శ్రీకాకుళం జిల్లా మకారాంపురంలో కిడ్నీ బాధితుల సమస్యలని తీర్చడానికి 700 కోట్లతో వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టుని సీఎం జగన్ ప్రారంభించారు దానితో పాటు పలాసలో వైఎస్ఆర్ కిడ్నీ రిసెర్చ్ సెంటర్, 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ప్రారంభించారు. ఈ చర్యతో శ్రీకాకుళం జిల్లా లో కిడ్నీవ్యాధుల బారిన పడ్డవారికి మెరుగైన వైద్యంతో పాటు కిడ్నీ సమస్యలు తలెత్తకుండా తాగునీరు కూడా అందుతుంది.
దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు ప్రబలుతున్న ఉద్దానం ప్రాంతంలోని ఏడు మండలాల పరిధిలోని 807 గ్రామాలకు శుద్ధి చేసిన తాగునీటిని శ్రీకాకుళం ప్రజల చిరకాల వాంఛను వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టు నెరవేరుస్తోంది అని తెలిపారు మరియు ఫేజ్ 2 కింద ఈ పద్ధకాన్ని 265కోట్లతో పాతపట్నం నియోజికవర్గంలో 448 గ్రామాలకు కూడా అందించే ఏర్పాట్లు చేయనున్నారు.
రూ.85 కోట్లతో నిర్మించిన 200 పడకల డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు ఉద్ధానం లో 10 PHCలు, 5UPHCలు, 6 కమ్యూనిటి హెల్త్ సెంటర్లలో సెమీ ఆటో ఎనలైజర్లు అందుబాటులోకి తీసుకునివచ్చామని తెలిపారు.
Read More: | |
తెలుగులో వారపు కరెంట్ అఫైర్స్ 2023 | నెలవారీ కరెంట్ అఫైర్స్ 2023 తెలుగులో |
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2023 | స్టడీ మెటీరియల్ |
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |