ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (APSLPRB) AP పోలీస్ కానిస్టేబుల్ PET ఈవెంట్ షెడ్యూల్ 01 నవంబర్ 2024 న విడుదల చేయబడింది. డిసెంబరు చివరి వారంలో ఫిజికల్ టెస్ట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. 2022 నవంబరు 28న 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. 2023 జనవరి 22న ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించగా మొత్తం 4,59,182 మంది హాజరుకాగా.. 95,208 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. అందులో 91,507 మంది మాత్రమే దేహదారుఢ్య, శారీరక సామర్థ్య పరీక్షలకు అన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారని.. మిగిలిన వారికి కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని బోర్డు చైర్మన్ తెలిపారు. నవంబరు 11వ తేదీ సాయంత్రం 3 గంటల నుంచి 21వ తేదీ సాయంత్రం 5 గంటల మధ్య వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Adda247 APP
AP కానిస్టేబుల్ PET షెడ్యూల్ నోటిస్
2023 జనవరి 22న నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షలో 95,208 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఈ అర్హులైన అభ్యర్థులకు డిసెంబర్ లో దేహదారుఢ్య పరీక్షలు జరగనున్నాయి. దశ 2 కోసం దరఖాస్తు చేయని అభ్యర్ధులు 11 నుంచి 21నవంబరు 2024 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది APSLRB అందుకు సంబంధించి AP కానిస్టేబుల్ PET షెడ్యూల్ నోటిస్ అధికారిక వెబ్సైటు లో విడుదల చేయబడింది.
AP కానిస్టేబుల్ PET షెడ్యూల్ నోటిస్ pdf
AP కానిస్టేబుల్ PET షెడ్యూల్
ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు 6,100 కానిస్టేబుల్ పోస్టుల కోసం ఫిట్‌నెస్ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. SCT PCలు (సివిల్) (పురుషులు & మహిళలు) మరియు SCT PCలు (APSP) (పురుషులు) పోస్టుల కోసం ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ మరియు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్‌ని నిర్వహించాలని SLPRB కోరుకుంటోంది. ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించిన 95,208 మంది అభ్యర్థుల్లో 91,507 మంది అభ్యర్థులు స్టేజ్-II ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను నింపి సమర్పించారు. పేర్కొన్న ఫారమ్‌ను పూరించని/సమర్పించని కొందరు అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను పూరించడానికి మరో అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. వారికోసం 11 నుంచి 21నవంబరు 2024 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. స్టేజ్-II ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ పూర్తి అయిన తర్వాత PET షెడ్యూల్ విడుదల చేయబడుతుంది. అయితే ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ మరియు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ 2024 డిసెంబర్ చివరి వారంలో తాత్కాలికంగా నిర్వహించబడతాయి.
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు Youtube Official Channel | ఇక్కడ క్లిక్ చేయండి |