ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఫిబ్రవరి 5నుంచి ఓట్ ఆన్ అకౌంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బడ్జెట్ సమావేశాలకి ముందు గవర్నర్ ప్రసంగంలో రాష్ట్రం సాధించిన అభివృద్ది మరియు ప్రగతి గురించిన ముఖ్య అంశాలు తెలియజేస్తారు. గవర్నర్ ప్రసంగం లోని బడ్జెట్ అంశాలు మరియు వివిధ పధకాలలో సాధించిన అభివృద్ది వంటి ఎన్నో అంశాలు ఉంటాయి. ఫిబ్రవరి 25న APPSC గ్రూప్ 2 పరీక్ష లో ఈ అంశాల పై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఈ కధనంలో గవర్నర్ ప్రసంగం లో తెలిపిన ముఖ్య అంశాలు అందించాము.
APPSC/TSPSC Sure shot Selection Group
AP బడ్జెట్ 2024 ముఖ్యాంశాలు
AP బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 5న ప్రారంభమయ్యాయి, బడ్జెట్ సమావేశాల ముందు గవర్నర్ ప్రసంగం మరియు ధన్యవాదాలు తెలిపే అంశాలు ఉంటాయి. గవర్నర్ ప్రసంగం లోని కీలక అంశాలు ఇక్కడ అందించాము.
- రాష్ట్రంలో వ్యవసాయానికి పగటి పుట 19.41 లక్షల పంపుసెట్లకు విద్యుత్ అందిస్తున్నారు, మరియు వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా ఉంది.
- రాష్ట్రం ప్రభుత్వం తీసుకుని వచ్చిన దిశయాప్ ద్వారా 3040 కేసులు నమోదు చేశారు
- పేదలందరికీ ఇళ్లు అందించడం కోసం 22 లక్షల ఇళ్లు నిర్మాణం చేపట్టారు అందులో ఇప్పటికే 9 లక్షల ఇళ్లను లబ్దిదారులకు అందజేశారు
- జగనన్న చేదోడు పధకం ద్వారా దుకాణాలు, నాయిబ్రాహ్మణులు, దర్జీలకు ప్రభుత్వం రూ. 10,000 ఆర్ధిక సహాయం అందిస్తోంది అలాగే చిరు వ్యాపారస్థులకు, వీధి వ్యాపారస్థులకు 10,000 వడ్డీ లేని రుణం మంజూరుచేసింది
Strategies to get motivated and conquer exam stress in APPSC Group 2 preparation
- వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పధకం కింద రూ.350.89 కోట్లు పెళ్లి అయిన జంటలకు అందిస్తున్నాము
- నాన్ DBT కింద 4.23 లక్షల కోట్ల సంక్షేమ ఫలాలు అందించాం
- 3, 27, 289 మంది తల్లులకు లబ్దిచేకూరడానికి 500 తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను రూ. 71 కోట్ల వ్యయంతో కొనుగోలు చేశాము.
- వైఎస్సార్ పెన్షన్ కానుక కింద 66.34 లక్షల మందికి పెన్షన్ అందిస్తున్నాం అలాగే పెన్షన్ ని 3000 పెంచి 1 జనవరి 2024 నుంచి అందిస్తున్నాము. పెన్షన్ల కోసం రూ. 1961 కోట్లు వెచ్చిస్తున్నాము.
- వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కోసం రూ.4,969.05 కోట్లు, వైఎస్సార్ చేయూతకి రూ.14,129 కోట్లు మరియు వైఎస్సార్ కాపునేస్తం కింద రూ.2,029 కోట్లు ఖర్చుచేశాము
- వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా ఏడాదికి రూ.15 వేలుచొప్పున 5 సంవత్సరాలలో 75వేలు అందించాము తద్వారా 3, 57, 844 మంది మహిళల అర్హుల ఖాతాల్లో రూ.2,029 కోట్లు విడుదల చేశాము
- రాష్ట్రంలో 55,607 మెయిన్, మినీ అంగన్ వాడీ కేంద్రాలు అభివృద్ది చేశాము, మరియు అంగన్వాడీ కేంద్రాలకు రూ.21.82 కోట్ల విలువైన గ్రోత్ మానిటరింగ్ పరికరాలు అందించాం
- వైఎస్సార్ ఆసరా ద్వారా డ్వాక్రా మహిళలకు ఆర్థిక సాయం రుణం ని తిరిగి వారికి అందించాము
- ఆక్వా రంగానికి ఊతం ఇచ్చేలా రాష్ట్రం మొత్తం మీద 35 అక్వా ల్యాబ్లు ఏర్పాటు చేసి, రైతులకు విద్యుత్ చార్జీలలో రాయితీ అందించాము. అక్వా రైతులకు రాయితీ కోసం రూ. 3,186.36 కోట్లు ఖర్చుచేసి రొయ్యల ఉత్పత్తిలో దేశం లోనే 75 శాతం వాటాలో ఏపీ ని అక్వా హబ్ చేశాము
- మత్స్యకార భరోసా కింద 2.43 లక్షల లబ్దిదారుల రూ.540 కోట్ల జమ చేసి వాటి కుటుంబాలకు అండగా నిలిచ్చాము. వారికి చేపల వేట నిషేధ కాలంలో రూ.10 వేలు ఆర్ధిక సహాయం అందించాము. చేపల వేటకు వెళ్లి మరణిస్తే రూ. 10 లక్షలు నష్ట పరిహారం అందిస్తున్నాము.
- రైతులకోశం 10, 778 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు చేసి వారికి అవసరమైన విత్తన, ఎరువులను సకాలంలో అందుతున్నాయి. ఇప్పటివరకూ 53. 53 లక్షల రైతులకు రైతు భరోసా ద్వారా సహాయం అందింది మరియు 22.85 లక్షల రైతులకు రూ.1,977 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ మంజూరు అయ్యింది.
- రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 53 ఏరియా ఆసుపత్రులు, 9 జిల్లా ఆసుపత్రులలో మెరుగైన వసతులు కల్పించాము.
- 1142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 177 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 10, 132 విలేజ్ హెల్త్ క్లినిక్ లు ఏర్పాటు చేయడమే కాకుండా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం కూడా ప్రారంభించారు
- 1 నుంచి 10 తరగతి వరకు జగనన్న గోరుముద్ద పధకం కింద రూ.4,417 కోట్లు ఖర్చు చేశారు. మరియు 8,9 పాఠశాల విధ్యార్ధినీ విద్యార్ధులకు 9, 52, 925 ట్యాబ్ల ద్వారా వారికి సిలబస్ లో ఉన్న అంశాలని వీడియొ రూపంలో చూసి అర్ధం చేసుకునే వెసులుబాటు చేశాము.
- జగనన్న విద్యాకానుక పధకం ద్వారా ఇప్పటివరకూ రూ.3, 367 కోట్లు వెచ్చించారు, విద్యారంగంపై రూ.73, 417 కోట్లు ఖర్చు చేసి దేశంలోనే అత్యుత్తమ విద్యను పిల్లలకు అందించే ఏర్పాట్లు జరుగుతోంది.
- రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో నాడు నేడు పనుల ద్వారా మెరుగైన వసతులు కల్పించడమే కాకుండా డిజిటల్ క్లాస్ రూమ్స్ విధానం ద్వారా పాఠాలు బోధించేలా తగిన చర్యలు తీసుకున్నారు.
Also Read:
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు Youtube Official Channel | ఇక్కడ క్లిక్ చేయండి |