AP District Court Exam Analysis 2023 Shift-3
AP District Court Exam Analysis 2023 Shift-3 2nd January 2023: AP High Court Conducted CBT(Computer Based Test) for Stenographer, Typist, Junior & Field Assistant on 2nd January 2023. 3rd shift timing is 4 to 5.30am. 1162 Stenographer, Junior Assistant, Typist & Field Assistant Posts notification has been released for the year 2022. In this article AP District Court Stenographer, Typist, Junior & Field Assistant Shift-1 Exam Analysis has been given in complete detail.
Also Read: AP District Court Exam Analysis 2022 For all Shifts
AP District Court Exam Analysis 2023 Shift-3 For Stenographer, Typist, Junior & Field Assistant 2nd January 2023: AP District Court స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ & ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్షలకు సంబంధించి CBT(Computer Based Test) ను 2 జనవరి 2023 వ తేదీన జరిగింది. ఈ పరీక్ష మొత్తం మూడు షిఫ్టులలో నిర్వహించడం జరిగింది. ఈ వ్యాసము నందు AP District Court Stenographer, Typist, Junior & Field Assistant Shift-2 Exam Analysis పూర్తి వివరంగా ఇవ్వడం జరిగింది.
Note: ఈ విశ్లేషణ మేము పరీక్షకు హాజరైన విద్యార్ధుల ద్వారా తెలుసుకున్న సమాచారం మాత్రమే, క్రింద తెలుపబడిన సంఖ్యలు యధాతధం కావు.
Fill the form to get the AP District Court exam Analysis 2022
AP District Court Stenographer, Typist, Junior & Field Assistant Exam Analysis | AP జిల్లా కోర్టు పరీక్ష విశ్లేషణ
AP District Court 2 జనవరి 2023 న స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ & ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు గాను పరీక్షను నిర్వహించడం జరిగింది. ఈ పోస్టులకు ఒకటే సిలబస్ కావున పరీక్షను ఒకే సారి నిర్వహించడం జరిగింది. అభ్యర్ధులు వారి సామర్ధ్యాలకు అనుగుణంగా పరీక్షను ప్రయత్నించి ఉంటారు. ఒకసారి పరీక్ష పూర్తి అయిన తరువాత మన పరీక్షను విశ్లేషణ చేసుకోవడం ద్వారా, పరీక్షలో విజయం సాధించడానికి గల అవకాశాలను మనం అంచనా వేసుకోవచ్చు. దీనికి అనుగుణంగా ఈరోజు అడిగిన ప్రశ్నలను మరియు వాటి కఠినత స్థాయి వివరాలను ఇక్కడ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము.
APPSC/TSPSC Sure shot Selection Group
AP District court Exam analysis 2023 :
AP District Court Typist Exam Pattern (AP జిల్లా కోర్టు టైపిస్ట్ / కాపీస్ట్ పరీక్షా సరళి)
- AP జిల్లా కోర్టు టైపిస్ట్ / కాపీస్ట్ ప్రశ్నపత్రం 80 బహుళ ఎంపిక ప్రశ్నలు (MCQలు) కలిగి ఉంటుంది
- స్కిల్ టెస్ట్ (టైపింగ్) 20 మార్కులకు ఉంటుంది
Subjects | No. of Questions | Marks | Duration |
General English | 40 | 40 | 90 Minutes |
General Knowledge | 40 | 40 | |
Total | 80 | 80 |
AP District Court Stenographer / Junior Assistant / Field Assistant Exam Pattern (AP జిల్లా కోర్టు టెనోగ్రాఫర్ గ్రేడ్ III / జూనియర్ అసిస్టెంట్ / ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్షా సరళి)
AP జిల్లా కోర్టు టెనోగ్రాఫర్ / జూనియర్ అసిస్టెంట్ / ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్షా సరళి దిగువన అందించాము.
Subjects | No. of Questions | Marks | Duration |
General English | 40 | 40 | 90 Minutes |
General Knowledge | 40 | 40 | |
Total | 80 | 80 |
AP High Court Assistant Minimum Qualifying Marks (అర్హత మార్కులు)
ఓపెన్ కాంపిటీషన్ & EWS కోసం కనీస అర్హత మార్కులు 40%, BC వర్గానికి- 35%, SC & STలకు 30% మార్కులను అర్హతగా పరిగణించడం జరుగుతుంది.
కేటగిరి | అర్హత మార్కులు (%) |
జనరల్ & EWS | 40% |
BC | 35% |
SC, ST మరియు ఇతరులు | 30% |
AP District Court Stenographer, Typist, Junior & Field Assistant Exam Analysis 2022 Difficulty level(కఠినత స్థాయి)
AP District court Stenographer, Typist, Junior & Field Assistant 2nd January 2023 పరీక్షకు సంబంధించి పరీక్ష కఠినత స్థాయిని మీరు ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకొనవచ్చు. AP హైకోర్ట్ అసిస్టెంట్ పరీక్ష నందు రెండు అంశాల మీద ప్రశ్నలను 80 మార్కులకు గాను అడగడం జరిగింది. వీటిలో జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ అంశాల మీద ఇవ్వడం జరిగింది. ఈ వ్యాసము నందు ఈ రెండు అంశాల మీద అడిగిన ప్రశ్నల స్థాయిని అలగే, పూర్తి పరీక్ష యొక్క కఠినత స్థాయిని తెలుసుకొనే ప్రయత్నం చేద్దాము.
AP District Court Assistant Exam Analysis | Difficulty Level
AP జిల్లా కోర్టు స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, జూనియర్ & ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్ష స్థాయి మొత్తంగా మధ్యస్తంగా ఉంది. వివిధ విభాగాల నుండి వచ్చిన ప్రశ్నలను ఆధారంగా చేసుకొని కఠినత స్థాయి మీకు క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.
Section | Difficulty Level |
జనరల్ ఇంగ్లీష్ | Moderate |
జనరల్ నాలెడ్జ్ | Difficult – moderate |
మొత్తంగా | moderate |
AP District Court Exam Analysis | Questions asked in General Knowledge
Topic | Questions asked |
Indian Art, Culture, Dance & Music, Ap Art and culture | 2 |
Indian History & AP History | 3 |
Indian Geography, Agriculture & Environment, AP Geography | 4 |
Indian Polity & Constitution | 4 |
Ap scheme | 2 |
Current affairs- India & Andhra Pradesh | 10 |
Other | 15 |
AP District Court Exam Analysis | Questions asked in General English
Topic | Questions asked |
Reading Comprehension | 5 |
Sentence correction | 3 |
Synonym/Antonym | 4 |
Idioms & Phrases | 2 |
Other | 26 |
Questions Asked in AP District Court exam Shift 3: 2nd January 2023 |AP జిల్లా కోర్టు shift 3 పరీక్ష లో అడిగిన కొన్ని ప్రశ్నలు:
- కేరళలో ఎక్కువ మంది మాట్లాడే భాష?
- ఏపీలో ఎర్ర నేలలు మొదటి స్థానం లో ఉంటె, రెండవ స్థానం లో ఉన్న నేలలు ఏవి?
- ఏపీ జ్యుడీషియల్ క్యాపిటల్ ఏది?
- 1926కి ముందు ఏపీ రాజధాని ఏది?
- బాస్కెట్‌బాల్ గేమ్‌లో ఎంత మంది ఆటగాళ్లు ఉంటారు?
- NHAI ఏ సంవత్సరంలో స్థాపించబడింది?
- ఇస్రో ద్వారా శుక్ర గ్రహం మీదకు 2024 లో భారత అంతరిక్ష యాత్ర కు ఉపగించే వెహికల్ పేరు ఏమిటి?
- మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఎవరు అందుకున్నారు?
- సత్రియా నృత్యం ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది?
- GST సవరణ చట్టం 2016 ఏ రాజ్యాంగంలో ఉంది?
- బుద్ధ చరిత్ర ఎవరు రచించారు?
- హెరిటేజ్ ఆమోదం పొందిన 4వ నీటిపారుదల నిర్మాణం ఏది?
- వాతావరణ మార్పుపై ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ IPCC 6వ సమ్మిట్ ఏ సంవత్సరంలో జరిగింది?
- 2021 అవినీతి అవగాహన సూచికలో భారతదేశ ర్యాంక్ ఎంత?
- భారతదేశపు అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటర్లలో ఒకటైన ‘పరమ్ ప్రవేగ’ను ఎవరు స్థాపించారు?
- భారతదేశంలోని కింది రాష్ట్రాలలో ఏది భారతదేశంలో ఎక్కువ పేదరికం ఉన్న రాష్ట్రం?
- నృత్యంలో అత్యున్నత పురస్కారం ఏది?
- బొజ్జన్న కొండ ఎక్కడ ఉంది?
- గ్రాండ్ స్లామ్ ఏ ఆటకు సంబంధించినది?
- 14 సంవత్సరాల పని తర్వాత ఏ రాకెట్ డిస్పోసల్ అయింది?
- ప్రతిష్టాత్మకమైన వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకానికి చట్టపరమైన మద్దతు పొందడానికి ఏ యూనివర్సిటీతో ఏపీ ప్రభుత్వం MOU కుదుర్చుకుంది.
- రాజ్యసభలో గరిష్ట సీట్లు ఎన్ని?
- ఒక వ్యక్తీ స్వతహాగా పౌరసత్వం వదులుకోవడం గురించి ఏ ఆర్టికల్ లో పేర్కొనబడింది?
- శ్రీ వారి బ్రహ్మోత్సవాలు తెలుగు మాసంలో ఏ నెలలో చేసుకుంటారు?
- 2021 అటవీ సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో విస్తీర్ణం ఎంత?
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |