ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షల యొక్క వెయిటేజీకి భౌగోళిక శాస్త్రం ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. కాబట్టి ADDA247,ఆంధ్రప్రదేశ్ భౌగోళిక శాస్త్రం కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి .
మీరు ఇంతకు మునుపు ప్రశ్నలు చదివి ఉండనట్లయితే ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేయండి
A.P Geography Important Questions Part-1
A.P Geography Important Questions Part-2
ప్రశ్నలు:
Q1. తూర్పు కనుములుకు అనంతపురం జిల్లా లో ఉన్న మరొక పేరు ఏమిటి?
(a) పెనుగొండ కొండలు
(b) మడకశిర కొండలు
(c) రామగిరి గుట్టలు
(d) పైవన్నీ
Q2. తూర్పు కనుములుకు చిత్తూరు జిల్లా లో ఉన్న మరొక పేరు ఏమిటి?
(a) శేషాచల కొండలు
(b) అవులపల్లి కొండలు
(c) హార్సిలీ కొండలు (ఏనుగు యల్లం కొండలు)
(d) పైవన్నీ
Q3. తూర్పు కనుములుకు కృష్ణా జిల్లా లో ఉన్న మరొక పేరు ఏమిటి?
(a) మొగల్రాజపురం
(b) కొండపల్లి కొండలు
(c) సీతానగరం కొండలు
(d) పైవన్నీ
Q4. తూర్పు కనుములుకు గుంటూరు జిల్లా లో ఉన్న మరొక పేరు ఏమిటి?
(a) బెల్లంపల్లి కొండలు, నాగార్జున కొండలు
(b) వినుకొండ కొండలు, కోటప్ప కొండ
(c) కొండవీడు కొండలు, గనికొండ
(d) పైవన్నీ
Q5. తూర్పు పచ్చిమ గోదావరి జిల్లాలలో ఉన్న ధూప కొండలు సగటు ఎత్తు ఎంత (మీటర్ లలో) ?
(a) 925
(b) 915
(c) 945
(d) 935
Q6. తూర్పు కనుములు తీర మైదానానికి పడమటి పీఠభూమికి మద్య ఉండి ఉత్తరాన శ్రీకాకుళం , విశాఖ జిల్లాల్లో ఎన్ని కిలోమీటర్ల వెడల్పు వ్యాపించి ఎన్ని మీటర్ల ఎత్తు కలిగి ఉన్నాయి?
(a) 70, 1200
(b) 50,1000
(c) 80,1300
(d) 60,1100
Q7. విజయవాడలోని సీతానగరం కొండలను చీల్చుకుని కృష్ణానది ప్రవహిస్తుంది అయితే ఈ ప్రాంతంలో బ్రిటిషర్లు ప్రకాశం బ్యారేజి ని ఏ సంవత్సరం లో నిర్మించారు?
(a) 1855
(b) 1853
(c) 1856
(d) 1854
Q8. ప్రకాశం బ్యారేజి నుండి కలువల ద్వార ఎన్ని లక్షల ఎకరాల భూమి సాగు అవుతుంది కనుగొనండి?
(a) 12
(b) 11
(c) 13
(d) 10
Q9. విశాఖపట్నం డాల్ఫినోస్ పై ఎన్ని మీటర్ల ఎత్తులో లైట్ హౌస్ ఉంది?
(a) 155
(b) 175
(c) 165
(d) 185
Q10.తూర్పు కనుముల్లో ఎత్తైన శిఖరం విశాఖపట్నం జిల్లాలోని చింతపల్లి వద్ద ఉన్న అరోమా శిఖరం ఎత్తు మీటర్ల లో ఎంత?
(a) 1508
(b) 1608
(c) 1680
(d) 1580
APPSC GROUP-2 బ్యాచ్ లో చేరడానికి ఇదే సువర్నావకాసం
సమాధానాలు:
Q1.ANS.(d)
Sol. తూర్పు కనుములుకు ప్రకాశం జిల్లా లో ఉన్న మరొక పేరు పెనుగొండ కొండలు, మడకశిర కొండలు, రామగిరి గుట్టలు.
Q2.ANS.(d)
Sol. తూర్పు కనుములుకు చిత్తూరు జిల్లా లో ఉన్న మరొక పేరు శేషాచల కొండలు, అవులపల్లి కొండలు, హార్సిలీ కొండలు (ఏనుగు యల్లం కొండలు).
Q3.ANS.(d)
Sol. తూర్పు కనుములుకు కృష్ణా జిల్లా లో ఉన్న మరొక పేరు మొగల్రాజపురం, కొండపల్లి కొండలు, సీతానగరం కొండలు.
Q4.ANS.(d)
Sol. తూర్పు కనుములుకు కృష్ణా జిల్లా లో ఉన్న మరొక పేరు బెల్లంపల్లి కొండలు, నాగార్జున కొండలు, వినుకొండ కొండలు, కోటప్ప కొండ, కొండవీడు కొండలు, గనికొండ.
Q5.ANS.(d)
Sol. తూర్పు పచ్చిమ గోదావరి జిల్లాల ఉన్న ధూప కొండల సగటు ఎత్తు 915 మీటర్లు.
Q6.ANS.(a)
Sol. తూర్పు కనుములు తీర మైదానానికి పడమటి పీఠభూమికి మద్య ఉన్నాయి.ఇవి కొండల వరుసలతో ఉంది ఎక్కువగా స్తనికమైన తెమ్పులను కలిగి ఉన్నాయి. ఉత్తరాన శ్రీకాకుళం , విశాఖ జిల్లాల్లో 70 కిలోమీటర్ల వెడల్పు వ్యాపించి 1200 మీటర్ల ఎత్తు కలిగి ఉన్నాయి.
Q7.ANS.(b)
Sol. విజయవాడలోని సీతానగరం కొండలను చీల్చుకుని కృష్ణానది ప్రవహిస్తుంది అయితే ఈ ప్రాంతంలో బ్రిటిషర్లు ప్రకాశం బ్యారేజి ని 1853 సంవత్సరం లో నిర్మించారు.
Q8.ANS.(a)
Sol. ప్రకాశం బ్యారేజి నుండి కాలువల ద్వార 12 లక్షల ఎకరాల భూమి సాగు అవుతుంది.
Q9.ANS.(b)
Sol. విశాఖపట్నం డాల్ఫినోస్ పై 175 మీటర్ల ఎత్తులో లైట్ హౌస్ ఉంది.
Q10.ANS. (C)
Sol. తూర్పు కనుముల్లో ఎత్తైన శిఖరం విశాఖపట్నం జిల్లాలోని చింతపల్లి వద్ద ఉన్న అరోమా శిఖరం ఎత్తు 1680 మీటర్లు.
ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరిన్ని ముఖ్యమైన ప్రశ్నల కోసం ఇక్కడ క్లిక్ చేయండి