ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షల యొక్క వెయిటేజీకి భౌగోళిక శాస్త్రం ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. కాబట్టి ADDA247,ఆంధ్రప్రదేశ్ భౌగోళిక శాస్త్రం కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి .
మీరు ఇంతకు మునుపు ప్రశ్నలు చదివి ఉండనట్లయితే ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేయండి
A.P Geography Important Questions Part-1
A.P Geography Important Questions Part-2
A.P Geography Important Questions Part-3
A.P Geography Important Questions Part-4
ఆంధ్రప్రదేశ్ శీతోష్ణస్థితి
Q1. ఈశాన్య ఋతుపవన కాలంలో బంగాళాఖాతంలో వాయుగుండాలు ఏర్పడి దక్షిణ కోస్తా జిల్లాలు అయిన వేటికి ఎక్కువ నష్టం జరుగుతుంది?
A.ప్రకాశం, గుంటూరు
B.గుంటూరు, నెల్లూరు
C.నెల్లూరు , ప్రకాశం
D.పైవన్నీ
Q2. నైరుతి ఋతుపవనాల వల్ల అధిక వర్షపాతం పడే జిల్లా ఏది?
A.తూర్పు గోదావరి
B.పశ్చిమ గోదావరి
C.కృష్ణా
D.పైవన్నీ
Q3. ఈశాన్య ఋతుపవనాల వల్ల అధిక వర్షపాతం పడే జిల్లా ఏది?
A.తూర్పు గోదావరి
B.పశ్చిమ గోదావరి
C.కృష్ణా
D.పైవన్నీ
Q4. నైరుతి ఋతుపవనాల వల్ల అల్ప వర్షపాతం పడే జిల్లాలు ఏవి?
A.నెల్లూరు, అనంతపురం
B.అనంతపురం, కర్నూలు
C.కర్నూలు , నెల్లూరు
D.పైవన్నీ
Q5. ఈశాన్య ఋతుపవనాల వల్ల అల్ప వర్షపాతం పడే జిల్లాలు ఏవి?
A.అనంతపురం, నెల్లూరు
B.నెల్లూరు, కర్నూలు ,
C.కర్నూలు, అనంతపురం,
D.పైవన్నీ
Q6. రాజస్థాన్లోని జైసల్మీరు తర్వాత అతి తక్కువ వర్ష పాతం 560 మి.మీ.కంటే తక్కువ నమోదయ్యే ప్రాంతం ఏది?
A.కర్నూలు
B.అనంతపురం
C.నెల్లూరు
D.కృష్ణా
Q7.ఈ క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్ లో అధిక వర్షపాతం ఏ నెలలో ఏ ప్రాంతంలో ఉంటుందో సరైన జతలను కనుగొనండి?
మాసం ప్రాంతం
A.సెప్టెంబర్ 1. కోస్తా ఆంధ్రా, తెలంగాణ
B. జులై 2. దక్షిణ తెలంగాణ, ఆగ్నేయ ప్రాంతం
C. అక్టోబర్ 3. నెల్లూరు, గుంటూరు
D. నవంబర్ 4. చిత్తూరు
A. A-2, B-1, C-3, D-4
B. A-1, B-2, C-3, D-4
C. A-2, B-1, C-4, D-3
D. A-1, B-2, C-3, D-4
Q8. ఈ క్రింది ఇచ్చిన జతలలో ఆంధ్ర రాష్ట్ర సగటు వర్షపాతం ఏ కాలంలో ఎంత ఉంటుందో గుర్తించండి?
కాలం రాష్ట్ర సగటు వర్షపాతం
A.వేసవికాలం 1. 18 మి.మీ.
B.శీతాకాలం 2. 73 మి.మీ.
C.ఈశాన్య ఋతుపవనాలు 3. 203 మి.మీ.
D.నైరుతి ఋతుపవనాలు 4. 602 మి.మీ.
A. A-2, B-1, C-4, D-3
B. A-1, B-2, C-3, D-4
C. A-2, B-1, C-3, D-4
D. A-4, B-3, C-2, D-1
Q9. ఆంధ్రప్రదేశ్ లో రెండు రకాల శీతోష్ణస్థితి మండలలున్నాయి అని తెలిపింది కొప్పెన్. అయితే ఆంధ్ర రాష్ట్రంలో కలిగి ఉన్న రెండు శీతోష్ణస్థితి మండలాలను కనుగొనండి?
- సమ శీతోష్ణ
- పొడి
- ఖండాంతర
- ఉష్ణమండల వర్షాకాలం
- ధ్రువ
A. 1,4.
B. 3,4
C. 2,3
D. 2,4
Q10. ఆంధ్రప్రదేశ్ లో శుష్క ప్రాంతం ఎక్కడ నుండి ఎక్కడ వరకు వ్యాపించి ఉంది?
A. కడప నుండి దక్షిణాన నల్గొండ వరకు , ఉత్తరాన బళ్ళారి నుండి తూర్పున ఉదయగిరి వరకు
B. కడప నుండి ఉత్తరాన నల్గొండ వరకు , దక్షిణాన బళ్ళారి నుండి తూర్పున ఉదయగిరి వరకు
C. కడప నుండి దక్షిణాన నల్గొండ వరకు , తూర్పున బళ్ళారి నుండి పడమర ఉదయగిరి వరకు
D. కడప నుండి ఉత్తరాన నల్గొండ వరకు , పడమర బళ్ళారి నుండి తూర్పున ఉదయగిరి వరకు
Q11. ఈ క్రింది వాటిలో క్రమంగా దేనిని అతివృష్టి మరియు అనావృష్టి అని అంటారు?
A. కురవాల్సిన సాదారణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షపాతం, కురవాల్సిన సాదారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం
B. కురవాల్సిన సాదారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం, కురవాల్సిన సాదారణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షపాతం
C. పైవన్ని
D. పైవేవికాదు
Q12. ఆంధ్రప్రదేశ్ లో వరదలు సంబవించే ప్రాంతాలు ఏవి?
A. కొల్లేరు, వంశధార
B. కృష్ణా , గోదావరి ప్రాంతాలు
C. శారదానది ప్రాంతాలు
D. పైవన్నీ
Q13.సాదారణ వర్షపాతంలో ఎంత శాతం కంటే తక్కువ వర్షం కురిస్తే దానిని కరువు అంటారు?
A. 65%
B. 75%
C. 85%
D. 95%
Q14.సాదారణ వర్షపాతంలో ఎంత శాతం కంటే తక్కువ వర్షం కురిస్తే దానిని “తీవ్రమైన కరువు” అంటారు?
A. 45%
B. 50%
C. 55%
D. పైవేవి కాదు
Q15. ఆంధ్రరాష్ట్రములో అధిక కరువులు సంబవించే జిల్లా ఏది?
A. కడప
B. కర్నూలు
C. అనంతపురం
D. పైవన్నీ
జవాబులు :
Q1.ANS.(C)
ఈశాన్య ఋతుపవన కాలంలో బంగాళాఖాతంలో వాయుగుండలు ఏర్పడతాయి. వీటి వల్ల దక్షిణ కోస్తా జిల్లాలు అయిన నెల్లూరు , ప్రకాశం జిల్లాలకు ఎక్కువ నష్టం జరుగుతుంది.
Q2.ANS.(B)
నైరుతి ఋతుపవనాల వల్ల అధిక వర్షపాతం పడే జిల్లా పశ్చిమ గోదావరి మరియు ఈశాన్య ఋతుపవనాల వల్ల అధిక వర్షపాతం పడే జిల్లా తూర్పు గోదావరి.
Q3.ANS.(A)
నైరుతి ఋతుపవనాల వల్ల అధిక వర్షపాతం పడే జిల్లా పశ్చిమ గోదావరి మరియు ఈశాన్య ఋతుపవనాల వల్ల అధిక వర్షపాతం పడే జిల్లా తూర్పు గోదావరి.
Q4.ANS.(A)
నైరుతి ఋతుపవనాల వల్ల అల్ప వర్షపాతం పడే జిల్లాలు నెల్లూరు, అనంతపురం మరియు ఈశాన్య ఋతుపవనాల వల్ల అల్ప వర్షపాతం పడే జిల్లాలు కర్నూలు, అనంతపురం.
Q5.ANS.(C).
నైరుతి ఋతుపవనాల వల్ల అల్ప వర్షపాతం పడే జిల్లాలు నెల్లూరు, అనంతపురం మరియు ఈశాన్య ఋతుపవనాల వల్ల అల్ప వర్షపాతం పడే జిల్లాలు కర్నూలు, అనంతపురం.
Q6.ANS.(B)
రాజస్థాన్లోని జైసల్మీరు తర్వాత అతి తక్కువ వర్ష పాతం 560 మి.మీ.కంటే తక్కువ నమోదయ్యే ప్రాంతం అనంతపురం.ఇది ఆంధ్రప్రదేశ్ లో మొదటి స్థానం భారతదేశం లో రెండవ స్థానం.
Q7.ANS.(C)
ఆంధ్రప్రదేశ్ లో అధిక వర్షపాతం జులైలో – కోస్తా ఆంధ్రా, తెలంగాణ :, సెప్టెంబర్ లో- దక్షిణ తెలంగాణ, ఆగ్నేయ ప్రాంతం:, అక్టోబర్ లో – చిత్తూరు:, మరియు నవంబర్ లో – నెల్లూరు, గుంటూరు ఉంటుంది.
Q8.ANS.(C)
ఆంధ్ర రాష్ట్ర సగటు వర్షపాతం వేసవికాలంలో -73 మి.మీ., శీతాకాలం లో – 18 మి.మీ., ఈశాన్య ఋతుపవనాలు లో – 203 మి.మీ., నైరుతి ఋతుపవనాలు లో – 602 మి.మీ. గా ఉంటుంది.
Q9.ANS.(D)
కొప్పెన్ వాతావరణ వర్గీకరణ వాతావరణాలను ఐదు ప్రధాన వాతావరణ సమూహాలుగా విభజిస్తుంది, ప్రతి సమూహం కాలానుగుణ అవపాతం మరియు ఉష్ణోగ్రత నమూనాల ఆధారంగా విభజించబడుతుంది. ఐదు ప్రధాన సమూహాలు 1.(ఉష్ణమండల), 2.(పొడి), 3. (సమశీతోష్ణ), 4.(ఖండాంతర), మరియు 5.(ధ్రువ). ప్రతి గ్రూపు మరియు సబ్ గ్రూపు ఒక లేఖ ద్వారా ప్రాతినిధ్యం వహిస్తుంది. అయితే ఆంధ్రరాష్ట్రంలో ఉన్న శీతోష్ణస్థితి మండలాలు ఆయన రేఖా వర్షపాత ప్రాంతం (ఉష్ణమండల వర్షాకాలం), శుష్క ప్రాంతం (పొడి).
Q10.ANS.(D)
ఆంధ్రప్రదేశ్ లో శుష్క ప్రాంతం కడప నుండి ఉత్తరాన నల్గొండ వరకు , పడమర బళ్ళారి నుండి తూర్పున ఉదయగిరి వరకు వ్యాపించి ఉంది. మిగిలిన ప్రాంతం అంతా మొదటి రకం అయిన రేఖా వర్షపాత ప్రాంతం (ఉష్ణమండల వర్షపాతంకు) చెందినది.
Q11.ANS. (A)
కురవాల్సిన సాదారణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షపాతం కురిస్తే దానిని అధిక వర్షపాతం లేదా అతివృష్టి అంటారు , కురవాల్సిన సాదారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం కురిస్తే దానిని అల్ప వర్షపాతం లేదా అనావృష్టి అంటారు.
Q12.ANS.(D)
అతివృష్టి వల్ల వరదలు వస్తాయి. ఆంధ్రప్రదేశ్ లో వరదలు సంబవించే ప్రాంతాలు కొల్లేరు, వంశధార, కృష్ణా , గోదావరి ప్రాంతాలు , శారదానది ప్రాంతాలు.
Q13.ANS.(B)
సాదారణ వర్షపాతంలో 75 శాతం కంటే తక్కువ వర్షం కురిస్తే దానిని కరువు అంటారు మరియు సాదారణ వర్షపాతంలో 50 శాతం కంటే తక్కువ వర్షం కురిస్తే దానిని తీవ్రమైన కరువు అంటారు.
Q14.ANS.(B)
సాదారణ వర్షపాతంలో 75 శాతం కంటే తక్కువ వర్షం కురిస్తే దానిని కరువు అంటారు మరియు సాదారణ వర్షపాతంలో 50 శాతం కంటే తక్కువ వర్షం కురిస్తే దానిని తీవ్రమైన కరువు అంటారు.
Q15.ANS.(D)
ఆంధ్రరాష్ట్రములో అధిక కరువులు సంబవించే ప్రాంతం రాయలసీమ ఇందులో కడప,కర్నూలు, చిత్తూరు, అననతపురం జిల్లాలున్నాయి.