ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల వ్యవస్థ
- ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా వ్యవసాయాధార రాష్ట్రం.
- ఆంధ్రప్రదేశ్‌లో నీటిపారుదల సౌకర్యం ప్రధానంగా కాలువలు, చెరువులు, బావుల ద్వారా జరుగుతుంది.
- 2014 డిసెంబరులో విడుదల చేసిన సామాజిక – ఆర్థిక సర్వే రిపోర్టు ప్రకారం రాష్ట్రంలో మొత్తం 54 నీటి పారుదల ప్రాజెక్టులు ఉన్నాయి. ఇందులో భారీ ప్రాజెక్టులు 26, మధ్య తరహా 18, 4 వరద నియంత్రణ ప్రాజెక్టులతో సహా 6 ఆధునికీకరణ కోసం ఏర్పాటు చేసినవి ఉన్నాయి.
- వీటి ద్వారా 48 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడంతోపాటు 21 లక్షల ఎకరాలకు నీటిని స్థిరీకరించవచ్చు.
- ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం భూవిస్తీర్ణంలో 40.96% నికర సాగు భూమి ఉంది. ఇందులో నీటిపారుదల సౌకర్యాలు ఉన్న భూమి 38.0 %.
- రాష్ట్రంలో 9 భారీతరహా ప్రాజెక్టులు ఉన్నాయి.అవి.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు
- ఇది ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానమైన బహుళార్థసాధక ప్రాజెక్టు.దీన్ని నల్గొండ జిల్లా నందికొండ దగ్గర గుంటూరు జిల్లా సరిహద్దులో నిర్మించారు.
- ఎత్తు 125 మీటర్లు.
- ఈ జలాశయం విస్తీర్ణం 280 చ.కి.మీ.
- ఈ ప్రాజెక్టు రెండువైపులా రెండు కాలువలు తవ్వి నీటిని సరఫరా చేస్తున్నారు. కుడి కాలువను జవహర్‌లాల్ నెహ్రూ కాలువ, రెండో కాలువను లాల్ బహదూర్ కాలువ అని అంటారు.
- జవహర్ కాలువ పొడవు 444కి.మీ. దీని ద్వారా గుంటూరు, ప్రకాశం జిల్లాలకు నీటి సరఫరా జరుగుతుంది.
- లాల్‌బహదూర్ కాలువ పొడవు 330 కి.మీ. దీని ద్వారా నల్గొండ, ఖమ్మం, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు సాగునీటిని అందిస్తున్నారు.
- ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 22 లక్షల ఎకరాలకు నీటి సరఫరా జరుగుతుంది.
- ప్రపంచంలో రాతితో నిర్మించిన అతి ఎత్తయిన ఆనకట్ట నాగార్జునసాగర్.
APPSC/TSPSC Sure shot Selection Group
శ్రీశైలం
దీన్ని కర్నూలు జిల్లా నందికొట్కూరు తాలూకా శ్రీశైలం వద్ద కృష్ణానదిపై నిర్మించారు. ఈ ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా కర్నూలు,కడప జిల్లాల్లో 76,900 హెక్టార్లకు; ఎడమ కాలువ ద్వారా నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 1.25 లక్షల హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం కల్పించడానికి ఉద్దేశించారు.
సోమశిల ప్రాజెక్టు
నెల్లూరు జిల్లా ఆత్మకూరు తాలూకాలోని సోమశిల వద్ద 1975లో పెన్నానదిపై నిర్మించారు. ఈ ప్రాజెక్టు ద్వారా నెల్లూరు జిల్లాలో రెండు లక్షల హెక్టార్లకు నీటివసతి కల్పించారు.
వంశధార ప్రాజెక్టు
దీన్ని శ్రీకాకుళం జిల్లా హీర మండలం దగ్గర గట్టు గ్రామం వద్ద వంశధార నదిపై నిర్మించారు. ఈ ప్రాజెక్టు వల్ల శ్రీకాకుళం జిల్లాలో 1.6 లక్షల హెక్టార్లకు నీరు లభిస్తుంది.
తుంగభద్ర ప్రాజెక్టు
- ఇది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ల ఉమ్మడి ప్రాజెక్టు.
- దీన్ని కర్ణాటక రాష్ట్రంలోని హోస్పేట వద్ద నిర్మించారు.
- ఈ ప్రాజెక్టు దిగువ కాలువ ద్వారా కర్నూలు జిల్లాకు, ఎగువ కాలువ ద్వారా అనంతపురం జిల్లాకు నీరు అందుతోంది.
- తాడిపత్రి కాలువ, గుంతకల్లు బ్రాంచి కాలువ, గుత్తి కాలువ, మైలవరం రిజర్వాయర్, చిత్రావతి బ్యాలన్సింగ్ రిజర్వాయర్‌ను కలుపుకుని దిగువ కాలువలో అంతర్భాగాలు.
ప్రకాశం బ్యారేజి
దీన్ని కృష్ణా జిల్లా విజయవాడ వద్ద కృష్ణా నదిపై 1852 – 1856 మధ్య కాలంలో నిర్మించారు. ఈ ఆనకట్ట ద్వారా కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 12 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. దీని నిర్మాణానికి విశేష కృషి చేసింది కెప్టెన్ ఓర్.
సర్ అర్థర్ కాటన్ బ్యారేజి
దీన్ని తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై 1853లో నిర్మించారు. 1976లో వచ్చిన వరదల వల్ల పాత బ్యారేజికి గండి పడింది. మిత్రా కమిటీ సూచన మేరకు ప్రభుత్వం తిరిగి బ్యారేజిని నిర్మించింది. గోదావరి డెల్టాలో 4.1 లక్షల హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం కల్పిస్తుంది.
తెలుగు గంగ ప్రాజెక్టు
శ్రీశైలం ప్రాజెక్టు కుడికాలువ నుంచి కృష్ణా జలాలను మద్రాసు నగరానికి సరఫరా చేయడంతోపాటు కర్నూలు, కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో సుమారు 6 లక్షల ఎకరాలకు నీటిపారుదల సౌకర్యం కల్పించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. ఈ ప్రాజెక్టును 1983, మే 25న ప్రారంభించారు.
మోపాడు ప్రాజెక్టు: దీన్ని ప్రకాశం జిల్లాలో కనిగిరి తాలూకాలోని మున్నేరు నదిపైన నిర్మించారు.
పులిచింతల ప్రాజెక్టు: కృష్ణా నదిపై గుంటూరు జిల్లా రాజుపాలెం మండలంలోని పులిచింతల గ్రామం వద్ద నిర్మిస్తున్నారు.
గాజులదిన్నె ప్రాజెక్టు: కర్నూలు జిల్లాలో హంద్రీ నదిపై ఉంది.
ఏలేరు ప్రాజెక్టు: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు నీరు అందిస్తుంది.
వట్టిగడ్డ ప్రాజెక్ట్: శ్రీకాకుళం జిల్లాలో నాగావళి ఉపనదిపై నిర్మించారు.
పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు/ వెలుగోడు ప్రాజెక్టు: ఇది కుందూ నదిపైన కర్నూలు జిల్లాలోని వెలుగోడు వద్ద నిర్మించారు. ఇది తెలుగు గంగ ప్రాజెక్టులో భాగం.
ఆంధ్రప్రదేశ్‌లో నీటి పారుదల ప్రాజెక్టుల జాబితా
ప్రాజెక్టు | నది/ ప్రాంతం | లబ్ది పొందే జిల్లాలు | ఆయకట్టు (ఎకరాల్లో) |
వంశధార | వంశధార నది గొట్ట గ్రామం వద్ద | శ్రీకాకుళం | 62,280 |
తాడిపూడి ఎత్తిపోతల | గోదావరి | పశ్చిమ గోదావరి | 1,38,000 |
పుష్కరం ఎత్తిపోతల | గోదావరి | తూర్పు గోదావరి | 186,000 |
సోమశిల ప్రాజెక్టు | పెన్నా | నెల్లూరు | 4,14,000 |
తెలుగు గంగ ప్రాజెక్టు | కృష్ణా, పెన్నా | కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు | 5,75,000 |
తోటపల్లి బ్యారేజ్ | నాగావళి | విజయనగరం,శ్రీకాకుళం | 1,84,000 |
జంఝూవతి ప్రాజెక్ట్ | జంఝూవతి | విజయనగరం (తొలి రబ్బరు డ్యామ్ |
24640 |
ఇందిరాసాగర్(పోలవరం) | గోదావరి | కృష్ణా, గోదావరిజిల్లాలు, విశాఖపట్నం | 7221000 |
కె.ఎల్.సాగర్ (పులి చింతల) |
కృష్ణా | కృష్ణా, పశ్చిమగోదావరి గుంటూరు | 10,42,000 |
గుండ్లకమ్మ రిజర్వాయర్ | గుండ్లకమ్మ | ప్రకాశం | 80,060 |
పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు | కృష్ణానది | ప్రకాశం, నెల్లూరు,కడప | 438,000 |
కె.సి.కెనాల్ | తుంగభద్ర | కర్నూలు, కడప ఆయకట్లు స్థిరీకరణ | 2,65,000 |
గాలేరు – నగరి సుజల స్రవంతి |
కృష్ణా | కడప, చిత్తూర్తు ,నెల్లూరు | 325000 |
పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ |
పెన్నా | అనంతపురం | 2,21,400 |
హంద్రీ-నీవా- సుజల స్రవంతి | కృష్ణా | రాయలసీమ (నాలుగుజిల్లాలు) | 6,02,500 |
నాగార్జున సాగర్ | కృష్ణా | నల్గొండ, ఖమ్మం,కృష్ణా పశ్చిమగోదావరి,గుంటూరు, ప్రకాశం | 22,21,000 |
శ్రీశైలం కుడిగట్లు కాలువ పి.వి.నరసింహారావు |
కృష్ణా | కర్నూలు, కడప | 1,90,000 |
తుంగభద్ర ఎగువ, దిగువ కాలువలు | తుంగభద్ర | అనంతపురం, కడప | 263,736 |
ప్రకాశం బ్యారేజి | కృష్ణా | కృష్ణా,పశ్చిమ గోదావరి,గుంటూరు,ప్రకాశం | 12 లక్షలఎకరాలు |
ఏలేరు రిజర్వాయర్ | గోదావరి | తూర్పు గోదావరి,విశాఖ | 144000 |
పెద్దగడ్డ | వేగవతి | విజయనగరం | 12,000 |
ఎస్.ఆర్.బి.సి. | – | కర్నూలు, కడప | 1,00,000 |
పెద్దేరు రిజర్వాయర్ | పెద్దేరు | విశాఖపట్నం | 10,000 |
సూరంపాలెం(కె.వి.రామకృష్ణ) | గోదావరి | తూర్పు గోదావరి | 15482 |
అప్పర్ పెన్నార్ | పెన్నా | అనంతపురం | 9,700 |
పెన్నార్ -కుముద్వతిప్రాజెక్టు | పెన్నా | అనంతపురం | 6,125 |
అప్పర్ సగిలేరు ప్రాజెక్టు | పెన్నా | కడప | 4495 |
మద్దిలేరు రిజర్వాయర్ | పెన్నా | అనంతపురం | 18,000 |
బుగ్గవంక | పెన్నా | కడప | 132,000 |
చెయ్యేరు రిజర్వాయర్ | పెన్నా | కడప | 22,000 |
పాపాఘ్నీ ప్రాజెక్టు | పెన్నా | అనంతపురం | 4350 |
రామతీర్థ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ | రామతీర్జ | ప్రకాశం | 72,8574 |
గాజులదిన్నె (గాజులదిన్నె వద్ద) | హంద్రీనది | కర్నూలు | – |
గండిపాలెం | పిల్లమేరు | నెల్లూరు | – |
సుంకేసుల | తుంగభద్ర | కర్నూలు | – |
బకింగ్‌హామ్ కాలువ
- విజయవాడ, చెన్నై మధ్య ఉంది. పొడవు 310 కి.మీ.
- కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు నీరందుతుంది.
- ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా చెరువులపై ఆధారపడి వ్యవసాయం చేస్తుంది.
- ఆంధ్రప్రదేశ్‌లో నీటి పారుదల కార్పొరేషన్‌ను 1974లో స్థాపించారు.
- ఆంధ్రప్రదేశ్‌లో వాటర్‌షెడ్ పథకం 1997లో ప్రారంభమైంది.
పట్టిసీమ ఎత్తిపోతల పథకం
ఇది కృష్ణా, గోదావరి జలాల అనుసంధాన కార్యక్రమం. సముద్రంలో ప్రతి సంవత్సరం వృథాగాపోయే ౩౦౦౦ టీఎమ్‌సీల గోదావరి నీటిలోని కొంత భాగాన్ని కృష్ణానది డెల్టాను పరిరక్షించడం కోసం కృష్ణానదిలోకి మళ్లించడమే దీని ప్రధాన ఉద్దేశం.
దీనిలో భాగంగా గోదావరి నీటిని లిఫ్ట్ ఇరిగేషన్ (ఎత్తిపోతల విధానం) పద్ధతిలో సెప్టెంబరు 16, 2015 న గోదావరి నీటిని కృష్ణానదితో అంతర సంధానం చేశారు.
ఉపయోగాలు:
- పోలవరం నిర్మాణం పూర్తి అయ్యేలోపు కృష్ణా డెల్టాకు భద్రత, భరోసానివ్వడం.
- ప్రతి ఏడాది ఆగస్టులోపు సాగునీరు అందించడం వల్ల కృష్ణా డెల్టా రైతులను అక్టోబరు, నవంబరులో వచ్చే తుపానుల నుంచి రక్షించవచ్చు.
- పట్టిసీమ కాలువ పొడవు 174 కి.మీ.
లక్ష్యం: 80 టీఎమ్‌సీల గోదావరి జలాలను కృష్ణాలో కలపడం.
మొత్తం పంపుల లక్ష్యం: 24
ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల వ్యవస్థ PDF
AP Geography -Soil types of Andhra Pradesh |
Mineral Wealth of Andhra Pradesh |
AP Geography PDF in Telugu Chapter wise |
Andhra Pradesh Agriculture |
Andhra Pradesh – Transport |
Industries Of Andhra Pradesh |
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |