AP Fishing Harbours Are Being Developed As Tourist Hubs | ఏపీ ఫిషింగ్ హార్బర్‌లను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నారు
ఫిషింగ్ హార్బర్‌లు కేవలం చేపల వేటకే పరిమితం కాకుండా పర్యాటక ప్రదేశాలుగా వాటిని తీర్చిదిద్దనున్నారు. వాటి సమీపంలో రిసార్ట్‌లు, వెల్‌నెస్ సెంటర్లు, వాటర్ పార్కులు, వినోద ఉద్యానవనాలు ఏర్పాటు చేయడం ద్వారా పర్యాటకులను ఆకర్షించేందుకు ఏపీ మారిటైమ్ బోర్డు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
పర్యాటకుల డిమాండ్ అధికంగా ఉన్న హార్బర్లను పరిశీలించి అక్కడ పర్యాటక అవకాశాలపై అధ్యయనం చేస్తోంది. ఇందులో భాగంగా తొలి దశలో అభివృద్ధి చేస్తున్న జువ్వెలదిన్నె, నిజాంపట్నం, ఉప్పాడ, మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్లలో మచిలీపట్నం వద్ద పర్యాటక అవకాశాలు అధికంగా ఉన్నట్లు గుర్తించింది. ఈ నాలుగు ఫిషింగ్ హార్బర్లలో పర్యాటక ఏర్పాట్లు చేయడం ద్వారా ఏటా రూ.131 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా.
ఈ ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్ల మూలంగా నాలుగు ఫిషింగ్ హార్బర్ల ద్వారా ఏటా రూ.225.18 కోట్ల ఆదాయం వస్తుందని ఏపీ మారిటైమ్ బోర్డు చెబుతోంది. కేవలం చేపల వేట కాకుండా టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా రూ.357 కోట్ల ఆదాయం పొందొచ్చని అంచనా వేసింది.
జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనులు 90 శాతం పూర్తయ్యాయి. సమిష్టిగా రూ.1523 కోట్ల విలువైన ఈ నాలుగు ఫిషింగ్ హార్బర్లను ఏడాది చివరి నాటికి కార్యాచరణలోకి తీసుకురావడమే ఏపీ మారిటైమ్ బోర్డు లక్ష్యం. జువ్వలదిన్నె సెప్టెంబరులో సిఎం వైఎస్ జగన్‌చే ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. మిగిలిన మూడు హార్బర్లు నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడల్లో 60 శాతానికి పైగా పనులు పూర్తి కావడంతో వీటిని డిసెంబర్ నాటికి అందుబాటులోకి తేనున్నారు.
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |