ఆంధ్రప్రదేశ్ అడవులు – జంతుజాలం
ఆంధ్రప్రదేశ్ అడవులు వైవిధ్యమైన అటవీ రకాలు, ప్రత్యేకమైన పర్యావరణ వ్యవస్థలు, విభిన్న ఆవాసాలు మరియు జీవవైవిధ్యం అధికంగా ఉన్న ప్రాంతాలను కలిగి ఉన్నాయి. ఇది అనేక ప్రత్యేకమైన మరియు స్థానిక వృక్షజాలం మరియు జంతుజాలం యొక్క స్టోర్ హౌస్, ఇందులో ప్టెరోకార్పస్ శాంటాలినస్ (రెడ్ సాండర్స్), సైకాస్ బెడ్‌డోమి, షోరియా టాంబాగ్గియా, సిజిజియం ఆల్టర్నిఫోలియం, టెర్మినలియా పల్లిడా మొదలైనవి ఉన్నాయి. ఇందులో టైగర్, గౌర్ (ఇండియన్ బైసన్), గ్రేట్ ఇండియన్ బస్టార్డ్ వంటి జంతుజాలం ఉంది. ఫ్లోరికన్, జెర్డాన్స్ కోర్సర్, గోల్డెన్ గెక్కో, ఫ్లెమింగో, పెలికాన్ మొదలైన ఇతర పక్షులు. ఇది దేశంలోనే అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం అంటే శ్రీశైలం టైగర్ రిజర్వ్ మరియు దేశంలో రెండవ అతిపెద్ద మడ పర్యావరణ వ్యవస్థను కలిగి ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడవులు 37,258 చ.కి.మీ. విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి.
- రాష్ట్రం మొత్తం విస్తీర్ణంలో 23.04% అడవులు ఉన్నాయి.
- దేశ అటవీ విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ 8వ స్థానాన్నిఆక్రమించింది.
- కోస్తాంధ్ర ప్రాంతంలో అటవీ వైశాల్యం 19,590 చ.కి.మీ. (30.67%)
- రాయలసీమలో అటవీ వైశాల్యం 14,996 చ.కి.మీ. (23.53%)
భారత దేశంలో ముఖ్యమైన అటవీ సంస్థలు
- భారతీయ అటవీ పరిశోధనా సంస్థ – డెహ్రాడూన్
- శుష్క అటవీ పరిశోధనా సంస్థ – జోద్‌పూర్
- తేమ ఆకురాల్చు అటవీ పరిశోధనా సంస్థ – జోరాట్
- ఉష్ణ మండల అడవుల అటవీ పరిశోధనా సంస్థ – జబల్‌పూర్
- సమశీతల అటవీ పరిశోధనా సంస్థ – సిమ్లా
- సామాజిక అటవీ పరిశోధనా సంస్థ – అలహాబాద్
- ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ సంస్థ – భోపాల్
రాష్ట్రంలో నేలల స్వభావం, వర్షపాతం, ఉప్టోగ్రత ఆధారంగా అడవులను 4 రకాలుగా వర్గీకరించారు.అవి:
1) ఆర్ద్ర ఆకురాల్చు అడవులు
2) అనార్ద్ర ఆకురాల్చు అడవులు
3) చిట్టడవులు
4) తీర ప్రాంతపు అడవులు
ఆర్ద్ర ఆకురాల్చు అడవులు
సాధారణంగా వర్షపాతం ఎక్కువగా ఉండే (125 – 200 సెం.మీ.) ప్రాంతాల్లో ఈ తరహా అడవులు అభివృద్ది చెంది ఉన్నాయి.
- జిల్లాలవారీగా పరిశీలిస్తే శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇలాంటి అడవులు అధికంగా వ్యాపించి ఉన్నాయి.
- విశాఖపట్నం, తూర్పు గోదావరి ఏజెన్సీ ప్రాంతాల్లో,రంపచోడవరం ప్రాంతంలో ఉన్న దట్టమైన అడవులు ఈ కోవకు చెందుతాయి.
- ఈ అడవుల్లోని ముఖ్యమైన వృక్షాలు: వేగి, మద్ది, ఏగిస, సాల్, వెదురు, బండారు, జిట్టెగి, పాల, కరక, సిరమాను లాంటి వృక్ష జాతులు పెరుగుతాయి
అనార్ద్ర ఆకురాల్చు అడవులు
- సహజంగా వర్షపాతం తక్కువగా ఉండే ప్రాంతాల్లో (75-100 సెం.మీ. వర్షపాతం) ఈ అడవులు ఉంటాయి.
- కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో ఈ రకానికి చెందిన అడవులు ఎక్కువ వైశాల్యంలో ఉన్నాయి.
