Telugu govt jobs   »   Current Affairs   »   ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వారాంతపు కరెంట్ అఫైర్స్‌
Top Performing

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వారాంతపు కరెంట్ అఫైర్స్ డిసెంబర్ 2023 – 3వ వారం | డౌన్‌లోడ్ PDF

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వారాంతపు కరెంట్ అఫైర్స్ డిసెంబర్ 2023 – 3వ వారం| డౌన్‌లోడ్ PDF

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వారాంతపు కరెంట్ అఫైర్స్: APPSC గ్రూప్స్ , SI మరియు కానిస్టేబుల్ పరీక్షలలో కరెంట్ అఫైర్స్ చాలా ముఖ్యమైన విభాగాలలో ఒకటి మరియు మీరు మీ సమయాన్ని హృదయపూర్వకంగా కేటాయించినట్లయితే ఈ అంశం నుండి చాలా మంచి మార్కులు సాధించగలరు. పరీక్షల  ముందు అప్పటికప్పుడు  ఈ అంశాన్ని చదువుకొని వెళ్ళడం ద్వారా ఎక్కువ మార్కులు సాధించడం అసాధ్యం.  కరెంట్ అఫైర్స్ మీరు 10-15 రోజుల్లో పూర్తి  చేయగల విభాగం కాదు. మీరు కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించడానికి  ఉత్తమ మార్గం రోజూ వార్తాపత్రికలను చదవడం లేదా వారపు వార్తల ద్వారా వెళ్ళడం.

దీని ద్వారా  నెలవారీ లేదా 6 నెలల వార్తల ద్వారా తెలుసుకొనే సమాచారం కంటే ఎక్కువ సమాచారం తెలుసుకోవచ్చు. ఇక్కడ మేము మీకు అన్ని వార్తాపత్రికల నుండి సమకాలీన అంశాల సారాంశాన్ని మరియు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కరెంట్ అఫైర్స్ ను ఇక్కడ అందిస్తున్నాము, ఇది మీ సమయాన్ని ఆదా చేస్తుంది మరియు మీరు ఆ సమయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వారాంతపు సమకాలీన అంశాలు 2023 అధ్యయనం కోసం కేటాయించవచ్చు.

Adda247 Telugu

APPSC/TSPSC Sure shot Selection Group

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వారాంతపు కరెంట్ అఫైర్స్

1. ICAR  బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు 2023 ని  దక్కించుకున్న SVVU

ICAR awarded Breed Conservation Award-2023 to SVVU-01

భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ICAR) శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న గుంటూరు లోని లాం పరిశోధనా కేంద్రానికి బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు 2023 అందజేసింది. ఈ ఏడాది ఒంగోలు జాతిని పశువులను కాపాడుతున్న లాం పరిశోధన కేంద్రానికి దక్కింది. కిసాన్ దివస్ రోజున హరియానా లో కర్నల్ ళక్ష కార్యక్రమం లో ఈ అవార్డుని అందజేస్తారు.  గత సంవత్సరం పుంగనూరు పశువులను పరిరక్షించేందుకు పలమనేరులోని పుంగనూరు పరిశోధన కేంద్రానికి ఈ అవార్డు దక్కింది.

2019 లో IVF- ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ (IVF&ET) పధకం ద్వారా 2.39 కోట్లతో ఒంగోలు జాతి పశువుల అభివృద్ధి కోసం కేటాయించారు.  1926 లో లాం పరిశోధన కేంద్రం ఏర్పాటైంది, మరియు 1972 నుంచి ఒంగోలు జాతి పరిరక్షణ కోసం కృషి చేస్తోంది. గత నాలుగున్నర సంవత్సరాలుగా IVF, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ ద్వారా మేలు జాతి ఒంగోలు ఆవులను అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటివరకు 450 ఒంగోలు పశుసంపద కలిగి ఉంది.

2. ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో పలువురు కలెక్టర్లు బదిలీ

Andhra Pradesh Several collectors are transferred in the state

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో పలువురు కలెక్టర్ల బదిలీఅయ్యారు, మరియు శిక్షణ పూర్తిచేసుకున్న వారికి  ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి పోస్టింగ్ ఉత్తర్వులు జారీచేసారు.
బదిలీ అయిన సబ్ కలెక్టర్లు:
  1. శుభం బన్సాల్ (రంపచోడవరం) జాయింట్ కలెక్టర్ తిరుపతి జిల్లా కి బదిలీ అయ్యారు
  2. శోభిక (కందుకూరు) ప్రత్యేక అధికారి మధ్యాహ్న భోజనం
  3. గీతాంజలి శర్మ (తెనాలి) సచివాలయాల అదనపు డైరెక్టర్
  4. అభిషేక్ కుమార్ (అదోని) జాయింట్ కలెక్టర్ సత్యసాయి జిల్లా
  5. కొల్లాబత్తుల కార్తీక్ (పెనుగొండ) జాయింట్ కలెక్టర్ అల్లూరిసీతారామరాజు జిల్లా
  6. సేదు మాధవన్ (మార్కాపురం) CEO ఎంఎస్ఎంఈ కార్పొరేషన్

3. ప్రఖ్యాత రచయిత మరియు పర్యావరణవేత్త డా. తల్లావఝుల పతంజలి శాస్త్రి సాహిత్య అకాడమీ-2023 అందుకున్నారు

Renowned writer and environmentalist Dr. Tallavajhula Patanjali Sastri Received Sahitya Akademi-2023

రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ రచయిత, పర్యావరణవేత్త డాక్టర్ తాళ్లవజ్జుల పతంజలి శాస్త్రి కేంద్ర సాహిత్య అకాడమీ-2023 జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. చిన్న కధల విభాగంలో ఆయనకు ఈ అవార్డు లభించింది. ఈయన రచించిన రామేశ్వరం కాకులు కి ఈ సాహిత్య అవార్డు లభించింది. 2024 మార్చి 12న న్యూఢిల్లీలోని కోపర్నికస్ మార్గ్లోని కమానీ ఆడిటోరియంలో ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డు కింద తామ్ర పతకం, లక్ష నగదు పురస్కారాన్ని అందజేస్తారు.

పతంజలి శాస్త్రికి 9 కవితా సంకలనాలు, 6 నవలలు, 5 చిన్న కథలు, మూడు వ్యాసాలు, ఒక సాహిత్య అధ్యయనం అవార్డు లభించాయి. ఆంధ్రప్రదేశ్ మడ అడవుల పరిరక్షణ కోసం ఈయన ఎంతో శ్రమించారు జనవరి 2017 నుంచి డిసెంబర్ 2021 మధ్య ప్రచురితమైన పుస్తకాలను ఈ అవార్డుకు ఎంపిక చేయడానికి పరిగణనలోకి తీసుకున్నారు, ఈ ఏడాది సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన 24 మందిలో పతంజలి శాస్త్రి ఒక్కరే తెలుగువారు.

AP State Weekly CA December 2023 1 and 2nd week in Telugu PDF

4. భోగాపురం విమానాశ్రయం లో NIIF 675 కోట్లు పెట్టుబడి పెట్టనుంది

NIIF to Invest Rs.675 crs in Bhogapuram Airport

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో భోగాపురంలో ఏర్పాటవ్వనున్న విమానాశ్రయ నిర్మాణానికి నేషనల్ ఇన్వెస్ట్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (NIIF) రూ.675కోట్లను పెట్టుబడి పెట్టనుంది. (GVAIL) జిఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఈ పెట్టుబడి ని పెట్టేందుకు GVAL మరియు NIIF మధ్య ఈ పెట్టుబడి మొత్తాని కంపల్సరీ కన్వర్టిబల్ డెబెంచర్స్ రూపంలో పెట్టింది. జిఎంఆర్ విశాఖపట్నం విమానాశ్రయం ప్రాజెక్టుని డిజైన్, నిర్మాణం, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ ప్రాతిపాదికన 40 సంవత్సరాలకు లీజు ని 2020 లో GVAL దక్కించుకుంది. ఈ నిర్మాణం పూర్తి అయితే ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద విమానాశ్రయంగా నిలుస్తుంది.

RINL మరియు జిందాల్ స్టీల్ మధ్య ఒప్పందం
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నేస్-3 (BF-3)ని ప్రారంభించడానికి మరియు ఆపరేట్ చేయడానికి అవసరమైన వర్కింగ్ క్యాపిటల్ సపోర్టు కోసం జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ (JSPL)తో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు RINL యొక్క CMD అతుల్ భట్ తెలియజేశారు. JSPLతో ఏర్పాటు చేయడం వలన BF-3 యొక్క స్థిరమైన ఆపరేషన్‌కు అవసరమైన వర్కింగ్ క్యాపిటల్ అడ్వాన్స్ / ముడి పదార్థాల రూపంలో RINLకి దాదాపు రూ. 800 నుండి 900 కోట్లు లభిస్తుంది, దీనికి ప్రతిచర్యగా RINL RINL యొక్క స్టీల్ మెల్టింగ్ షాప్-2(SMS-2) నుండి ప్రతి నెలా దాదాపు 90,000 టన్నుల కాస్ట్ బ్లూమ్‌లను సరఫరా చేయనుంది. ఈ చర్యతో నెలవారీ విక్రయాల టర్నోవర్ రూ. 500 కోట్ల వరకు పెరుగుతుంది మరియు నెలకు రూ. 50 నుండి 100 కోట్ల వరకు నష్టాలను తగ్గించుకునే అవకాశం ఉంది అని అంచనా వేశారు.

5. ఏపీ సీఎం జగన్ ఎన్‌ఆర్‌టీఎస్‌కు బీమా పథకాన్ని ప్రకటించారు

AP CM Jagan Announced Insurance Scheme for NRTS

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విదేశాలలో ఉండే ప్రవాసాంద్రులకి రాయిటీతో బీమా సదుపాయం కల్పించింది. ఏపిఎన్‌ఆర్‌టీఎస్‌, ఆంధ్రప్రదేశ్ నుంచి విదేశాలకి వెళ్ళే ఉద్యోగులు, వలస కార్మికులకు 50% సబ్సిడీతో బీమా కల్పించనుంది. మరియు విధ్యార్ధులకు పూర్తి ఉచితంగా మొదటి 3 సంవత్సరాలకు బీమా అందించనుంది. ఉద్యోగులు, వలస కార్మికులు 3సంవత్సరాలకి 550 రూపాయలు మరియు విధ్యార్ధులు సంవత్సరానికి 180 రూపాయలు చెల్లించాలి కానీ ప్రభుత్వం విధ్యార్ధులకి పూర్తి రాయితీ మరియు ఇతరులకి 50% సబ్సిడీ అందించనుంది. న్యూ ఇండియా అష్యూరెన్స్ తో ఈ పధకాన్ని అందించనున్నారు. అర్హులందరు 26 డిసెంబర్ నుంచి 15 జనవరి 2024 లోగా నమోదుచేసుకోవాలి.

AP State Weekly CA December 2023 3rd week in Telugu

APPSC Group 2 (Pre + Mains) Selection Kit Batch | Online Live Classes by Adda 247

 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వారాంతపు కరెంట్ అఫైర్స్ డిసెంబర్ 2023 – 3వ వారం | డౌన్‌లోడ్ PDF_10.1