ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వారాంతపు కరెంట్ అఫైర్స్ నవంబర్ 2023 – 3వ వారం | డౌన్‌లోడ్ PDF
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వారాంతపు కరెంట్ అఫైర్స్: APPSC గ్రూప్స్ , SI మరియు కానిస్టేబుల్ పరీక్షలలో కరెంట్ అఫైర్స్ చాలా ముఖ్యమైన విభాగాలలో ఒకటి మరియు మీరు మీ సమయాన్ని హృదయపూర్వకంగా కేటాయించినట్లయితే ఈ అంశం నుండి చాలా మంచి మార్కులు సాధించగలరు. పరీక్షల ముందు అప్పటికప్పుడు ఈ అంశాన్ని చదువుకొని వెళ్ళడం ద్వారా ఎక్కువ మార్కులు సాధించడం అసాధ్యం. కరెంట్ అఫైర్స్ మీరు 10-15 రోజుల్లో పూర్తి చేయగల విభాగం కాదు. మీరు కరెంట్ అఫైర్స్ పై పట్టు సాధించడానికి ఉత్తమ మార్గం రోజూ వార్తాపత్రికలను చదవడం లేదా వారపు వార్తల ద్వారా వెళ్ళడం.
దీని ద్వారా నెలవారీ లేదా 6 నెలల వార్తల ద్వారా తెలుసుకొనే సమాచారం కంటే ఎక్కువ సమాచారం తెలుసుకోవచ్చు. ఇక్కడ మేము మీకు అన్ని వార్తాపత్రికల నుండి సమకాలీన అంశాల సారాంశాన్ని మరియు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కరెంట్ అఫైర్స్ ను ఇక్కడ అందిస్తున్నాము, ఇది మీ సమయాన్ని ఆదా చేస్తుంది మరియు మీరు ఆ సమయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వారాంతపు సమకాలీన అంశాలు 2023 అధ్యయనం కోసం కేటాయించవచ్చు.
APPSC/TSPSC Sure shot Selection Group
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వారాంతపు కరెంట్ అఫైర్స్
1. NAOP యొక్క 33వ వార్షిక సమావేశానికి GITAM విశ్వవిద్యాలయం ఆతిథ్యం ఇవ్వనుంది.
GITAM విశ్వవిద్యాలయం ఫిబ్రవరి 14 నుండి ఫిబ్రవరి 16, 2024 వరకు నేషనల్ అకాడమీ ఆఫ్ సైకాలజీ (NAOP) యొక్క 33వ వార్షిక సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 14 నుండి 3 రోజుల సమావేశానికి సుమారు 300 మంది జాతీయ మరియు అంతర్జాతీయ సైకాలజీ ప్రతినిధులు హాజరవుతారు.
నేషనల్ అకాడమీ ఆఫ్ సైకాలజీ అనేది వివిధ దేశీయ మరియు అంతర్జాతీయ ఏజెన్సీలు మరియు మనస్తత్వశాస్త్రం మరియు అనుబంధ రంగాలకు సంబంధించిన సంస్థలతో సంబంధాలను పెంపొందించే వృత్తిపరమైన సంస్థ. ఈ సదస్సు నిర్వహణకు గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ కు చెందిన అప్లైడ్ సైకాలజీ విభాగం ఏర్పాట్లు చేస్తోంది.
2. వరల్డ్ ట్రేడ్ సెంటర్ అసోసియేషన్ గుర్తింపు పొందిన ఏపీ మెడ్ టెక్ జోన్
విశాఖపట్నం లో ఏర్పాటు అయిన ఏపిమెడ్ టెక్ జోన్ కి అరుదైన గుర్తింపు లభించింది. ఏపిమెడ్ టెక్ జోన్ లో ఉన్న AMTZ వరల్డ్ ట్రేడ్ సెంటర్ కి, వరల్డ్ ట్రేడ్ సెంటర్ అసోసియేషన్ ఆమోదం తెలిపింది. WTC తాత్కాలిక కార్యాలయం 2022 మే 11న ఏర్పాటు చేశారు ఇది వైద్య ఉపకరణాల ఎగుమతులు, వాణిజ్యం పరంగా కీలకం. 150 రోజులలో AMTZనిర్మాణం పూర్తి చేసి ఇండియా ఎక్స్పో కూడా నిర్వహించారు, దీనికి అంతర్జాతీయ ప్రముఖులు హాజరయ్యారు. ఏపి మెడ్ టెక్ జోన్ వైద్య ఉపకరణాలు తయారీ ఎగుమతులు ప్రపంచ దేశాలకు అందిస్తోంది. ఇది లాక్డౌన్ ఉన్నప్పటికీ, AMTZ వైద్య పరికరాల ఉత్పత్తికి అవసరమైన అన్ని శాస్త్రీయ సేవలను అందించడం ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద వైద్య పరికరాల క్లస్టర్‌గా నిలిచింది. ఇది ఒకే చోట 18 సర్వీసులను కలిగి ఉండగా, చైనాలో 11 మరియు USAలో ఏడు సర్వీసులు ఉన్నాయి. ఏపి మెడ్ టెక్ జోన్ ఆంధ్రప్రదేశ్ రాష్టానికి మరియు భారతదేశానికి ఒక మణిహారం కానుంది.
3. దేశంలోనే మొదటి సారిగా భూ హక్కుల చట్టం ఆంధ్రప్రదేశ్ లో అమల్లోకి రానుంది
భారతదేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో భూ హక్కుల చట్టం (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ) అమలులోకి తీసుకుని వచ్చారు. అక్టోబర్ 31 నుంచి ఈ చట్టం వర్తిస్తుంది అని ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన GO.512 లో తెలిపారు. ఈ చట్టం ద్వారా భూమి యజమానులు, కొనుకున్నవారి హక్కులను పూర్తిగా పరిరక్షిస్తుంది. భూ హక్కుదారులు తప్ప భూమిని ఎవ్వరూ విక్రయించలేరు. ఈ చట్టం అమలుతో పాటు ఏపి ల్యాండ్ ఆధారిటీని ఏర్పాటు చేసి ఒక ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని కూడా నియమిస్తారు. భారతదేశంలో మరేఇతర రాష్ట్రాలలో ఇటువంటి చట్టం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భూ యాజమాణ్య హక్కు దారులను పరిరక్షించడానికి ఈ చట్టం తీసుకుని వచ్చింది.
Andhra Pradesh State Weekly CA November 2023 1st Week
4. విజయవాడ స్వరాజ్ మైదానంలో అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రారంభించనున్న సీఎం
విజయవాడ లో స్వరాజ్ మైదానంలో నగరానికే తలమానికం కానున్న 125 అడుగుల అంబెడ్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఈ నవంబర్ 26వ తేదీన ఆవిష్కరించనున్నారు. రూ.400 కోట్లతో ఈ విగ్రహ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నవంబర్ 26వ తేదీ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అంబెడ్కర్ విగ్రహంతో పాటు జీవిత చరిత్ర తెలిపే డిజిటల్ మ్యూజియం, 1500 మంది కూర్చోగలిగే కన్వెన్షన్ సెంటర్, మినీ థియేటర్, ఫుడ్ కోర్టు, పార్కింగ్ వంటి అనేక మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. కింద బేస్ తో కలిపి మొత్తం విగ్రహం ఎత్తు 206 అడుగులు. ఈ స్మృతి వనంలో దాదాపు 3కి.మీ మేర సైక్లింగ్ ట్రాక్ కూడా నిర్మించారు.
5. APలో 32 కొత్త సాంప్రదాయ ఆహార క్లస్టర్‌లు ప్రారంభించారు
కాకినాడ గొట్టం కాజా…అనకాపల్లి బెల్లం.. మాడుగుల హల్వా..ఆత్రేయపురం పూతరేకులు.. తాపేశ్వరం మడత కాజా.. గువ్వలచెరువు పాలకోవా, బందరు తొక్కుడు లడ్డు.. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో ఏ మారుమూల పల్లెకు వెళ్లినా స్థానికంగా పేరొందిన ఎన్నో సంప్రదాయ ఆహార ఉత్పత్తులున్నాయి. చరిత్ర కలిగిన ఈ ఆంధ్ర వంటకాలకు భౌగోళిక గుర్తింపు తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతీ ఉత్పత్తికి ప్రత్యేక బ్రాండింగ్తో అంతర్జాతీయ మార్కెటింగ్, తద్వారా వీటి తయారీపై ఆధారపడిన వారికి మెరుగైన జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఆహార ఉత్పత్తులకు బ్రాండింగ్, భౌగోళిక గుర్తింపు తెచ్చేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు దామోదరం సంజీవయ్య లా వర్సిటీతో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ ఎంవోయూ చేసుకుంది. ఇటీవలే ఆత్రేయపురం పూతరేకులకూ జీఐ ట్యాగ్ వచ్చింది. ఇప్పుడు మాడుగుల హల్వాకు జీఐ ట్యాగ్ తీసుకొచ్చే దిశగా చర్యలు చేపట్టారు. ఆ తర్వాత దశల వారీగా మిగిలిన ఉత్పత్తులకు కూడా జీఐ ట్యాగ్ తీసుకురానున్నారు. ఆహార ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్లో 32 ట్రెడిషన్ ఫుడ్ క్లస్టర్స్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
6. ఏపీ హైకోర్టు ఏఎస్జీగా నరసింహ శర్మ నియమితులయ్యారు
ఆంధ్రప్రదేశ్ హై కోర్టులో కేంద్రప్రభుత్వం తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ (ASG)గా బి. నరసింహ శర్మ నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం తెలంగాణ హై కోర్టు లో ASGగా బాధ్యతలు నిర్వహిస్తున్న నరసింహ శర్మ కి అదనంగా ఆంధ్రప్రదేశ్ ASGగా కూడా బాధ్యతలు అప్పగించారు. నవంబర్ 15నుండి ఆరు నెలలకు లేదా కొత్త ASG ని నియమించే వరకు నరసింహ ఈ పదవి లో కొనసాగుతారు.
AP State Weekly CA November 2023 2nd Week PDF
7. కార్మెల్-విశాఖ సిస్టర్ సిటీ కమిటీ ఏర్పాటుపై కార్మెల్ సిటీ మేయర్, GVMC అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి.
ఇండియానాలోని కార్మెల్ మేయర్ జేమ్స్ బ్రెయినార్డ్ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం సందర్శించారు. విశాఖపట్నం (వైజాగ్) ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తుందని ఆయన అన్నారు. కార్మెల్ పౌరుల్లో దాదాపు 10% మంది భారతీయులేనని కూడా ఆయన చెప్పారు.
విశాఖపట్నం మేయర్ గొలగాని హరి వెంకట కుమారి మరియు ఇండియానాలోని కార్మెల్ సిటీ, మేయర్ జేమ్స్ బ్రెయినార్డ్ రెండు నగరాల మధ్య అధికారికంగా సంబంధాలను నెలకొల్పడానికి కార్మెల్-విశాఖపట్నం సిస్టర్ సిటీ కమిటీ ఏర్పాటుపై ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు.
8. ఆంధ్రప్రదేశ్‌లో 4640 కోట్ల పెట్టుబడి పెట్టనున్న పెప్పర్ మోషన్ సంస్థ
ఆంధ్రప్రదేశ్ లో రూ.4640 కోట్లతో ప్రముఖ జర్మనికి చెందిన పెప్పర్ మోషన్ అనే సంస్థ ఆంధ్రప్రదేశ్ లో తయారీ యూనిట్ ను నెలకొల్పనున్నట్టు తెలిపింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదిరినట్టు పెప్పర్ మోషన్ GmbH ఒక ప్రకటనలో తెలిపింది. ఆంధ్రప్రదేశ్ పర్భుతవ్యం చిత్తూరు జిల్లా పుంగనూరు లో 800 ఎకరాలు ఈ సంస్థకి కేటాయించారు. ఈ పరిశ్రమ లో విద్యుత్ బస్సు లు, ట్రక్ లు, 20GWH బ్యాటరీ తయారీ యూనిట్ వంటివి తయారు చేయనున్నారు, తద్వారా 8000పైగా నిరుద్యోగులకు ఉపాది దొరుకుతుంది. ఈ నెల చివరికి పనులు ప్రారంభించి 2025 నాటికి వాణిజ్యపరంగా సంస్థలో ఉత్పత్తి ప్రారంభించనున్నారు, సంవత్సరానికి దాదాపుగా 50,000 బస్లు మరియు ట్రక్లు తయారు చేయాలి అని లక్ష్యం పెట్టుకున్నారు. ఈ తయారీ యూనిట్ ద్వారా దేశం లోని ఇతర రాష్ట్రాలకి కాకుండా అంతర్జాతీయంగా కూడా విడిభాగాలు ఎగుమతి చేసే ప్రణాళికతో ఉన్నారు.
AP State Weekly CA November 2023 3rd Week Telugu PDF
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |