భౌగోళిక గుర్తింపు దక్కించుకున్న ఆంధ్రప్రదేశ్ ఆత్రేయపురం పూతరేకులు
ఆత్రేయపురం పూతరేకులకు భౌగోళిక గుర్తింపు లభించింది. నోరూరించే వంటకానికి ఆత్రేయపురం గ్రామం ఎప్పటి నుంచో ప్రసిద్ది చెందింది. కేంద్ర ప్రభుత్వ డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీలో ఆత్రేయపురం పూతరేకులు నమోదయ్యాయి. 400 ఏళ్ల చరిత్ర కలిగిన పూతరేకులు అంతర్జాతీయ గుర్తింపు పొందడం పట్ల ఆత్రేయపురం వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైజాగ్ దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్శిటీ సహకారంతో ఆత్రేయపురంలోని సర్ ఆర్థర్ కాటన్ పూతరేకుల కో-ఆపరేటివ్ సొసైటీ భౌగోళిక గుర్తింపు కోసం దరఖాస్తు చేసింది. దీనిపై స్పందించిన కేంద్ర శాఖ ఫిబ్రవరి 13న ఆత్రేయపురం పూతరేకులను అధికారికంగా గుర్తిస్తూ జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ జర్నల్‌లో ప్రకటన విడుదల చేసింది. భౌగోళిక గుర్తింపుపై అభ్యంతరాల గడువు జూన్ 13వ తేదీ అర్ధరాత్రి ముగియగా, ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడంతో అందరూ హర్షం వ్యక్తం చేశారు.
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
***************************************************************************