- ప్రపంచంలో ఎక్కడా దొరకని ఎర్రచందనం ఆంధ్రప్రదేశ్‌లోని కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని అడవుల్లో మాత్రమే లబిస్తుంది.
- ఎర్రచందనం కలపను రంగులు, జంత్ర వాయిద్యాలు,బొమ్మల తయారీకి ఉపయోగిస్తారు.
- ఎర్రచందనాన్ని మన రాష్ట్రం నుంచి చైనాకు ఎక్కువగ ఎగుమతి చేస్తున్నారు.
- ఎంతో విలువైన మంచి గంధం చెట్లు చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోని అడవుల్లోఉన్నాయి.
- ఈ అడవుల్లోని ముఖ్యమైన వృక్షాలు: టేకు, ఏగిస, బండారు, చిరుమాను, ఎర్రచందనం, మంచిగంధం, నల్లమద్ది లాంటి వృక్షాలు పెరుగుతాయి.
చిట్టడవులు
- 75 సెం.మీ.ల వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో ఈ రకమైన అడవులు విస్తరించి ఉన్నాయి.
- చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి.
- ఈ అడవుల్లో ముళ్లపొదలు ఎక్కువగా కనిపిస్తాయి.
- రెల్లుగడ్డి అధికంగా ఉంటుంది.
- ముఖ్య వృక్షజాతులు: తుమ్మ, కలబంద, బ్రహ్మజెముడు, నాగజెముడు, వేగు, చండ్ర, రేగు,బలుసు ముఖ్యమైన వృక్షజాతులు.
తీరప్రాంత అడవులు/ కార జలారణ్యాలు/ టైడల్ అడవులు
- వీటిని పోటు, పాటు అరణ్యాలు లేదా మాంగ్రూవ్ అరణ్యాలు అని కూడా పిలుస్తారు.
- ఇవి ముఖ్యంగా నదీ ముఖ ద్వారాల్లో విస్తరించి ఉన్నాయి.
- కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతాల్లో ఈ అరణ్యాలు అత్యధికంగా విస్తరించి ఉన్నాయి.
- ముఖ్య వృక్షాలు: ఉప్పు పొన్న, బొడ్డు పొన్న, ఊరడ, మడ, తెల్లమడ, గుండుమడ లాంటి వృక్షజాతులున్నాయి.
మరిన్ని ముఖ్యాంశాలు
- ఆంధ్రప్రదేశ్‌లోని టైడల్ అరణ్యాలను కోరింగ అడవులు అని పిలుస్తారు. (తూర్పు గోదావరిలో)
- ఆంధ్రప్రదేశ్‌లో విస్తీర్ణ పరంగా అతిపెద్ద అడవులు – నల్లమల అడవులు
- అడవులు ఎక్కువగా ఉన్న జిల్లాలు – కడప, చిత్తూరు
- రాష్ట్రంలో విస్తీర్ణసరంగా అడవులు తక్కువగా ఉన్న జిల్లాలు -కృష్ణా, శ్రీకాకుళం
- రాష్ట్రంలో అటవీ సాంద్రత ఎక్కువగా ఉన్న జిల్లాలు – విశాఖ, కడప
- రాష్ట్రంలో అటవీ సాంద్రత తక్కువగా ఉన్న జిల్లాలు – కృష్ణా అనంతపురం
- టేకు అధికంగా లభించే జిల్లా – తూర్పు గోదావరి
- టేకును King of Forest అని పిలుస్తారు.
- వెదురు అధికంగా లభించే జిల్లా – తూర్పు గోదావరి
- వెదురును ‘పేదవాడి కలప’ అని పిలుస్తారు.
- ఇప్ప పువ్వు అధికంగా కర్నూలు జిల్లాలో లభిస్తుంది.
అటవీ సంరక్షణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు
- 1952లో జాతీయ అటవీ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
- జాతీయ అటవీ తీర్మానం ప్రధాన లక్ష్యం దేశ విస్తీర్ణంలో 33% అడవులను పెంచడం.
- 1980లో భారత ప్రభుత్వం అడవుల (రక్షణ) చట్టాన్ని ప్రవేశపెట్టింది.
- ఈ చట్టం వల్ల కేంద్రం అనుమతి లేనిదే అటవీ భూములను రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర అవసరాలకు కేటాయించే అధికారం లేదు.
- పోడు వ్యవసాయ పద్ధతులపై కూడా నిబంధనలు విధించారు.
- అడవులను పునరుద్ధరించడానికి సామాజిక అడవుల కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం 5వ పంచవర్ష ప్రణాళికలో ప్రారంభించింది. 6వ పంచవర్ష ప్రణాళికలో అధికంగా అమలైంది.
