AP Budget 2022-23 Key Highlights of Andhra Pradesh Budget: The state cabinet met on Monday under the chairmanship of Chief Minister YS Jaganmohan Reddy. At this meeting the Cabinet took several key decisions. To know the key poins of the cabinet meeting read this article
AP Budget 2022-23 Key Highlights of Andhra Pradesh Budget(ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2022 ముఖ్యమైన అంశాలు):వికేంద్రీకృత, సమ్మిళిత పరిపాలన కోసం రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా నిరంతర కృషి చేస్తోందని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. కోవిడ్ ప్రతికూలతను ఎదుర్కొని మరీ ఆర్థికాభివృద్ధి సాధించి జాతీయస్థాయిలో ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందిందని చెప్పారు. నేరుగా నగదు బదిలీ ద్వారా ఇప్పటివరకు రూ.1,32,126 కోట్లను పారదర్శకంగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. విద్య, వైద్య రంగాల్లో సంస్కరణలు, నాడు–నేడు ద్వారా విప్లవాత్మక మార్పులతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సోమవారం ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
APPSC/TSPSC Sure shot Selection Group
AP Budget 2022-23 Key Highlights of Andhra Pradesh Budget
2022-23 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన:
ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించనున్న 2022-23 వార్షిక బడ్జెట్‌ను ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు.2లక్షల 56 వేల 257 కోట్లతో బడ్జెట్‌ను రాష్ట్ర అసెంబ్లీ ముందుంచారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నాలుగో బడ్జెట్ ను సభలో ప్రవేశ పెట్టారు.
- మొత్తం బడ్జెట్ – రూ. 2,56,256 కోట్లు
- రెవెన్యూ వ్యయం – రూ. 2,08,261 కోట్లు
- మూలధన వ్యయం – రూ. 47,996 కోట్లు
- రెవెన్యూ లోటు – రూ. 17,036 కోట్లు
- ద్రవ్యలోటు – రూ. 48,724 కోట్లు
- వైఎస్సార్ రైతు భరోసా రూ. 3,900 కోట్లు
- వైఎస్సార్ పెన్షన్ కానుక పథకం రూ. 18 వేల కోట్లు
- ఎస్సీ సబ్ ప్లాన్ రూ. 18,518 కోట్లు
- ఎస్టీ సబ్ ప్లాన్ రూ. 6,145 కోట్లు
- బీసీ సబ్ ప్లాన్ రూ. 29,143 కోట్లు
- బీసీ సంక్షేమం రూ. 20,962 కోట్లు
- మైనార్టీ యాక్షన్ ప్లాన్ రూ. 3,532 కోట్లు
- ఈబీసీల సంక్షేమం రూ 6,639 కోట్లు
- సోషల్ వెల్ఫేర్ 12,728 కోట్లు
- ఈడబ్ల్యూఎస్ రూ. 10,201 కోట్లు
AP Budget 2022-23 Sector Wise Budget Allocation(AP బడ్జెట్ రంగాల వారీగా కేటాయింపులు)
- వ్యవసాయం: రూ. 11,387.69 కోట్లు.
- వైద్య శాఖ 15,384 కోట్లు
- పశుసంవర్ధకం: రూ. 1568.83 కోట్లు.
- బీసీ సంక్షేమం: రూ. 20,962.06 కోట్లు
- రోడ్లు, భవనాల శాఖ రూ. 8,581 కోట్లు
- పర్యావరణ, అటవీ: రూ. 685.36 కోట్లు.
- ఉన్నత విద్య: రూ. 2,014.30 కోట్లు.
- విద్యుత్: రూ. 10,281.04 కోట్లు.
- సెకండరీ ఎడ్యుకేషన్: రూ. 27,706.66 కోట్లు.
- ఎకానమికల్ బ్యాక్ వర్డ్: రూ. 10,201.60 కోట్లు.
- సివిల్ సప్లైస్: రూ. 3,719.24 కోట్లు.
- ఫైనాన్స్: రూ. 58,583.61 కోట్లు
- జీఏడీ: రూ. 998.55 కోట్లు.
- సచివాలయ వ్యవస్థ: రూ. 3,396.25 కోట్లు
- మహిళా శిశు సంక్షేమం రూ. 4,382 కోట్లు
- క్రీడల శాఖ రూ. 290 కోట్లు
- పరిశ్రమల శాఖ రూ. 2,755 కోట్లు
- హోంశాఖ 7,586 కోట్లు
AP Budget Allocation for Social Welfare Schemes(సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపు)
- వైఎస్సార్ పెన్షన్ కానుక -రూ. 18 వేల కోట్లు
- వైఎస్సార్ రైతు భరోసా -రూ. 3, 900 కోట్లు
- జగనన్న విద్యా దీవెన -రూ. 2, 500 కోట్లు
- జగనన్న వసతి దీవెన -రూ. 2, 083 కోట్లు
- వైఎస్సార్-పీఎం ఫసల్ బీమా యోజన-రూ. 1, 802 కోట్లు
- వైఎస్సార్ స్వయంసహకార సంఘాల(గ్రామీణ) ఉచిత వడ్డీరహిత రుణాలు రూ. 600 కోట్లు
- వైఎస్సార్ స్వయంసహకార సంఘాల(అర్బన్) ఉచిత వడ్డీరహిత రుణాలు రూ. 200 కోట్లు
- వైఎస్సార్ వడ్డీ రహిత రైతు రుణాలు-రూ. 500 కోట్లు
- వైఎస్సార్ కాపు నేస్తం -రూ. 500 కోట్లు
- వైఎస్సార్ జగనన్న చేదోడు-రూ. 300 కోట్లు
- వైఎస్సార్ వాహన మిత్ర-రూ. 260 కోట్లు
- వైఎస్సార్ నేతన్న నేస్తం- రూ. 199 కోట్లు
- వైఎస్సార్ మత్స్యకార భరోసా-రూ. 120.49 కోట్లు
- మత్స్యకారుల డీజిల్ సబ్సిడీ-రూ. 50 కోట్లు
- రైతుల ఎక్స్‌గ్రేషియా-రూ. 20కోట్లు
- లా నేస్తం- రూ. 15 కోట్లు
- జగనన్న తోడు-రూ. 25 కోట్లు
- ఈబీసీ నేస్తం రూ. 590 కోట్లు
- వైఎస్సార్ ఆసరా – రూ. 6, 400 కోట్లు
- వైఎస్సార్ చేయూత-రూ. 4, 235 కోట్లు
- అమ్మ ఒడి-రూ. 6, 500 కోట్లు
AP Budget Allocations for Social Service Sector(సామాజిక సేవారంగంలో కేటాయింపులు)
- విద్యకు-రూ. 30, 077 కోట్లు
- హౌసింగ్- రూ. 4,791.69 కోట్లు
- లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ః రూ. 1,033.86 కోట్లు
- వైద్యం-రూ. 15, 384.26 కోట్లు
- సామాజిక భద్రత మరియు సంక్షేమంః రూ. 4,331. 85 కోట్లు
- క్రీడలు, యువత -రూ. 140.48 కోట్లు
- సాంకేతిక విద్య- రూ. 413.5 కోట్లు
- పట్టణాభివృద్ధి- రూ. 8,796 కోట్లు
- తాగునీరు, పారిశుధ్యం- రూ. 2, 133.63 కోట్లు
- సంక్షేమం- రూ. 45,955 కోట్లు – గతేడాది రూ. 27, 964 కోట్లు
- మొత్తంగా సామాజిక సేవా రంగాల కోసంః రూ. 1,13,340.20 కోట్లు
- (మొత్తంగా బడ్జెట్ లో సామాజిక సేవా రంగానికి 44. 23 శాతం)
- ఇవికాకుండా, సాధారణ సేవలకు రూ. 73, 609.63 కోట్లు
- వ్యవసాయ అనుబంధ రంగాలుః రూ. 13, 630.10 కోట్లు
- ఇంధన రంగంః రూ. 10, 281.04 కోట్లు
- జనరల్ ఎకో సర్వీసెస్-రూ. 4,420. 07 కోట్లు
- ఇండస్ట్రీ అండ్ మినరల్స్- రూ. 2,755. 17 కోట్లు
- ఇరిగేషన్ ఫ్లడ్ కంట్రోల్-రూ. 11, 482.37 కోట్లు
- గ్రామీణాభివృద్ధి- రూ. 17, 109.04 కోట్లు
- సైన్స్ అండ్ టెక్నాలజీ- రూ. 11.78 కోట్లు
- ట్రాన్స్ పోర్టుః రూ. 9, 617. 15 కోట్లు
- మొత్తంగా ఆర్థిక సేవల రంగానికిః రూ. 69, 306. 74 కోట్లు( బడ్జెట్ లో 27.5 శాతం)
AP Budget 2022-23 Governar Speech(AP బడ్జెట్-గవర్నర్ ప్రసంగం)
గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగ వివరాలివీ.
► వికేంద్రీకృత, సుపరిపాలన లక్ష్యానికి అనుగుణంగా ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా పునర్య్వవస్థీకృతం చేస్తున్నాం. ఉగాది నుంచి కొత్త జిల్లాల పరిపాలన వ్యవస్థ పని చేయడం ప్రారంభిస్తుంది.
► ఉద్యోగులకు ఐదు విడతల కరువు భత్యాన్ని ఒకేసారి విడుదల చేయడంతోపాటు 23 శాతం ఫిట్‌మెంట్‌తో 11వ వేతన సవరణ అమలు చేశాం. ఉద్యోగ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచడంతోపాటు ఇతర ప్రయోజనాలు కల్పిస్తున్నాం.
► నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పించి కార్పొరేట్‌కు ధీటుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం మూడు దశల్లో రూ.15 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. విద్యార్థుల చేరికలు పెంచేందుకు జగనన్న అమ్మ ఒడి, విద్యా కానుక, గోరుముద్ద, విద్యా దీవెన, వసతి దీవెన లాంటి కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఆంగ్ల మాధ్యమంలో బోధన అందిస్తున్నాం.
► సార్వత్రిక వైద్య బీమా పథకం కింద 2020–21లో ఎస్‌డీజీ ఇండియా ఇండెక్స్ ర్యాంకింగ్‌లో ఆంధ్రప్రదేశ్ దేశంలో మొదటి ర్యాంక్ సాధించింది. వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు రూ.16,255 కోట్లు ఖర్చు చేస్తున్నాం. కొత్తగా 16 వైద్య కళాశాలలను ఏర్పాటు చేయడంతోపాటు 11 వైద్య కళాశాలలు, బోధనాసుపత్రులను కూడా అప్‌గ్రేడ్ చేస్తున్నాం. పలాసలో కిడ్నీ పరిశోధన కేంద్రం, డయాలసిస్ యూనిట్‌తో సహా 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నాం. గిరిజన ఉప ప్రణాళిక కింద ఐదు ఐటీడీఏ ప్రాంతాల పరిధిలో సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, బుట్టాయగూడెం, దోర్నాలలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను నెలకొల్పనున్నాం.
► గర్భిణులు, బాలింతలు, పిల్లల్లో రక్త హీనత, పోషకాహార లేమి సమస్యలను అధిగమించేందుకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ కోసం ఏటా రూ.1,956.34 కోట్లు వెచ్చిస్తున్నాం.
► వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాం. వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ పథకం కింద ఇప్పటివరకు 52.38 లక్షలమంది రైతులకు రూ.20,162 కోట్లు అందించాం. వైఎస్సార్ సున్నా వడ్డీ ద్వారా రూ.1,218 కోట్లు అందించాం. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సుపరిపాలన ఇండెక్స్ 2020–21లో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది.
► 2019 నుంచి ఇప్పటివరకు 19.02 లక్షలమంది రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీగా రూ.1,541.80 కోట్లు చెల్లించాం. మిరప, పసుపు, ఉల్లి, చిరుధాన్యాలు, అరటి, బత్తాయి లాంటి మరో ఆరు పంటలకు కనీస మద్దతు ధర ప్రకటిస్తూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం. వైఎస్సార్ జలకళ కింద 3 లక్షలకుపైగా బోరుబావులు రైతులకు ఉచితంగా తవ్వేలా చర్యలు చేపట్టాం. 9 గంటల ఉచిత విద్యుత్తు పథకం కోసం ఇప్పటివరకు రూ.19,146 కోట్లు ఖర్చు చేశాం. జగనన్న జీవ క్రాంతి పథకం కింద రూ.1,867.50 కోట్లు వెచ్చించి 2.49 లక్షలమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా రైతులకు గొర్రెలు, మేక పిల్లలను పంపిణీ చేశాం. అమూల్ పాలవెల్లువ ద్వారా పాడి రైతులు అదనపు ఆదాయం పొందుతున్నారు. వైఎస్సార్ మత్య్సకార భరోసా ద్వారా రూ.331.58 కోట్లు అందచేశాం. డీజిల్ సబ్సిడీని లీటరుకు రూ.9కి పెంచాం. జగనన్న పచ్చ తోరణం కింద ప్రభుత్వం 2021–22లో 9.39 కోట్ల మొక్కలు నాటింది. 646.9 చ.కి.మీ. అదనపు అటవీ విస్తీర్ణాన్ని పెంచడం ద్వారా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచింది.
► పేదలందరికీ ఇళ్లు పథకం కింద 30.76 లక్షల మంది మహిళలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశాం. మొదటిదశలో 15.60 లక్షల గృహ నిర్మాణాలు చేపట్టగా రెండో దశలో 15 లక్షల ఇళ్లను నిర్మించాలని నిర్ణయించాం.
► వైఎస్సార్ పింఛన్ కానుక కింద 61.74 లక్షల మందికి ఇప్పటివరకు రూ.48,957 కోట్లు అందచేశాం. పింఛన్ మొత్తాన్ని నెలకు రూ.2,250 నుంచి రూ.2,500కు పెంచాం.
► వైఎస్సార్ నేతన్న పథకం కింద రూ.577.47 కోట్లు అందించాం.
► జగనన్న తోడు పథకం ద్వారా చిరు వ్యాపారులకు రూ.1,416 కోట్లు వడ్డీలేని రుణాలను పంపిణీ చేశాం. రూ.32.51 కోట్ల వడ్డీ మొత్తాన్ని రీయింబర్స్ చేశాం.
► వైఎస్సార్ వాహన మిత్ర ద్వారా రూ.770.50 కోట్లు పంపిణీ చేశాం.
► వైఎస్సార్ న్యాయ నేస్తం కింద రూ.23.70 కోట్లు పంపిణీ చేశాం.
► వైఎస్సార్ ఆసరా పథకం కింద 78.75 లక్షలమంది పొదుపు మహిళలకు రూ.12,758 కోట్లు ఆర్థిక సహాయం చేశాం.
► వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద రెండేళ్లలో 98 లక్షల మంది పొదుపు మహిళలకు రూ.2,354.2 కోట్లను అందించాం.
► వైఎస్సార్ చేయూత ద్వారా 24.95 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు రూ.9,179 కోట్లు పంపిణీ చేశాం.
► వైఎస్సార్ కాపు నేస్తం కింద 3,27,349 మంది లబ్ధిదారులకు రూ.981.88 కోట్లు అందించాం.
► ఈబీసీ నేస్తం ద్వారా మొదటి దశలో 3,92,674 మంది లబ్ధిదారులకు రూ.589 కోట్లు అందించాం.
► ఉపాధి హామీ ద్వారా రూ.7,395.54 కోట్లతో 22.34 కోట్ల పనిదినాలు కల్పించాం.
► పోలవరం నిర్మాణాన్ని 77.92 శాతం పూర్తి చేశాం. 2023 జూన్ నాటికి పూర్తి చేసేలా యుద్ధప్రాతిపదికన పనులు చేస్తున్నాం. జలయజ్ఞం కింద 14 ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేశాం. మరో రెండు పాక్షికంగా పూర్తికాగా మిగిలినవి నిర్మాణ దశలో ఉన్నాయి.
► శ్రీకాకుళం జిల్లా ఉద్ధానం, వైఎస్సార్ జిల్లా పులివెందుల, కర్నూలు జిల్లా డోన్‌లలో రూ.1,477 కోట్లతో రక్షిత తాగునీటి ప్రాజెక్టులను మంజూరు చేశాం.
► వ్యవసాయ అవసరాలకు సోలార్ ప్రాజెక్టుల ద్వారా 25 ఏళ్లలో దాదాపు రూ.3,750 కోట్ల ప్రజాధనం ఆదా అవుతుంది.
► చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమలు, టెక్స్‌టైల్స్ రంగానికి ప్రభుత్వం రూ.2,363.2 కోట్ల మేర పారిశ్రామిక ప్రోత్సాహకాలు అందించింది. రూ.36,304 కోట్ల పెట్టుబడితో 56,611 మందికి ఉపాధి కల్పిస్తూ 91 భారీ, మెగా ప్రాజెక్టులను ప్రారంభించింది. రూ.1,61,155.85 కోట్లతో 70 భారీ, మెగా ప్రాజెక్టులు(పీఎస్‌యూ)లతో స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. తద్వారా 1,80,754 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రూ.7,015.48 కోట్లతో 22,844 ఎంఎస్‌ఎంఈలను ప్రారంభించడం ద్వారా 1,56,296 మందికి ఉపాధి కల్పించాం.
► విశాఖ, తిరుపతిలలో నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయాలు, మరో 26 నైపుణ్యాభివృద్ధి కళాశాలలు నెలకొల్పుతున్నాం.
► 2020–21లో 16.8 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతుల పెరుగుదలతో ఆంధ్రప్రదేశ్ దేశంలో 4వ స్థానానికి చేరుకుంది. గత ఏడాదితో పోలిస్తే 13.8 శాతం వృద్ధి సాధించింది.
► స్పందన ద్వారా 2.98 లక్షల ఫిర్యాదులకుగాను 2.87 లక్షల ఫిర్యాదుల పరిష్కారం.
► శాంతి భద్రతల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యం. 92.27 శాతం లైంగిక దాడుల కేసుల విచారణను 60 రోజుల్లో పూర్తి చేయడం ద్వారా ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది.
AP Budget 2022-23 Cabinet Decisions(AP బడ్జెట్ మంత్రి మండలి కీలక నిర్ణయాలు)
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సోమవారం సమావేశమైంది. మంత్రి మండలి సమావేశం ప్రారంభం కాగానే దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతిపై కేబినెట్ సంతాపం తెలిపింది. సీఎం వైఎస్ జగన్, మంత్రులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సమావేశంలో మంత్రి మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
మంత్రి మండలి కీలక నిర్ణయాలు:
- స్టేట్ వక్ఫ్ ట్రిబ్యునల్‌లో 8 రెగ్యులర్, 4 అవుట్ సోర్సింగ్ పోస్టులకు కేబినెట్ ఆమోదం.
- రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసుకున్న వారికి తెలుగుతో పాటుగా ఉర్ధూను సెకెండ్ లాంగ్వేజ్‌గా చదువుకునేందుకు అవసరమైన చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం
- కర్నూలుకు చెందిన ఇండియన్ డెఫ్ టెన్నిస్ కెప్టెన్, 2017 డెఫ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతక విజేత షేక్ జాఫ్రిన్‌కు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలన్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం.
- ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో గోదాముల నిర్మాణానికి స్టాంప్ డ్యూటీ మినహాయింపు బిల్లుకు కేబినెట్ ఆమోదం.
- తూనికలు, కొలతలశాఖలో నిబంధనలు అమలు కోసం మెరుగైన చర్యలు.
- డిప్యూటీ కంట్రోలర్ పోస్టును జాయింట్ కంట్రోలర్(అడ్మిన్) పోస్టుకు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం.
- నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్భర్ల నిర్మాణానికి పరిపాలనాపరమైన అనుమతులకు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్
- రామాయపట్నం, భావనపాడు, మచిలీపట్నం పోర్టుల నిర్మాణానికి రూ.8741కోట్ల రుణ సమీకరణ
- ప్రభుత్వం గ్యారంటీకి కేబినెట్ ఆమోదం.
- బెంగుళూరు–కడప, విశాఖపట్నం–కడప నడుమ వారానికి మూడు విమాన సర్వీసులు
- ఇప్పటికే కడప నుంచి పలు విమాన సర్వీసులు
- వీటికి అదనంగా కొత్త సర్వీసులకు ఆమోదం
- మార్చి 27 నుంచి సర్వీసులు ప్రారంభం
- ఈ మేరకు ఇండిగోతో ఏపీఏడీసీఎల్ ఒప్పందం.. కేబినెట్ ఆమోదం
- సర్వీసులు మొదలైన తర్వాత ఏడాదికి రూ.15 కోట్ల మేర మద్ధతు ఇవ్వనున్న రాష్ట్ర ప్రభుత్వం
- అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ప్రాజెక్టు –2 కింద చెరువులకు నీళ్లు
- దీని కోసం బైపాస్ కాలువ నిర్మాణం.. రూ.214.85 కోట్ల ఖర్చు. ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం
- పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పడతదిక గ్రామం వద్ద ఉప్పుటేరుపై 1.4 కిలోమీటర్ల మేర రెగ్యులేటర్– బ్రిడ్జి నిర్మాణం
- పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం మల్లపర్రు వద్ద రెగ్యులేటర్– బ్రిడ్జి– లాకుల నిర్మాణానికి పరిపాలనా పరమైన అనుమతులకు కేబినెట్ ఆమోదం
- కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న డిగ్రీ కాలేజీలో 24 టీచింగ్ పోస్టులు, 10 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం
- ఆర్చరీ క్రీడాకారిణి, అర్జున అవార్డు గ్రహీత కుమారి జ్యోతి సురేఖ వెన్నంకు డిప్యూటీ కలెక్టర్ నియామకానికి సంబంధించిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం
- తిరుమల తిరుపతి దేవస్ధానం ప్రత్యేక ఆహ్వానితులపై అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బిల్లుకు కేబినెట్ ఆమోదం
- ఆర్మ్‌డు రిజర్వ్ పోర్స్‌లో 17 ఆఫీసర్ లెవల్ ( 7 ఏఏస్పీ,10 డిఎస్పీ) కొత్త పోస్టులకు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
- ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ శాసనసభలో ప్రవేశపెట్టనున్న బిల్లుకు కేబినెట్ ఆమోదం
- 165 మొబైల్ వెటర్నరీ క్లినిక్‌ల ఆపరేషన్ అండ్ మెయింటైనెన్స్ (ఓఅండ్‌ఎం) కోసం రూ.75.24 కోట్లు మంజూరుకు కేబినెట్ ఆమోదం
- ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా చింతలదేవి వద్ద నేషనల్ కామధేను బ్రీడింగ్ సెంటర్ (ఎన్‌కేబీసీ) ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
- మొబైల్ ఆంబ్యులేటరీ వెటర్నరీ క్లినిక్ ప్రాజెక్టులో భాగంగా ఫేజ్ –2లో 165 మొబైల్ వెటర్నరీ క్లినిక్‌ల కొనుగోలుకు సంబంధించిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం.
Read More : తెలంగాణా బడ్జెట్ 2022-23 PDF
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
********************************************************************************************