Telugu govt jobs   »   Current Affairs   »   AP Forest Development Corporation has received...

AP Forest Development Corporation has received national recognition | ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు జాతీయ గుర్తింపు లభించింది

AP Forest Development Corporation has received national recognition | ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు జాతీయ గుర్తింపు లభించింది

ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. టాప్ ఎక్స్పోర్ట్ అవార్డ్ ఆఫ్ క్యాపెక్సిల్ అవార్డును సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 16న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ గుర్రంపాటి దేవేందర్ రెడ్డికి లోక్‌సభాపతి ఓంబిర్లా ఈ అవార్డును అందజేశారు. అనంతరం దేవేందర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో ఎర్రచందనాన్ని విదేశాలకు ఎగుమతి చేయడంలో పురోగతి సాధించినట్టు చెప్పారు. బీడీ ఆకులు, ఎర్రచందనం, అలాగే కలప ఆధారిత మరియు అటవీ ఆధారిత పరిశ్రమలతో కూడిన వాణిజ్యాన్ని సులభతరం చేయడంలో ప్రభుత్వ యాజమాన్యంలోని AP కార్పొరేషన్ కీలక పాత్ర పోషిస్తోంది ఆయన ఉద్ఘాటించారు.

ఎకో టూరిజాన్ని కూడా కార్పొరేషన్ ప్రొత్సహిస్తోందని తెలిపారు. 4 లక్షల మెట్రిక్ టన్నుల సగటు ఉత్పత్తితో 35 వేల హెక్టార్లలో యూకలిప్టస్ను పెంచుతున్నట్టు చెప్పారు. 6 వేల హెక్టార్లలో జీడి మామిడి, 4 వేల హెక్టార్లలో కాఫీ, మిరియాలు, 2,500 హెక్టార్లలో వెదురు, 825 హెక్టార్లలో టేకు, 1000 హెక్టార్లలో ఇతర వాణిజ్య పంటల్ని ప్రోత్సహిస్తున్నట్టు పేర్కొన్నారు.

సాధించిన విజయాల విషయానికొస్తే, తాము సుమారు 5,353 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం విక్రయించామని, సుమారు రూ.2 వేల కోట్ల ఆదాయం సమకూరిందని దేవేందర్ రెడ్డి పంచుకున్నారు. 2023లో ఇప్పటి వరకూ రూ.218 కోట్ల విదేశీ మారకద్రవ్యాన్ని సాధించామని, మరో రూ.250 కోట్లు సాధించే దిశగా ముందుకెళుతున్నట్టు తెలిపారు. కార్పోరేషన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నుండి ‘త్రీస్టార్ ఎక్స్‌పోర్ట్ హౌస్’ హోదాను పొందిందని చెప్పారు.

AP and TS Mega Pack (Validity 12 Months)

 

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

***************************************************************************

Sharing is caring!

FAQs

ఆంధ్రప్రదేశ్‌లో 4 రకాల అడవులు ఏవి?

ఆంధ్రప్రదేశ్‌లో కనిపించే అటవీ రకాలు సెమీ సతతహరిత, తేమతో కూడిన ఆకురాల్చే, పొడి ఆకురాల్చే, పొడి సతతహరిత, ముల్లు, టేకు మిశ్రమ, వెదురు మిశ్రమం, నదీతీర అడవులు, మడ అడవులు మరియు సవన్నా.