ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షల యొక్క వెయిటేజీకి భౌగోళిక శాస్త్రం ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. కాబట్టి ADDA247,ఆంధ్రప్రదేశ్ భౌగోళిక శాస్త్రం కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి .
ఆంధ్రప్రదేశ్ అడవులు – జంతుజాలం-1
ప్రశ్నలు
Q1. ఆంధ్రప్రదేశ్ సామజిక ఆర్దిక సర్వే 2015-2016 ప్రకారం రాష్ట్రంలో అడవులు ఎన్ని చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి?
A.36,914.78
B.36,914.58
C.36,956.79
D.36,956.58
Q2. రాష్ట్రం మొత్తం విస్తీర్ణంలో ఎంత శాతం అడవులు ఉన్నాయి?
A.05
B.06
C.03
D.04
Q3.భారతదేశ అడవుల విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అడవుల విస్తీర్ణం ఎన్నో స్థానం లో ఉంది?
A.8
B.9
C.10
D.11
Q4. ఆంధ్ర రాష్ట్రము లో కోస్తాంద్ర ప్రాంత అటవీ వైశాల్యం ఎన్ని చదరపు కిలోమీటర్లు ?
A.14,996
B.19,590
C.15,996
D.18,890
Q5. ఆంధ్ర రాష్ట్రము లో రాయలసీమ ప్రాంత అటవీ వైశాల్యం ఎన్ని చదరపు కిలోమీటర్లు ?
A.14,996
B.19,590
C.15,996
D.18,890
Q6.ఆంధ్ర రాష్ట్రము లో వేటి ఆధారంగా అడవులను నాలుగు రకాలుగా వర్గీకరించారు?
A.నేలల స్వభావం
B.వర్షపాతం
C.ఉష్ణోగ్రత
D.పైవన్నీ
Q7. ఆర్ద్ర ఆకురాల్చు అడవులు సాదారణంగా ఎన్ని సెంటీ మీటర్ల వర్షపాతం ఉండే ప్రాంతాల్లో అభివృద్ధి చెంది ఉన్నాయి?
A.75-100
B.50-75
C.100-125
D.125-200
Q8. ఆంధ్ర రాష్ట్రము లో ఆర్ద్ర ఆకురాల్చు అడవులు జిల్లాల వారిగా అధికంగా ఏ క్రమంలో వ్యాపించి ఉన్నాయి?
A.విశాఖపట్నం, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి , తూర్పు గోదావరి.
B.శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి , పశ్చిమ గోదావరి.
C.తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం.
D.పశ్చిమ గోదావరి , తూర్పు గోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం.
Q9. ఆర్ద్ర ఆకురాల్చు అడవులలో ముఖ్యంగా ఎలాంటి వృక్ష జాతులు పెరుగుతాయి?
A.వేగి, మద్ది, ఏగిస
B.సాల్ , వెదురు , బందరు
C.జిట్టేగి , పల , కరక, సిరమాను
D.పైవన్నీ
Q10. అనార్ద్ర ఆకురాల్చు అడవులు సాదారణంగా ఎన్ని సెంటీ మీటర్ల వర్షపాతం ఉండే ప్రాంతాల్లో అభివృద్ధి చెంది ఉన్నాయి?
A.75-100
B.50-75
C.100-125
D.125-200
Q11. ఆంధ్ర రాష్ట్రము లో అనార్ధ్ర ఆకురాల్చు అడవులు ఏ జిల్లాలలో ఉన్నాయి?
1.కడప , కర్నూలు, చిత్తూరు,
2.అనంతపురం , నెల్లూరు
A.1 మాత్రమే
B.2 మాత్రమే
C.1 మరియు 2 రెండూ
D.1,2 కాదు
Q12. ప్రపంచంలోని ఎక్కడా దొరకని కలప ఆంధ్రప్రదేశ్ జిల్లాలలో దొరుకుతుంది అది ఏది గుర్తించండి?
A.నల్లచందనం
B.ఎర్రచందనం
C.మంచి గంధం
D.పైవన్నీ
Q13. ఎర్రచందనం కలపను వేటి తయారికి ఉపయోగిస్తారు?
A.బొమ్మలు
B.రంగులు
C.జంత్ర వాయిద్యాలు
D.పైవన్నీ
Q14. ఎర్ర చందనం మన రాష్ట్రము నుండి ఏ దేశానికీ ఎక్కువగా ఎగుమతి అవుతుంది?
A.అమెరిక
B.చైనా
C.ఆస్ట్రేలియా
D.న్యూజిల్యాండ్
Q15. ఎంతో విలువైన మంచి గంధం చెట్లు ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లాల అడవుల్లో ఉన్నాయి ?
A.చిత్తూరు
B.అనంతపురం
C. A మరియు B రెండూ
D. A మరియు B రెండూ కాదు
జవాబులు
Q1.ANS.(A)
ఆంధ్రప్రదేశ్ సామజిక ఆర్దిక సర్వే ప్రకారం 2015-2016 రాష్ట్రంలో అడవులు 36,914.78 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. రాష్ట్రము మొత్తం విస్తీర్ణంలో 23.04% అడవులు ఉన్నాయి. దేశ అటవీ విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ 9వ స్థానాన్ని ఆక్రమించింది.
Q2.ANS.(D)

Q3.ANS.(B)

Q4.ANS.(B)
ఆంధ్ర రాష్ట్రము లో కోస్తాంద్ర ప్రాంతం అటవీ వైశాల్యం 19,590 చదరపు కిలోమీటర్లు (30.67%) మరియు రాయలసీమ లో అటవీ వైశాల్యం 14,996 చదరపు కిలోమీటర్లు (23.53%).
Q5.ANS.(A)
ఆంధ్ర రాష్ట్రము లో కోస్తాంద్ర ప్రాంతం అటవీ వైశాల్యం 19,590 చదరపు కిలోమీటర్లు (30.67%) మరియు రాయలసీమ లో అటవీ వైశాల్యం 14,996 చదరపు కిలోమీటర్లు (23.53%).
Q6.ANS.(D)
ఆంధ్ర రాష్ట్రము లో నేలల స్వభావం, వర్షపాతం, ఉష్ణోగ్రత ఆధారంగా అడవులను నాలుగు రకాలుగా వర్గీకరించారు.అవి 1.ఆర్ద్ర ఆకురాల్చు అడవులు 2.అనార్ధ్ర ఆకురాల్చు అడవులు 3.చిట్టడవులు 4.తీరప్రాంత అడవులు.
Q7.ANS.(D)
ఆర్ద్ర ఆకురాల్చు అడవులు సాదారణంగా 125-200 సెంటీ మీటర్ల వర్షపాతం ఉండే ప్రాంతాల్లో అభివృద్ధి చెంది ఉన్నాయి.జిల్లాల వారిగా పరిశీలిస్తే శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి , పశ్చిమ గోదావరి జిల్లాలలో ఇలాంటి అడవులు అధికంగా వ్యాపించి ఉన్నాయి.
Q8.ANS.(B)

Q9.ANS.(D)
విశాఖపట్నం తూర్పు గోదావరి ఏజెన్సీ ప్రాంతాల్లో రంపచోడవరం ప్రాంతాల్లో ఉన్న దట్టమైన అడవులు ఈ కోవకు చెందుతాయి. ఆర్ద్ర ఆకురాల్చు అడవులు ముఖ్యంగా వేగి, మద్ది, ఏగిస, సాల్ , వెదురు , బందరు, జిట్టేగి , పల , కరక, సిరమాను లాంటి వృక్ష జాతులు పెరుగుతాయి.
Q10.ANS.(A)
అనార్ద్ర ఆకురాల్చు అడవులు సహజంగా వర్షపాతం తక్కువ ఉండే ప్రాంతాల్లో 75-100 సెంటీ మీటర్ల వర్షపాతం ఉండే ప్రాంతాల్లో అభివృద్ధి చెంది ఉన్నాయి. కడప, కర్నూలు , చిత్తూరు , అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో ఈ రకానికి చెందిన అడవులు ఎక్కువ వైశాల్యంలో ఉన్నాయి.
Q11.ANS.(C)

Q12.ANS.(B)
కడప, కర్నూలు , చిత్తూరు , అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో అనార్ద్ర ఆకురాల్చు అడవులు ఎక్కువ వైశాల్యంలో ఉన్నాయి. ప్రపంచంలోని ఎక్కడా దొరకని ఎర్రచందనం ఆంధ్రప్రదేశ్ లోని కడప, చిత్తూరు , నెల్లూరు జిల్లాలలో అడవుల్లో మాత్రమే లబిస్తుంది.
Q13.ANS.(D)
ప్రపంచంలోని ఎక్కడా దొరకని ఎర్రచందనం ఆంధ్రప్రదేశ్ లోని కడప, చిత్తూరు , నెల్లూరు జిల్లాలలో అడవుల్లో మాత్రమే లబిస్తుంది. ఎర్రచందనం కలపను బొమ్మలు, రంగులు, జంత్ర వాయిద్యాలు తయారికి ఉపయోగిస్తారు.
Q14.ANS.(B)
ప్రపంచంలోని ఎక్కడా దొరకని ఎర్రచందనం ఆంధ్రప్రదేశ్ లోని కడప, చిత్తూరు , నెల్లూరు జిల్లాలలో అడవుల్లో మాత్రమే లబిస్తుంది. ఎర్రచందనం కలపను బొమ్మలు, రంగులు, జంత్ర వాయిద్యాలు తయారికి ఉపయోగిస్తారు. ఎర్ర చందనం మన రాష్ట్రము నుండి చైనా దేశానికీ ఎక్కువగా ఎగుమతి అవుతుంది.
Q15.ANS.(C)
ఎంతో విలువైన మంచి గంధం చెట్లు ఆంధ్రప్రదేశ్ లో చిత్తూరు, అనంతపురం జిల్లాలలోని అడవుల్లో ఉన్నాయి.
మీరు ఇంతకు మునుపు ప్రశ్నలు చదివి ఉండనట్లయితే ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేయండి
ఆంధ్రప్రదేశ్ శీతోష్ణస్థితి – 1 : A.P Geography Important Questions Part-1
ఆంధ్రప్రదేశ్ శీతోష్ణస్థితి – 2 : A.P Geography Important Questions Part-2
ఆంధ్రప్రదేశ్ శీతోష్ణస్థితి – 3 : A.P Geography Important Questions Part-3
ఆంధ్రప్రదేశ్ శీతోష్ణస్థితి – 4 : A.P Geography Important Questions Part-4
ఆంధ్రప్రదేశ్ శీతోష్ణస్థితి – 5 : A.P Geography Important Questions Part-5