అడవి జంతువులు
- ఆంధ్రప్రదేశ్‌లో అనేక రకాల జంతువులు అన్ని జిల్లాల్లో ఉన్నాయి.
- దుప్పి, కొండగొర్రె, కణతి, అడవి పంది, రకరకాల కోతులు, ముళ్ల పంది, సివంగి, చారల సివంగి, ఎలుగుబంటులు, జింకలు ఉన్నాయి
- తెల్ల దున్నపోతులు ఎక్కువగా ఉత్తర సర్కారు (విజయనగరం, శ్రీకాకుళం,విశాఖపట్నం) జిల్లాల్లో కనిపిస్తాయి.
- నాలుగు కొమ్ముల కొండగొర్రెలు, ఎక్కువగా రాయలసీమలోనే ఉంటాయి.
- శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల వద్ద కృష్ణానదిలో మొసళ్లు ఉంటాయి…
- భారతదేశంలో ఎప్పుడో అంతరించి పోయిందనుకున్న బట్ట మేకపక్షి కర్నూలు జిల్లా రోళ్లపాడులో కనిపించింది.
వన్యప్రాణుల సంరక్షణ లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం-
- IUCN(International Union for Conservation of Nature ) సంస్థ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ఎర్రచందన వృక్షాన్ని అరుదైన వృక్షాల జాబితాలో చేర్చింది.
- అదేవిధంగా కడప జిల్లాలోని శ్రీ లంకమల్లేశ్వర వన్యమృగ సంరక్షణా కేంద్రంలో నివసించే కలివి కోడిని కూడా IUCN సంస్థ అరుదైన జంతువుల జాబితాలో చేర్చింది.
- ఎర్రచందనాన్ని ఎర్ర బంగారం అని పిలుస్తారు.
రాష్ట్రంలోని వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలు
2014 సామాజిక – ఆర్దిక సర్వే రిపోర్లు ప్రకారం రాష్టంలో మొత్తం 16 వన్యమృగ సంరక్షణా కేంద్రాలు, ౩ జాతీయ పార్కులు 7410 చ.కి.మీ.ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నాయి. ఇందులో ఒక టైగర్ రిజర్వు, ఒక ఎలిఫెంట్ రిజర్వు, ఒక బయోస్ఫియర్ (శేషాచలం) ఉన్నాయి.
సంరక్షణాకేంద్రం | ప్రాంతం | సంరక్షణలోని జంతువులు/పక్షులు |
కోరంగి (కోరింజ) | కాకినాడ సమీపం (తూర్పు గోదావరి) | మొసళ్లు |
గుండ్ల బ్రహ్మశ్వరం | కర్నూలు, ప్రకాశం | – |
కొల్లేరు | కృష్ణా, పశ్చిమ గోదావరి | పక్షులు, పెలికాన్ కొంగలు |
నాగార్జునసాగర్‌శ్రీశ్రైలం | కృష్ణానది తీరంలో నాగార్జునసాగర్నుంచి శ్రీశైలం వరకు | పులులు,చిరుతలు,దుప్పులు |
నేలపట్టు | సూళ్లూరుపేట (నెల్లూరు) | బూడిదరంగు పెలికాన్స్ |
పాపికొండలు | ఉభయగోదావరి జిల్లాలు(పాపికొండలు) | పులులు, నక్కలు, వివిధ రకాల పక్షులు |
పులికాట్ | సూళ్లూరుపేట | పెరిమిట్స్, బాతులు, నీటి కాకులు |
శ్రీవేంకటేశ్వర | చంద్రగిరి (చిత్తూరు) | పులులు, హైనాలు,నక్కలు |
రోళ్లపాడు | కర్నూలు, ప్రకాశం | బట్టమేకల పక్షి (దీన్ని గ్రేట్‌ఇండియన్ బస్సర్స్ అంటారు) |
శ్రీలంక మల్లేశ్వర | కడప | కలివికోడి |
శ్రీపెనుగుల నర్సింహా | కడప, చిత్తూరు | – |
కంబాల కొండ | విశాఖపట్నం | – |
శేషాచలం | చిత్తూరు, కడప | రాష్ట్రంలో తొలి బయోరిజర్వ్ |
కౌండిన్య | చిత్తూరు | ఏనుగులు |
కృష్ణా వన్యప్రాణి | కృష్ణా, గుంటూరు | – |
కండలేరు జింకల పార్కు | నెల్లూరు | జింకలు |
పులయం జింకలపార్కు | కర్నూలు | జింకలు |
ఆంధ్రప్రదేశ్ – అడవులు మరియు జంతువులు PDF
AP Geography Related Articles
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |