ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వారాంతపు కరెంట్ అఫైర్స్ డిసెంబర్ 2023 – 1వ మరియు 2వ వారం| డౌన్‌లోడ్ PDF
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వారాంతపు కరెంట్ అఫైర్స్: APPSC గ్రూప్స్ , SI మరియు కానిస్టేబుల్ పరీక్షలలో కరెంట్ అఫైర్స్ చాలా ముఖ్యమైన విభాగాలలో ఒకటి మరియు మీరు మీ సమయాన్ని హృదయపూర్వకంగా కేటాయించినట్లయితే ఈ అంశం నుండి చాలా మంచి మార్కులు సాధించగలరు. పరీక్షల ముందు అప్పటికప్పుడు ఈ అంశాన్ని చదువుకొని వెళ్ళడం ద్వారా ఎక్కువ మార్కులు సాధించడం అసాధ్యం. కరెంట్ అఫైర్స్ మీరు 10-15 రోజుల్లో పూర్తి చేయగల విభాగం కాదు. మీరు కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించడానికి ఉత్తమ మార్గం రోజూ వార్తాపత్రికలను చదవడం లేదా వారపు వార్తల ద్వారా వెళ్ళడం.
దీని ద్వారా నెలవారీ లేదా 6 నెలల వార్తల ద్వారా తెలుసుకొనే సమాచారం కంటే ఎక్కువ సమాచారం తెలుసుకోవచ్చు. ఇక్కడ మేము మీకు అన్ని వార్తాపత్రికల నుండి సమకాలీన అంశాల సారాంశాన్ని మరియు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కరెంట్ అఫైర్స్ ను ఇక్కడ అందిస్తున్నాము, ఇది మీ సమయాన్ని ఆదా చేస్తుంది మరియు మీరు ఆ సమయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వారాంతపు సమకాలీన అంశాలు 2023 అధ్యయనం కోసం కేటాయించవచ్చు.
APPSC/TSPSC Sure shot Selection Group
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వారాంతపు కరెంట్ అఫైర్స్
1. విజయనగరం జిల్లాలో 25 PHCలు NAQS గుర్తింపు పొందాయి
విజయనగరం జిల్లా నుండి 25 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHCలు) కేంద్ర ప్రభుత్వంచే గుర్తించబడ్డాయి మరియు మంచి ఆరోగ్య సౌకర్యాలను సృష్టించడం మరియు వాటి పరిధిలో సేవలను అందించడం కోసం నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ (NQAS) ధృవీకరణను పొందాయి. NQAS గుర్తింపు అనేది ఆరోగ్య సంరక్షణ డెలివరీ, రోగి భద్రతలో వారి శ్రేష్ఠతకు గుర్తింపు. కేంద్ర ప్రభుత్వం ఒక్కో PHCకి ఏడాదికి రూ.లక్ష చొప్పున మూడేళ్లపాటు అందజేస్తుంది. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌వో) డాక్టర్ ఎన్.భాస్కరరావు మాట్లాడుతూ. ఇతర రాష్ర్టాలకు చెందిన ఇద్దరు అధికారులు, మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరికొందరు అధికారులు ఒక్కో పీహెచ్‌సీలో సేవలు, సౌకర్యాలను అంచనా వేస్తారని తెలిపారు. వారి నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ధ్రువీకరణ కోసం PHCలను ఎంపిక చేస్తుంది.
2. విశాఖపట్నంలో తూర్పు నౌకాదల కమాండ్లో రూ.2192 కోట్లకు పైగా వ్యయంతో 37 ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి
విశాఖపట్నంలో 37 ప్రాజెక్టులు మొత్తం రూ. 2192 కోట్ల వ్యయంతో తూర్పు నౌకాదళ కమాండ్ (ENC) దాని సాంకేతిక మౌలిక సదుపాయాలను మెరుగుపరచుకుంటోంది. ఈ ప్రాజెక్టులు నౌకాదళ స్థావరం యొక్క సామర్థ్యాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ENC యొక్క ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్, నేవీ డే వేడుకల్లో భాగంగా భారత నావికాదళం యొక్క పోరాట సామర్థ్యాలను ప్రదర్శించే కార్యాచరణ డెమో కోసం ప్రణాళికలను ప్రకటించారు. ప్రతికూల వాతావరణం కారణంగా, ఈవెంట్ డిసెంబర్ 10కి వాయిదా వేశారు.
3. సెర్ప్ మరియు ఏపీ ప్రభుత్వం ఉన్నతి పథకం కింద 660 ఆటోలను పంపిణీ చేయనున్నారు
ఆంధ్రప్రదేశ్‌లో, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ద్వారా నిర్వహించబడుతున్న ప్రభుత్వ ‘ఉన్నతి’ కార్యక్రమం అట్టడుగు వర్గాలకు, ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాల (SC) మరియు షెడ్యూల్డ్ తెగల (ST) మహిళలకు సాధికారత కల్పిస్తోంది. ఈ చొరవ ద్వారా, 660 ఆటో-రిక్షాలు SC మరియు ST మహిళలకు స్థిరమైన జీవనోపాధి అవకాశాలను అందించే సాధనంగా నిలవనుంది. ప్రారంభ దశలో, 231 ఆటో-రిక్షాలు ఇప్పటికే పంపిణీ చేశారు, మిగిలిన 429 ఏప్రిల్ 14, 2024 నాటికి అందించనున్నారు.
4. స్వావలంబన్ కార్యక్రమం కోసం IIM విశాఖపట్నం SIDBIతో MOU కుదుర్చుకుంది
SIDBI యొక్క “మిషన్ స్వభలంబన్” కార్యక్రమంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ విశాఖపట్నం (IIMV) మరియు స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI) అవగాహన ఒప్పందాన్ని (MOU) చేసుకున్నాయి. ఈ ఒప్పందం ద్వారా STEM అనే కార్యక్రమం అమలుకి ఈ MOU ఉపయోగపడుతుంది. STEM లేదా స్కిల్ టు ఎంటర్‌ప్రైజ్ మోడల్ ద్వారా యువతకు వారి వ్యవస్థాపక ప్రయత్నాల సాధనలో అవగాహన కల్పించడం మరియు మద్దతు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఈ అవగాహన ఒప్పందంలో భాగంగా, IIM విశాఖపట్నం, వ్యవస్థాపకులు కావాలనుకునే వ్యక్తులకు కస్టమైజ్డ్ మరియు స్పెషలైజ్డ్ PG సర్టిఫికేట్ కోర్సు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో స్కిల్ టు ఎంటర్‌ప్రైజ్ మోడల్ (STEM) ప్రోగ్రామ్‌ను అందిస్తుంది.
5. ఏపీలో 4 స్మార్ట్ సిటీల కోసం కేంద్రం రూ.6,865 కోట్లు కేటాయించింది
పార్లమెంటులోఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపికైన తిరుపతి, కాకినాడ, విశాఖపట్నం, అమరావతి నగరాలను స్మార్ట్ సిటీల అభివృద్ధిలో భాగం కోసం ఇప్పటికే రూ.6865 కోట్లు కేటాయించినట్టు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ వెల్లడించారు. ఈ మొత్తం లో ఇప్పటివారు రూ.4742.43 కోట్ల పనులు పూర్తయ్యాయి మరియు రూ.2,122.98 కోట్లపనులు వివిధ దశలలో ఉన్నాయి అని తెలిపారు.
6. CGWB నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భూగర్బ జలాల పరిరక్షణ లో ముందు నిలిచింది
ఈ సంవత్సరం రాష్ట్రం లో వర్షాభావ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా రాష్ట్రం లో భూగర్భజలాలు మెరుగైన స్థితిలో ఉన్నాయి అని కేంద్ర భూగర్భ జలవనరుల మండలి నివేదిక తెలిపింది. భూగర్భ జలాల పరిరక్షణ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరుసగా రెండవ సంవత్సరం కూడా మొదటి స్థానం లో నిలిచింది. CGWB నివేదికలో ముఖ్యాంశాలు:
- CGWB నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 6553 మండలాలలో 667 మండలాలలో అధ్యయనం చేసింది. దేశంలో 2 నుంచి 5 మీటర్లలో నీరు లభించే ప్రాంతాలలో ఆంధ్రప్రదేశ్, అసోం, UP (ఉత్తర ప్రాంతం), బీహార్ (ఉత్తర ప్రాంతం) నిలిచాయి. 20-40 మీటర్లకి పడిపోయిన రాష్ట్రాలలో రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, పంజాబ్ ఉన్నాయి.
- భారతదేశంలో భూగర్భ జలాలు సురక్షితంగా ఉన్న మండలాలు 4,793 (73.1%) అలాగే ఆందోళనకరంగా ఉన్న ప్రాంతాలు 736(11.2%)గా ఉన్నాయి.
- భారతదేశంలో కొంతమేర సమస్యాత్మకంగా ఉన్న మండలాలు 698 (10.7%). సమస్యాత్మకంగా ఉన్న మండలాలు 199 (3%)గా ఉన్నాయి.
- భారతదేశంలో ఉప్పునీళ్లుగా మారిన మండలాలు 127(1.9%), అదే రాష్ట్రంలో 39 (5.85%)మండలాలు ఉన్నాయి.
- రాష్ట్రంలో సురక్షితంగా ఉన్న మండలాలు 597(89.5%), ఆందోళనకరంగా ఉన్న మండలాలు 10(1.5%), సమస్యాత్మకంగా ఉన్నవి 3(0.45), ఉప్పునీళ్లుగా మారినవి 39(5.85%).
- రాష్ట్రంలో భూగర్భజలాలు ఆందోళనకరంగా ఉన్న మండలాలు వెల్దుర్తి (పల్నాడు), రణస్థలం(శ్రీకాకుళం), పులివెందుల(వైఎస్ఆర్), రాచర్ల, పెద్దారవీడు, కంభం (ప్రకాశం), తనకళ్ళు, హిందూపురం, రోళ్ళ, గాండ్లపెంట (సత్యసాయి).
- రాష్ట్రంలో ఈ ఏడాది 835.03కి గాను 714.88 మీటర్లు వర్షపాతం నమోదైంది అని తెలిపింది.
APPSC Group 2 Prelims Free Live Batch
7. ఒక హెక్టారుకు ధాన్యం దిగుబడిలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది: నాబార్డ్ నివేదిక
తాజాగా నాబార్డు 2022-2023కి దేశంలోని వివిధ రాష్ట్రాలలో హెక్టారుకు ధాన్యం దిగుబడి పై ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక లో పంజాబ్ మొదటి స్థానంలో నిలవగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండవ స్థానంలో నిలిచింది. పంజాబ్ లో హెక్టారు కు 4,193కిలోలు పంట రాగా ఆంధ్రప్రదేశ్ లో 3,730.40 కిలోలు పంట వచ్చింది. తమిళనాడు 3,500.40కిలోలతో మూడవ స్థానం, తెలంగాణ 3405.60తో నాలుగోవ స్థానం లో నిలిచాయి. దేశం మొత్తం మీద చూసుకుంటే ఒక హెక్టారు కి 2838.17 కిలోల ధాన్యం దిగుబడి లభించింది అని నివేదికలో తెలిపింది.
8. ఏపీ సీఎం పలాస లో వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టు మరియు వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ను ప్రారంభించారు
శ్రీకాకుళం జిల్లా మకారాంపురంలో కిడ్నీ బాధితుల సమస్యలని తీర్చడానికి 700 కోట్లతో వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టుని సీఎం జగన్ ప్రారంభించారు దానితో పాటు పలాసలో వైఎస్ఆర్ కిడ్నీ రిసెర్చ్ సెంటర్, 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ప్రారంభించారు. ఈ చర్యతో శ్రీకాకుళం జిల్లా లో కిడ్నీవ్యాధుల బారిన పడ్డవారికి మెరుగైన వైద్యంతో పాటు కిడ్నీ సమస్యలు తలెత్తకుండా తాగునీరు కూడా అందుతుంది.
దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు ప్రబలుతున్న ఉద్దానం ప్రాంతంలోని ఏడు మండలాల పరిధిలోని 807 గ్రామాలకు శుద్ధి చేసిన తాగునీటిని శ్రీకాకుళం ప్రజల చిరకాల వాంఛను వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టు నెరవేరుస్తోంది అని తెలిపారు మరియు ఫేజ్ 2 కింద ఈ పద్ధకాన్ని 265కోట్లతో పాతపట్నం నియోజికవర్గంలో 448 గ్రామాలకు కూడా అందించే ఏర్పాట్లు చేయనున్నారు.
9. AP కేబినెట్ జనవరి నుండి ఆరోగ్యశ్రీ మరియు పెన్షన్ మొత్తాన్ని పెంచనుంది
వైఎస్‌ఆర్ ఆసరా, చేయూత పథకాల అమలుకు మరియు జనవరి నుంచి వృద్ధాప్య సామాజిక భద్రత పింఛన్‌లను రూ.2,750 నుంచి రూ.3,000కు పెంచేందుకు రాష్ట్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య చికిత్స పరిమితిని రూ. 25 లక్షలకు పెంచనుంది అదికూడా వార్షిక ఆదాయం రూ.5 లక్షలు ఉన్న వారందరికీ ఇది వర్తిస్తుంది. ఈ చర్యతో దాదాపు 90శాతం కుటుంబాలకు ఖరీదైన వైద్యం అందనుంది. ఈ పధకంలో భాగంగా కొత్త ఆరోగ్యశ్రీ కార్డులను 18వ తేదీన జగన్ మోహన్ రెడ్డి లబ్ది దారులకు అందజేయనున్నారు. ఆరోగ్యశ్రీ పథకానికి ఏడాదికి రూ.4,400 కోట్లు కేటాయించారు 3,257 జబ్బులకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యం అందించనున్నారు.
AP State Weekly CA December 2023 1 and 2nd week in Telugu PDF
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |