ఆంధ్ర ప్రదేశ్ శీతోష్ణస్థితి
ఆంధ్రప్రదేశ్ యొక్క శీతోష్ణస్థితి సాధారణంగా లోతట్టు తీర ప్రాంతాలలో వేడిగా మరియు తేమగా ఉంటుంది, అయితే ఇది అనంతపురం జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా, కర్నూలు జిల్లా మరియు కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో ఎక్కువగా పాక్షిక శుష్కంగా ఉంటుంది. ఈ ప్రాంతాలు పశ్చిమ కనుమలలోని రెయిన్‌షాడో ప్రాంతం క్రిందకు వస్తాయి. ఈ రాష్ట్రంలో వేసవి కాలం సాధారణంగా మార్చి నుండి మే లేదా జూన్ వరకు ఉంటుంది. ఈ నెలల్లో తేమ స్థాయి శీతాకాలంలో కంటే సాపేక్షంగా ఎక్కువగా ఉంటుంది మరియు ఇది సాధారణంగా తీరప్రాంత లోతట్టు ప్రాంతాలలో ఎక్కువగా ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్- శీతోష్ణస్థితి
ఆంధ్రప్రదేశ్ ఆయన రేఖామండలంలో ఉంది. అందువల్ల ఉష్ణమండల లేదా ఆయనరేఖా మండలం శీతోష్ణస్థితిని కలిగి ఉంటుంది. భారతదేశం మాదిరిగానే ఈ రాష్ట్రం శీతోష్ణస్థితి రుతుపవనాలపై ఆధారపడి ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ శీతోష్టస్టితిని సాధారణంగా ఆయన రేఖామండల రుతుపవన శీతోష్ణస్థితి అంటారు.
భారత వాతావరణ శాఖ సంవత్సర కాలాన్ని 4 భాగాలుగా విభజించింది. అవి:
- శీతాకాలం (జనవరి నుంచి ఫిబ్రవరి)
- వేసవికాలం (మార్చి నుంచి జూన్ మధ్య వరకు)
- నైరుతి రుతుపవనకాలం/వర్షాకాలం (జూన్ మధ్య నుంచి సెప్టెంబరు వరకు)
- ఈశాన్య రుతుపవనకాలం/ తిరోగమన నైరుతి రుతుపవనకాలం (అక్టోబరు నుంచి డిసెంబరు వరకు)
1.శీతాకాలం
డిసెంబరు చివరి నాటికి రాష్ట్రం మొత్తం చల్లబడి జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఉష్టోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి.
- ఈ రుతువులో పొడి వాతావరణం నెలకొని ఉంటుంది.
- అనంతపురం, చిత్తూరు జిల్లాలు మిగతా జిల్లాల కంటే తక్కువ ఉప్టోగ్రతతో ఉంటాయి. ఈ జిల్లాలు మైసూరు పీఠభూమిని ఆనుకుని ఉండటమే దీనికి కారణం.
- ఈ కాలంలో అత్యల్ప ఉప్టోగ్రత విశాఖ జిల్లాలోని లంబసింగిలో -2°C ఉష్ణోగ్రత నమోదు అవుతుంది.
- కోస్తా ప్రాంతం అంతటా రాత్రుల్లో మంచు బాగా కురుస్తుంది.
- ఉష్ణోగ్రత విలోమం (Temperature Inversion) వల్ల కొన్నిరోజులు ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు కురుస్తుంది.
- ఈ కాలంలో కోస్తా జిల్లాల కంటే రాయలసీమ జిల్లాల్లో చలి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇవి సముద్రానికి దూరంగా ఉన్నాయి కాబట్టి.
- మార్చి తర్వాత ఎండలు ముదిరి గ్రీష్కతాపం మొదలవుతుంది.
2.వేసవికాలం
ఆంధ్రప్రదేశ్‌లో వేసవి కాలం
- గరిష్ట ఉష్ణోగ్రత ‘మే’లో నమోదు అవుతుంది.
- ఈ సమయంలో గుంటూరు జిల్లాలోని రెంటచింతలలో 45°C పైన ఉష్టోగ్రతలు నమోదు అవుతాయి. మైసూరు పీఠభూమికి ఆనుకొని ఉన్న చిత్తూరు, అనంతపురం జిల్లాలు ఇతర ప్రాంతాల కంటే మరింత చల్లగా ఉంటాయి.
- చిత్తూరు జిల్లాలోని హార్సిలీ హిల్స్ వేసవి విడిది కేంద్రం.
- మే నెల రెండు, మూడు వారాల్లో రాష్ట్రమంతటా వడగాలులు వీస్తాయి.
- ఈ రుతువులో సంవహన ప్రక్రియ అధికంగా జరగడం వల్ల క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి ఉరుములు, మెరుపులు, వడగళ్లతో కూడిన సంవహన వర్షపు జల్లులు పడతాయి.వేసవిలో అత్యధిక సగటు 31.5°C, అత్యల్ప సగటు ఉష్ణోగ్రత 18°C ఉంటుంది.
- రాష్ట్ర సరాసరి ఉష్టోగ్రత 27°C
- వేసవిలో ఆంధ్రప్రాంతంలో రుతుపవనాలు రాకముందు పడే జల్లులను మామిడి జల్లులు లేదా మ్యాంగోషవర్స్ లేదా తొలకరి జల్లులు లేదా ఏరువాక జల్లులు అని పిలుస్తారు.
- విశాఖపట్నం, మచిలిపట్నం, కాకినాడ ప్రాంతాల్లో సముద్రం ప్రభావం వల్ల తక్కువ ఉష్టోగ్రతలు ఉంటాయి.
- ఆంధ్రప్రదేశ్ సగటు వర్తపాతం 960 మిల్లీ మీటర్లు
3.నైరుతి రుతుపవనకాలం/ వర్షాకాలం
- జూన్ మధ్య నుంచి ప్రారంభమై సెప్టెంబరు చివరి వరకు వర్షాకాలం ఉంటుంది.
- నైరుతి రుతుపవనాల వల్ల ఆంధ్రప్రదేశ్ ఉత్తర ప్రాంతంలో 80 సెం.మీ., దక్షిణ ప్రాంతంలో 40 సెం.మీ. వర్షపాతం ఉంటుంది. ప్రాంతాల వారీగా చూస్తే కోస్తా తీరం సగటు 65.1 సెం.మీ., రాయలసీమలో 46.3 సెం.మీ. వర్షపాతం నమోదవుతుంది.
- జూన్ రెందో వారంలో నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయి.
- నైరుతి రుతుపవనాల వల్ల కోస్తా, రాయలసీమ ప్రాంతాల కంటే తెలంగాణలో అధిక వర్షపాతం పడుతుంది.
- నైరుతి రుతుపవననాల కాలంలో వర్షాల ప్రారంభంలో మబ్బులు, వర్షం వల్ల పగటి ఉష్ణోగ్రత కొంత తగ్గుతుంది. కానీ వర్షంలేని రోజుల్లో సూర్యరశ్మి కారణంగా వేడిగాలిలో తేమ అధికంగా ఉండటం వల్ల ఎక్కువగా చెమట పడుతుంది.
(ఆంధ్రప్రదేశ్ – నైసర్గిక స్వరూపం)
4.ఈశాన్య రుతుపవన కాలం/ తిరోగమన నైరుతి రుతుపవనకాలం
అక్టోబరు వర్షాకాలానికి, శీతాకాలానికి మధ్య వారధిలా ఉండి సంధిమాసంలా ఉంటుందని చెప్పవచ్చు. అధిక ఉప్టోగ్రత, అధిక తేమ కారణంగా వాతావరణం ఉక్కపోతగా ఉంటుంది. దీన్ని సాధారణంగా ‘అక్షోబరు వేడిమి’ (October Heat) అని అంటారు.
- ఈశాన్య రుతుపవనాల వల్ల కూడా కొద్దిపాటి వర్షం పడుతుంది. ఉత్తర ప్రాంతాల కంటే దక్షిణ ప్రాంతాల్లో ఎక్కువ వర్షం కురుస్తుంది.
- అక్టోబరు నుంచి డిసెంబరు మధ్య వీచే ఈశాన్య రుతుపవనాల వల్ల సాధారణ వర్షపాతం 224 మి.మీ. నమోదు అవుతుంది.
- ఈ కాలంలో బంగాళాఖాతంలో వాయుగుండాలు ఏర్పడి దక్షిణ కోస్తా జిల్లాలకు (నెల్లూరు,ప్రకాశం) ఎక్కువ నష్టం జరుగుతుంది.
- వైరుతి రుతుపవనాల వల్ల అధిక వర్షపాతం పడే జిల్లా పశ్చిమ గోదావరి. ఈశాన్య రుతుపవనాల వల్ల అధిక వర్షపాతం పడే జిల్లా తూర్పు గోదావరి.
- నైరుతి రుతుపవనాల వల్ల అల్ప వర్షపాతం పడే జిల్లాలు నెల్లూరు, అనంతపురం.
- . ఈశాన్య రుతుపవనాల వల్ల అల్ప వర్షపాతం పడే జిల్లాలు కర్నూలు, అనంతపురం.
- సగటు అధిక వార్షిక వర్షపాతం పశ్చిమ గోదావరిలో, అల్ప వర్షపాతం అనంతపురంలో నమోదు అవుతుంది.
మరిన్ని ముఖ్యాంశాలు
- రాజస్థాన్‌లోని జైసల్మీర్ తర్వాత అతి తక్కువ వర్షపాతం (560 మి.మీ. కంటే) నమోదు అయ్యే ప్రాంతం అనంతపురం. ఇది భారత్‌లోనే రెందో స్టానంలో ఉంది.
- జులైలో కోస్తా ఆంధ్రా, తెలంగాణలో అధిక వర్షం పడుతుంది.
- సెప్టెంబరులో దక్షిణ తెలంగాణ, ఆగ్నేయ ప్రాంతంలో అధిక వర్షం పడుతుంది. అక్టోబరులో చిత్తూరులో అధిక వర్షపాతం కురుస్తుంది.
- నవంబరులో నెల్లూరు, గుంటూరులో వర్షాలు పడతాయి.
రాష్ట్ర సగటు వర్షపాతం | 896 మి.మీ. |
నైరుతి రుతుపవనాల వల్ల | 602 మి.మీ. |
ఈశాన్య రుతుపవనాలు వల్ల. | 203 మి.మీ |
వేసవి కాలం | 73 మి.మీ. |
శీతాకాలం | 18 మి.మీ. |
మొత్తం | 896 మి.మీ. |
ఆంధ్రప్రదేశ్‌లో రెండు రకాల శీతోష్ణస్థితి మండలాలు ఉన్నాయని తెలిపింది కొప్పెన్.
అవి:
1. ఆయన రేఖా వర్షపాత ప్రాంతం (Tropical Rainy-A)
2.శుష్క ప్రాంతం (Dry- B)
- శుష్క ప్రాంతం కడప నుంచి ఉత్తరాన నల్గొండ వరకు, పడమర బళ్లారి నుంచి తూర్పున ఉదయగిరి వరకు వ్యాపించి ఉంది.
- మిగిలిన ప్రాంతంమంతా మొదటి రకానికి చెందింది.
వరదలు
- కురవాల్సిన సాధారణ వర్షపాతం కంటే అధిక వర్షపాతం కురిస్తే దాన్ని అతివృష్టి అంటారు.
- అతివృష్టి వల్ల వరదలు వస్తాయి.
- వరదలు సంభవించే ప్రాంతం – కొల్లేరు, వంశధార, శారదానది ప్రాంతాలు; కృష్ణా, గోదావరి ప్రాంతాలు.
- ‘ఆంధ్ర దుఃఖదాయిని’ బుడమేరు. (“The Sorrow of Andhra”)
కరవు కాటకాలు
- అనావృష్టి మూలంగా కరవులు వస్తాయి.
- సాధారణ వర్షపాతంలో 75% కంటే తక్కువ వర్షం కురిస్తే దాన్ని కరవు అంటారు.
- సాధారణ వర్షపాతంలో 50% కంటే తక్కువ వర్షం కురిస్తే దాన్ని తీవ్రమైన కరవుఅంటారు.
- అధిక కరవులు సంభవించే ప్రాంతం రాయలసీమ
ఆంధ్రప్రదేశ్-శీతోష్ణస్థితి PDF తెలుగులో
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |