AP పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1896 పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ పోస్టుల కోసం AP గ్రామ సచివాలయం నోటిఫికేషన్ 2023ని విడుదల చేసింది. AP గ్రామ సచివాలయం 1896 పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ పోస్టుల నోటిఫికేషన్ అధికారిక వెబ్‌సైట్ https://ahd.aptonline.in/లో 18 నవంబర్ 2023న విడుదల చేయబడింది. AP పశుసంవర్ధక అసిస్టెంట్ ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 20 నవంబర్ 2023 మరియు AP పశుసంవర్ధక సహాయకులు ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ 11 డిసెంబర్ 2023. AP పశుసంవర్ధక అసిస్టెంట్ ఆన్లైన్ దరఖాస్తు లింక్, దరఖాస్తు విధానం, దరఖాస్తు రుసుము వివరాలు ఈ కధనంలో అందించాము.
APPSC/TSPSC Sure shot Selection Group
AP పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ ఆన్లైన్ దరఖాస్తు అవలోకనం
AP గ్రామ సచివాలయం పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ ఆన్లైన్ దరఖాస్తు 20 నవంబర్ 2023 నుండి 11 డిసెంబర్ 2023 వరకు అందుబాటులో ఉంటుంది. AP పశుసంవర్ధక అసిస్టెంట్ ఆన్లైన్ దరఖాస్తు అవలోకనం దిగువ పట్టికలో అందించాము.
AP పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ ఆన్లైన్ దరఖాస్తు అవలోకనం | |
సంస్థ పేరు | ఆంధ్ర ప్రదేశ్ పశుసంవర్ధక శాఖ |
పోస్ట్ పేరు | పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ |
మొత్తం ఖాళీలు | 1896 |
AP గ్రామ సచివాలయ పశు సంవర్ధక అసిస్టెంట్ నోటిఫికేషన్ 2023 విడుదల తేదీ | 18 నవంబర్ 2023 |
దరఖాస్తు ప్రారంభ తేదీ | 20 నవంబర్ 2023 |
దరఖాస్తు చివరి తేదీ | 11 డిసెంబర్2023 |
ఫీజు చెల్లింపు చివరి తేదీ | 10 డిసెంబర్ 2023 |
హాల్ టిక్కెట్ల విడుదల తేదీ | 27 డిసెంబర్ 2023 |
పరీక్ష తేదీ | 31 డిసెంబర్ 2023 |
వయో పరిమితి | 18 నుండి 42 సంవత్సరాలు |
అధికారిక వెబ్‌సైట్ | Ahd.aptonline.in |
AP పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ ఆన్లైన్ దరఖాస్తు లింక్
ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ (AHD) తన అధికారిక వెబ్‌సైట్ https://ahd.aptonline.in/లో 18 నవంబర్ 2023న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ వెటర్నరీ ఆసుపత్రులలో అందుబాటులో ఉన్న పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. AP గ్రామ సచివాలయం పశుసంవర్ధక అసిస్టెంట్ ఆన్లైన్ దరఖాస్తు 20 నవంబర్ 2023 నుండి 11 డిసెంబర్ 2023 వరకు అందుబాటులో ఉంటుంది. దిగువ ఇచ్చిన లింక్ ను ఉపయోగించి అభ్యర్ధులు తమ దరఖాస్తును సమర్పించవచ్చు.
AP పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ ఆన్లైన్ దరఖాస్తు లింక్
AP పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ పోస్ట్ కి ఆన్‌లైన్ దరఖాస్తు ఎలా చేయాలి?
- దశ-I: దరఖాస్తు చేసే అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేసేటప్పుడు వెబ్‌సైట్‌లో (ahd.aptonline.in లేదా https://apaha recruitment.aptonline.in) రిజిస్ట్రేషన్ IDని పొందేందుకు జాగ్రత్తగా నమోదును పూర్తి చేయాలి; అభ్యర్థి వివరాలు సరిగ్గా పూరించబడ్డాయని నిర్ధారించుకోవాలి. అభ్యర్థులు చేసిన పొరపాట్లకు శాఖ బాధ్యత వహించదు. రిజిస్ట్రేషన్‌లో నమోదు చేయబడిన వివరాలు చివరివి మరియు సవరించబడవు.
- దశ-II: రిజిస్ట్రేషన్ స్క్రీన్‌లో నమోదు చేసిన వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేయడం ద్వారా చెల్లింపును పూర్తి చేయండి.
- దశ-III: దరఖాస్తుదారు వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి (ahd.aptonline.in లేదా https://apaha recruitment.aptonline.in) రిజిస్ట్రేషన్ ID మరియు అభ్యర్థి ఇచ్చిన పాస్‌వర్డ్ (పుట్టిన తేదీ)లో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత, దరఖాస్తుదారు హోమ్ పేజీలోని “సబ్మిట్ ఆన్‌లైన్ అప్లికేషన్”పై క్లిక్ చేయాలి. దరఖాస్తును విజయవంతంగా సమర్పించిన తర్వాత, సమర్పించిన దరఖాస్తు ప్రింట్ అందుబాటులో ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ నోటిఫికేషన్ 2023
AP పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ దరఖాస్తు రుసుము 2023
ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ (AHD) అసిస్టెంట్ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడానికి, అభ్యర్థులు దరఖాస్తు రుసుము రూ.1,000/- (రూపాయిలు వెయ్యి మాత్రమే) దరఖాస్తు మరియు పరీక్ష రుసుము కోసం చెల్లించాలి. అతని/ఆమె స్థానిక జిల్లాతో పాటు నాన్-లోకల్ అభ్యర్థిగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థికి జిల్లాకు రూ.1000/- చొప్పున (గరిష్టంగా 3 జిల్లాలు) రుసుము వసూలు చేయబడుతుంది.
వర్గం | దరఖాస్తు రుసుము మరియు పరీక్ష రుసుము | స్థానికేతర జిల్లాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు (ప్రతి జిల్లాకు) |
---|---|---|
SC/ST/PH/Ex-Servicemen | రూ.500 | రూ.500 |
ఇతర అభ్యర్ధులు | రూ.1,000 | రూ.1,000 |
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |