ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్ష గ్రూప్ పరిక్షలు. చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షల యొక్క వెయిటేజీకి భౌగోళిక శాస్త్రం ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది, కాబట్టి ADDA247,ఆంధ్రప్రదేశ్ భౌగోళిక శాస్త్రం కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అబ్యర్ధులు దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి .
ప్రశ్నలు
Q1.ఆంధ్రప్రదేశ్ లో ప్రవహించే నదులు సాదారణంగా ఏ దిశగా ప్రవహిస్తున్నాయి?
- వాయువ్య దిశ నుండి ఆగ్నేయ దిశకు
- తూర్పు దిశ నుండి పడమర దిశకు
- పడమర దిశ నుండి తూర్పు దిశకు
- ఆగ్నేయ దిశ నుండి వాయువ్య దిశకు
Q2.దక్షిణ భారత దేశంలో నదులు అన్నింటిలో అతిపెద్ద నది ఏది ?
- గోదావరి
- కృష్ణ
- తుంగ భద్రా
- పెన్నా నది
Q3.గోదావరి నది ఎక్కడ పుట్టింది?
- తెలంగాణా
- మధ్య ప్రదేశ్
- మహారాష్ట్ర
- కర్ణాటక
Q4.గోదావరి నది మొత్తం పొడవు కిలో మీటర్లలో ఎంత ?
- 1500
- 1400
- 1465
- 1565
Q5.గోదావరి నది ఏడు పాయలుగా చీలి ప్రవహిస్తుంది అయితే ఈ క్రింది వాటిలో వాటిని గుర్తించండి?
- గౌతమీ
- వశిష్ట
- కౌశిక
- పైవన్నీ
Q6.ఆంద్ర ప్రదేశ్ లోని కొన్ని ముఖ్యమైన నదుల పేర్లు ఈ క్రింది వాటిలో గుర్తించండి?
- కృష్ణ
- గోదావరి
- పెన్నా
- పైవన్నీ
Q7.మహారాష్ట్ర లోని పశ్చిమ కనుముల వద్ద వుండే నాసిక త్రయంబక్ దగ్గర పుట్టిన నది పేరుని కనుగొనండి?
- కృష్ణ
- మాచ్ ఖండ్
- సువర్ణముఖి నది
- గోదావరి
Q8.“అందాలమాల” సమీపంలో బంగాళాఖాతంలో కలిసే నది ఏది?
- గుండ్లకమ్మ
- సువర్ణముఖి
- మాచ్ ఖండ్
- పైవన్నీ
Q9.“గుండ్లకమ్మ” నది ఏ జిల్లాలో పుట్టింది?
- కర్నూలు
- గుంటూరు
- ప్రకాశం
- నెల్లూరు
Q10.గోదావరి నది యొక్క పాయల పేర్లు ఈ క్రింది వాటిలో కనుగొనండి?
- ఆత్రేయ
- తుల్య
- పైవి రెండు
- పైవేవి కాదు
జవాబులు
Q1. (a)
ఆంధ్రప్రదేశ్ భుబాగంలో ఎక్కువ భాగం వాయువ్య భాగాన ఎత్తుగా వుండి ఆగ్నేయ దిశగా వాలి ఉన్నాయి. అందువల్ల ఆంధ్రప్రదేశ్ లో ప్రవహించే నదులన్నీ సాదారణంగా వాయువ్య దిశ నుండి ఆగ్నేయ దిశగా ప్రవహిస్తున్నాయి.
Q2. (a)
దక్షిణ భారత దేశం నదులు అన్నింటిలో పెద్ద నది “గంగ నది” అందుకే దీనిని “దక్షిణ గంగ “ అని కుడా పిలుస్తారు.
Q3.ANS: (c)
గోదావరి నది మహారాష్ట్ర లోని పశ్చిమ కనుముల వద్ద వుండే నాసిక త్రయంబక్ దగ్గర పుట్టింది
Q4. (c)
గోదావరి నది మొత్తం పొడవు 1465 కిలో మీటర్లు కాగ ఆంధ్రత తెలంగాణాల్లో 220 కి.మీ. దూరం పయనిస్తుంది
Q5.ANS: (d)
గోదావరి నదికి ఏడు పాయలు గౌతమీ, వశిష్ట, వైనతేయ, కౌశిక,ఆత్రేయ, తుల్య, భరద్వాజ.
Q6. (d)
గోదావరి , కృష్ణ , పెన్నా, సువర్ణముఖి , గుండ్లకమ్మ మాచ్ ఖండ్, వంశధార ముఖ్యమైన నదులు
Q7. (d)
గోదావరి నది మహారాష్ట్ర లోని పశ్చిమ కనుముల వద్ద వుండే నాసిక త్రయంబక్ దగ్గర పుట్టింది
Q8. (b)
స్వర్ణముఖి నది చిత్తూరు జిల్లాలోని చంద్ర గిరి గుట్టలలో జన్మించి నెల్లూరు జిల్లా ద్వార ప్రవహిస్తూ ఆ జిల్లా లోని అందలమాల సమీపంలో బంగాళాఖాతం లో కలుస్తుంది.
Q9. (a)
కర్నూలు జిల్లాలోని నల్లమల కొండల్లో పుట్టి గుంటూరు ప్రకాశం జిల్లాల ద్వార 235 కిలో మీటర్లు ప్రవహించి ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది
Q10. (c)
గోదావరి నదికి ఏడు పాయలు గౌతమీ, వశిష్ట, వైనతేయ, కౌశిక,ఆత్రేయ, తుల్య, భరద్వాజ.
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర పరీక్ష కోసం స్టడీ మెటీరియల్ మరియు ఆన్లైన్ క్లాసుల కొరకు దిగువ లింక్ పై క్లిక్ చేయండి