Telugu govt jobs   »   AndhraPradesh Geography | A.P Geography Important...

AndhraPradesh Geography | A.P Geography Important Questions In Telugu Part-7

AndhraPradesh Geography | A.P Geography Important Questions In Telugu Part-7_2.1

ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షల యొక్క వెయిటేజీకి భౌగోళిక శాస్త్రం ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. కాబట్టి ADDA247,ఆంధ్రప్రదేశ్ భౌగోళిక శాస్త్రం కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి .

ఆంధ్రప్రదేశ్ అడవులు – జంతుజాలం-2

ప్రశ్నలు

Q1. ఆంధ్రప్రదేశ్ లో అనార్ధ్ర ఆకురాల్చు అడవులులో ముఖ్యంగా కనిపించే వృక్షజాతులను కనుగొనండి?

A.టేకు, ఏగిస, బండారు, చిరమను,

B.ఎర్ర చందనం, మంచిగంధం, నల్లమద్ది

C. A మరియు B రెండూ

D. A మరియు B రెండూ కాదు.

Q2. ఆంధ్రప్రదేశ్  లో ఎన్ని సెంటీ మీటర్ల కంటే తక్కువ ఉన్న వర్షపాతాన్ని చిట్టడవులు అంటారు?

A.85

B.75

C.70

D.80

Q3. ఆంధ్రప్రదేశ్ లో రెల్లుగడ్డి అధికంగా కనిపించే అరణ్యాలు ఏవి?

A.అనార్ధ ఆకురాల్చు అడవులు

B.ఆర్ద్ర ఆకురాల్చు అడవులు

C.చిట్టడవులు

D.తీర ప్రాంత అడవులు

Q4. ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని చిట్టడవులలో కనిపించే ముఖ్యమైన వృక్షజాతుల పేర్లను తెలపండి?

A.తుమ్మ, కలబంద,బ్రహ్మజెముడు ,నాగజెముడు

B.వేగు, చండ్ర,రేగు, బలుసు

C. A మరియు B రెండూ

D. A మరియు B రెండూ కాదు.

Q5. ఆంధ్రప్రదేశ్ లోని తీరప్రాంత అడవులుకు గల మరొక పేరుని ఈ క్రింది వాటిలో తెల్పండి?

A.క్షార జలారణ్యాలు

B.టైడల్ అడవులు

C. A మరియు B రెండూ

D. A మరియు B రెండూ కాదు.

Q6. ఆంధ్రప్రదేశ్ అరణ్యాలలో ఈ క్రింది వాటిలో వేటిని పోటు,పాటు అరణ్యాలు అంటారు?

A.అనార్ద్ర ఆకురాల్చు అడవులు

B.ఆర్ద్ర ఆకురాల్చు అడవులు

C.చిట్టడవులు

D.తీర ప్రాంత అడవులు

Q7. ఆంధ్రప్రదేశ్ అరణ్యాలలో ఈ క్రింది వాటిలో వేటిని మాంగ్రూవ్ అరణ్యాలు అంటారు?

A.అనార్ద్ర ఆకురాల్చు అడవులు

B.ఆర్ద్ర ఆకురాల్చు అడవులు

C.చిట్టడవులు

D.తీర ప్రాంత అడవులు

Q8. మాంగ్రూవ్ అరణ్యాలలో ముఖమైన వృక్షలు ఏవి?

A.ఉప్పుపోన్న , బొడ్డు పోన్న ఊరడ

B.మడ, తెల్లమడ, గుండు మడ

C. A మరియు B రెండూ

D. A మరియు B రెండూ కాదు.

Q9. ఆంధ్ర ప్రదేశ్ లోని టైడల్ అరణ్యాలను ఏమని పిలుస్తారు?

A.కోరింగ అడవులు

B.ఆర్ద్ర ఆకురాల్చు అడవులు

C.చిట్టడవులు

D.తీర ప్రాంత అడవులు

Q10. ఆంధ్రప్రదేశ్ లో విస్తిర్ణ పరంగా అతిపెద్ద అడవులు ఏవి?

A.కోరంగి అడవులు

B.నల్లమల అడవులు

C.చిత్తడి అడవులు

D.పైవేవి కాదు

Q11. ఆంధ్రప్రదేశ్ లో ఆడవులు ఎక్కువగా ఉన్న జిల్లాలు ఏవి?

A.కడప, చిత్తూరు

B.కడప,కర్నూలు

C.కడప,అనంతపురం

D.పైవేవి కాదు

Q12. ఆంధ్రప్రదేశ్ లో విస్తీర్ణ పరంగా ఆడవులు తక్కువగా ఉన్న జిల్లాలు ఏవి?

A.కడప, చిత్తూరు

B.కృష్ణా, శ్రీకాకుళం

C.విశాఖ, కడప

D.కృష్ణా, అనంతపురం

Q13. ఆంధ్ర రాష్ట్రంలో అటవీ సాంద్రత ఎక్కువగా ఉన్న జిల్లాలు ఏవి?

A.కడప, చిత్తూరు

B.కృష్ణా, శ్రీకాకుళం

C.విశాఖ, కడప

D.కృష్ణా, అనంతపురం

Q14. ఆంధ్ర రాష్ట్రంలో అటవీ సాంద్రత తక్కువగా ఉన్న జిల్లాలు ఏవి?

A.కడప, చిత్తూరు

B.కృష్ణా, శ్రీకాకుళం

C.విశాఖ, కడప

D.కృష్ణా, అనంతపురం

Q15. ఆంధ్రప్రదేశ్ లో టేకు అధికంగా కనిపించే జిల్లా ఏది?

A.తూర్పు గోదావరి

B.పశ్చిమ గోదావరి

C.కృష్ణా

D.శ్రీకాకుళం

AndhraPradesh Geography | A.P Geography Important Questions In Telugu Part-7_3.1

జవాబులు

Q1.ANS.(C)

ఆంధ్రప్రదేశ్ లో అనార్ధ్ర ఆకురాల్చు అడవులులో ముఖ్యంగా కనిపించే వృక్షజాతులు టేకు, ఏగిస, బండారు, చిరమను, ఎర్ర చందనం, మంచిగంధం, నల్లమద్ది.

Q2.ANS.(B)

75 సెంటీ మీటర్ల వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో ఈ రకమైన అడవులు విస్తరించి ఉన్నాయి. చిత్తూరు , అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ అడవుల్లో ముళ్ళ పొదలు మరియు రెల్లుగడ్డి ఎక్కువగా కనిపిస్తాయి.

Q3.ANS.(C)

75 సెంటీ మీటర్ల వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో ఈ రకమైన అడవులు విస్తరించి ఉన్నాయి. చిత్తూరు , అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ అడవుల్లో ముళ్ళ పొదలు మరియు రెల్లుగడ్డి ఎక్కువగా కనిపిస్తాయి.

Q4.ANS.(C)

ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని చిట్టడవులలో కనిపించే ముఖ్యమైన వృక్షజాతులు తుమ్మ, కలబంద,బ్రహ్మజెముడు ,నాగజెముడు, వేగు, చండ్ర,రేగు, బలుసు.

Q5.ANS.(C)

ఆంధ్రప్రదేశ్ లోని తీరప్రాంత అడవులుకు గల క్షార జలారణ్యాలు , టైడల్ అడవులు

Q6.ANS.(D)

ఆంధ్రప్రదేశ్ అరణ్యాలలో తీర ప్రాంత అడవులును పోటు,పాటు అరణ్యాలు, మాంగ్రూవ్ అరణ్యాలు అంటారు. ఇవి ముఖ్యంగా నదీ ముఖ ద్వారాల్లో విస్తరించి ఉన్నాయి. కృష్ణా డెల్టా ప్రాంతాల్లో ఈ అరణ్యాలు అత్యధికంగా విస్తరించి ఉన్నాయి.

Q7.ANS.(D)

ఆంధ్రప్రదేశ్ అరణ్యాలలో తీర ప్రాంత అడవులును పోటు,పాటు అరణ్యాలు, మాంగ్రూవ్ అరణ్యాలు అంటారు. ఇవి ముఖ్యంగా నదీ ముఖ ద్వారాల్లో విస్తరించి ఉన్నాయి. కృష్ణా డెల్టా ప్రాంతాల్లో ఈ అరణ్యాలు అత్యధికంగా విస్తరించి ఉన్నాయి.

Q8.ANS.(C)

ఆంధ్రప్రదేశ్ అరణ్యాలలో తీర ప్రాంత అడవులును పోటు,పాటు అరణ్యాలు, మాంగ్రూవ్ అరణ్యాలు   అంటారు. ఇవి ముఖ్యంగా నదీ ముఖ ద్వారాల్లో విస్తరించి ఉన్నాయి. కృష్ణా డెల్టా ప్రాంతాల్లో ఈ అరణ్యాలు అత్యదికంగా విస్తరించి ఉన్నాయి. ఉప్పుపోన్న , మాంగ్రూవ్ అరణ్యాలులో ముఖమైన వృక్షాలు ఉప్పుపోన్న , బొడ్డు పోన్న, ఊరడ ,మడ, తెల్లమడ, గుండు మడ.

Q9.ANS.(A)

ఆంధ్ర ప్రదేశ్ లోని టైడల్ అరణ్యాలను కోరింగ అడవులు అని పిలుస్తారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకి ఇవి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.

Q10.ANS.(B)

ఆంధ్రప్రదేశ్ విస్తిర్ణ పరంగా అతిపెద్ద అడవులు నల్లమల అడవులు. ఆంధ్రప్రదేశ్ లో ఆడవులు ఎక్కువగా ఉన్న జిల్లాలు కడప, చిత్తూరు. ఆంధ్రప్రదేశ్ లో విస్తీర్ణ పరంగా ఆడవులు తక్కువగా ఉన్న జిల్లాలు కృష్ణా, శ్రీకాకుళం. రాష్ట్రంలో అటవీ సాంద్రత ఎక్కువగా ఉన్న జిల్లాలు విశాఖ, కడప. రాష్ట్రంలో అటవీ సాంద్రత తక్కువగా ఉన్న జిల్లాలు కృష్ణా, అనంతపురం.

Q11.ANS.(A)

ఆంధ్రప్రదేశ్ లో ఆడవులు ఎక్కువగా ఉన్న జిల్లాలు కడప, చిత్తూరు. ఆంధ్రప్రదేశ్ విస్తిర్ణ పరంగా అతిపెద్ద అడవులు నల్లమల అడవులు. ఆంధ్రప్రదేశ్ లో విస్తీర్ణ పరంగా ఆడవులు తక్కువగా ఉన్న జిల్లాలు కృష్ణా, శ్రీకాకుళం. రాష్ట్రంలో అటవీ సాంద్రత ఎక్కువగా ఉన్న జిల్లాలు విశాఖ, కడప. రాష్ట్రంలో అటవీ సాంద్రత తక్కువగా ఉన్న జిల్లాలు కృష్ణా, అనంతపురం.

Q12.ANS.(B)

ఆంధ్రప్రదేశ్ లో విస్తీర్ణ పరంగా ఆడవులు తక్కువగా ఉన్న జిల్లాలు కృష్ణా, శ్రీకాకుళం. ఆంధ్రప్రదేశ్ లో ఆడవులు ఎక్కువగా ఉన్న జిల్లాలు కడప, చిత్తూరు. రాష్ట్రంలో అటవీ సాంద్రత ఎక్కువగా ఉన్న జిల్లాలు విశాఖ, కడప. రాష్ట్రంలో అటవీ సాంద్రత తక్కువగా ఉన్న జిల్లాలు కృష్ణా, అనంతపురం.

Q13.ANS.(D)

రాష్ట్రంలో అటవీ సాంద్రత ఎక్కువగా ఉన్న జిల్లాలు విశాఖ, కడప. ఆంధ్రప్రదేశ్ లో ఆడవులు ఎక్కువగా ఉన్న జిల్లాలు కడప, చిత్తూరు. ఆంధ్రప్రదేశ్ విస్తిర్ణ పరంగా అతిపెద్ద అడవులు నల్లమల అడవులు. ఆంధ్రప్రదేశ్ లో విస్తీర్ణ పరంగా ఆడవులు తక్కువగా ఉన్న జిల్లాలు కృష్ణా, శ్రీకాకుళం. రాష్ట్రంలో అటవీ సాంద్రత తక్కువగా ఉన్న జిల్లాలు కృష్ణా, అనంతపురం.

Q14.ANS.(D)

రాష్ట్రంలో అటవీ సాంద్రత తక్కువగా ఉన్న జిల్లాలు కృష్ణా, అనంతపురం. ఆంధ్రప్రదేశ్ లో ఆడవులు ఎక్కువగా ఉన్న జిల్లాలు కడప, చిత్తూరు. ఆంధ్రప్రదేశ్ విస్తిర్ణ పరంగా అతిపెద్ద అడవులు నల్లమల అడవులు. ఆంధ్రప్రదేశ్ లో విస్తీర్ణ పరంగా ఆడవులు తక్కువగా ఉన్న జిల్లాలు కృష్ణా, శ్రీకాకుళం. రాష్ట్రంలో అటవీ సాంద్రత ఎక్కువగా ఉన్న జిల్లాలు విశాఖ, కడప.

Q15.ANS.(A)

ఆంధ్రప్రదేశ్ లో టేకు అధికంగా లభించే జిల్లా తూర్పుగోదావరి. టేకు ని “కింగ్ అఫ్ ఫారెస్ట్”  అంటారు.

మీరు ఇంతకు మునుపు ప్రశ్నలు చదివి ఉండనట్లయితే ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేయండి

ఆంధ్రప్రదేశ్ శీతోష్ణస్థితి – 1    :      A.P Geography Important Questions Part-1

ఆంధ్రప్రదేశ్ శీతోష్ణస్థితి – 2    :      A.P Geography Important Questions Part-2

ఆంధ్రప్రదేశ్ శీతోష్ణస్థితి – 3    :      A.P Geography Important Questions Part-3

ఆంధ్రప్రదేశ్ శీతోష్ణస్థితి – 4   :       A.P Geography Important Questions Part-4

ఆంధ్రప్రదేశ్ శీతోష్ణస్థితి – 5   :        A.P Geography Important Questions Part-5

ఆంధ్రప్రదేశ్ అడవులు-జంతుజాలం-1 :  A.P Geography Important Questions Part-6

AndhraPradesh Geography | A.P Geography Important Questions In Telugu Part-7_4.1

Sharing is caring!

AndhraPradesh Geography | A.P Geography Important Questions In Telugu Part-7_5.1