AP DSC నోటిఫికేషన్ 2024
APలో DSC, ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) నోటిఫికేషన్ ఫిబ్రవరి 7న విడుదల అయ్యింది. AP DSC నోటిఫికేషన్ లో 6,100 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి 12 నుంచి దరఖాస్తు ప్రారంభం అయినది. దరఖాస్తుకు మరియు ఆన్లైన్ లో ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 25 ఫిబ్రవరి 2024 వరకు పొడిగించబడింది. SGT పోస్టులు 2,280, స్కూల్ అసిస్టెంట్ 2,299, 242 ప్రిన్సిపల్ పోస్టులు భర్తీ చేయనున్నారు. కొత్తగా 12ఏళ్ల క్రితం తొలగించిన అప్రెంటిస్‌షిప్ విధానాన్ని తీసుకురానున్నారు. DSCలో ఎంపికైన ఉపాధ్యాయులు రెండేళ్లపాటు గౌరవవేతనానికి పని చేయాల్సి ఉంటుంది. మొదట TET నిర్వహించి, ఫలితాలు ఇచ్చిన తర్వాత DSC పరీక్ష నిర్వహిస్తారు. DSCలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. AP DSC 2024 పరీక్షను 15 మార్చి 2024 నుండి 30 మార్చి 2024 మధ్య వివిధ దశలలో నివహించనున్నారు. దరఖాస్తు విధానం మరియు ఫీజు చెల్లింపు వివరాలు ఇక్కడ తనిఖీ చెయ్యండి.
Get AP DSC 2024 Study Material and Online classes
AP DSC 2024 నోటిఫికేషన్ ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ పొడగింపు
AP DSC 2024 కి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు కొరకు రిజిస్ట్రేషన్ లింక్ ను తన అధికారిక వెబ్ సైట్ నందు పొందుపరచినది. అభ్యర్ధులు ముందుగా ఆన్లైన్ లో దరఖాస్తు ఫీజు చెల్లించిన తర్వాత దరఖాస్తు వివరాలు పూరించవలసి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ 12 ఫిబ్రవరి 2024 నుండి 25 ఫిబ్రవరి 2024 వరకు జరుగుతుంది. కావున అభ్యర్ధులు త్వరితగతిన దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో పూరించడం ద్వారా ఆఖరి నిమిషపు గంధరగోలానికి గురికావలసి ఉండదు.
AP DSC నోటిఫికేషన్ 2024 ఆన్లైన్ దరఖాస్తు లింక్
ఇప్పటివరకు AP DSC కి ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే?
AP డీఎస్సీ దరఖాస్తు గడువును ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఈనెల 25 వరకు పొడిగించింది. అయితే, ఇప్పటివరకు 3,19,176 దరఖాస్తులు వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. AP TET కు 3,17,950 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నాయి. స్థానికేతర అభ్యర్థులు పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకునే సమయంలోనే స్థానికేతర ఆప్షన్ ను నమోదు చేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది.
AP DSC ఆన్లైన్ దరఖాస్తు ముఖ్యమైన తేదీలు
AP DSC 2024 ఆన్లైన్ దరఖాస్తు ముఖ్యమైన తేదీలు | |
AP DSC రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2024 | 07 ఫిబ్రవరి 2024 |
AP DSC రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2024 PDF | 12 ఫిబ్రవరి 2024 |
AP DSC రిక్రూట్‌మెంట్ 2024 ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ | 12 ఫిబ్రవరి 2024 |
AP DSC రిక్రూట్‌మెంట్ 2024 ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ | 25 ఫిబ్రవరి 2024 |
AP DSC 2024 ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లింపు ప్రారంభ తేదీ | 12 ఫిబ్రవరి 2024 |
AP DSC 2024 ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి తేదీ | 25 ఫిబ్రవరి 2024 |
AP DSC 2024 హాల్ టికెట్ | మార్చి 5, 2024 |
AP DSC 2024 పరీక్షా తేదీ | మార్చి 15 నుంచి 30, 2024 |
AP DSC రిక్రూట్‌మెంట్ 2024 ఆన్సర్ కీ | ఏప్రిల్ 2, 2024 |
AP DSC రిక్రూట్‌మెంట్ 2024 ఫలితాలు | ఏప్రిల్ 7, 2024 |
AP DSC నోటిఫికేషన్ 2024 ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి?
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ అంటే apdsc.apcfss.in ఓపెన్ చేయండి.
- ప్రతి అభ్యర్ధి ఒక్కొక్క పోస్టుకు విడిగా దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
- అభ్యర్ధులు ఇప్పుడు “Payment” పై క్లిక్ చెయ్యాల్సి ఉంటుంది.
- ఇప్పుడు మీ యొక్క వ్యక్తిగత వివరాలు పేరు, ఫోన్ నుండి నమోదు చెయ్యడం ద్వారా మీ పేమెంట్ గెట్ వే కు మళ్ళించబడతారు.
- మీ యొక్క రిజర్వేషన్ ఆధారంగా ఫీజు రూ. 750/- ఇక్కడ చెల్లించాల్సి ఉంటుంది. చెల్లింపు విజయవంతం అయిన తరువాత మీ యొక్క “Candidate ID (Journal Number)” పొందడం జరుగుతుంది.
- ఇప్పుడు “Home Page” లో ఉన్న “Application” option మీద క్లిక్ చెయ్యడం ద్వారా మీరు, అర్హతలు మరియు మరిన్ని పూర్తి వివరాలు ఇక్కడ నమోదు చెయ్యాల్సి ఉంటుంది.
- పూర్తి ధృవీకరణ తర్వాత సమర్పించు బటన్‌పై క్లిక్ చేయండి.
- భవిష్యత్ ఉపయోగం కోసం మీ దరఖాస్తును సేవ్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోండి.
AP DSC నోటిఫికేషన్ దరఖాస్తు రుసుము
AP DSC నోటిఫికేషన్ 2024 కోసం దరఖాస్తు రుసుము రూ. 750/-.
- దరఖాస్తుదారులు ఈ రిక్రూట్‌మెంట్‌లో వారి అర్హత కోసం, ఫీజు చెల్లింపు మరియు దరఖాస్తును సమర్పించే ముందు జాగ్రత్తగా ఇన్ఫర్మేషన్ బులెటిన్ ద్వారా వెళ్లాలి.
- దరఖాస్తుదారులు రిక్రూట్‌మెంట్ అప్లికేషన్ (ప్రతి పోస్ట్‌కి విడివిడిగా) ప్రాసెస్ చేయడానికి పేమెంట్ గేట్‌వే ద్వారా రూ.750/- రుసుమును చెల్లించాలి.
AP DSC నోటిఫికేషన్ ఎంపిక పక్రియ
వ్రాత పరీక్ష మరియు ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిర్దేశించిన ఇతర ప్రమాణాలతో కూడిన ఎంపిక ప్రక్రియ ద్వారా నియామకం జరుగుతుంది.
- రాత పరీక్ష (CBT):- కంప్యూటర్ ఆధారిత పరీక్ష అన్ని జిల్లాల్లో నిర్వహించబడుతుంది. ఒక అభ్యర్థి అతను/ఆమె రిక్రూట్‌మెంట్ (లేదా) పొరుగు రాష్ట్రాల ప్రక్కనే ఉన్న జిల్లాలలో కంప్యూటర్ ఆధారిత పరీక్షకు హాజరు కావాలి.
- i. స్కూల్ అసిస్టెంట్లకు (SAS) మొత్తం మార్కులు 100, అందులో 80 మార్కులు వ్రాత పరీక్ష (TRT) మరియు మిగిలిన 20 మార్కులు APTET (20%) వెయిటేజీకి ఉంటాయి.
- ii. సంగీత ఉపాధ్యాయులకు మొత్తం 100 మార్కులు ఉండాలి, అందులో 70 మార్కులు రాత పరీక్ష (టిఆర్‌టి)కి మరియు మిగిలిన 30 మార్కులు స్కిల్ టెస్ట్‌కి ఉంటాయి.
- iii. సెకండరీ గ్రేడ్ టీచర్లకు (SGTS) రాత పరీక్షకు (TET కమ్ TRT) మొత్తం మార్కులు 100 ఉండాలి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రస్తుత నిబంధనల ప్రకారం రిక్రూట్‌మెంట్ పూర్తిగా మెరిట్ కమ్ రోస్టర్ విధానంపై ఆధారపడి ఉంటుంది.
- పత్రాల ధృవీకరణ
Read More | |
AP DSC Notification 2024 Released | AP DSC Selection Process 2024 |
AP DSC Exam Pattern 2024 | AP DSC Syllabus |
AP DSC Vacancy 2024 | AP DSC Eligibility Criteria 2024 |
AP DSC Exam Date 2024 Out |
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |