంస్థ చైర్మన్ ప్రొ.ఆర్. రగబ్ రగబ్ అందజేశారు.
పక్కన గోదావరి ప్రవహిస్తున్నా సాగు, తాగునీటికి తల్లడిల్లే గోదావరి డెల్టాను సస్యశ్యామలం చేయడం.. కాకినాడ నుంచి పుదుచ్చేరికి జలరవాణా మార్గానికి కేంద్ర బిందువుగా చేసేందుకు 1857లో బ్రిటిష్ సర్కార్ ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణాన్ని ప్రారంభించి 1862లో పూర్తిచేసి కాలువల వ్యవస్థను అభివృద్ధి చేసింది. కాకినాడ కెనాల్ మీదుగా ధవళేశ్వరం బ్యారేజ్‌కు చేరి.. అక్కడి నుంచి ఏలూరు కెనాల్ మీదుగా ప్రకాశం బ్యారేజ్‌కు చేరి అక్కడి నుంచి కొమ్మమూరు, బకింగ్‌హాం కెనాల్ ద్వారా బంగాళాఖాతంలోకి చేరుకుని అక్కడి నుంచి చెన్నై, పుదుచ్చేరికి వెళ్లేలా అప్పట్లోనే జలరవాణా మార్గాన్ని అభివృద్ధి చేశారు.
దేశంలో నాలుగు కట్టడాలకు గుర్తింపు
పురాతన కాలం నుంచి ఆయకట్టుకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందిస్తున్న కట్టడాలను ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడాలుగా ఐసీఐడీ గుర్తిస్తోంది. ఈసారి అడిలైడ్‌లో జరుగుతున్న 24వ కాంగ్రెస్‌లో ప్రపంచవ్యాప్తంగా 22 ప్రాజెక్టులను గుర్తించగా.. ఇందులో దేశంలోని నాలుగు ప్రాజెక్టులకు స్థానం దక్కింది. వీటిలో ఏపీలోని ధవళేశ్వరం బ్యారేజ్, తమిళనాడులోని లోయర్ ఆనకట్ట, ఒడిశాలోని బైతరణి, రుషికుల్య ప్రాజెక్టులున్నాయి.
2. కృష్ణా నదిపై రెండంతస్తుల కేబుల్ బ్రిడ్జి
దేశంలోనే తొలిసారి రెండు అంతస్తుల కేబుల్ వంతెన రాష్ట్రంలో నిర్మాణం కాబోతోంది. కృష్ణానదిపై సోమశిల వద్ద ప్రతిపాదించిన భారీ బ్రిడ్జికి కేంద్ర రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ అధీనంలోని స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ ఆమోదముద్ర వేసింది. అక్టోబర్ 7న ఢిల్లీలో ఈ కమిటీ భేటీ అయ్యింది. నిర్మాణ సంస్థకు వర్క్ ఆర్డర్ ఇచ్చిన రెండేళ్ల కాలంలో ఇది సిద్ధం కానుంది. తెలంగాణ–ఆంధ్రప్రదేశ్‌లను కలుపుతూ కృష్ణా నదిపై నిర్మించే ఈ వంతెనలో పైన వాహనాలు వెళ్లే ప్రధాన క్యారేజ్ వే ఉంటుంది. దాని దిగువన పర్యాటకులు నడుచుకుంటూ సోమశిల ప్రకృతి సౌందర్యం, కృష్ణా నదీ పరవళ్లను తిలకించేందుకు వీలుగా గాజు వంతెన (పెడస్ట్రియన్ డెక్) ఉంటుంది.
తెలంగాణ నుంచి ఏపీలోని నంద్యాల వైపు రోడ్డు మార్గాన వెళ్లేవారికి దూరాభారాన్ని తగ్గించే క్రమంలో కొత్త జాతీయ రహదారిని ప్రతిపాదించారు. నంద్యాల, తిరుపతి వెళ్లాలంటే కర్నూలు మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. అదే కొల్లాపూర్ మీదుగా కృష్ణా నదిని దాటేలా వంతెన నిర్మిస్తే ఆ దూరం దాదాపు 90 కి.మీ మేర తగ్గిపోతుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్–శ్రీశైలం రహదారి మీద ఉన్న కోట్రా జంక్షన్ నుంచి మల్లేశ్వరం, అక్కడి నుంచి నంద్యాల వరకు 173.73 కి.మీ మేర రహదారిని (హైవే 167 కే) నాలుగు వరసలుగా నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు కృష్ణానదిపై వంతెన అవసరమైంది. అయితే దీన్ని సాదాసీదాగా నిర్మించకుండా, పర్యాటకులను ఆకట్టుకునేలా ఐకానిక్ వంతెనగా నిర్మిస్తే బాగుంటుందని అధికారులు ప్రతిపాదించారు. పాపికొండలు తరహాలో ఈ ప్రాంతం అత్యంత రమణీయంగా ఉన్నందున ఇక్కడికి నిత్యం వేలల్లో పర్యాటకులు వస్తారు. గాజు నడక వంతెన నిర్మిస్తే వారు నదీ పరవళ్లను తిలకిస్తూ ప్రత్యేక అనుభూతిని పొందేందుకు అవకాశం ఉంటుందని భావించారు. వాహనాల వంతెన దిగువన గాజు డెక్ ఉండేలా రెండంతస్తులుగా డిజైన్ చేశారు.
3. దివ్యాంగులకు రిజర్వేషన్ పెంపు
దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకనుంచి ప్రభుత్వ ఉద్యోగాలు, పదోన్నతుల్లో దివ్యాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్ అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం మూడుశాతం ఉన్న రిజర్వేషన్‌ను నాలుగు శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్‌శర్మ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. నిర్ధారిత వైకల్యాలున్న వారికి నాలుగు శాతం రిజర్వేషన్ వర్తిస్తుందని పేర్కొన్నారు.
ఏశాఖలోనైనా రిజర్వేషన్ల నుంచి మినహాయింపు అవసరమైతే అందుకు తగిన కారణాల సమర్థనతోపాటు ఇంటర్ డిపార్ట్‌మెంటల్ కమిటీ అనుమతి తీసుకోవాలని తెలిపారు. ఈ రిజర్వేషన్ పెంపునకు అనుగుణంగా ఏపీ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్–1996లో సవరణలు చేయనున్నట్లు పేర్కొన్నారు.
వికలాంగుల హక్కుల చట్టం–2016లోని సెక్షన్–34 ప్రకారం ప్రభుత్వ నియామకాలు, పదోన్నతుల్లో నిర్ధారిత వైకల్యాల వ్యక్తులకు నాలుగుశాతం రిజర్వేషన్ కల్పిస్తూ 2020 ఫిబ్రవరి 19వ తేదీన మహిళా శిశు సంక్షేమ, వికలాంగుల సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీచేసింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలు, పదోన్నతుల్లో దివ్యాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించింది.
4. 21న జీఎస్‌ఎల్‌వీ మార్క్–3 ప్రయోగం
న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీ అర్ధరాత్రి 12.02 నిమిషాలకు తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జియో శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (జీఎస్‌ఎల్‌వీ మార్క్–3, ఎం–2) ఉపగ్రహ వాహకనౌకను ప్రయోగించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు.
యునైటెడ్ కింగ్‌డం(యూకే)కు చెందిన నెట్‌వర్క్ యాక్సెస్ అసోసియేషన్ లిమిటెడ్(వన్ వెబ్ కంపెనీ)తో ఇస్రో, న్యూ స్పేస్ ఇండియా, డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ సంస్థలు ఈ ప్రయోగాన్ని నిర్వహించేందుకు ఇటీవల ఒప్పందం చేసుకున్నాయి. ఇందులో భాగంగానే వన్ వెబ్ కంపెనీకి చెందిన 36 ఉపగ్రహాలను ఒకేసారి లోయర్ ఎర్త్ ఆర్బిట్ (లియో అర్బిట్) రోదశీలోకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో ఉపగ్రహం బరువు 137 కిలోలు ఉంటుందని, 36 ఉపగ్రహాలు కలిపితే 4,932 కిలోల బరువుగా ఇస్రో పేర్కొంది.
5. AP: ఈ–గవర్నెన్స్‌లోనూ అదుర్స్
గత ఆర్థిక సంవత్సరం (2021–22)లో దేశవ్యాప్తంగా ఈ–గవర్నెన్స్ అమలులో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో నిలిచింది. టాప్–10 రాష్ట్రాలకు తొలి మూడు స్థానాల్లో పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు వరుసగా నిలిచాయి. పశ్చిమ బెంగాల్ అత్యధికంగా 136.07 కోట్ల ఎలక్ట్రానిక్ లావాదేవీలతో తొలి స్థానంలో నిలవగా ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ 109.27 కోట్లతో రెండో స్థానంలోనూ.. 84.23 కోట్లతో తమిళనాడు మూడో స్థానంలో నిలిచినట్లు నివేదిక వెల్లడించింది. అదే ఏపీలో 52.90కోట్ల ఎలక్ట్రానిక్ లావాదేవీలు జరిగినట్లు కేంద్ర గణాంకాలు, కార్యకమాల అమలు మంత్రిత్వ శాఖ నివేదిక వెల్లడించింది.
ఇక ఎలక్ట్రానిక్ సేవల లావాదేవీలను ఆరు కేటగిరీలుగా నివేదిక వర్గీకరించింది. చట్టబద్ధమైన, చట్టబద్ధతలేని సేవలు, బిజినెస్ సిటిజన్ సేవలు, సమాచార సేవలు, మొబైల్ గవర్నెన్స్, యుటిలిటీ బిల్లుల చెల్లింపులు, సామాజిక ప్రయోజనాలుగా వర్గీకరించింది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ 52.90 కోట్ల ఎలక్ట్రానిక్ సేవల లావాదేవీలను నిర్వహించినట్లు నివేదిక వెల్లడించింది. ఇందులో చట్టబద్ధత, చట్టబద్ధతలేని సేవల లావాదేవీలు 4.16 కోట్లని నివేదిక పేర్కొంది. ఇక యుటిలిటీ బిల్లుల చెల్లింపుల లావాదేవీలు 10.76 కోట్లు, సమాచార సేవల లావాదేవీలు 4.13 కోట్లు సామాజిక ప్రయోజనాల లావాదేవీలు 33.83 కోట్లు బిజినెస్ సిటిజన్ సేవల లావాదేవీలు 23 వేలు నిర్వహించినట్లు నివేదిక పేర్కొంది.
6. ‘సంక్షేమం’ ఖర్చులో ఏపీదే అగ్రస్థానం
సమాజంలో పేదరిక నిర్మూలన కోసం సంక్షేమ పథకాలపై భారీ మొత్తాలను ఖర్చుచేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌దే అగ్రస్థాన మని సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (సెర్ప్) హైకోర్టుకు నివేదించింది. కేంద్రం మంజూరు చేసిన పెన్షన్లకు, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్లకు పొంతనే లేదని, కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద సంఖ్యలో అత్యధిక మొత్తాన్ని చెల్లిస్తోందని సెర్ప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) మహ్మద్ ఇంతియాజ్ హైకోర్టుకు వివరించారు.
వైఎస్సార్ పెన్షన్ కానుక పథకం కింద వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, డప్పు కళాకారులు, చర్మకారులకు నెలకు రూ.2,500, వికలాంగులకు నెలకు రూ.3 వేలు, తీవ్రమైన కిడ్నీ జబ్బులతో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్న వారికి నెలకు రూ.10 వేలు చెల్లిస్తోందన్నారు. పెన్షన్ల అర్హత వయసు కూడా 65 నుంచి 60కి తగ్గించిందన్నారు.
7. ఏపీ వరుసగా రెండో ఏడాది జాతీయ అవార్డు
జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ మరోసారి సత్తా చాటుకుంది. వరుసగా రెండో ఏడాది కూడా స్వచ్చ సర్వేక్షన్‌లో జాతీయ అవార్డులు అందుకుంది. కాగా, స్వచ్చ సర్వేక్షన్ కార్యక్రమంలో భాగంగా తిరుపతి కార్పొరేషన్‌కు జాతీయ అవార్డు లభించింది.
అలాగే, విశాఖ, విజయవాడ, పుంగనూరు, పులివెందులకు కూడా స్వచ్చ సర్వేక్షన్ అవార్డులు వచ్చాయి. ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శనివారం.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సురేష్‌తో పాటుగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి పాల్గొన్నారు.
9. 30 మందికి వైఎస్‌ఆర్ జీవిత సాఫల్య, సాఫల్య పురస్కారాలు
సామాన్యుల్లో ఉన్న అసామాన్యులను సత్కరించాలన్న లక్ష్యంతో వైఎస్‌ఆర్ జీవిత సాఫల్య, సాఫల్య పురస్కారాలను ప్రభుత్వం అందిస్తోందని సమాచార సలహాదారు జీవీడీ కృష్ణమోహన్ తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబరు 1వ తేదీన 8 రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 30 మందికి పురస్కారాలను అందించనున్నట్లు ప్రకటించారు. (మొత్తం 20 మందికి జీవిత సాఫల్య పురస్కారాలు, 10 మందికి సాఫల్య పురస్కారాలు). వివిధ రంగాల్లో సేవలు అందించిన వ్యక్తులు, సంస్థల నుంచి అందిన 428 ప్రతిపాదనలను కమిటీ పరిశీలించి పారదర్శకంగా ఎంపిక చేసినట్లు తెలిపారు. వైఎస్‌ఆర్ జీవిత సాఫల్య పురస్కారం కింద రూ.10 లక్షలు, సాఫల్య పురస్కారం కింద రూ.5 లక్షల నగదు పురస్కారాలు అందిస్తారు.
10. నింగిలోకి నూతన లాంచ్‌వెహికల్‌ఎం3–ఎం2 రాకెట్
శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్(ఎస్‌డీఎస్‌సీ) ప్రయోగవేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లిన నూతన లాంచ్‌వెహికల్‌ఎం3–ఎం2 రాకెట్ విజయవంతంగా 36 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో ఇస్రో ఒక చరిత్రాత్మక వాణిజ్య ఘట్టానికి శ్రీకారం చుట్టింది. ఈ రకం రాకెట్‌ను వాణిజ్యపరమైన ప్రయోగాలకు వాడటం ఇదే తొలిసారి. తొలి యత్నంలోనే ఇస్రో గ‘ఘన’ విజయం సొంతం చేసుకుంది.
శనివారం అర్థరాత్రి 12 గంటల 7 నిమిషాల 40 సెకన్లకు స్పేస్‌సెంటర్ రెండో ప్రయోగవేదికగా ఈ రాకెట్‌ను ప్రయోగించారు. ఒకేసారి 36 బ్రాడ్‌బ్యాండ్ కమ్యూనికేషన్ శాటిలైట్లను పోలార్ లోయర్ ఎర్త్ ఆర్బిట్(ఎల్‌ఈఓ)లో ప్రవేశపెట్టారు. ఇస్రోకు చెందిన వాణిజ్యవిభాగం న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ చేస్తున్న తొలి వాణిజ్యపర ప్రాజెక్ట్ ఇది. బ్రిటన్‌కు చెందిన నెట్‌వర్క్ యాక్సెస్ అసోసియేటెడ్ లిమిటెడ్, భారతి ఎంటర్‌ప్రైజెస్ భాగస్వాములుగా వన్‌వెబ్ ఇండియా లిమిటెడ్‌ను ఏర్పాటు చేశారు.
వన్‌వెబ్ ఇండియా–1 పేరిట 36 ఉప్రగ్రహాలను కక్ష్యలో పంపేందుకు వన్‌వెబ్‌తో న్యూస్పేస్ ఇండియా ఒప్పందం చేసుకుంది. వన్‌వెబ్ లిమిటెడ్ అనేది వివిధ దేశాల ప్రభుత్వ, వ్యాపార సంస్థలకు అంతరిక్ష, ఇంటర్నెట్ సేవలు అందించే గ్లోబల్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్ సంస్థ. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 648 శాటిలైట్లను నిర్వహిస్తోంది.
రాకెట్ పేరు మార్చారు
జీఎల్‌ఎల్‌వీ–ఎంకే3గా ఇన్నాళ్లు పిలవబడిన రాకెట్‌నే కాస్త ఆధునీకరించి కొత్తగా లాంచ్‌వెహికల్ ఎం3–ఎం2గా నామకరణం చేయడం గమనార్హం. జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ కక్ష్య(జీటీవో)లోకి శాటిలైట్లను పంపే రాకెట్లకే జీఎస్‌ఎల్‌వీగా పిలుస్తున్నారు. శనివారం నాటి రాకెట్ జీటీవోకి పంపట్లేదు. ఎల్‌ఈఓలోకి పంపుతోంది. అందుకే దీనిని వేరే పేరుపెట్టారు. జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ కక్ష్య(జీటీఓ)లోకి 4,000 కేజీల బరువును, ఎల్‌ఈఓలోకి దాదాపు 8,000 కేజీల బరువును తీసుకెళ్లే సత్తా లాంచ్‌వెహికల్ ఎం3–ఎం2 రాకెట్ సొంతం.
11. ఆదర్శ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్
గృహ నిర్మాణ కార్యకలాపాల్లో అత్యుత్తమ పనితీరు కనబరుస్తూ, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఇందుకు సంబంధించిన అవార్డును ఏపీ తరఫున కేంద్ర గృహనిర్మాణ శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ చేతుల మీదుగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ అందుకున్నారు. గృహాల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని కేంద్రమంత్రి అభినందించారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో మూడ్రోజుల పాటు జరిగే జాతీయ పట్టణ గృహ నిర్మాణ సమ్మేళనం శుక్రవారం ప్రారంభమైంది. ఏపీలో జగనన్న కాలనీల పేరిట నిర్మిస్తున్న ఇళ్లలో విద్యుత్ ఆదాకు చేపడుతున్న చర్యలను ఈ సమ్మేళనంలో అజయ్‌జైన్ వివరించారు.
తొలిదశలో 15.6 లక్షల ఇళ్లకు ఏపీ ఇంధన సామర్థ్య అభివృద్ధి సంస్థ (ఏపీసీడ్కో), ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్‌ఎల్) సాయంతో ఒక్కో ఇంటికీ నాలుగు ఎల్‌ఈడీ బల్బులు, రెండు ఎల్‌ఈడీ ట్యూబ్‌లైట్లు, రెండు ఫ్యాన్లను అందజేయనున్నట్లు తెలిపారు. వీటి ద్వారా ఒక్కో ఇంటికి ఏడాదికి 734 యూనిట్ల విద్యుత్ చొప్పున మొత్తం 1,145 మిలియన్ యూనిట్ల కరెంటు ఆదా అవుతుందని చెప్పారు. నిర్మాణంలో ఇండో–స్విస్ బిల్డింగ్ టెక్నాలజీతో పాటు రీఇన్ఫోర్డ్స్ కాంక్రీట్ (ఆర్సీసీ) ప్రీకాస్ట్ టెక్నాలజీ, షియర్‌వాల్ టెక్నాలజీ, ఈపీఎస్ టెక్నాలజీ వంటి అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఈ టెక్నాలజీవల్ల ఇంటి లోపల కనీసం రెండు డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గడంతోపాటు 20 శాతం విద్యుత్ ఆదా అవుతుందని అజయ్‌జైన్ వివరించారు.
12. కర్నూలులో రాష్ట్ర జ్యుడిషియల్ అకాడమీ
రాష్ట్రంలోని న్యాయాధికారులకు శిక్షణ ఇచ్చే రాష్ట్ర జ్యుడిషియల్ అకాడమీని శాశ్వత ప్రాతిపదికన కర్నూలులో ఏర్పాటు చేసేందుకు అనుమతి మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అకాడమీని ప్రస్తుతానికి మంగళగిరిలో అద్దె భవనంలో ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చింది. రాష్ట్ర విభజన తరువాత ఇప్పటివరకు రాష్ట్రంలో జ్యుడిషియల్ అకాడమీ లేదు. దీంతో రాష్ట్రంలో జ్యుడిషియల్ అకాడమీ ఏర్పాటుకు హైకోర్టు న్యాయమూర్తుల కమిటీ సిఫారసులు పంపింది.
ఈ సిఫారసులను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం కర్నూలులో అకాడమీ ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి జి.సత్యప్రభాకర్ పేరు మీద జీవో జారీ అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ అకాడమీలో ఉన్న సిబ్బందిలో 58.32 శాతం మించకుండా సిబ్బందిని మంజూరు చేస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. సిబ్బంది మంజూరు, మౌలిక సదుపాయాల కల్పన వివరాలతో తగిన ఉత్తర్వులను వేరుగా జారీ చేస్తామంది.
13. ఉద్యోగులకు చైల్డ్‌కేర్ లీవ్స్ పెంపు
ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులకు పిల్లల సంరక్షణ సెలవులను పొడిగించింది ప్రభుత్వం. ప్రస్తుతం అరవై రోజులు ఉన్న చైల్డ్ కేర్ లీవ్స్‌ను కాస్త 180 రోజులకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సెలవులను పది విడతల్లో ఉపయోగించుకోవాలని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |