Telugu govt jobs   »   State GK   »   AP River System
Top Performing

AP Geography Study Notes – River System Of Andhra Pradesh, Download PDF | ఆంధ్రప్రదేశ్ నదీ వ్యవస్ద

River System Of Andhra Pradesh

Geographically, Andhra Pradesh is in peninsular India consisting of the coastal belt on the east and Rayalaseema in the south-west. Therefore, Andhra Pradesh has the advantage of having most of the east-flowing rivers in the state bringing in copious supplies from the Western and Eastern Ghats and up to the Bay of Bengal. Andhra Pradesh is a riverine state with 40 major, medium and minor rivers. Godavari, Krishna, Vamsadhara, Nagavali, and Pennar are major interstate rivers. Godavari River enters Bhurgampad Mandal of the state of Andhra Pradesh and flows for a distance of around 250 km eastward before joining the Bay of Bengal. In this article, we discussed some Important rivers in Andhra Pradesh.

ఆంధ్రప్రదేశ్‌ నదీ వ్యవస్ద

ఆంధ్రప్రదేశ్‌ భూభాగంలో ఎక్కువ భాగం వాయవ్య భాగాన ఎత్తుగా ఉండి ఆగ్నేయ దిశగా వాలిఉన్నాయి. అందువల్ల ఆంధ్రప్రదేశ్‌లో ప్రవహించే నదులన్నీ సాధారణంగా వాయవ్య దిశ నుంచి ఆగ్నేయ దిశకు ప్రవహిస్తున్నాయి. కృష్ణా, గోదావరి, తుంగభద్ర, పెన్న మంజీర, నాగావళి, వంశధార నదులు ఆంధ్రప్రదేశ్‌ లో ముఖ్యమైన నదులు.

TSPSC గ్రూప్ 1 కోసం చదవాల్సిన పుస్తకాలు, సబ్జెక్ట్ వైజ్ బుక్‌లిస్ట్_30.1

Adda247 APP

గోదావరి నది

  • దక్షిణ భారత దేశ నదులన్నింటిలో పెద్ద నది. అందుకనే దీన్ని ‘దక్షిణ గంగ’ అని కూడా పిలుస్తారు.
  •  గోదావరి నది మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల వద్ద ఉండే నాసికా త్రయంబక్‌ దగ్గర పుట్టింది
  •  ఆదిలాబాద్‌ జిల్లాలోని బాసర వద్ద తెలంగాణలో ప్రవేశించి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం మీదుగా పయనించి పాపికొండల సమీపంలో ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుంది.
  •  గోదావరి నది మొత్తం పొడవు 1465 కి.మీ. కాగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో 770 కి.మీ. దూరం పయనిస్తుంది.

గోదావరి నది ఉపనదులు – మంజీర ప్రాణహిత, శబరి, సీలేరు, ఇంద్రావతి, కిన్నెరసాని ముఖ్యమైనవి.

  •  రాజమండ్రికి ఏడు పాయలుగా చీలి బంగాళాఖాతంలో కలుస్తుంది. అందుకే దీనిని సప్త గోదావరి అని పిలుస్తారు

గోదావరి ఏడు పాయలు

  1. గౌతమి
  2. వశిష్ట
  3. వైనతేయ
  4. కౌశిక
  5. ఆత్రేయ
  6. తుల్య
  7. భరద్వాజ
  • గోదావరి డెల్ద్టా రాజమండ్రి వద్ద ప్రారంభమవుతుంది
  •  ఈ సమీపంలో ధవళేశ్వరం ప్రాజెక్టు కట్టారు.
  •  గోదావరి లోయ పొడవునా మంచి కలపనిచ్చే దట్టమైన మన్యం అడవులు ఉన్నాయి.
  •  పాపికొండల ప్రాంతంలో మనోహర దృశ్యాల వల్ల గోదావరికి ‘భారత దేశ రైన్‌ నది (The Rhine Of India)’ అని పేరు వచ్చింది. సప్త గోదావరి ప్రాంతాన్ని కోనసీమ అని కూడా పిలుస్తారు.
  •  కోనసీమను ‘ఆంధ్రప్రదేశ్‌ ఉద్యాన వనం’గా పిలుస్తారు.

కృష్ణా నది

పశ్చిమ కనుమల్లోని మహాబలేశ్వరం వద్ద కృష్ణా నది పుట్టింది. మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల మీదుగా పయనిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ముక్తల్‌ తంగడి అనే ప్రాంతం వద్ద ప్రవేశించి, కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరం వద్ద తుంగభద్ర నదిని తనలో కలుపుకుంటుంది

  •  కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ప్రవహిస్తూ కృష్ణా జిల్లాలోని విజయవాడకు 64 కి.మీ.దూరంలోని పులిగడ్డ వద్ద రెండు పాయలుగా చీలి, ‘హంసలదీవి’ అనే ప్రాంతం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.
  •  ఈ రెండు శాఖల మధ్య ఉన్న సారవంతమైన మైదానాన్ని ‘దివి సీమ‘ అంటారు.
  •  కృష్ణా నది మొత్తం పొడవు 1400 కి.మీ. కాగా తెలుగు రాష్ట్రాల్లో 720 కి.మీ.ల దూరం పయనిస్తుంది

కృష్ణా నది ఉప నదులు: మూసి, మున్నేరు, దిండి, పాలేరు, కొయన, వర్ణ, పంచగంగ్య భీమ, ఘటప్రభ,తుంగభద్ర. కృష్ణా నది అతి ముఖ్యమైన ఉపనది – తుంగభద్ర

తుంగభద్ర నది

పశ్చిమ కనుమల్లోని దక్షిణ కెనరా, మైసూరు జిల్లాల సరిహద్దున ఉన్న వరాహ పర్వతాల్లో పుట్టి కర్ణాటక రాష్ట్రం ద్వారా పయనించి కర్నూలు జిల్లాలో సంగం/సంగమేశ్వరం వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది.

  •  తుంగభద్ర ఉపనదుల్లో పెద్దది – హగరి

పెన్నా నది

పెన్నా నది కర్ణాటక రాష్ట్రంలో నందిదుర్గ కొండల్లోని ‘చెన్న కేశవగిరి’ వద్ద పుట్టి,అక్కడి నుంచి కర్ణాటక రాష్ట్రం గుండా ప్రవహించి ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా హిందూపురం తాలూకాలో ప్రవేశిస్తుంది.

  •  ఇది అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాల ద్వారా ప్రవహించి నెల్లూరు జిల్లాలోని ఊటుకూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.
  •  పెన్నా నది పొడవు సుమారు 600 కి.మీ
  • రాష్ట్రంలో పెన్నా నది పరివాహక శాతం – 18.3%

ఉపనదులు: జయమంగళి, చిత్రావతి, చెయ్యేరు, సగిలేరు, పాపమ్ని, కుందేరు

  •  పెన్నా నదిని పినాకిని, పెన్నేరు అని కూడా పిలుస్తారు.

వంశధార

  • తూర్పు కనుమల్లో పుట్టి బంగాళాఖాతంలో కలిసే నదుల్లో వంశధార పెద్దది.
  •  ఒడిశాలోని జయపూరు కొండల్లో పుట్టి సుమారు 96 కి.మీ. ప్రవహించి, పాతపట్నం వద్ద శ్రీకాకుళం జిల్లాలో ప్రవేశిస్తుంది.
  •  శ్రీకాకుళం జిల్లాలో 130 కి.మీ. దూరం ప్రవహించి చివరకు కళింగపట్నం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.

నాగావళి నది

  •  నాగావళి నదికి మరొక పేరు లాంగుల్యా నది.
  •  ఈ నది ఒడిశాలోని రాయ్‌గఢ్‌ కొండల్లో జన్మించి ఆ రాష్ట్రం మీదుగా ప్రవహించి శ్రీకాకుళంలోని మోపసు బందరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.
  •  ఈ నది ఒడిశాలో 96 కి.మీ.ల దూరం, ఆంధ్రప్రదేశ్‌లో 110 కి.మీ. దూరం ప్రవహిస్తుంది.

ముఖ్య ఉపనదులు: స్వర్ణముఖి, జంరూవతి, వేదవతి, ఒట్టిగడ్డ

మాచ్‌ఖండ్‌

మాచ్‌ఖండ్‌ నది విశాఖపట్నం జిల్లాలోని మాడుగ కొండల్లో జన్మిస్తుంది. ఒడిశాలో ఉత్తర దిశగా పయనించి బంగాళాఖాతంలో కలుస్తుంది.

  •  మాచ్‌ఖండ్‌కు మరొక పేరు – ‘ముచికుంద’
  •  మాచ్‌ఖండ్‌ నదిపై ఉన్న జలపాతం – ‘డుడుమా జలపాతం”

గుండ్లకమ్మ నది

గుండ్లకమ్మ నది (తెలుగు: గుండ్లకమ్మ నది) భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు-మధ్య భాగం గుండా ప్రవహించే కాలానుగుణ జలమార్గం. ఇది తూర్పు కనుమలలోని నల్లమల కొండలలో పుడుతుంది. దీని ప్రధాన జలాలు ప్రకాశం జిల్లా అర్ధవీడు గ్రామం నుండి 425 మీటర్ల ఎత్తులో 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. కర్నూలు జిల్లాలోని నల్లమల కొండల్లో పుట్టి గుంటూరు, ప్రకాశం జిల్లాల ద్వారా 235 కి.మీ. ప్రవహించి ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ప్రాచీనకాలంలో దీన్ని ‘గుండిక’, బ్రహ్మకుండి అని పిలిచేవారు.

సువర్ణముఖి నది

స్వర్ణముఖి దక్షిణ భారతదేశంలోని ఒక నది. ఇది తిరుపతి జిల్లాలోని పాకాల సమీపంలో తూర్పు కనుమల శ్రేణులలో 300 మీటర్ల ఎత్తులో పుట్టి 130 కిలోమీటర్లు బంగాళాఖాతం వైపు ప్రవహించే స్వతంత్ర నది. తిరుమల మరియు శ్రీకాళహస్తి పవిత్ర హిందూ దేవాలయాలు నదీ పరీవాహక ప్రాంతంలో ఉన్నాయి. ధూర్జటి కృతులలో మొగలేరుగా పేర్కొనబడింది. కళ్యాణి డ్యామ్ 25 మిలియన్ క్యూబిక్ మీటర్ల లైవ్ స్టోరేజీతో 1977లో దాని ఉపనది కల్యాణి నదిపై నిర్మించబడింది. ఇది చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి గుట్టల్లో జన్మించి నెల్లూరు జిల్లా ద్వారా ప్రవహిస్తూ, ఆ జిల్లాలోని ‘అందాల మాల’ సమీపంలో బంగాళాఖాతంలో కలుస్తుంది.

కుందూ నది

కుందూ నది భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతంలో పెన్నా నదికి ఉపనది. దీనిని “కుందేరు” మరియు “కుముర్దృతి” అనే పేర్లతో కూడా పిలుస్తారు. ఇది కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం ఉప్పలపాడు గ్రామ పరిధిలో బుగ్గగా ప్రారంభమై కడపలోని కమలాపురం వద్ద పెన్నాలో కలుస్తుంది. నంద్యాల మరియు కోయిల్‌కుంట్ల జిల్లాలలో పునరావృతమయ్యే వరదలు సంభవించే తీవ్రమైన నష్టం కారణంగా దీనిని “నంద్యాల దుఃఖం” అని పిలుస్తారు.

జిల్లాలు – నదులు

  • శ్రీకాకుళం – బహుదా, వరహాలుగడ్డ, ఉత్తర మహేంద్ర
  •  విశాఖపట్నం – చంపావతి, గోస్తని, శారద, తాండవ
  •  తూర్పు గోదావరి – ఏలేరు
  •  పశ్చిమ గోదావరి – ఎర్రకాలువ, తమ్మిలేరు, జిల్లేరు
  •  కృష్ణా – బుడమేరు
  •  గుంటూరు – నాగులేరు
  •  నెల్లూరు – మున్నేరు, ఉప్పులేరు
  •  చిత్తూరు – స్వర్ణముఖి
  • కర్నూలు – హంద్రీ, కుందేరు, సగిలేరు
  •  కడప – పాపాఘ్బీ, చిత్రావతి, చేయ్యేరు

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నీటి వనరుల వివరాలు

విషయం కోస్తా (ఎకరాలు) రాయలసీమ (ఎకరాలు)
సేద్యయోగ్యమైన భూమి 1,15,73,891 98,95,226
వివిధ నీటివనరుల కింద సాగవుతోన్న భూమి (బోర్లుమినహా) 70,24,287 (60.7%) 16,96,404 (17.2%)
జలయబ్దంలో అదనంగా నీరు అందే భూమి 26,63,002  (23.00%) 19,22,344 (19.4%)
ఆ భూమికి ఇవ్వబోయే నీరు (టీఎమ్సీ) 485 (32.3%) 182 (50.3%)
జలయజ్ఞం తర్వాత మొత్తం మీద సాగులోకి వచ్చేభూమి 96,87,599 (83.72%) 36,18,748 (36.6%)
సేద్యయోగ్య భూమిలో ఇంకా నీటి వసతి లేకుండా మిగిలేప్రాంతం 18,86,892 (16.3%) 62,76,478 (6.4%)

AP Geography – River System Of Andhra Pradesh, Download PDF

AP Geography eBook for APPSC GROUP-1, GROUP-2, AP Grama Sachivalayam, JL, DL, DEO and other APPSC Exams By Adda247.

 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు Youtube Official Channel ఇక్కడ క్లిక్ చేయండి

 

 

Sharing is caring!

AP Geography - River System Of Andhra Pradesh, Download PDF_5.1

FAQs

How many rivers are there in the state of Andhra Pradesh?

Andhra Pradesh is a riverine state with 40 major, medium and minor rivers.

Which is the longest river in Andhra Pradesh?

Godavari River is the longest river in Andhra Pradesh

Which is the shortest river in Andhra Pradesh?

Pennar is the shortest river in Andhra Pradesh

Which river is known as sorrow of Andhra Pradesh?

Budameru is a rivulet in Krishna district which originates in the hills surrounding Mylavaram and empties itself into Kolleru Lake. Budameru is also known as The Sorrow of Vijayawada