ఆంధ్రప్రదేశ్: సుపరిపాలనలో ఆంధ్రప్రదేశ్ మరోసారి దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. ‘స్కోచ్’ సంస్థ నిర్వహించిన సర్వేలో రాష్ట్రం వరుసగా రెండో ఏడాదీ తొలి స్థానంలో నిలవడం గమనార్హం. విప్లవాత్మక సంస్కరణలను అమలు చేయడం ద్వారా సీఎం అత్యంత పారదర్శకంగా పరిపాలన అందిస్తుండటం, సంక్షేమాభివృద్ధి పథకాలను సమర్థంగా అమలు చేస్తూ ఇంటి ముంగిటకే ఫలాలను చేరవేస్తుండటం వల్లే దేశంలో అన్నింటా ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలుస్తోందని, ‘స్కోచ్’ 2021 సర్వే ఫలితాలే అందుకు నిదర్శనమని సామాజికవేత్తలు విశ్లేషిస్తున్నారు.
స్కోచ్ సంస్థ నిర్వహించిన సర్వేలో సుపరిపాలనలో ఏపీ మినహా దక్షిణాది రాష్ట్రాల్లో ఏ ఒక్కటీ తొలి ఐదు స్థానాల్లో నిలవకపోవడం గమనార్హం. రెండో స్థానంలో పశ్చిమ బెంగాల్, మూడో స్థానంలో ఒడిశా, 4వ స్థానంలో గుజరాత్, 5వ స్థానంలో మహారాష్ట్ర నిలవగా తెలంగాణ ఆరో స్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత స్థానాల్లో ఉత్తరప్రదేశ్(7), మధ్యప్రదేశ్ (8), అస్సాం(9), హిమాచల్‌ప్రదేశ్ (10), బిహార్(11), హరియాణా (12) ఉన్నాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న పరిపాలన సంస్కరణలు, అన్ని వర్గాల సంక్షేమం కోసం చేపట్టిన పథకాలు, సమగ్రాభివృద్ధికి తీసుకున్న చర్యలపై స్కోచ్ సంస్థ ఏటా అధ్యయనం చేస్తోంది.
సర్వేలో తొలి ఐదు స్థానాల్లో నిలిచిన వాటిని స్టార్ రాష్ట్రాలుగా గుర్తించారు.
స్టార్ రాష్ట్రాలు ఇవీ..
(1) ఆంధ్రప్రదేశ్
(2) పశ్చిమ్‌బెంగాల్
(3) ఒడిశా
(4) గుజరాత్
(5) మహారాష్ట్ర
సర్వేలో 6 నుంచి 10 స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలను సత్ఫలితాలు సాధిస్తున్న రాష్ట్రాలు(పర్‌ఫార్మర్స్)గా పేర్కొన్నారు.
పర్‌ఫార్మర్ రాష్ట్రాలు ఇవీ..
(6) తెలంగాణ
(7) ఉత్తరప్రదేశ్
(8) మధ్యప్రదేశ్
(9) అసోం
(10) హిమాచల్‌ప్రదేశ్
సర్వేలో 11 నుంచి 15 స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలను అవకాశాలను అందిపుచ్చుకుంటూ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలు(క్యాచింగ్ అప్)గా గుర్తించారు.
క్యాచింగ్ అప్ రాష్ట్రాలు ఇవీ..
(11) బిహార్
(12) హర్యానా
(13) జమ్మూకశ్మీర్
(14) ఛత్తీస్‌గఢ్
(15) రాజస్థాన్
*******************************************************************************************
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
********************************************************************************************